Tuesday, June 2, 2020

సినిమాలలో విలన్ నిజ జీవితంలో రియల్ హీరో సోనుసూద్

నేను ఒక్కప్పుడు వలస కార్మికుడినే..

పొట్ట చేత పట్టుకొని ముంబయ్ వలస వచ్చిన వాడినే..!!

రైళ్లలో కిక్కిరిసిన జనరల్ బోగీలో బాతరుమ్ పక్కన్న తలుపు పట్టుకొని వేలాడుతూ ఎన్నోసార్లు ప్రయాణాలు చేసాను..

ఆ బాధలు ఎలా ఉంటాయో తెలుసు.

అందుకే లాక్ డౌన్ వేళ ఉపాధి కోల్పోయి తిండి లేక సొంతూరు చేరుకునే మార్గం లేక వాళ్ళు పడుతున్న అవస్థలు చూసి వేల కిలోమీటర్లు పిల్లలతో కొంత మంది కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడిచి వెళుతుంటే మనసు చలించిపోయింది..

నా కెరీర్ మొదట్లో నేను పడిని కష్టాలు కళ్ళ ముందు మోదిలాయి..

సహాయ కార్యక్రమాల్లో మొదటి అడుగుగా జుహు లోని నా హోటల్ని ప్రాణాలు పణంగా పెట్టి కరోనాతో పోరాడుతున్న వైద్యులకు ఇచ్చాను..

ముంబయ్ పరిసర ప్రాంతాల్లో పట్టేడు అన్నం లేక అలాంటిస్తున్న దాదాపు 40 వేల మందికి అన్నదానం మొదలు పెట్టాను.

తరవాత ఇంకా ముంబయ్ కి దూరంగా వంటగదులు ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన భోజనం తయారుచేసి వడ్డించామ్.

ఆకలి తీరినా వాళ్ళ కళ్ళలో ఎదో తెలియని బాధ..

ఏంటని అడిగితే మా సొంత గ్రామలకి పంపించండయ్య అని ఆడిగేసరికి ఆలోచించకుండా అధికారులతో పోలీస్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి బస్సులు ఏర్పాటు చేసాం..

వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు కళ్ళలో నుండి వస్తున్న కనీళ్ల చూసి చలించిపోయాను.

ఒక గర్భిణి ఇంటికి చేరుకున్నాక ప్రసవించి తన కొడుకుకి సోనూసూద్_శ్రీవాత్సవ్ అని పేరు పెట్టుకుంది..

ఎక్కడ వలస కార్మికులు ఉంటే అక్కడకి వెళ్లి నాకు అవకాశం ఇవ్వండి మిమల్ని మీ గ్రామాలకి పంపుతాను అని అడిగి కొన్ని వేల మందిని వాళ్ళ స్వస్థలాకి పంపాను..

వాళ్ళు వెళ్ళుతూ నాపైన చూపించిన ప్రేమ వారి కళ్ళలో ఆనందం చూసి
ఇక ఈ జన్మకి ఇది చాలు అనుకున్న..

నాకు తోడుగా నా భార్య పిల్లలు...స్నేహితులు సహకారం..

మరి ముఖ్యంగా అధికారులు పోలీసులు తోడ్పాటు మరువలేనిది...!!

ఒక్కసారి గట్టిగా సోను సూద్ కీ చప్పట్లు తో హర్షం తెలపండి...!!👏🏻👏🏻👏🏻👏🏻

No comments:

Post a Comment