Tuesday, June 2, 2020

తారక మంత్రం

తారక మంత్రం
""""""""""""""""""""

రామ మంత్రం ఒక్కటియే తారకమంత్రమైనది.

తా, రకం - తన యొక్క స్వరూపం.

తన స్వరూపం తాను తెలిసికొనినచో ఏ చింతయు లేక మనస్సు నెమ్మది పొందును.

పరమాత్ముడైన శ్రీరామునితో ప్రత్యగాత్మ స్వరూపుడైన తాను వియ్యమగుటయే యోగమనబడును.

రామ ఏవ పరబ్రహ్మ
రామ ఏవ పరం తపః
రామ ఏవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మతారకం//

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే/

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే //


(నేను సదా రామనామమును ధ్యానించెదను,
అది విష్ణు సహస్రనామములకు సమానమైనది.

నీవును ఆ నామమును జపించుమని శివుడు పార్వతీదేవికి ఉపదేశించెను)

తారక మంత్రమునే శివుడు సదా జపించెను. జీవుడు ముక్తి పొందవలెనని తలచి కాశీలోని మరణకాలమున ఈశ్వరుడే తారకమంత్రం స్వయముగా జీవుల దక్షిణ చెవియందు ఉపదేశించును.

రామ అను శబ్దమును మరా అని జపించి దోపిడిదొంగ రత్నాకరుడు వాల్మికి మహాముని అయ్యెను.

సహస్రనామములతో సమానమని శివుని వచనమును విని, పార్వతీ రామనామమును పఠించి శివుని సాంగత్యం నొందెను.

తన వచనములయందామెకు గల విశ్వాసం జూచి, సంతచించి ప్రసన్నుడై పార్వతికి శివుడు తన శరీరములో ఎడమభాగమును ఇచ్చెను.

రామనామ స్మరణతో రాయిరూపంలోఉన్న అహల్య రామస్పర్శకు నోచుకొని పునీతురాలైనది.


రామ అను తారకమంత్రము చేత సకల పాతకములు నశించును.

పార్వతీదేవికి పరమేశ్వరుడు,
వాల్మికికీ నారదుడు,
భరద్వాజునకు వాల్మికి,
వ్యాసులకు పరాశరులు,
శుకులకు వ్యాసుడు ఉపదేశించినది తారక మంత్రమే.

తారకమంత్రము కంటే ఉత్తమమంత్రం లేదు

ఈ మంత్రమును త్రికరణశుద్ధిగా అనుష్టించినవారు భవసాగరమును నిస్సంశయమముగా తరింపగలరు.

నిరంతంను ప్రాణావాయువు లోపల వెలుపల సంచరించు నప్పుడెల్లను తదేకధ్యానముతో తారకమంత్రమును మననింపుచు ఉన్నను కాలక్రమేణ ఈ మహామంత్ర ప్రభావంచే ముక్తిని పొందుదురు.

ఓ కధని కంచి పీఠమునకు అధిపతి అయిన శ్రీ చంద్రశేఖరసరస్వతివారు ఓసారి చెప్పారు.

ఓ అడవిలో కొందరు దొంగలు తాము చేద్దామనుకుంటున్న దొంగతనం గురించి ఇలా మాట్లాడుకొని ముక్తిని పొందినట్లు ఓ కవి చమత్కారముగా చెప్పింది చెప్పారు.


వనే చ రామః
వసు చాహరామః
నదీం స్తరామః
నభయం స్మరామః
వనే కిరాతః
ముక్తిం గతాః షంగాతే

అంటే - వనే చ రామః (అడవిలో నివశిద్దాం),

వసు చాహరామః
(ఈ దారిలో వెళ్ళే ప్రయాణికులనుండి సంపదను దొంగలిద్దాం),

నదీం స్తరామః
(దొంగాలించాక నదిని దాటేద్దాం),

నభయం స్మరామః (నదిని దాటేస్తే పట్టుబడతామనే భయం వుండదు)

అని అనుకున్నారు.
వారు

దొంగలైనప్పటికి వారి మాటలలో రామః అను శబ్దం వుండడం వలన వనే కిరాతః ముక్తిం గతాః షంగాతే ....

ఆ అడవిలో కిరాతకులు మరణించినతర్వాత ముక్తిని పొందారు.

రామ అన్న పదమహిమ తెలియకున్నా ఆ కిరాతకులు వారివారి మాటలమద్య అసంకల్పితముగా రామ అని పలికినందులకే ముక్తి లభిస్తే,

భక్తితో శ్రద్ధతో స్మరిస్తే ఇహపరములందు ఎంతలా తరిస్తమో గుర్తించండి.

జై శ్రీ రామ్🙏🏻🙏🏻

No comments:

Post a Comment