క్షమించండి... ప్లీజ్
( ఒక చిన్న కథ)
ఆ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ మీద కొత్తగా శాంతమూర్తి అని ఒక ఆఫీసర్ వచ్చాడు.
స్ఫురద్రూపి,
అందగాడు, యువకుడు, చురుకైన వాడు - కాకపోతే కాస్త కోపిష్టి అని తెలిసింది.
ఒక రోజు ఎందుకో
తన కింది ఉద్యోగి, ఆనందరావు పైన విపరీతమైన కోపం వచ్చింది.
ఆఫీసులో అందరి ముందు చెడామడా తిట్టేశాడు.
అంతగా తిడుతుంటే తట్టుకోలేక ఆనందరావుకి కూడా కోపం నషాళానికి అంటింది.
'చిన్న పొరపాటుకి వయసులో పెద్ద వాడినని కూడా చూడకుండా అనవసరంగా తిడతాడా ?'
అని మాటామాటా పెరిగి చివరికి కొట్టుకునే స్థాయి వరకు వచ్చింది.
అందరూ కలిసి ఇద్దరిని విడదీశారు.
అయితే ఆఫీసర్ శాంతమూర్తి, ఆనందరావు మీద ఇంకా కోపంతో రగిలి పోతూనే ఉన్నాడు.
కోపం మీద ఉన్న శాంతమూర్తి తన ఛాంబర్ తలుపు ధనామని వేసుకుని లోపలికి పోయాడు.
క్యాబిన్లో ఎవరో ఒకరి మీద తన కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు.
శాంతమూర్తి కోపం ఇంకా చల్లారలేదు.
ఆనందరావు మీద పైఆఫీసర్లకు ఫిర్యాదు చేయాలనుకున్నాడు.
ఆ రోజంతా ఆఫీస్ స్మశాన నిశ్శబ్దంలో గడిచిపోయింది....
అప్పుడప్పుడు శాంతమూర్తి చిర్రుబుర్రులు తప్ప.
సాయంత్రం ఐదు కొట్టక ముందే శాంతమూర్తి ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇంట్లో వాళ్లతో కూడా సరిగ్గా మాట్లాడలేదు.
భార్య రాధ కూడా శాంత మూర్తి కోపం చూసి సైలెంట్ గా ఉండిపోయింది.
పిల్లలు ఆడుకోవడానికి కూడా భయపడి ఓ పక్కనపుస్తకాలేసుకుని కూర్చున్నారు.
రాత్రికి భార్య బలవంతం మీద రెండు ముద్దలు గతికి బెడ్ రూం లోకి వెళ్ళిపోయాడు.
ఏదో అసౌకర్యం.. అసహనం.. కోపతాపాల తాలూకు మంటలు.. గుండె దడ..
అర్థం కాలేదు....
పడుకో లేక..
కూర్చో లేక ...
ఇబ్బందిపడుతూ ఉన్నాడు.
ఎక్కడో గుండెల్లో కొద్దిగా నొప్పిగా ఉన్నట్లు ఉంది.
"ఏమండీ... అలా ఉన్నారు..!!" భార్య రాధ ఆదుర్దాగా అడిగింది.
"ఏమీ లేదు" మాట దాటవేశాడు.
అంతలో ఇక ఆగలేక "పద హాస్పిటల్ కి పోదాం" అంటూ బయలు దేరాడు.
పిల్లల్ని అత్తగారి దగ్గర వదిలి శాంతమూర్తి వెంట బిక్కుబిక్కు మంటూ నడిచింది.
దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి పోయి డాక్టర్ను సంప్రదించాడు.
డాక్టర్ బి. పి. చూసి "ఏం చేశారు శాంత మూర్తి గారు...
బి.పి. అమాంతం పెరిగింది...
ఇంతకుముందు కూడా మీకు బీ.పీ. ఉండేదా !!"
"లేదండి... నిన్న ఆఫీసులో చిన్న గొడవ అయింది.. డాక్టర్"
బీ.పీ.కి, ప్రశాంతంగా నిద్రపోవడానికి మాత్రలు ఇచ్చి "రేపు పొద్దున్నే పరగడుపున ఏమీ తినకుండా హాస్పిటల్ కి రండి.. కొన్ని టెస్టులు చేద్దాం."
మళ్లీ కోపం వచ్చింది శాంతమూర్తికి 'అంతే...హాస్పిటల్ అంటే అనవసరమైన టెస్టులు అవి చేసి డబ్బు గుంజుకోవడమే అన్నమాట..' మనసులో కోపంతో ఊగి పోయాడు.
డాక్టర్ గమనించి " మీ డబ్బులు గుంజుకోవడానికి టెస్టులు రాయలేదండీ.."
శాంతమూర్తి మనసులో మాట అర్ధమైనట్లు చెప్పాడు.
"టెస్ట్ చేస్తే మంచిది ఏదైనా ఉంటే తెలుసుకోవచ్చు.
మీరు ఆందోళన మనసులో పెట్టుకోకుండా ఈ మాత్రలు వేసుకుని పడుకోండి" నవ్వుతూ చెప్పాడు. " టెస్ట్ లకు కూడా ఎక్కువ డబ్బులు తీసుకోనులెండీ..."
"సారీ ఏమనుకోకండి.. నా ఉద్దేశం అది కాదు"... శాంతమూర్తి కూడా నవ్వుతూనే బదులిచ్చాడు.
ఆఫీస్ కి రెండు రోజులు సెలవు పెట్టి టెస్టులన్నీ
చేయించుకున్నాడు.
రిపోర్ట్ లను పరిశీలించిన డాక్టర్ "సార్ మీ పేరు లోనే ఉంది శాంతం..
కోపం తెచ్చుకోకండి. అదుపులో ఉంచుకోండి.
మీకు తెలియంది కాదు.
'తన కోపమే తన శత్రువు' అని.
అన్ని పారామీటర్లు నార్మల్ గానే ఉన్నాయి.
సమస్యలు ఏమీ లేవు. ఒక్కసారిగా చాలా కోపం తెచ్చుకున్నట్లున్నారు.
అమాంతం బీపీ పెరిగింది.
అవునూ... నాకు తెలియక అడుగుతున్నాను.
మీ ఆఫీసులో మీరే పెద్ద అధికారి కదా....!!
మీ సబార్డినేట్ లను కోపగించుకొని, కసురుకుని పని చేయించుకోగలరా...!!
అంతేకాదు... వయసులో చిన్నవారు, ఇప్పుడున్న స్థాయికన్నా అంచెలంచెలుగా పైస్థాయికి ఎదగాల్సినవాళ్ళు కదా !
మీరు,మీ భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం కదా,
మీమీదే ఆధారపడి ఉంది కదా !!
పదిమందిలో పనిచేసే చోట కోపతాపాలు సహజమే.
నేను కొద్దిగా సైకాలజీ చదువుకున్నాను.
అందుకే మీరు ఏమనుకున్నా, అనుకోకపోయినా చిన్న సలహా ఇస్తాను."
"కోపతాపాలు మీ శక్తిని హరిస్తాయి.
ఒక్కసారి వాళ్ళని క్షమించేయండి...
నిజంగా క్షమించండి...
ఎన్ని వ్యతిరేక భావాలు ఉన్నా పటాపంచలై పోతాయి.
మీ మనసును మిమ్మల్ని బాధించినవారిని క్షమించడానికి సాధన చేయండి.
బాధ మరిచిపోవడం కాదు,
క్షమించండి..
దానివల్ల మానసిక క్రమశిక్షణ అలవడుతుంది.
రాను రాను బాధ్యతలు కూడా పెరుగుతాయి కదా !
క్షమాగుణం ద్వారా స్వీయ క్రమశిక్షణ అలవడుతుంది.
మీ పనిలో శ్రద్ధ పెరుగుతుంది.
మీ కింద పనిచేసే వాళ్ళతో బాగా పని చేయించుకో గలుగుతారు.
మీ సామర్థ్యం పెరుగుతుంది.
క్షమించడం కష్టమే......!!!
అయినా క్షమిస్తే మనసు తేలికవుతుంది."
శాంతమూర్తికి కొత్త ఆలోచన కలిగింది-- కోపం తెచ్చుకోకూడదు.
చిరునవ్వుతో పలకరించాలి.*
ఇంత ఎత్తుకు ఎదిగిన వాణ్ణి...
ఆ మాత్రం నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనా !!
మర్నాడు ఆఫీసుకు పోగానే ఆనందరావు చేయిపట్టుకుని "సారీ ఆనంద రావు గారూ...
క్షమించండి...
తొందరపడ్డాను." అంటూ హత్తుకున్నాడు.
"మీ అందరికీ కూడా అపాలజీ చెప్తున్నా ఏమనుకోకండి.
మనందరం ఒక టీంగా కలిసి మెలిసి పనిచేద్దాం."
అందరి కళ్ళలో ఆశ్చర్యం ఆనందం...
వెల్లివిరిశాయి.
ఆఫీసంతా కొత్త ఉత్సాహంతో నిండి పోయింది.
అందుకే... వీలైనంత వరకు క్షమిస్తు ఉండండి..!!

No comments:
Post a Comment