Monday, August 3, 2020

విశ్వమత గ్రంధం ఏమిటి?

#విశ్వమత గ్రంధం ఏమిటి?
💐🙏💐🙏💐🙏💐🙏💐🌼🌼🌼🌼🌼🌼

🌸 #ఈ లోకంలో ప్రతి మానవుడు సుఖాన్నే కోరుకుంటాడు. ఎంత తెలివి తక్కువ వాడు కూడా #దుఃఖాన్ని కోరుకోడు. కోరకపోయినా పూర్వజన్మ కర్మల ఫలితంగా రావలసిన సమయంలో దుఃఖాలు వస్తూనే ఉంటాయి.

#అలా వచ్చినప్పుడు ఈ దుఃఖం ఎప్పుడు పోతుందా? 🙏🌷

#తిరిగి ఎప్పుడు సుఖం వస్తుందా?
అని ఎదురు చూస్తాడు. ఎదురు చూడటమే కాదు. ఆ సుఖంకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. డబ్బు #సంపాదిస్తాడు, వస్తువులు తెచ్చుకుంటాడు. ఇతరుల సాయం అర్ధిస్తాడు. అనేక వస్తువులు కనిపెడుతుంటాడు, తన వృత్తిని మారుస్తాడు, వ్యాపారాన్ని మారుస్తాడు, ఉద్యోగాన్ని మారుస్తాడు, ఉన్న ఊరిని మారుస్తాడు, తన దేశాన్ని కూడా వదిలి #విదేశాలకెళతాడు, పెద్దవాళ్ళతో స్నేహం చేస్తాడు, శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమిస్తాడు - ఇలా ఎన్నో, ఎన్నెన్నో చేస్తాడు. వీటి ఫలితంగా దుఃఖాలు పోవచ్చు, సుఖాలు రావచ్చు. కాని ఆ సుఖాలు శాశ్వతంగా ఉండటం లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఆ #సుఖాలు దూరమై, మళ్ళీ దుఃఖాలు దరిచేరతాయి. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడ్డా మానవుడు తాను కోరుకున్న సుఖాన్ని, ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. ఎందువల్ల ? తాను #కోరుకొనేది శాశ్వత ఆనందమే గాని, తాత్కాలిక ఆనందం కాదు.

#ఎప్పుడూ ఉండే సుఖం - ఎప్పుడూ ఉండే ఆనందమే కావాలి. అప్పుడే తపన తీరేది, అన్వేషణ #ఆగేది.🍀🍂

🌸 #అట్టి శాశ్వత ఆనందం, నిత్యసుఖం ఎన్ని వస్తువులు సంపాదించినా, ఎందరు వ్యక్తులను దరిచేర్చుకున్నా, ఎన్ని పరిస్ధితులను, స్ధితులను మారుస్తున్నా రావటం లేదు. అనిత్యమైన సుఖమే వస్తున్నది ఎందువల్ల?🌸🌺

🌸 #మనం కోరుకొనేది నిత్యసుఖాన్ని, కాని పట్టుకొనేది అనిత్య వస్తువులను. అనిత్య వస్తువులు అనిత్యమైన సుఖాన్నే ఇస్తాయిగాని నిత్యసుఖాన్ని ఇవ్వలేవు. నిత్యవస్తువు మాత్రమే నిత్యసుఖాన్నిస్తుంది. మరేమిటి ఆ నిత్యవస్తువు ?

#నిత్యవస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం #సర్వమనిత్యం"

#నిత్యవస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. పరమాత్మకన్న వేరైన సమస్తమూ అనిత్యమే - అని శంకరాచార్యులవారు 'తత్త్వబోధ' అనే ప్రకరణ #గ్రంధంలో తెలియచేసారు 🌼🙏

🌸 కనుక ప్రతిమానవుడు నిత్యమైన పరమాత్మను మాత్రమే పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే అనిత్య వస్తువులు, విషయాలు, భోగాలు మొదలైన వాటి #పట్టు నుండి విడిపించుకోవాలి. ఈ అనిత్య వస్తువుల పట్టు నుండి విడిపించుకొని శాశ్వతమైన పరమాత్మను ఆశ్రయించి, పరమాత్మతో ఇక్యమై పోవుటకే మనకు ఈ మానవజన్మ వచ్చింది. ఈ #మానవ జన్మలోనే దీనిని సాధించాలి. అలా సాధిస్తేనే ఈ జన్మసార్ధకం. సాధించలేనిచో ఈ జన్మ వ్యర్ధం.

🌸 #మరి ఎలా సాధించటం? 🙏

#ఎలా ప్రాపంచికవిషయ వ్యామోహాన్ని వదలటం?

#ఎలా పరమాత్మను తెలుసుకొని, ఆశ్రయించి, అందుకోవటం?
ఎలా సమస్త దుఃఖాల నుండి శాశ్వతంగా నివృత్తి చెంది అనంతమైన, అఖండమైన, దుఃఖ రహితమైన శాశ్వత ఆనందాన్ని పొందటం? 🍀

#ఈ అన్ని సందేహాలకు ఖచ్చితమైన సమాధానమే
భగవద్గీత🍂🍀

🌸 #భగవద్గీత సర్వ ఉపనిషత్తుల సారం, యోగ శాస్త్రం, బ్రహ్మ విద్యా ప్రతిపాదిత గ్రంధం. ఇది మోక్ష శాస్త్రం. అన్ని వేదాల, ఉపనిషత్తుల, సమన్వయ శాస్త్రం. అన్ని శాస్త్రాలను, సిద్ధాంతాలను మధించి #వెలికి తీసిన సార సంగ్రహం. 🌸🌹

#ఒక్క హిందూమతానికేగాక, అన్ని మత సాంప్రదాయాలకు సబంధించిన ప్రధాన సూత్రాలను, ధర్మాలను క్రోడీకరించిన సర్వ ధర్మ సమన్వయ క్షేత్రం ఇది. 🌹🌷

#అందుకే దీనిని విశ్వమత గ్రంధం అన్నారు
.

#ప్రపంచంలోని 42 భాషలలోనికి అనువదించబడి, 125 దేశాలలో పరిచయమున్న అద్భుత గ్రంధం #భగవద్గీత. 🌿🌼

#అన్ని కాలాలలోని, అన్ని దేశాలలోని మానవులందరి జీవిత సాఫల్యానికి కావలసిన సమస్త విషయాలను తెలియజేసిన సమగ్ర గ్రంధరాజం భగవద్గీత. 🍀🍂

#ఎందరో మహాత్ములు మహానుభావులు, ఆచార్యులు, పీఠాధిపతులు, స్వామీజీలు ఈ గీతాసాగరంలో మునిగి, అనర్ఘమైన రత్నాలను చేజిక్కించుకొని వాటిని సామాన్య మానవులకు పంచుతూనే ఉన్నారు.🌹🌻🍀

🌼🙏ప్రతి ఒక్కరూ ఈ గ్రంథ రాజాన్ని తమ వద్ద ఉంచుకొని చదవాలి,పిల్లలకు నేర్పించి జన్మను సాకారం చేసుకోవాలి........🌻🌹🌷

స్వస్తి........

సనాతన ధర్మస్య రక్షిత-రక్షితః
*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Source - Whatsapp Message

No comments:

Post a Comment