Monday, August 17, 2020

నేను, నా శరీరం ఒకటేనా, లేక వేరు వేరా. అయితే ఇక్కడ నేను అనేది ఎవరు? శరీరం అంటే అది మన కంటి ముందు కనిపిస్తుంది. కానీ నేను అనేది ఎలా ఉంటుందో, ఎక్కడ నుండి వచ్చిందో, ఎక్కడకు వెళ్తుందో అనేది ఎలా తెలుస్తుంది. ఒకసారి పరిశీలిద్దాం..

🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘

👌నేను, నా శరీరం ఒకటేనా, లేక వేరు వేరా. అయితే ఇక్కడ నేను అనేది ఎవరు? శరీరం అంటే అది మన కంటి ముందు కనిపిస్తుంది. కానీ నేను అనేది ఎలా ఉంటుందో, ఎక్కడ నుండి వచ్చిందో, ఎక్కడకు వెళ్తుందో అనేది ఎలా తెలుస్తుంది. ఒకసారి పరిశీలిద్దాం..👌

సహజంగా ఒక వ్యక్తి మన ముందుకు వచ్చి మన కంటికి కనపడినపుడు మనకు కనిపించేది కేవలం అతడి శరీరం మాత్రమే. కానీ ఆ వ్యక్తి శరీరంలో మన కంటికి కనిపించని మరొక శరీరం దాగి ఉంది, దాన్నే సూక్ష్మ శరీరం అంటారు. ఆ సూక్ష్మ శరీరాన్నే మనం మన మామూలు భాషలో మనసు అంటారు. మనిషి తనను తాను చూసుకున్నప్పుడు తన శరీరం మాత్రమే తనకు కనిపిస్తుంది. కానీ తనకు తెలియకుండానే తనలో, తనకొక వ్యక్తిత్వం ఉన్నట్లు అనిపిస్తుంటుది. దానివల్లే తన ఉనికి తనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి కారణం మనలో మన కంటికి కనపడకుండా దాగి ఉన్న మన మనసే. ఈ మనసనేది మన కంటికి కనిపించక పోయినా, మన కంటికి కనిపిస్తున్న ఈ స్థూల శరీరాన్ని పుట్టిన దగ్గర నుండి మరనించెంత వరకు ఆటాడిస్తూ, నడిపిస్తూ ఉంటుంది. ఆ కనిపించని మనసునే ఈ "నేను " అని అంటారు.

ఈ నేను అనే భావం మనిషికి తన లోలోపల చాలా ఆనందం కలిగిస్తుంది. పుట్టుకలో లేని నేను ఎదుగుతున్న కొద్దీ ఎరుకలోకి వచ్చి మొక్క పెరిగి మానైనట్లుగా అలా అలా మహావృక్షంగా పెరుగుతుంది. ఈ 'నేేను ' అనేది మన లోపల ఒక శిఖరంలా, 'నాది ' అనేది ఒక ఆధార పీఠంలా చేసుకుని మనిషి బతుకుతూ ఉంటాడు. ఒక్కోసారి ఒక్కడే అంతా తానే అయి చేస్తున్న భావనకు లోనవుతుంటాడు. అది అతడి మనసు చేసే మాయాజాలం. ఎక్కడా ఏ సహాయం తీసుకోకుండా గాలికి పుట్టి గండాన పెరిగినట్లు, తనకు ఎవరి అవసరం లేనట్లు ఊహించుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఉంటాడు.

కానీ ఇదంతా ఒక అందమైన భ్రమ అని మనిషి తెలుసుకోలేక పోతున్నాడు. నిజానికి మనిషి ఎందరిమీదో ఆధారపడి బతుకు తున్నాడు. ఇతరులతో ఏ సహాయమూ లేకుండా ఏ మనిషి తన జీవితం కొనసాగించే ప్రసక్తే లేదు. నిజానికి తల్లిగర్భంలోనే మన శరీరం అనేది శిశువుగా ఒక రూపం ఏర్పడుతుంది. తల్లి బతుకుతో బిడ్డ బతుకు ముడిపడి ఉంటుంది. అలా మనిషి తను పుట్టక ముందు నుండే తల్లి రూపంలో సహాయం పొందుతాడు. మనిషికి ఇంతకు మించిన సహాయం ఈ ప్రపంచంలోనే లేనేలేదు. అందుకే అలాంటి మన తల్లి రుణం తీర్చడం ఏ బిడ్డకూ ఎప్పటికీ సాధ్యం కానేకాదు అంటారు మన వేద పురుషులు.

పుట్టి భూమ్మీద పడిన శిశువు గాలితో, నీటితో, పాలతో, తల్లి ప్రేమతో బతుకుతాడు. పెరుగుతున్నకొద్దీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రకృతి నుండి, పంచభూతాల నుండి ఎన్నో సహాయాల మూలాన మనిషి శరీరాన్ని పెంచుకొంటూ, దానిని నిలబెట్టుకుని ఒక వ్యక్తిత్వం సంపాదించు కుంటాడు. మనిషికి అన్ని వనరులున్నా, అందరూ ఉన్నా ఒక మనిషి మీద ఇంకొక మనిషి ఆధారపడి బతక వలసిందే. సమాజంలో ఒకరికొకరు సహాయం చేసుకోకుండా మనం మన మానవ జీవనం ముందుకు కొనసాగించే అవకాశం లేనేలేదు.

మీరు గమనిస్తే గొప్ప మనుషులు, మహానుభావులు లోకం తమకు చేసిన సహాయం వల్లనే ఇంతటి స్థాయికి వచ్చామని చెబుతూ ఉంటారు. శ్రీకృష్ణుడి సహాయం లేకుండా పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చెయ్యగలిగేవారా? శ్రీరాముణ్ని కలిసిన హనుమ చేసిన సహాయం సీతమ్మను చూపించడానికే కదా. చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి ఎన్నో దివ్య సహాయాలు దైవ కార్యాల్లో ఇంకెన్నో మనకు కనిపిస్తు ఉన్నాయి.

ఒక యోగికి యోగం పొందడానికి తప్పని సరిగా ఒక ఉత్తమ గురువు గారి సహాయం కావాలి. అలాగే ఒక జ్ఞానికి తాను జ్ఞానం పొందడంలోనూ ఒక సద్గురువు సహాయం అవసరం. ఒక భక్తుడికి ఆత్మ విశ్వాసం పెంపొందడానికి జీవిత పర్యంతం, నిరంతరాయంగా భగవంతుడి సహాయం తప్పనిసరి. సహాయం అనేది ఒక దివ్యమైన, శక్తిమంతమైన ఆపన్న హస్తం. ఆ చెయ్యి వెనక ఉండి నడిపించకపోతే మహామహ కార్యాలెన్నో ఆగిపోతాయి. ప్రతి మనిషి తనకు వేరొకరి సహాయం అవసరం అయినప్పుడు వారితో ఆ సహాయాన్ని పొందే ప్రయత్నం తప్పకుండా చేయాలి. సహాయం పొందేందు కోసం పోరాడాలి. సహాయం కోసం వారిని ప్రార్థించాలి, అర్థించాలి, సహాయం పొందడం కోసం శరణాగతి చెందాలి. మనుషులు మనుషులకే కాదు, పశుపక్ష్యాదులకు కూడా ప్రేమతో, వాశ్చల్యంతో సహాయం చెయ్యాలి.

మనకు మనం మనయొక్క అవసరాలకు, ఆపదలకు మనల్ని మనం ఆదుకుంటున్న తీరును చూసినప్పుడు ఆ ఈశ్వరుడి మనసు కరుగుతుంది. తనవంతుగా ఆయన మనకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని, ఆశీర్వచనాన్ని అందించి దయగల దేవుడు అని నిరూపించు కుంటాడు. అలాగే ఆ పనిని ముగించడానికి అవసరమైన, తగిన వ్యక్తులను మనకు కలిపే విధంగా కొన్ని సందర్భాలను మనకు కల్పిస్తాడు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయి అని మనం అనుకుంటాం. కానీ ఆ భగవంతుడి ప్రమేయం లేకుండా ఈ సృష్టిలో ఏ చర్యలు జరిగే ప్రసక్తే లేదు. అందుకే మన పెద్దలు అన్నారు "శివుడాగ్నే లేనిదే చీమైనా కుట్టదు" అని.

సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మన కోసం మనం బతుకుతూ ఇతరుల కోసం బతకాలి. సహాయం చెయ్యడానికి ముందుండే మనిషే అసలైన మానవత్వం ఉన్న మనిషి అని పించుకొంటాడు. అలా కాకుండా నేను, నాది, నా కుటుంబం, నా డబ్బు ఇవి బాగుంటే చాలు, ఎవరు ఏమైనా నాకు సంబంధం లేదు అని జీవించే వాడిని మనసు, మానవత్వం లేని రాక్షసుడు అంటారు. ఇదంతా మనలో దాగి ఉన్న ఆ మనసు చేసే మర్మాలు. అందుకే గురువులు బోధిస్తూ ఉంటారు "నీ జీవితంలో నీ శతృవును జయించడం గొప్పకాదు, నీ మనసును జయించు. అదే నీ జీవితంలో అసలైన గెలుపు" అని. అందుకే మనిషన్న ప్రతి ఒక్కరూ ఇతరులకు తనవంతు సహాయం చెయ్యడానికి అవకాశం కోసం ఎదురుచూసే లాంటి మనిషిదే గొప్ప మనసు అంటారు. వారే హృదయమున్న గొప్ప సహృదయులు అన బడతారు.

మనిషిగా పుట్టిన ప్రతి మనిషి యోగక్షేమాలు చూసేవాడు ఆ భగవంతుడు. మనుషుల ద్వారా ఎవరెవరికి ఏ సమయానికి ఏ సహాయం చెయ్యాలో క్షుణ్నంగా తెలిసినవాడు ఆ భగవంతుడు. అది ఆయన ప్రణాళిక. తనకు కావలసిన పూజ చేయించుకుని, దానికి తగిన ఫలాన్ని ఇచ్చి, అతడి పాపాన్ని తొలగించడానికి చేసే సహాయమే దైవానుగ్రహం. ఎవరైనా మనల్ని సహాయం కావాలని కొరుకొంటే, ఆ భగవంతుడు ఆ వ్యక్తి రూపంలో నీ ముందుకు వచ్చాడని తెలుసుకొని, ఆ వ్యక్తికి అవసరమైన సహాయం చెయ్యాలి. అదే నీవు ఆ భగవంతుడికి చేసే పూజా ఫలం. అలా నీ జీవితంలో నీవు ఎప్పుడో, ఎక్కడో, ఎవరికో చేసిన ఒక చిన్న సహాయమే ఇప్పుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను, నీ భార్య పిల్లలను సుఖంగా ఉంచుతోంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్.👌

🤘సర్వే జనా సుఖినోభవంతు🤘

👌ధర్మో రక్షతి రక్షతః 👌

For Every Action Equal &
Opposite Reaction

🕉🌞🌎🏵🌼🙏🌼🏵🌎🌞🕉

Source - Whatsapp Message

No comments:

Post a Comment