Monday, March 1, 2021

జరిగింది మన మంచికే జరుగుతున్నదీ మన మంచికే జరగబోయేది మన మంచికే ఇలా అనుకుంటే,జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది.

ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి.
అది కింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి.కానీ, ఇవి రెండూ ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే,అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు.నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు.
నీ గురించి ఆలోచించు, బలపడతావు. పక్కవారి గురించి ఆలోచిస్తే, బలహీన పడతావు.

నువ్వు చెప్పే మాటల కంటే కూడా నీతో నువ్వు చెప్పుకునే సందేశాత్మక సంభాషణకు శక్తి ఎక్కువ. ప్రభావం ఎక్కువ..

ఏదో ఒక రోజు నీ జీవితం మొత్తం నీ కళ్ళ ముందు కదలాడుతుంది.ఆ రోజున నువ్వు చూసేందుకు నీకు నచ్చేలాగా నీ జీవితాన్ని మలుచుకో.
జీవితంలో అది లేదు, ఇది లేదని ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది, ఇంకొంచెం ఏడుపు తప్ప.ఆశల్ని అవకాశంగా మార్చుకుని, జీవితాన్ని ఆస్వాదించడమే గొప్ప.మన శక్తి కన్నా,
సహనం చాలాసార్లు మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.
బయట కనిపించే మురికి గుంతల కన్నా,మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతో చాలా ప్రమాదం.

జరిగింది మన మంచికే
జరుగుతున్నదీ మన మంచికే
జరగబోయేది మన మంచికే
ఇలా అనుకుంటే,జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది.
👏👏👏👏
.

Source - Whatsapp Message

No comments:

Post a Comment