దివ్యత్వాన్ని ఆశించే ప్రేమ!!
ఒక గులాబీ పుష్పించినపుడు అందాన్ని వెదజల్లే ఆనందం కోసం సహజంగా స్వచ్చందంగా వికసిస్తుంది. గులాబీ వికసిండంలో తనకు ఏ లాభాన్ని ఆశించక , మధురమైన సువాసనలతో , జీవనంలో ఉన్న సంతోషాన్ని వ్యక్తీకరిస్థుంది . రూపాన్ని దాల్చి జీవించడానికి మాత్రమే అది స్వచ్చంగా ఈ పనిని చేస్తుంది. మానవుడి విషయం వేరే. ఎవరో కొందరు మహానుభావులు తప్ప , ప్రతీ మానవుడు , తన మనసు పనిచేసే స్థితి వచ్చినప్పటి నుంచి , తన రూపం , తెలివితేటల ద్వారా ఏదో ఒక లాభాన్ని పొందాలని తపన పడుతుంటాఢు.. వాటివల్ల తనకేదో ప్రయోజనం కలగాలి . యితరుల పొగడ్తనైనా పొందాలి . లేదా ఏదైనా హీనమైన లబ్దీనైనా పొందాలని ఆశీస్తాడు . దీన్ని బట్టి చూస్తే , గులాబీ పువ్వు మనుషులకన్నా గొప్పదనే చెప్పాలి ..!
అందుచేత మనం కూడా జీవితంలో ఒక మెట్టు పైకి ఆరోహించగలిగితే గులాబీ స్వచ్చందంగా ఎలాగైతే వికసిస్తుందో , అలాగే మనం కూడా ఇంకా ఎక్కువ ఉన్నత స్థితిని సాధించగలం . స్వచ్ఛమైన సౌందర్య వికాసం లో ప్రయోజనాన్ని ఆశించకుండా జీవించడం లో ఉన్న ఆనందాన్ని పొందడానికి గులాబీతో సమానమైన ప్రవృత్తిని మనం సాధించగలం ... ఈ విషయాన్ని ఎక్కువగా మనం చిన్నపిల్లల్లో చూస్తాం. దురదృష్టవశాత్తు , తల్లిదండ్రుల ప్రభావం వల్ల, పరిసరాల ప్రభావం వల్ల, వారు కూడా చిన్న తనం లోనే లాభనష్టాలను బెరిజు వేసుకోవడం నేర్చుకుంటున్నారు.
ఈ విధంగా మనకున్న దానిని , మన స్వప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగింఛడం ప్రపంచంలో అతి వికృత విషయాల్లో ఒకటి.. ఇలాంటి స్వార్థం ప్రపంచమంతా వ్యాపించి ఉండటం వల్ల, మానవునిలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి ఈ లాభనష్టాలను గురించి అంచనా వేయడం అలవాటు అయితే దానిని ఏ శక్తీ దైవత్వం వైపు మరల్చడం కష్టం..
ఈ వికసించడమే గులాబీల ప్రేమ స్వరూపం. సూర్య కాంతిలో గులాబీ వికసించినప్పుడు , అది తన అందాన్ని చూపించడానికే ఆ పని చేస్తునట్లు ఉంటుంది. పూలు వాటి పనినీ గురించి ఆలోచించవు . అయితే ఈ విషయం మనకు సులభంగా అర్ధం కాదు. దీనికి విరుద్ధంగా మానవుడు మాత్రం తాను ఏ పని చేస్తున్నా, తన శక్తిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఒక్కడే ఈ పనిని చేయగలిగినట్లు భావిస్తారు. జంతువులు ఆలోచించవు . వాటి ప్రేమ ఇటువంటిది కాదు. పుష్పాల్లో మాత్రం ఇది చాలా సరళమైన, స్వచ్ఛమైన , స్వార్థరహితమైన ప్రవృత్తి, విశ్వజనీనమైన చైతన్యం, ప్రేరణ, ఏదో ఒక మహనీయ శక్తి వీటిలో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ శక్తి పుష్పముల వికాసంలోనే కనబడుతూ ఉంటుంది.
కనుక ఒక సారి పూలను చూడు ఎప్పుడు ప్రొద్దుక్రుంకిందో అప్పుడు అన్ని మౌనంలోకి జారిపోతాయి , నిద్ర పోతాయి. నిశ్చలంగా కొంత సేపు కూర్చుని ప్రకృతిలో ద్రవించిపోయి, తాదాత్మ్యం పొందు భూబంధం నుండి గాలిలోకి తేలిపోతున్నట్టు ఉంటుంది చెట్లు వేళ్ళుగా భూమిలోకి అల్లుకునిపోయి పైకి కొమ్మలు గా సాగుతూ ఆకాశాన్ని చుంబిస్తాయి అదే సంవేదన, ఉత్కంఠత ఆ తపనకు ప్రయోజనమేమిటీ? ఒక వెలుగు రేఖ కోసం ఒక ఆనంద బిందువు కోసం ఆ వెలుగు ప్రొద్దుక్రుంకి పోతుంది తిరిగి మొక్కలు నిద్రలోకి ముడుచుకుని పోతాయి ఇదంతా అందని దాని కొసనందుకొనే ప్రయత్నమే ఆ సంవేదన లో తపనలో ఎంత నిర్మలత్వం ఉంది!! అది నీవు అనుభవించగలిగితే నీ అంతస్తత్వం కూడా - నీ చైతన్యం కూడా ఒక ప్రార్థన గా పైకెగసి పోతుంది ఆ ప్రార్థనకు ఫలితం ఏమిటి? ఒక ప్రశాంతి ఒక ప్రకాశం, ఒక ప్రేమ యొక్క పూర్ణ దశ అది భౌతిక జీవితంలో శూన్యం ఎప్పుడైతే నువ్వు ఈ సువిశాల యథార్థ పవిత్ర దివ్య ప్రేమ స్పర్శను చూశావో కేవలం ఒక్క క్షణకాలమైనా చాలు నీకే తెలుస్తుంది ఆ సంవేదన ఎంత దివ్యమైన వస్తువును మలిచి నీ చేతికందించిందో!?
🪄🪄🪄🪄🪄🧡🧡🧡🧡🪄🪄🪄
Source - Whatsapp Message

No comments:
Post a Comment