Monday, July 31, 2023

 *మనజీవితం కాలం విలువ*
🌹🌹🌹🌹🌹🌹🌹

ప్రతి మనిషికి ఒక భయం దిగులు ఉంటుంది..
 నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో..?
 నా భార్య పిల్లలకు దిక్కెవరు..?
 నా మీద ఉన్న బాధ్యతలన్నీ ఎవరు మోస్తారు ఎవరూ తీరుస్తారు..?

 ఈ ప్రశ్నలు ప్రతి మనిషిని వేధిస్తుంటాయి..

వాటన్నింటికీ సమాధానం కాలం..
మనం ఉన్నా లేకున్నా..
ఎవరికి ఇవ్వాల్సిన సమయం ఎప్పుడు జరగాల్సిన బాధ్యతలు అప్పుడు కాలం నెరవేరుస్తూనే ఉంటుంది.
ఈ టైంలో అమ్మాయికి పెళ్లి చేయాలి..
ఈ టైం లోపు అబ్బాయిని సెటిల్ చేయాలి..
ఈ టైం లోపు ఇది చేయాలి.. ఈ టైమ్ లోపు అది చేయాలి... అని ముందే లెక్కలు వేసుకుంటాం..

 కాలాన్ని మనం కంట్రోల్ చేయలేం..
 కాలమే అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది 
 కాలం ఒకరి సొంతం కాదు..
 కాలం ఎవరికోసం ఆగదు..
 కాలానికి ప్రపంచానికి మన కుటుంబానికి మనమేదో చేసేస్తున్నాం అనుకుంటాం.
 కానీ అన్నింటికి నడిపేది కాలం మాత్రమే..
కొన్నిసార్లు చిన్నపని కోసం ఎంత ప్రయత్నించిన అవదు, కానీ ఒక్కోసారి ఏ ప్రయత్నం లేకుండా గొప్ప విజయం వచ్చేస్తది. 

కాలం మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తది. కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం. 

*సర్వేజనాసుఖినోభవంతు*🙏🙏

No comments:

Post a Comment