Tuesday, July 4, 2023

నేటి చిట్టి కథ

 ✍️..........🌻 *నేటి చిట్టి కథ* 🌻



🍂ఒక కొలనులోని రెండుచేపలు చాలా స్నేహంగా ఉండేవి. ఆ రెండు చేపలు ఏ పని చేసినా కలిసే చేసేవి. 

🍂ఓ రోజు ఒక చేపలు పట్టేవాడు చేపల కోసం వల విసిరాడు. ఒక చేప వలలో పడగా ఇంకొకటి తప్పించుకుంది.

🍂''ఆహా! ఈ చేప ఎంత పెద్దగా ఉంది. దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బు వస్తుంది'' అని సంతోషపడ్డాడు చేపలవాడు.

🍂ఆ చేపను వల నుండి తీసి బుట్టలో వేస్తుండగా అది ఏడుస్తున్నట్టు గ్రహించి  ''ఎందుకు ఏడుస్తున్నావు? వలలో చిక్కుకుని నాకు దొరికావని బాధపడుతున్నావా?'' అని అడిగాడు చేపలవాడు ఆ చేపని.

🍂''నేను నా గురించి ఏడవట్లేదు. నా స్నేహితుడు కోసం ఏడుస్తున్నాను. అతను కూడా వలలో చిక్కుకున్నాడని బాధగా ఉంది'' జవాబిచ్చింది ఆ చేప.

🍂''బాధపడకు! నువ్వొక్కడివే వలలో చిక్కుకున్నావు. ఇంకో చేప తప్పించుకుంది'' అని అన్నాడు చేపలవాడు.ఇది విని ఆ చేప చాలా సంతోషించింది.

🍂''ఓ చేపలవాడా! నా మాట విను!'' అని నీటి నుంచి వినిపించింది. చేపలవాడు ఆశ్చర్యపోయాడు. ఎవరు మాట్లాడుతున్నారు అని నీళ్ళల్లోకి చూశాడు. రెండో చేప నీటిపై తేలుతూ కనిపించింది.

🍂''నా స్నేహితుడు నీ వలలో చిక్కుకున్నాడా?'' అడిగింది రెండోచేప. ''అవును!'' బదులిచ్చాడు చేపలవాడు.

🍂''నీకు చేపలన్నీ సమానమే, కదా! దయచేసి నన్ను పట్టుకుని, నా స్నేహితుడిని విడిచిపెట్టు! లేకపోతే నన్ను కూడా పట్టుకెళ్ళు. నేను నా స్నేహితుడు లేకుండా జీవించలేను'' అని ప్రాధేయపడింది రెండోచేప.

🍂చేపలవాడు ఆ చేపల స్నేహానికి ఆశ్చర్యపోయి  ''మిమ్మల్ని విడదీస్తే ఈ లోకంలో ఎవరూ కూడా నన్ను క్షమించరు!'' అని అంటూ మొదటి చేపను నీటిలో వదిలేశాడు.


క్షాంతిశ్చేత్ కవచేన కిం కిమరిభి: క్రోధో2స్తి చేద్దేహినాం,
ఙ్ఞాతిశ్చే దనలేన కిం యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం,
కిం సర్పైర్యది దుర్జనా: కిము ధనైద్విద్యా2నవద్యా
వ్రీడా చేత్ కిము భూషణై: సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్ ?


🍂ఓర్పు కల వానికి వేరే కవచం అక్కర లేదు.
కోపం కల వానికి వేరే శత్రువులెవరూ ఉండనక్కర లేదు. దాయాదులు ఉంటే వేరే అగ్ని అక్కర లేదు.

🍂 *మంచి మిత్రులున్న వారికి వేరే గొప్ప ఔషధాలతో పని లేదు.* దుష్టులు ఉండగా వేరే విష సర్పాలతో పని లేదు. మంచి విద్య ఉన్న వారికి వేరే గొప్ప నిధులు అక్కర లేదు. 

🍂లజ్జ కలిగిన వారికి వేరే ఆ భరణాలు అక్కర లేదు. 
కవితా శక్తి కల వారికి వేరే రాజ్య మక్కర లేదు.


🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀

No comments:

Post a Comment