Tuesday, July 4, 2023

కథ: బాధ్యత

 డబుర ధనలక్ష్మి కథలు ✍️

కథ: బాధ్యత

బెంగళూరు నుండి సెలవుపై ఇంటికొచ్చాడు మోహిత్. 
తన భార్య అర్చన మూడునెలల క్రితం పుట్టింటికి వెళ్ళింది. 
ఇక అత్తింటి కి రానని మొండికేసింది. తను ఫోన్ చేస్తే అర్చన లిఫ్ట్ చేయడం లేదు. అర్చన కు అసలే పంతం పట్టింపు ఎక్కువ.

అర్చన మోహిత్ తో విడిపోవడానికి నిర్ణయం తీసేసుకుంది.. ఇక తన చేతిలో ఏం మిగిలి లేదు.  మోహిత్ ను ఎంతగానో ఇష్టపడిన అర్చన ఇప్పుడు తన నీడను కూడా సహించడం లేదు. 

ఎప్పుడు చూసినా మోహిత్ కుటుంబం లోని అందరిపై చాడీలు చెప్తూ గొడవలు పడ్తున్న అర్చనంటే ఇంట్లో ఎవరికీ పడడం లేదు. అందుకే గొడవలు చిలికి చిలికి గాలివానలైనాయి. ఇంట్లో గోడవలతో మనఃశ్శాంతి లేకుండా పోయింది.అందుకే ఏదైతే అయిందని విడిపోవడానికే సిద్దపడిపోయాడు.

ఆ రోజు తన బర్త్ డే.

ఆఫీస్ ఈ మెయిల్స్ చెక్ చేస్తుండగా అర్చన పంపిన మెయిల్ కనిపించింది.వెంటనే ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు.

కన్నా 
ఓడిపోయా 
నిను ప్రేమించడం లో కాదు
నా ప్రేమను నీకు అర్థమయ్యేలా చూపడంలో
నీ నుండి నన్ను నేను మరచిపోయేంత తన్మయత్వపు ప్రేమను ఆశించి ఓడిపోయా.

ఊహ తెలిసే సరికే తండ్రిని కోల్పోయా.
అన్నీ తానై గుండె ల్లో దాచుకున్న తల్లి లాలనలో అపురూపంగా పెరిగాను.

ఇంటినిండా పేదరికం ఉన్నా నా తల్లి గుండెల్లో నా పట్ల కొండంత ప్రేమ వెలుగు చూశాను

నా చిన్నప్పుడు ముద్దుల మూటలు కడుతూ నే చెప్పే మాటల్లో అమ్మ తన కష్టాన్నంతా మరచిపోయేది.

చిన్నప్పుడు చీకటంటే భయపడేదాన్ని.

నిశిరాత్రిని కప్పే చీకటి దుప్పటిని చూసి మనుషుల్ని భయపెట్టి పీక్కు తినే దెయ్యాలున్నాయని భయపడేదాన్ని.

కానీ ఆశ్చర్యంగా సాటి మనుషుల రూపంలో వంకర మాటలు మాట్లాడేవాళ్ళు.నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే వాళ్ళు .పుకార్లు పుట్టించి ఆడపిల్ల జీవితాల్లో  అసూయతో అగ్గిరాజేసే వాళ్ళే ఈ కాలానికి నిజమైన దెయ్యాలని తెలుసుకున్నా.

మగదిక్కు లేక అమ్మ పడిన అవమానాలు నా మనసును ఎంతో గాయపరచాయి.

ఎక్కడో జరిగే అత్యాచారాలంటే వణికిపోయేదాన్ని.
లేత శరీరాల పై  ఆ నఖక్షతాలు రాక్షస పంటిగాట్లతో ఉన్న నిస్సహాయ స్త్రీల శవాల దృశ్యాలు ఎక్కడ ఏ వార్తల్లో కనిపించినా చిగురుటాకులా వణికిపోయేదాన్ని.

ఎక్కడికెళ్ళినా  మగాళ్ళ చూపుల్లో తేడా కనిపించేంత ప్రత్యేకత నేను ఏనాడూ కోరుకోలేదు.

నేను ఆడపిల్లను .ఆకాశంలో సగం అంటూ ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా నా అడుగులు నేలపైనే గా పడాలి.

చదువు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని నాలో చదవాలనే ఆశను ఆర్థిక స్థిరత్వాన్ని సాధించుకోవాలనే నా ఆశయాన్ని బలంగా శ్వాసించా.

చదువులో ముందుంటూ కాలేజ్ లో టాపర్ గా నిలిచా.

పూలు పరుచుకున్న సుగంధ సమీరాల దారుల్లో
నా మనసును సొంతం చేసుకోవాలన్న చాలామంది తాపత్రయానికి నేను చలించలేదు.

నాకు తెలుసు. వయసొచ్చిన ఆడపిల్ల ఉప్పొంగే గోదారి సొగసు ఎవరినైనా ఆకర్షణ వలయంలో చుట్టేయగలదు.

కానీ ఆ అమ్మాయికి పూల  పూల కీ మారుతూ సుగంధాన్ని ఆస్వాదించే తుమ్మెదలు ధూళితో సమానం.
ఆ ఆడ జీవితాలపై చెడు మచ్చ కు తప్ప ఎందుకూ పనికిరావు.

నా మెడలో తాళి కట్టి నాతో వందేళ్ళ జీవితం పంచుకుని  కష్టాల్లో ఓదార్పుగా సుఖాల్లో తోడుండి సంతోషాన్ని రెట్టింపు చేసే వ్యక్తి జీవిత భాగస్వామి గా రావాలని రెప్పపాటు స్వప్నాలెన్నో స్వప్నించాను.

కలత కన్నుల కన్నీరు నా చెంపలపై జారే అవసరం రానివ్వకుండా అనుక్షణం కష్టసుఖాల్లో నీడలా వెన్నంటి ఉండే  భర్త రావాలనుకున్నా.

అప్పుడే తెలిసినవాళ్ళ ద్వారా మీ పెళ్ళి సంబంధం మా ఇంటికి చేరింది.
పెళ్ళిచూపులు మొదలయ్యాయి.
పట్టుచీర లో వంచిన తల ఎత్తకుండా సిగ్గుబరువుతో సూటిగా మీ కళ్ళలోకి చూడలేకపోయా. అప్పుడప్పుడు మీరు నన్ను సూటిగా చూస్తున్న చూపు నాకు తెలుస్తూనే ఉంది.

దేవుడు రాసిపెట్టి నట్టు మన పెళ్ళి కుదిరింది. నాకేమో మీరు తెగ నచ్చేసారు. నాకంటే అందంగా ఉన్న మీకు నా దిష్టే తగులుతుందేమో అనుకునేంత.

మీ కుటుంబం గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు. మీ నాన్నగారిది పెద్ద ఉద్యోగం.మూడంతస్తుల ఇంద్రభవనం లాంటి ఇల్లు.
మీతో కలిసి పంచుకునే జీవితం పట్ల 
ఎన్నో కలలు కంటూ
మరెన్నో ఆశలు పెంచేసుకున్నాను 
భావిజీవితపు ఊహలు నన్ను భూమిపై నిలవనివ్వలేదు.

పెళ్ళి వారం రోజులు ఉందనగా "కట్నం తేలడం లేదు. పది లక్షలు అంటే ఒప్పుకోవట్లేదు.పన్నెండు లక్షలు కావాలంట. ఎనిమిదెకరాల పొలం వారి పేర రాయమంటున్నారు. కట్నం కావలిస్తే ఇంకో రెండు లక్షలు పెంచి ఇస్తాను కానీ పొలం మాత్రం నా కూతురు పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయిస్తా అని చెప్పా "  అంటూ మా అమ్మ బాధపడింది.

తొలిసారి మనసులో వెలితిగా అనిపించింది. ఈ పెళ్ళికి ఒప్పుకుని తప్పు చేశానా అనిపించింది.
కానీ అనుకున్న ముహూర్తానికి మన పెళ్ళి జరిగిపోయింది.

మీతో మొదలైన కొత్త జీవితం ఓ అద్భుత లోకం.

చిన్నప్పటి నా భయాలన్నీ పటాపంచలైపోయాయి.

తండ్రిగా భర్తగా కొడుకుగా స్త్రీ తనపై హక్కును నమ్మకం ప్రేమతో ఇస్తుంది.

భర్తగా మీ తోడు మీరు చూపించే ప్రేమ మీ బాధ్యత మీ ప్రేమ ప్రపంచం నాదే అనిపించింది





పాప పుట్టిన రోజు నేను హాస్పిటల్ లో నే ఉన్నా. పాపను నా చేతుల్లోకి తీసుకుంటుంటే ఆ పసిదాని స్పర్శ నాలో తెలియని సంతోషాన్ని నా మదికి పరిచయం చేసింది. 

అప్పుడే నా చిట్టితల్లి కి వాగ్ధానం చేసా. మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలగించి తనకు మంచి అమ్మానాన్నలు గా సంతోషాన్ని పంచుతామని.

నువు పీజీ పూర్తి చేశాక జాబ్ లో జాయిన్ అయ్యావు. అక్కడ నీకు సమస్యలు రాకుండా నా స్నేహితున్ని  నీకు తెలియకుండానే తోడుగా ఉంచా.

అప్పుడే మా అమ్మ కరోనాతో చనిపోవడం నన్ను మానసికంగా కృంగి దీసింది.

అదేంటో నా మనసుకు ఏ కష్టం వచ్చినా నువ్వు నా పక్కనుంటే బాగుండేది అనిపించేది.

నువ్వు జాబ్ లో సమస్యలు ఎదుర్కొన్నపుడు నీకు ఓదార్పు అవుదాం అనుకున్నా.కానీ ఈ సమాజంలో నువ్వు స్వతంత్ర వ్యక్తిత్వంతో ఎదగాలని కోరుకున్నా.

ఇక మనం కలిసే సమయం వచ్చిందని అనిపించింది.అందుకే వచ్చా. నీకు అభ్యంతరం లేకపోతే మనం తిరిగి మన జీవితాన్ని ప్రారంభిద్దాం. మన పాపకు మంచి తల్లిదండ్రులు అవుదాం " అన్నాడు.

కన్నీళ్ళతో  అంగీకార సూచకంగా అల్లుకుపోయింది అర్చన.

రెండు వారాల తర్వాత తన భుజంపై నిద్రపోతున్న చిన్నారికూతురికి నిద్రాభంగం కలగకుండా  బెడ్ పై పడుకోబెట్టి రెండువైపులా మెత్తటి తలగడలను పెడుతున్న మోహిత్ ను మెల్లగా హత్తుకుంది అర్చన.

అర్చన " మీరెంత గా నన్ను పాపను మిస్ అయ్యారో నేను కూడా అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని మిస్ అయ్యాను.

పొత్తిళ్ళలో బిడ్డను తండ్రికి దూరం చేసేహక్కు నాకు లేదనిపించింది.
మీ అమ్మ గారు కరోనాతో చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డా.
బాధ్యతగా మారి మీరు వస్తే మీతో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టాలనే ఆశపడ్డా.
ఇక మన గొడవల కంటే పాప భవిష్యత్తు కు విలువిద్దాం"అంది.

కలిసిన మనసులు
అర్థం చేసుకునే సర్దుబాటు గుణం
క్షమించే ఔదార్యం
ఒకరికొకరు తోడుండటం భార్యాభర్తలు అనుబంధానికి గట్టి పునాది .

విడిపోవడం తేలిక.
సర్దుకుపోతూ కలిసి బ్రతకడం లోనే సమర్థత ఉంటుంది.
ఆవేశంతో నో ఆవేదనతో నో భార్యాభర్తలు విడిపోవచ్చు.

కానీ ఏ పాపం తెలియని పసివాళ్ళను ఈ  లోకంలోకి తీసుకొచ్చి అమ్మానాన్నల లాలన లో పెరగాల్సిన బాల్యాన్ని అమ్మానాన్నలు విడిపోయి ఆ పసిహృదయాలను ప్రేమ రాహిత్యం లోకి ఒంటరితనం లోనికి అభద్రత లోకి నెట్టి వేయడం అమానుషం.

అందుకే పెళ్ళి అంటేనే ఒకరి జీవితం కాదు.
రెండు కుటుంబాల పరువు.
కొన్ని జీవితాలు.
సరైన నిర్ణయాలు తీసుకోకపోతే జీవితాలు గాడాంధకారం.

సమాప్తం
సర్వేజనా సుఖినోభవంతు

No comments:

Post a Comment