. *ప్రవర్తన - పరివర్తన*
*ఎవరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు.*
*ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి.*
*అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి.*
*ఎందుకంటే... దీనివల్ల చాలా లాభాలున్నాయి.*
*నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటంవల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది. అది అవతలవారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కాని, ముందు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది, ఎంత ధ్యానం చేసినా, యోగా, వ్యాయామం... చేసినా దానిని సరిచేయలేవు. దీనికి శాస్త్రీయమైన దాఖలాలు ఉన్నాయి.*
*రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం అదుపు తప్పుతుంది. మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడంటారు. చెడుగా ఆలోచించి, ఆలోచించి చెడ్డలో మునిగిపోతే మన మనసును దయ్యంలా చెడు పట్టుకుంటుంది. ఎంత పూజ చేసినా ఉపయోగం ఉండదు. అది అవతలవారికి హాని చేసే లోపలే మనం దానికి బలి అయిపోతాం. దీనివలన ఎదుటివారికి చెందవలసిన అశుభపరిణామాలను ప్రత్యక్షంగాకాని పరోక్షంగాకాని వీరు అనుభవిస్తున్నారు.*
*ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది.*
*ఉదయం లేవగానే "ఈ లోకం లో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి !" అని హృదయపూర్వకంగా పది నిమిషాలపాటు కోరుకోవాలి.*
*ఇలా చేస్తే... మందులు వేసుకోకుండానే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. గురువులు బోధిస్తున్నారు.*
*మనం కూడా ఆలోచించాలి, ఆచరించాలి. మంచి చెడుల మిశ్రమమే జీవితం. సుఖదుఃఖాల సంగమమే జీవనం. త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరాముడున్నాడు. మంచికి, ధర్మానికి మారుపేరు ఆయన. ఆ యుగంలోనే అతి దురాత్ముడు, మహా పాపి అయిన రావణాసురుడూ ఉన్నాడు. ఏ యుగమూ చెడ్డను తప్పించుకోలేదు.*
*మంచిని నిర్మించే శక్తి మనకు లేకపోవచ్చు. చెడ్డను నిరసించే శక్తి కావాలి. చెడుభావనలు మనసును హింస పెడుతున్నప్పుడు తత్సమానమైన మంచి భావాలతో నింపుకోవాలి.*
*అంతేకాని మీకు సంబంధం లేని ఎదుటివారి పాపకర్మలను నిందించి లేదా ప్రచారం చేసి వారికి చెందవలసిన చెడును మీరు అనుభవించకండి..!*
*పుట్టుకతో ఎవరూ దుర్మార్గులు కాదు, పాపాత్ములుకాదు. ప్రతివారిలోనూ మంచి-చెడు రెండూ ఉంటాయి. కానీ మన దురదృష్టమేమిటంటే నేటి సమాజం చెడును చూసినంత ఎక్కువగా మంచిని చూడటంలేదు.*
*ఇకనైనా మనము క్షమాగుణం కలిగి, ఎదుటివారిలోగల చెడుని వదిలేసి మంచిని మాత్రమే చూద్దాం, మంచి గురించి మాత్రమే చెబుదాం.!*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
*🙏లోకా సమస్త సుఖినోభవన్తు🙏*
🌹🌹🌹 🪷🕉️🪷 🌹🌹🌹
No comments:
Post a Comment