Thursday, October 10, 2024

 10-10- 2024- గురువారము - శుభమస్తు..
               🌹గుడ్ మార్నింగ్ 🌹
మనము జీవిస్తున్నాము అంటేనే మనలో జీవము అంటే ప్రాణ శక్తి వున్నదని అర్ధము.
ఇది కొంతకాలానికి మరణము పేరుతో వెళ్ళిపోతుందని అందరికి తెలుసు......
నేను అనుకుంటూ అనుభవాల  వెంపర్లాటలో కాలం గడిపిన శరీరం ఇక్కడే మిగిలిపోయి - భూమిలోనో , అగ్నిలోనో కలిసిపోతుంది. ఈ సత్యము అందరికి తెలుసు. అయినా ఇలా జీవించటమే ఇష్టం.
ఆలోచించటం, అన్వేషించటం, నిజం తెలుసుకోవటం అయిష్టం..............
ఎవరు మాత్రం ఏమి చేయగలరు?????
ఎవరిష్టం వారిది............
......  ఆధ్యాత్మికత అంటే ఈ జీవము లేక ప్రాణాన్ని తెలుసుకునే ప్రయత్నం.........
 అది మనలో జీవము వున్నప్పుడే చేయగలం - చేయాలి కూడా.....................
ఈ జీవ శక్తిని ఎవరము ఎలా ఉపయోగించుకుంటున్నామో గమనించుకోవాలి..........
చెడుకు ఉపయోగిస్తే ఈ జీవితముతో పాటు అనేక జన్మలు పాడుచేసుకుంటున్నారు... వాళ్లకే నష్టం........................
మంచికి ఉపయోగిస్తే - కొంచెం బెటర్. ఈ జీవితముతో పాటు మరు జన్మ కూడా బాగానే ఉండవచ్చు...............
మంచిగా జీవిస్తూ - నా జీవాన్ని లేక నా ప్రాణ శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే - ఆ ప్రయత్నం ఫలిస్తే - ఈ సుఖ దుఖాల శరీరం నుండి - ద్వంద, విభేదపు ప్రపంచం నుండి విముక్తి లభించి - అనంత,ఏకత్వపు, సర్వవ్యాపక,శాస్విత ఆనంద స్థితి అనుభవమవుతుంది...........
ఇది అద్భుతం కాదు - అనంత ప్రశాంతత.
...........ప్రతి వారి స్వీయ స్వరూపమైన అధ్యాత్మికతను అద్భుతాలుగాతయారుచేసి ప్రజలను నమ్మించేవారు - నమ్మేవారు.............. 
 జీవితాంతము వారు అక్కడే చిక్కుకుపోయి -- జన్మ జన్మలకు మహిమలు, మాయలు, కీర్తి, ధనము, కోరికలు అనే శరీర భ్రమలో - అదే దైవ మాయా విధానాలలో జన్మిస్తూ - అదే మాయను నమ్ముతూ - నమ్మిస్తూ, ఎప్పటికి ఒక చిన్న పరిధిలో జీవిస్తూ...
జన్మ, జన్మలుగా వచ్చి వెళుతూ వుంటారు
.......అందుకే అనేక మతాలు, మార్గాలు విధానాలు ఎప్పుడూ ఏర్పడుతూనే ఉంటాయి................
నీ మాయను నువ్వే తెలుసుకోని - నీ సత్యములోకి నువ్వు ప్రవేశించటమే ఆధ్యాత్మికత........అది నీ ఇష్టం మాత్రమే.
               🌹god bless you 🌹

No comments:

Post a Comment