Tuesday, October 15, 2024

పాదాభివందనం ఎందుకు చేయాలి....!! 🙏పాదాభివందనం వలన… ప్రయోజనం ఏమిటి🪷

 🕉️ ఓం నమః శివాయ 🕉️

🙏 శివాయ గురవే నమః 🙏

🙏 పాదాభివందనం ఎందుకు చేయాలి....!!

🙏పాదాభివందనం వలన…
             ప్రయోజనం ఏమిటి🪷
🌺🌺☘☘🌺🌺☘☘🌺🌺☘☘   

🌺శుభ కార్యాలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని, చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.

☘కేవలం శుభకార్యాల లోనే కాక, పెద్దవారు కనిపించనప్పుడు కూడా చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు. 

🌺అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి!🌷

☘భారతీయ సంప్రదాయంలో, పెద్దవారి పాదాలను తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న పురాతన పద్దతి. 

🌺అయితే కొందరు, 
అడుగులను అపరిశుభ్రంగా  భావిస్తారు.

☘పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత ప్రయోజనాలు, అర్ధవంతమైన సూచనలు, ఉన్నాయి.

🌺పెద్దవారి పాదాలను తాకాలంటే, మన అహంకారం వదిలి తల వంచాలి. 
అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను గౌరవించడంతో సమానం.

☘సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు, వారి ఆలోచనలు, స్పందనలు, వాటి నుండి వచ్చే పదాలు, చాలా శక్తివంతంగా ఉండటం వల్ల చిన్నవారికి ఎన్నో ఆయురారోగ్య ఐశ్వర్య విద్యా లాభాలు చేకూరుతాయి!

🌺పెద్దవారి పాదాలను తాకడానికి 
మన నడుము వంచి,  
మన కుడి చేతిని పెద్దవారి ఎడమ కాలిమీద పెట్టాలి.  

☘అలాగే మన ఎడమ చేతిని పెద్దవారి కుడి కాలిమీద ఉంచాలి. 
అప్పుడు పెద్దవారి చేతులు, మన మీదఉంటాయి. 

☘ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది. 
ఆ సమయంలో పెద్దవారి శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవుతాయి.

🌺ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే  దీవెనలు ఫలిస్తాయి.

☘పెద్దవారు ఈ భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం వల్ల, వారి పాద ధూళిలో కూడా, ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది. 

🌺"మేము కూడా మీ మార్గంలో  నడిచి అనుభవాన్ని, జ్ఞానాన్ని, సంపాదించడానికి ఆశీర్వదించండి", 
అని చెప్పే సంప్రదాయానికి ప్రతీకగా, 
చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.

☘మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు,
ఆ ఇంటిలో ఉన్న పెద్దవారికి
పాదాభివందనం చేసి, పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.

🌺అలాగే  ఎవరైనా పెద్దవారు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా,
వారికి పాదాభివందనం  చేసి,
పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.

☘🙌 సాధారణంగా పెద్దవారి ఆశీర్వచనాలు ఈవిధంగా ఉంటాయి! 🙌🌹

🌺పెళ్లయిన జంటని :
అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు.

☘పెళ్లి అయిన ఆడవారిని :
దీర్ఘసుమంగళీభవ

🌺చిన్న పిల్లల్ని :
🙌చిరంజీవ - చిరంజీవ

☘చదువుకుంటున్నవారిని :
🙌బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలి.

🌺పెద్ద చదువులు చదువుకునేవాళ్ళని :
🙌ఉన్నతవిద్యా ప్రాప్తిరస్తు.

☘పెళ్లికావసలసిన వాళ్ళని :
🙌శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.

🌺ఉద్యోగం చేస్తున్నవాళ్ళని :
🙌ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు.

☘ఏమని ఆశీర్వదించాలో తెలియనప్పుడు 
ఒక్క మాటలో ఆశీర్వదించాలంటే 

🌺🙌"మనోవాంఛా ఫలసిద్దిరస్తు"🙌

☘(నీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి)
ఈవిధంగా పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు!

🌺(పెద్దలకు, తల్లి దండ్రులకు, పూజ్యులకు, గురువులకు, పాదాభివందనం చేసి, ఆశీర్వచనాలు పొందేలా, మనం మన పిల్లలకు చిన్నప్పటినుంచీ నేర్పాలి.)
మన సంస్కృతిని మర్చిపోకూడదు...

🙏 సర్వేజనాః సుఖినో భవంతు🙏

No comments:

Post a Comment