Tuesday, October 8, 2024

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
6.ఆజ్ఞా చక్రము - పంచభూతాలకు ఆజ్ఞలు ఇవ్వటం , సూక్ష్మ శరీర యానం చేయడం

7. గుణ చక్రం -   దశేంద్రియాలు జయించడము

8. కర్మచక్రం -  అన్నిటి యందు విజయం పొందడం

9.కాలచక్రం-  భూత, వర్తమాన,భవిష్యత్తు సంఘటనలు చూడటం

10. బ్రహ్మ చక్రం- బ్రహ్మాండంలో అన్ని లోకాల దర్శనాలు , బ్రహ్మాండ దర్శనాలు, గ్రహ నక్షత్ర మండలాల దర్శనాలు

11.సహస్రార చక్రం - పంచభూతాలను అదుపులో ఉంచుకోవడం,సర్వసిద్ధులు ఆధీనం అవ్వటం, ఇచ్చా మరణము పొందడము

12.హృదయ చక్రం-  కావాలనుకునే కోరికలు తీరడం, ఇతరుల రోగాలు, వ్యాధులు నయం చేయటం

13.బ్రహ్మరంధ్రము - కోరుకునేవారికి మరణం ఇవ్వటం
అలాగే మనము ఏఏ చక్రాలకి విభేదనం చేయడానికి ఏఏ నాద శబ్దాలు కావాలో కూడా తెలుసుకోండి.

1. మూలాధార చక్రము -  తుమ్మెదల నాదము

2.స్వాధిష్ఠాన చక్రము - వేణు నాదము

3.మణిపూరక చక్రము - చిన్న ఘంటానాదము

4.అనాహత చక్రం - దీర్ఘ ఘంటానాదము

5.విశుద్ధి చక్రము -  వీణా నాదము /మేఘ గర్జన నాదము

6.ఆజ్ఞా చక్రము - ఓంకార నాదము

7. గుణ చక్రం -   దుందుభి నాదము

8. కర్మచక్రం -  కాంస్య నాదము

9.కాలచక్రం-   శృంగ నాదము

10. బ్రహ్మ చక్రం- మేఘ గర్జన   నాదము(ఏకపాదుడు)

11.సహస్రార చక్రం - శంఖం/డమరుకం నాదము

12.హృదయ చక్రం-  తుంకార నాదము

13.బ్రహ్మరంధ్రము -   నిశ్శబ్ద నాదము

...ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడటానికి తినవలసిన ఆహారపదార్ధాలు...

1. మూలాధార చక్రము -  పులగము

2.స్వాధిష్ఠాన చక్రము - పెరుగు అన్నము

3.మణిపూరక చక్రము - బెల్లం పొంగలి

4.అనాహత చక్రం - నెయ్యి కలిపిన అన్నము

5.విశుద్ధి చక్రము -  పాలపాయసాన్నం

6.ఆజ్ఞా చక్రము - పులిహోర

7. గుణ చక్రం -   పులిహోర

8. కర్మచక్రం -  పులిహోర

9.కాలచక్రం-  పులిహోర

10. బ్రహ్మ చక్రం- పులిహోర

11.సహస్రార చక్రం – పాలపాయసాన్నం

12.హృదయ చక్రం- ఇష్టపదార్ధాలు

13.బ్రహ్మరంధ్రము -మినప గారెలు

ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడటానికి ఉపయోగించవలసిన లోహములు:

1. మూలాధార చక్రము -   బంగారము

2.స్వాధిష్ఠాన చక్రము - వెండి

3.మణిపూరక చక్రము -రాగి

4.అనాహత చక్రం - ఇనుము

5.విశుద్ధి చక్రము - జింక్

6.ఆజ్ఞా చక్రము – బంగారం

7. గుణ చక్రం – బంగారం

8. కర్మచక్రం – బంగారం

9.కాలచక్రం – బంగారం

10. బ్రహ్మ చక్రం – బంగారం

11.సహస్రార చక్రం - పంచలోహ ధాతువులు

12.హృదయ చక్రం - నవపాషాణ ధాతువు

13.బ్రహ్మరంధ్రము -శుద్ధ స్పటికం

ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడటానికి ఉపయోగించవలసిన రంగులు:

1. మూలాధార చక్రము - ఎరుపు

2.స్వాధిష్ఠాన చక్రము - పసుపు పచ్చ

3.మణిపూరక చక్రము - కాషాయరంగు

4.అనాహత చక్రం - ఆకుపచ్చరంగు

5.విశుద్ధి చక్రము -నీలం

6.ఆజ్ఞా చక్రము - ముదురు వంకాయ రంగు

7. గుణ చక్రం -   ముదురు వంకాయ రంగు

8. కర్మచక్రం -   ముదురు వంకాయ రంగు

9.కాలచక్రం- ముదురు వంకాయ రంగు

10. బ్రహ్మ చక్రం- ముదురు వంకాయ రంగు

11.సహస్రార చక్రం – లేత వంకాయ రంగు

12.హృదయ చక్రం- లేతనీలం

13.బ్రహ్మరంధ్రము - తెలుపు

ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడటానికి వెయ్యవలసిన హస్తముద్రలు:

1. మూలాధార చక్రము - పృథ్వీముద్ర/అశ్వనీ ముద్ర/మహావేధముద్ర

2.స్వాధిష్ఠాన చక్రము – జలముద్ర/ ఖేచరీముద్ర

3.మణిపూరక చక్రము - సూర్యముద్ర/అగ్నిసారముద్ర/అపానముద్ర/ఉడ్యానబంధముద్ర

4.అనాహత చక్రం - వాయుముద్ర/అపానవాయుముద్ర

5.విశుద్ధి చక్రము - ఆకాశముద్ర/ఉదానముద్ర

6.ఆజ్ఞా చక్రము - జ్ఞానముద్ర

7. గుణ చక్రం - ప్రాణముద్ర

8. కర్మచక్రం - అంజలిముద్ర

9.కాలచక్రం- అగోచరీముద్ర

10. బ్రహ్మ చక్రం- జ్ఞానముద్ర

11.సహస్రార చక్రం – శూన్యముద్ర

12.హృదయ చక్రం- చిన్ముద్ర

13.బ్రహ్మరంధ్రము - షణ్ముఖ ముద్ర

ఇప్పుడు మన యోగ చక్రాల లో ఉన్నపుడు వచ్చే దైవిక వస్తువులు:

1. మూలాధార చక్రము -   మహా గణపతి

2.స్వాధిష్ఠాన చక్రము - మహా లక్ష్మీనారాయణ

3.మణిపూరక చక్రము - మీ ఇష్టదైవము

4.అనాహత చక్రం - మహా కాలుడు/మహా కాళిక

5.విశుద్ధి చక్రము - మహా సరస్వతి/మహా గాయత్రి

6.ఆజ్ఞా చక్రము - శివశక్తి

7. గుణ చక్రం - దత్తాత్రేయస్వామి

8. కర్మచక్రం - సీతారామస్వామి

9.కాలచక్రం- కాలభైరవ స్వామి

10. బ్రహ్మ చక్రం- బ్రహ్మదేవుడు

11.సహస్రార చక్రం – మహా విష్ణువు/మహా శివుడు/శ్రీ కృష్ణుడు

12.హృదయ చక్రం- నవపాషాణ ఇష్టలింగము

13.బ్రహ్మరంధ్రము- స్పటిక లింగాలు/ఓంకార చిహ్నము/ దక్షిణావృత శంఖము/ సుదర్శచక్రము//వామావృత శంఖం//గణపతి శంఖం/సుదర్శన చక్ర               మాల/సుదర్శన సాలగ్రామ మాల / శూన్యబ్రహ్మ ముద్ర...

ఇప్పుడు మన యోగ చక్రాలు ఏ ఏ  క్షేత్రాలలో అన్ని రకాల చక్ర స్థితులు కలుగుతాయో కూడా తెలుసుకోండి.

1. మూలాధార చక్రము -  గణపతి క్షేత్రం (కాణిపాకం)

2.స్వాధిష్ఠాన చక్రము - నారాయణ క్షేత్రాలు, లక్ష్మీదేవి క్షేత్రాలు (కొల్హాపురం)

3.మణిపూరక చక్రము - 108 దివ్య విష్ణు క్షేత్రాలు,( పండరీపురం) శ్రీ కృష్ణ క్షేత్రాలు

4.అనాహత చక్రం -మహాకాళి క్షేత్రాలు, మహాకాలుడు క్షేత్రాలు (ఉజ్జయిని)

5.విశుద్ధి చక్రము -  మహా సరస్వతి క్షేత్రాలు , గాయత్రీ దేవి క్షేత్రాలు( బాసర)

6.ఆజ్ఞా చక్రము -  శివ శక్తి క్షేత్రాలు, శివ కేశవ శక్తి క్షేత్రాలు, రాధా కృష్ణ క్షేత్రాలు (కాశీ, శ్రీశైలం ,బృందావనం)

7. గుణ చక్రం -  దత్త స్వామి క్షేత్రాలు( గాణ్గాపురం)

8. కర్మచక్రం -  శ్రీరామ క్షేత్రాలు (అయోధ్య)

9.కాలచక్రం-  కాలభైరవ, భైరవి క్షేత్రాలు (కాశీ, శ్రీశైలం, ఉజ్జయిని)

10. బ్రహ్మ చక్రం-  బ్రహ్మ దేవుడి క్షేత్రాలు
( పుష్కర్, చిదంబర క్షేత్రం)

11.సహస్రార చక్రం -  మహాశివుని క్షేత్రాలు ,మహావిష్ణు క్షేత్రాలు, శ్రీ కృష్ణ క్షేత్రాలు (ద్వారక, బృందావనం)

12.హృదయ చక్రం-  అనంతపద్మనాభ క్షేత్రం (తిరువనంతపురం) హనుమ క్షేత్రాలు( కాశి) ఇష్టలింగం  క్షేత్రం(కర్ణాటక)

13.బ్రహ్మరంధ్రము -   ఆది పరాశక్తి క్షేత్రం - దీప దుర్గ క్షేత్రం(తుముకూరు) - దీప కాళికా క్షేత్రం - దీప ఛంఢి క్షేత్రం
త్రి గ్రంధులు - త్రిమూర్తుల క్షేత్రాలు, త్రిశక్తుల క్షేత్రాలు.


మన యోగ చక్రాల మీద ప్రభావము చూపే గ్రహాలు

1. మూలాధార చక్రము – ఎరుపు - కుజుడు
2.స్వాధిష్ఠాన చక్రము - పసుపు పచ్చ- బుధుడు
3.మణిపూరక చక్రము – కాషాయరంగు- గురువు
4.అనాహత చక్రం – ఆకుపచ్చరంగు- శుక్రుడు
5.విశుద్ధి చక్రము –నీలం- శని
6.ఆజ్ఞా చక్రము - ముదురు వంకాయ రంగు-అర్ధచంద్రుడు
7. గుణ చక్రం -   ముదురు వంకాయ రంగు- మధ్యస్ధ చంద్రుడు
8. కర్మచక్రం -   ముదురు వంకాయ రంగు- చంద్రుడు
9.కాలచక్రం- ముదురు వంకాయ రంగు- అమావాస్య చంద్రుడు
10. బ్రహ్మ చక్రం- ముదురు వంకాయ రంగు- పౌర్ణమి చంద్రుడు
11.సహస్రార చక్రం – లేత వంకాయ రంగు- సూర్యుడు
12.హృదయ చక్రం- లేతనీలం- గ్రహణ సూర్యచంద్రుడు
13.బ్రహ్మరంధ్రము - తెలుపు – అంతరిక్షం
మన ఏఏ యోగచక్రాల యందు ఏఏ గురువులు వస్తారో తెలుసుకోండి
1. మూలాధార చక్రము - మంత్రగురువు
2.స్వాధిష్ఠాన చక్రము - మంత్రగురువు
3.మణిపూరక చక్రము - దీక్ష గురువు
4.అనాహత చక్రం - దీక్ష గురువు /భౌతిక గురువు
5.విశుద్ధి చక్రము - దీక్ష గురువు /భౌతిక గురువు
6.ఆజ్ఞా చక్రము - సద్గురువువు
7. గుణ చక్రం -   సద్గురువు
8. కర్మచక్రం -   సద్గురువు
9.కాలచక్రం- సద్గురువు
10. బ్రహ్మ చక్రం- సద్గురువు
11.సహస్రార చక్రం – పరమగురువు/విశ్వగురువు/జగత్ గురువు
12.హృదయ చక్రం- ఆదిగురువు
13.బ్రహ్మరంధ్రము - నీకు నీవే ఆత్మగురుదేవుడు
ఇప్పటివరకు మీరు మీకు నేను వివిధ గ్రంథాలలో నుండి అక్కడ అక్కడ ఉన్న విషయాలను సేకరించిన వాటిని చూశారు కదా.... కానీ ఇది అంతా శబ్ద పాండిత్యము. పుస్తక జ్ఞానానికి సంబంధించినది. కానీ ఈ శబ్ద పాండిత్యము నుండి అనుభవ పాండిత్యము అనగా ఈ చెప్పిన విషయాలు స్వానుభవంలోకి ఎలా వచ్చాయో వచ్చే రాబోవు అధ్యాయాలలో చూడండి. శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం మిన్న. అది చాలా కష్టమని గ్రహించండి. ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా నాతో పాటుగా యోగ చక్రాలు జాగృతి, శుద్ధి, ఆధీనం చేసుకోటానికి సాధన కొనసాగిస్తూ ముందుకు వెళ్ళండి. అంతకు ముందుమా మంత్రదేవత దీక్షానుభవాలు తెలుసుకోండి!
మాయాను దాటటం ఎలా?
ఇక్కడ చాలా మందికి చిన్న సందేహం రావచ్చు. అది ఏమిటంటే చక్రాలలో ఉండే మాయాలు, మర్మాలు, యోగ శక్తులు, యోగ మాయాలు గూర్చి బాగానే చెప్పినారు. కానీ మాయాను దాటటం ఎలా అనే సందేహం వస్తోంది. దీనికి సమాధానం ఏమిటంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర జీవితచరిత్రను చూస్తే తెలుస్తోంది. అనగా
విశ్వామిత్రకి మేనక ద్వారా ఇంద్రియనిగ్రహ పరీక్షలు – మాయా కోరిక స్ధితి - మొదటిదశ
విశ్వామిత్రకి మేనక ద్వారా ఇంద్రియనిగ్రహ పరీక్షలు – మాయా మోహము స్ధితి - రెండవ దశ
విశ్వామిత్రకి మేనక ద్వారా ఇంద్రియనిగ్రహ పరీక్షలు – మాయా వ్యామోహము స్ధితి - మూడవ దశ
విశ్వామిత్రకి మేనక ద్వారా ఇంద్రియనిగ్రహ పరీక్షలు – మాయా అంతిమ స్ధితి- స్మశాన వైరాగ్య స్ధితి - నాలుగవ దశ
అన్నిరకాల మాయాలను జ్ఞానస్ఫురణతో జయించే స్ధితి - జితేంద్రియుడు స్ధితి
విశ్వామిత్రుడు జితేంద్రియుడై రామ-లక్ష్మణలకు సద్గురువువై బ్రహ్మర్షి అయినారు.
అంటే మన గురుడు విశ్వామిత్రుడు తన ధ్యాన తపస్సు ద్వారా బ్రహ్మర్షిపదవి పొందాలని తీవ్ర ధ్యానసమాధిలో ఉండగా...ఇంద్రుడికి ఈయన వలన తన ఇంద్రపదవికి చేటు కలుగుతుందని భయముతో...మేనకను పంపించి మన విశు యొక్క తపస్సు భంగము చెయ్యమని ఆదేశించాడు.పాపం ఈమె కొన్ని సంవత్సరాలు పాటు మనగురుడికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినది.కాని మన గురుడు ఎంతో నిగ్రహముగానే ఉన్నాడు. కాని ఒకరోజు అనుకోకుండా మన గురుడు కాస్త మేనక యొక్క నగ్నదేహమును చూడటం జరిగినది. దానితో మనవాడికి ఇంద్రియ చపలత్వం కలిగినది. ఆపై ఇంద్రియ నిగ్రహశక్తిని కోల్పోయి ఆమె యందు మోహము చెంది అటు పై వ్యామోహము చెంది సంతానమును పొందిన తర్వాత విశ్వామితృడికి అసలు విషయము అర్ధమైనది.దానితో తను 10 లక్షల సం!!ల ధ్యానశక్తిని కోల్ఫోయినానని జ్ఞానస్ఫురణ పొంది...దానితో ఇంద్రియ నిగ్రహశక్తితో తిరిగి తపస్సు చేస్తూండగా...ఈసారి రంభ రావడము...దానితో మన గురుడు కాస్త ఈమె యందు తీవ్ర కోపావేశాలు కల్గి శాపము ఇవ్వడము...తద్వారా మళ్ళీ 10 లక్షల సం!!రాల జపశక్తిని కోల్పోవడము జరిగినది.            *

No comments:

Post a Comment