sankar jagalapudi గారి వాల్ నుండి...
ఒక మనిషిగా ఆ దేవుని గూర్చి ఇంతకు మించి తెలుసు కోవలిసినది ఇంకా ఉందని నేనను కోవడం లేదు ఆ సర్వేశ్వరుని గూర్చి సర్వం ఈ కొన్ని వాఖ్యాలలో ఉందని నమ్ముతున్నాను... మీరు కూడా చదవండి సత్యం అని నమ్మితే ఈ సత్యాన్ని
(సర్వేశ్వరుణ్ణి) పదిమందికీ చేర్చండి
🙏🙏🙏🙏🙏🙏
విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఆల్భర్ట్ ఐన్-స్టీన్ పలు విశ్వవిద్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు అతడిని
*'మీకు దేవుడి మీద నమ్మకం ఉందా ' అని అడిగేవాళ్ళట.*
స్పినోజా చెప్పిన దేవుడి మీద నమ్మకం" ఉంది అనేవాడట ఐన్-స్టీన్
*స్పినోజా 17 వ శతాబ్దపు డచ్ తాత్వికవేత్త.* అతడు చెప్పినదానికి చాలా గొప్పగా తెలుగులో ఇలా అనువదించారు...
(చిన్న చిన్న మార్పులు చేర్పులు నేను చేసాను)
దేవుడు మనిషికి చెప్పేది...
స్పినోజా మాటల్లో :
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
"..మీరు నా గురించి చేసే ప్రార్థనలేవీ అక్కర్లేదు...
ప్రపంచం లోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి...
సృష్టి సర్వం తో మమేకం కండి...
హాయిగా నవ్వండి... భువన గానం లో భాగం కండి...
నా గురించి ప్రార్థనా మందిరాలకు వెళ్లడం దేనికి? నేనక్కడ ఉంటానని ప్రకటిస్తూన్న అవన్నీ మీ నిర్మాణాలేగా!!!
పర్వతాలూ... అరణ్యాలూ... నదులూ... సరోవరాలూ...
సాగర తీరాలూ...
ఇవీ నా నివాసాలు.... ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించండి...
ఆ ప్రకృతిని కాపాడండి....
మీ దౌర్భాగ్యాలకు నన్ను నిందించడం వదిలెయ్యండి....
మీ తప్పటడుగులతోనూ పాపాలతోనూ నాకు ప్రమేయం లేదు...
మీ పవిత్ర గ్రంధాలతో నాకే సంబంధమూ లేదు...
అవన్నీ మీరు వ్రాసుకొన్న కల్పనలే...
ఒక సూర్యోదయం లో...
ఒక నిర్జన మైదానంలో...
ఒక ఆత్మీయ మిత్రుడి స్పర్శలో, సమావేశం లో...
మీ తల్లి తండ్రుల ఆనందంలో...
మీ బిడ్డ ప్రేమ కళ్ళలో నేను ఉంటాను....
అంతే కానీ ఏవో కొన్ని పుస్తకాల పుటల్లోనో, వాటిల్లోని నియమ నిబంధనలలోనో కాదు....
అవధి లేని ప్రేమ నేను...
నేను ఏ తీర్మానాలు చెయ్యను...
మిమ్మల్ని విమర్శించను... మీరంటే కోపాలూ, పట్టింపులూ ఉండవు....
క్షమాపణలేవీ నన్ను అడగకండి....
క్షమించ వలసినవేవీ ఉండవు....
మీ పరిధులూ, పరితాపాలూ, ఉద్వేగాలూ, సుఖాలూ, అవసరాలూ అన్నీ మీలో మీరు నింపుకున్నావే.... అలాంటప్పుడు మీ అతిక్రమణలకు నన్నెందుకు భాద్యుడిని చేస్తారు నేను మిమ్మల్ని ఎలా శిక్షిస్తాను?
అవన్నీ మీ స్వయంకృతాపారాదా లే....
మిమ్మల్ని కష్టపెట్టే కాల్చివేసే నరకమొకటి నేను సృష్టించి ఉంటే నేనేం దేవుణ్ణి ?
నిత్య జాగృతిలో బ్రతకండి....
అదే మీ దిక్సూచి.... ఇతరులు మీకేది చేయకూడదని మీరు భావిస్తారో అది వాళ్లకు మీరూ చెయ్యకండి....
జీవితం అంటే అదేదో పరీక్ష కాదు...
ఒక రిహార్సల్ కాదు....
పోలికలూ....
హెచ్చు తగ్గులూ... చూసుకొనే లెక్కలూ తూనికాలు, కొలతలు కాదు....
ఏ స్వర్గద్వారాలకో పీఠిక అసలు కాదు....
ఇక్కడ... ఇక్కడ మాత్రమే నడిచే, గడిచే వాస్తవం!!! అంతమాత్రంగానే చూడండి దాన్ని....
పరిపూర్ణ స్వేచ్ఛనిచ్చాను మీకు...
శిక్షలూ, పురస్కారాలూ, పాపాలూ, సద్గుణాలూ...
నా నిఘంటువులో మాటలు కాదు....
ఏదో కలంతో వాటినెవ్వరూ నా దివాణంలో లెక్క కట్టరు... మీరు పుట్టినరోజు తిధి లెక్క కట్టి మీ జీవితాన్ని నిర్ణయిస్తాను అనేది మీ మూర్ఖత్వం... దాన్ని నాకు అపాదించకండి....
స్వర్గం, నరకం మీకు మీరే నిర్మించుకోవాలి....
ఆ స్వేఛ్చ మీదే....
ఈ జీవితం ముగిశాక ఇంకొకటేదైనా ఉందో, లేదో నేను చెప్పను....
కానీ దీని తరువాత ఇంకేదీ లేదన్నంత దీక్షగా బతకాలి....
ఇంకొక బతుకు ఉంటే ఇంతకుముందు మీరేం ఏం చేశారో...
ఇంకేం విస్మరించారో...
అనే లెక్కలు నేను తిరగదోడను....
నన్ను నమ్మకండి
నమ్మడం అన్నది ఊహాత్మకం...
మిమ్మల్ని మీరు నమ్ముకోండి....
అదే నేను మీకు చెప్పే అత్యంత అద్భుతమైన సత్యం... రహస్యం...
ఏ సాగర జలంలోనో ఈత కొడుతున్నప్పుడో....
ఒక శిశువును హత్తుకున్నప్పుడో....
పెంపుడు పశువును నిమిరేటప్పుడో...
జాలువారే వర్షాన్ని కిటికీలోనుండి చూస్తున్నప్పుడో...
అదే వర్షంలో తడుస్తున్నప్పుడో...
వెన్నెల రాత్రిలో జాజిమల్లి సువాసనను ఆస్వాదిస్తున్నాప్పుడో....
జీవిత భాగస్వామి తో, పిల్లాపాపలతో ఆనందం గా గడుపుతున్నప్పుడో...
ఇతరుల కష్టసుఖాలులో పాలు పంచుకొన్నప్పుడో... నేను గుర్తురావడమే నేను ఆశించేది...
నా గురించి
మీకీర్తనలు అన్నీ వదిలెయ్యండి....
వాటికి ఉప్పొంగిపోతే నేనేం దైవాన్ని?
మీ ఆరోగ్యం...
మీ సంబంధాలూ... సంతోషాలూ సరిచూసుకోండి....
అదే నాకు మీరు పఠించే గొప్ప కీర్తన... భజన... ఆరాధన స్తోత్ర పాఠం....
నా గురించి ఇప్పటికే మీ బుర్ర నిండా ఉన్న సరంజామా అంతా తీసివేయండి...
అవన్నీ గొప్ప
చిక్కుముడులు...
అబూత కల్పనలూ...
అవి కేవలం పండితుల పండిత్య పటిమ తప్ప నాకు అన్నేసి వివరణలు దేనికి?
అలాంటి వాటికి పడిపోతే అసలు నేనేమి దేవుణ్ణి?
ప్రకృతినీ... సమాజం లోని సాటి మనుష్యులనూ ప్రేమించండి... అవసరం అయిన వారికి మీకు సాధ్యమైనంత సహాయం చేయండి... కులాలు... మతాలు... ప్రాంతాలు... ఎక్కువలు... తక్కువలు... అనుకొంటూ నా సృష్టిని అవమానించకండి....
తల నుండి కొందరినీ... చేతులనుండి కొందరినుండి కొందరినీ...
కాళ్ళ నుండి కొందరినీ.... సృష్టించాను అనే మీ పిచ్చి...
పిచ్చి ఆలోచనలను వదిలి పెట్టండి... అందిరినీ నా మనస్సు నుండే సృష్టించాను అని భావించండి....
నాకు వేరు రూపాలనూ... పేర్లనూ... మతాలనూ...
మీరే ఇచ్చి మర్లా వాటిలో ఒకటి ఎక్కువ...
ఒకటి తక్కువా... అనుకొంటూ కొట్టుకు సచ్చేదీ మీరే...
ఈ సకల చరా చర అనంత సృష్టి నాదయితే...
ఇంత చిన్న విషయాలను నాకు ఆపాదించకండి... నన్ను అవమానించకండి....
మీరు ఇప్పుడు... ఇక్కడ... శ్వాసిస్తూ ఉన్నారు.... ఇది... ఇది... మాత్రమే సత్యం....అద్భుతం....
అనంత విశ్వాన్నీ...
సుందర ప్రకృతినీ...
వీక్షిస్తూ ఉన్నారు ఇది... ఇది... మాత్రమే సత్యం.... అద్భుతం....
మీ చిన్న బిడ్డలనూ, పెంపుడు జంతువులనూ ప్రేమగా స్పృశిస్తున్నారు ఇది... ఇది మాత్రమే సత్యం... అద్భుతం....
వీనుల విందైనా సంగీతాన్ని వింటూ స్వర్గ తుల్యమైన ఆనందాన్ని పొందుతున్నారు ఇది... ఇది మాత్రమే సత్యం.... అద్భుతం....
అమ్మ చేతి వంటనూ... ప్రకృతి ఇచ్చే పంటనూ... ఫలాలనూ రుచి చూస్తున్నారు ఇది... ఇది మాత్రమే సత్యం.... అద్భుతం....
ప్రకృతినీ... సమాజం లోని సాటి మనుష్యులనూ... ప్రేమించండి... అవసరం అయిన వారికి మీకు సాధ్యమైనంత సహాయం చేయండి... కులాలు... మతాలు... ప్రాంతాలు... ఎక్కువలు... తక్కువలు... అనుకొంటూ నా సృష్టిని అవమానించకండి....
అంతకు మించిన అద్భుతం ఏదో ఇంకా ఎందుకు...?
నేను మీ అందరి కోసం సృష్టించిన స్వర్గం ఇదే...
వేరే స్వర్గం ఎక్కడో ఉందనే బ్రమలను వదిలి పెట్టండి....
ఇదే స్వర్గం...
ఇదే నేను సృష్టించిన స్వర్గం...
జీవితంలోని ప్రతీ క్షణాన్నీ ఆస్వాదించండి... ప్రేమించండి.... ప్రేమను పంచండి.... నేనే కాదు...
నా సృష్టికి ప్రతి రూపమైన మీరు కూడా....
దైవ స్వరూపంగా ప్రేమించబడండి...
❤️❤️❤️❤️❤️❤️
చదివినందుకు ధన్యవాదములు....
మీ మనస్సు లోకి తీసుకొంటే కోటి నమస్కారములు....
మీ మనస్సులోకి తీసుకొన్నది ఆచరిస్తే...
మీరే దైవ స్వరూపులు....
మీకు నా ప్రేమ పూర్వక శత సహస్రకోటి నమస్కారములు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
No comments:
Post a Comment