Tuesday, October 15, 2024

 ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…       
నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


            *ఒక ఔన్సు జలం !*
               ➖➖➖✍️
```
ఒకసారి శంకర జయంతి రోజు జలతరంగం నిర్వహించడానికి ఒక కళాకారుడు ఉద్యుక్తుడయ్యాడు. 

జలతరంగం అనేది మన సనాతన భారతీయ సంగీత కళ. 

నీరు నింపిన పింగాణి లేదా లోహపు 
గిన్నెల అంచులను చిన్న కర్రలచేత రెండు చేతులతో రాపాడించి చేసే ఒక కచేరి. 

ఆనాటి కచేరిని ‘వాతాపి గణపతింభజే హం’ అనే కీర్తనతో మొదలుపెట్టాలని అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. 

అతను ఈ కళలో బాగా ఆరితేరిన సంగీతజ్ఞుడే అయినా ఆరోజెందుకో ఎంత ప్రయత్నించినా శృతి కుదరటం లేదు. చాలా సార్లు ఏదేదో ప్రయత్నించాడు కాని అన్నీ నిష్పలమయ్యాయి. 

పరమాచార్య స్వామివారి ముందు ఇలా జరగడంతో అతనికి చాలా బాధ వేసింది. ఆవేదనని మనస్సులోనే అణచుకొని శృతి సరిచెయ్యడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 

మహాస్వామివారు ఆ సంగీతకారుని అవస్థను గమనించారు. శిష్యుడొకరిని దగ్గరకు పిలిచి అతనివద్దకు ఒక వార్తను చేరవేశారు. 

“ఆ అయిదవ గిన్నెలో నుండి ఒక ఔన్సు జలం తీసెయ్యమని అతనికి చెప్పు” 
స్వామివారి ఆదేశం ప్రకారం అతను చెయ్యగానే శృతి సరిగ్గా సరిపోయింది. 

ఆ విద్వాంసుడు దిగ్గున లేచివచ్చి 
ఒక్కసారిగా నేలపై పడి స్వామివారికి 
సాష్టాంగ నమస్కారం చేశాడు. 

క్షమాపణ పూర్వకంగా చిన్న స్వరంతో “ఈ విషయాలన్నీ మహాస్వామికి ఎలా తెలుసు? 
నాకు కూడా ఈ విషయం తెలియదు” 
అని కృతజ్ఞతలు తెలియజేశాడు. ✍️```

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥
 "కంచిపరమాచార్యవైభవం"!!!🙏

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment