Saturday, October 12, 2024

 12-10-2024-శనివారము. శుభమస్తు.
              🌹గుడ్ మార్నింగ్ 🌹
జీవితం నదీ ప్రవాహమువలె - విశ్వశక్తి ప్రవాహము.................................
మనము అవునన్నా - కాదన్నా శరీర కదలికలు సాగిపోతూనే ఉంటాయి.
అలా సాగుతూ ప్రతి శరీరం దాని గమ్యాన్ని చేరుకుంటుంది..............................
మనము 3 స్థితులలో వున్నాము. 
1) శరీరము - పదార్ధ స్థితి. 
2) మనసు -   భావస్థితి.
3) ప్రాణము -  శక్తి స్థితి.
పదార్ధము దాని పద్దతిలో అది సాగుతూనే వున్నది..........
ఈ శరీర పదార్ధము సాగటానికి భావ రూప ఆలోచనలు సహకరిస్తాయి. ఇదే మనసు. ఇక్కడ పదార్ధము లేదు కానీ వున్నవి అని తెలుస్తున్న భావాలు వున్నవి.
ఈ భావాలకు, శరీర కదలికలకు ఆధారముగా ప్రాణము వున్నది. కానీ అది ఉన్నట్లు తెలియటము కూడా లేదు.
ఇదే విశ్వ శక్తి...................................
మనలో ప్రాణముగా పిలువబడే మొత్తము విశ్వము యొక్క శక్తి ఏకముగానే వున్నది.
ఆ శక్తిలోనే ఉన్న పదార్ధములు అంటే శరీరములు - రూపము, పరిమితి చేత విభిన్నముగా అనిపిస్తున్నాయి..........
ఈ శరీర పదార్ధ పరిమిత భావన వలన మనసు కూడా పరిమిత భావాలతోనే పని చేస్తున్నట్టుగా వున్నది. కానీ అక్కడ పదార్ధము లేదు - కేవలము భావము మాత్రమే వున్నది...............................
ఈ భావాన్ని జాగ్రత్తగా గమనించ గలిగితే 
- అది కేవల ఉనికిగా అనుభవమవుతుంది.
ఆ ఉనికిని పరిశీలిస్తే - రూప, స్థల, కాలాదులు ఏమి లేని ఒక అనంత స్థితిగా అర్ధమవుతుంది...................................
ఇదే విశ్వ శక్తి లేక ఆత్మ శక్తి అని పిలవబడుతున్నది. ఈ శక్తిలో నెలకొని ఉన్న శరీరముల - పదార్ధముల సృష్టి - జీవులకు జీవితముగా పిలవబడుతూ సాగుతున్న అనంత సృష్టి ప్రవాహము..............
పదార్ధములుగా కదులుతున్నట్లున్నది. భావముల మనసుగా కదుపుతున్నట్లున్నది. 
ఉనికిగా వున్నదదే. స్థిరముగా, శాస్వితముగా కేవలము వున్నది........
సత్యము కేవలము ఉండటమే.......
          🌹god bless you 🌹

No comments:

Post a Comment