Friday, October 11, 2024

****చరిత్ర పుస్తకాలలో చోటు దక్కని.,. భారతీయ అణు భౌతిక పితామహుడు..

 

చరిత్ర పుస్తకాలలో చోటు దక్కని.,. భారతీయ అణు భౌతిక పితామహుడు..

#అణు భౌతిక _స్వామి_జ్ఞానానంద.. (5.12.1896-21.09.1969)

సాంకేతికతకు మతానికి పొత్తు కుదరదని చాలా మంది భావన. కాని ఆల్బర్ట్ ఐన్ స్టీన్, జగదీశ్ చంద్ర బోస్, స్వామి జ్ఞానానంద వంటి వారు ఆ రెంటికి ఉన్న అవినాభావ సంబంధాన్ని చక్కగా వివరిస్తూ రెండు ఒక దానికొకటి అవసరమని, అప్పుడే మానవ జాతి పురోగతి అని విస్పష్టంగా చెప్పి,ఆచరించి మార్గ దర్శనం చేశారు...!

అణు భౌతిక శాస్త్రంలో స్పెక్ట్రోస్కోపి మీద విశేష పరిశోధన చేసి దేశవిదేశాల్లో దాన్ని బోధించి హిమాలయాలలో తపస్సు చేసి యోగాభ్యాసం చేసి వేద ప్రాశస్త్యాన్ని నేల నాలుగు చెరగులా ఉపన్యాసాలతో వ్యాప్తి చేసిన మహానుభావుడే మన స్వామీ జ్ఞానానంద...!

#స్వామి_జ్ఞానానంద పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర గొరగనమూడిలో 1896 డిసెంబర్ అయిదున జన్మించారు. వీరి అసలు పేరు భూపతి రాజు లక్ష్మీ నరసింహ రాజు తండ్రి గారు రామరాజు గారు మహా వేద విజ్ఞాన ఖని. వేదాలకు ఉపనిషత్తులకు శాస్త్రాలకు సంబంధించిన వందలాది అపూర్వ గ్రంధాలును, ఆయన చదివి గొప్ప గ్రంధాలయాన్ని నిర్మించుకొన్నారు...! సంపన్నమైన భూస్వామ్య కుటుంబం వీరిది.ఆ వేద భాండాగారాన్ని కుమారుడు లక్ష్మీ నరసింహ రాజు అద్భుతం గా సద్వినియోగ పరచుకొని వేద వేదాంగాలలో ఉత్తమాభినివేశాన్ని సంపాదించుకొన్నారు. ఆ గ్రంధాలకు సార్ధకత చేకూర్చారు...! నర్సాపురం లోని టేలర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు.ఇరవైవ ఏట వివాహం జరిగింది... బుద్ధుని ప్రభావం వారి పైన ఉన్నది అందుకని నేపాల్ లోని లుంబిని కి వెళ్లి కొంతకాలం గడి పారు...! తర్వాత పదేళ్లు దేశ సంచారం లో, పెద్దల దర్శనలతో జీవితాన్ని చదువు కున్నారు. హిమాలయా చేరి అక్కడ
యోగాభ్యాసం చేస్తూ మరో పదేళ్లు సార్దక జీవనం సాగించారు. వేదాధ్యయనం వారిని విడువ లేదు. దాని పై ఉన్న మక్కువ తో అన్ని వేదోపనిషత్తుల సారాన్ని జీర్నిన్చుకొన్నారు. మానసిక వికాసం కలిగింది.ఒక అపూర్వ తెజస్సేదో వారిలో విరాజిల్లింది...!

క్రమం గా వీరి దృష్టి భౌతిక శాస్త్రం వైపుకు మళ్ళింది. దేని మీద దృష్టి పడినా దాన్ని ఆసాంతం కరతలామలకం చేసుకోకుండా ఉండలేదు అందుకని జర్మని చేరుకొన్నారు. అక్కడి డ్రెస్ డ్రెయిన్లో గణితం, భౌతికశాస్త్రం చదివారు. భౌతికశాస్త్రం అంటే వీరాభిమానం కలిగింది. అంతే అప్పుడే విస్తరిస్తున్న 'హై టెన్షన్ ఎక్స్ రే ఫిజిక్స్ "లో పరిశోధన ప్రారంభించారు...! ప్రేగ్ లోని చార్లెస్ విశ్వవిద్యాలయంలో వీరు పరిశోధన కొనసాగించారు.వీరి ఆధ్యాత్మిక గురువు వీరిలోని వేద విజ్ఞానికి అబ్బుర పడి,శిష్యుని వల్ల వేద విజ్ఞానం ప్రపంచమంతా విస్తరిల్లాలని ఆ కాంక్షించి రాజు గారికి "స్వామి జ్ఞానానంద"* అనే ఆశ్రమ నామాన్ని ఒసంగి ఆశీర్వ దించారు.అప్పటి నుండి స్వామి కాషాయామ్బరదారిగా జీవించారు..

1927 లో మళ్ళీ జర్మనీ దేశం వెళ్లారు స్వామి జ్ఞానానంద. అక్కడ హిందూ మతం మీద వేద విజ్ఞానం మీద పుంఖాను పుంఖం గా ఉపన్యాసాలిచ్చి చైతన్య వంతుల్ని చేశారు.ఆ ఉపన్యాసం ఒక గంగా ప్రవాహమే. ఎన్నో తెలియ రాని విషయాలను విజ్ఞానంతో ముడి వేసి అలవోకగా అందిస్తూ శ్రోతల మనసులను రంజింప జేసే వారు. అదొక తపస్సు గా, యోగం గా, వారు భావించి ఉత్తేజితులను చేశారు...! ఆ ఉపన్యాస పరంపర ఒక అత్యద్భుత మైన గ్రంధంగా వెలువడింది. డిస్ప్లేయిన్ విశ్వవిద్యాలయ ఆచార్యుడు స్వామి ఉపన్యాసాలకు పులకించి పోయాడు. అవి మానవాళికి కర దీపికలన్నాడాయన...!

#జ్ఞానానందకు అయిన్ స్టీన్ గారి సాపేక్ష సిద్ధాంతం పైన ద్రుష్టిపడింది.పడింది అంటే దాన్ని ఆపోసన పట్టినట్లే 1929 లో దానిమీద రెండేళ్లు అధ్యయనం చేస్తూ అండర్ గ్రాడ్యు యేషన్ పూర్తీ చేశారు.

ఆయన సాధించిన యోగా విధానం మీద 150 కి పైగా ప్రసంగాలు చేసి యువతను యోగా మార్గం వైపుకు ఆకర్షితు లయేట్లు చేశారు. యోగ, విజ్ఞాన శాస్త్రాలు సన్నిహిత సంబంధం కలవని ఆయన చెప్పే వారు. యోగాలో మూలసూత్రాలు నేర్చుకొంటే మనసు, మెదడు, శరీరాలపై పూరీ సాంధీనం కలుగు తుందని సోదాహరణంగా ఉపన్యసహించే వారు స్వామీజీ ఉపన్యాస సారాన్నంతా“పూర్ణ సూత్రాలు 'అనే ఉద్గ్రంధంగా వెలువడి యోగా మార్గానికి కర దీపిక గా నిలిచింది...!

ఇది వారి మహోత్రుష్టరచన గా ప్రశంశలు అందుకొన్నది. తర్వాత ఆయన ఆచార్య డోల్టేక్ గారితో కలిసి జర్మని, ఫ్రాన్స్,జెకోస్లోవేకియా లలో పర్య టించారు...! స్వామి జ్ఞానానంద అభిమాన విషయమైన ఎక్స రే స్పెక్టోగ్రఫీ లో పరిశోధన చేసి 1936 లో D,Scసాధించారు .ఇంగ్లాండ్, లివర్ పూల్ విశ్వవిద్యాలయాలలో జాన్ చాడ్విక్ అనే మహా శాస్త్ర వేత్త వద్ద రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో పని చేశారు .అణుభౌతిక శాస్త్రంలో "స్పెక్టోగ్రఫీ అఫ్ బీట రేస్ రేడియేషన్ " అద్భుత పరిశోధన చేసి పిహెచ్ డి పొందారు...! అమెరికా వెళ్లి అక్కడి మిచిగాన్ విశ్వవిద్యాలయంలో “రేడియో యాక్టివ్ ఐసోటోపులు "మీద పరిశోధన చేశారు. ఆయన రాసిన “హై వాక్యూం "అనే శాస్త్ర గ్రంధం మేధావులైన ఎంతో మంది శాస్త్ర వేత్తలను ఆకర్షించింది...! దాదాపు పాతికేళ్ళు విదేశాలలోనే చదువు,వేదాంత ప్రవచనాలు,యోగా ఉపన్యాసాలు, తీవ్ర పరిశోధన ల తో గడిపిన స్వామి జ్ఞానానంద* 1947 మాతృదేశామైన భారత దేశం వచ్చేశారు..! డిల్లీ లోని జాతీయ భౌతిక పరిశోధనాలయంలో జ్యేష్ట శాస్త్ర పరిశోధక అధికారిగా తమ అమూల్య మైన సేవలందించారు. ఏడేళ్ళ తర్వాత స్వామీజీకి భీమ వరం వద్ద ఒక ప్రమాదం 
జరిగింది .విశాఖ కింగ్ జార్జి వైద్యశాలలో చేరారు .ప్రమాదం తప్పి,ఆరోగ్యం కుదురుకొన్నది...! ఆంద్ర విశ్వ విద్యాలయంలో అణుభౌతిక శాస్త్రం లో సౌకర్యాలు,పరిశోధనా విభాగం ఆ శాఖా ను తీర్చి దిద్దే బాధ్యతను ఆ నాటి ఉప కులపతి స్వామి జ్ఞానానంద కు పూర్తీ బాధ్యలతో అప్పగించారు. వారు తమ శక్తి యుక్తులను ధార పోసి 1954 లో చేరి తీర్చి దిద్దారు. అణు భౌతిక శాస్త్రంకు గొప్ప భవిష్యత్తు స్వామీజీ వల్లనే మన రాష్ట్రం లో కలిగింది . 1-7-1956 లో విశ్వ విద్యాలయం లో అణు భౌతిక శాస్త్ర శాఖ"ను స్వామి ఆధ్వర్యం లో ఏర్పడింది. ఎంతో మందిని ప్రోత్సహించి , ప్రేరణ కల్గించి అణు భౌతిక శాస్త్రం భవిష్యత్తును చాటి చెప్పి, అందులో విద్య నేర్వటానికి విద్యార్ధులను సంసిద్ధులను చేసారు..

ఆంద్ర దేశం లో అణు భౌతిక శాస్త్రంకు పునాదులు వేసి, వ్యాప్తి చేసింది స్వామి జ్ఞానానంద ఆచార్యుడిగా ..,అణు భౌతిక శాస్త్ర శాఖలో చేరి, శాఖాడిపతిగా1965 న పదవీ విరమణ చేశారు. రాష్ట్ర మంతటా పర్య టించి, వారు వేద వేదాంగ, యోగా శాస్త్ర రహస్యాలను శ్రోతలకు అందించి యోగశాస్త్ర వేద విజ్ఞాన శాస్త్రాల మధ్య ఉన్న సమన్వయాన్ని విశదీక రించే వారు. ఇవి ఒక దానికొకటి వైరుధ్యం ఉన్నవి కావని, పరస్పర సంబంధం కలవని రుజువు చేశారు. ఆంద్ర విశ్వ విద్యాలయం లో వారి సేవలను గుర్తించి స్వామి జ్ఞానానంద లేబరేటరీస్ ఆఫ్ న్యూక్లియర్ రిసెర్చ్"ను ఏర్పాటు చేసి ఘనం గా నివాళులర్పించారు...! స్వామి జ్ఞానానంద మతాన్ని విజ్ఞానాన్ని  "కలిసి చూడాలని  భావించారు. ఆయన మహా మానవతావాదిగా నిరూపించుకొన్నారు...!!!

( శ్రీభూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గారు...)

No comments:

Post a Comment