Friday, October 11, 2024

నమస్కారంనకు అంతరార్థం.

 *🌺🙏🏻ఓం నమః శివాయ🙏🏻🌺*

🌴" మీరు చేతులు జోడించి భగవంతునికి నమస్కరిస్తారు.  నమస్కారమంటే ఏమిటి?  ఐదు కర్మేంద్రియాలు,  ఐదు జ్ఞానేంద్రియాలు కలిపి భగవంతునికి అర్పించమే  నిజమైన నమస్కారం.  '  న  మ ' అనగా  'నాదికాదు' అని అర్థం....

అంటే సర్వమూ భగవంతునిదే అన్న నిరంహకార భావానికి చిహ్నం నమస్కారం. కర్మలను ప్రారంభించే ముందు మీరు కర్మలకు నమస్కరించాలి.  ' తస్మై నమ:  కర్మణే ' , ' ఓ కర్మ దేవతా!  నాచే పవిత్రమైన కర్మలను మాత్రమే చేయించు' అని ప్రార్థించాలి.  నమస్కారం అంటే ఏదో రెండు చేతులు జోడించడం కాదు. తలపెట్టిన కర్మ విజయవంతం అయ్యేలా ఆశీర్వదించమని  భగవంతుని ప్రార్థించడమే నమస్కారంనకు అంతరార్థం. 🌴.         

No comments:

Post a Comment