Sunday, May 25, 2025

Miss England Quits Miss World Hyderabad, Says She Was 'Made to Feel Like a Prostitute'

Miss England Quits Miss World Hyderabad, Says She Was 'Made to Feel Like a Prostitute'




మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఈవెంట్ నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి అనే ఆవిడ బయటికి వచ్చేసింది. ఇదొక పెద్ద వివాదంగా మారింది. ఎందుకు వచ్చింది బయటికి ఈవిడ? ఈ పోటీల్లో నన్ను ఒక వేసేలాగా చూసినట్టు అనిపించింది నాకు ఒక కోతిని ప్రదర్శనకి పెట్టినట్టుగా మమ్మల్ని అంటే ఈ పోటీల్లో పాల్గొనేటువంటి అందాల అతివల్ని ప్రదర్శనకి పెట్టారు. ఇది చాలా అవమానకరంగా తోచింది నాకు అందుకే విరమించుకొని వచ్చేసాను అని చెప్పింది. మిల్లామాగి మిస్ ఇంగ్లాండ్ ఈ పోటీలో పాల్గొంటున్న తొలి ప్లస్ సైజ్ మహిళ ప్లస్ సైజ్ అంటే కొంచెం లావుగా బొద్దుగా ఉండేవాళ్ళు సాధారణంగా ఈ అందాల పోటీల్లో పాల్గొనాలి అంటే చాలా సన్నగా ఉండాలి కానీ దీని మీద అంటే ఈ బ్యూటీ స్టాండర్డ్స్ మీద ఇటీవల కాలంలో చాలా విమర్శలు వచ్చినాయి సన్నగానే ఉండాలా లావుగా ఎందుకు ఉండకూడదో బొద్దుగా ఎందుకు ఉండకూడదు ఇట్లాంటివన్నీ సో ఈ నేపథ్యంలో కొంచెం బొద్దుగా ఉన్నా కూడా మిల్లా మాగి ని మిస్ ఇంగ్లాండ్ గా ఎంపిక చేశారు. మిస్ ఇంగ్లాండ్ కాబట్టి నాచురల్ గా ఆ దేశం తరఫున మిస్ వరల్డ్ పోటీలకి ఆవిడ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈమె హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వల్డ్ పోటీలకు వచ్చింది. కొన్ని రోజులు అయిన తర్వాత కొన్ని నైతిక ప్రశ్నలు లేవనెత్తి ఈ పోటీలు కాలం చెల్లినవి ఇందులో పార్టిసిపేట్ చేయడం నన్ను నేను దిగజార్చుకోవడమే అని అంటుంది. మేఏడవ తేదీన మిల్లామాగి హైదరాబాద్ వచ్చింది అప్పటినుంచి ఈ మిస్ వరల్డ్ ఈవెంట్స్ లో పాల్గొంటుంది. మే 16వ తేదీన పోటీల నుంచి విరమించుకొని ఇంగ్లాండ్ కి తిరిగి వెళ్ళిపోయింది. ఈ మిస్ వరల్డ్ 2025 ఫైనల్ ఈవెంట్ హైదరాబాద్లో మే 31వ తేదీన హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరుగుతుందట. ఇందులో 109 మంది అందాల భామలు వివిధ దేశాల నుంచి పాల్గొంటున్నారు. మిస్ వరల్డ్ పోర్టల్ స్టార్ట్ అయ్యి 74 ఏళ్ళ అయింది. ఈ 74 ఏళ్లలో ఇట్లా ఒక పార్టిసిపెంట్ మధ్యలో వదిలేసి పోవడం ఇదే మొదటిసారి సో ఇప్పుడు ఆమె స్థానంలో మిస్ ఇంగ్లాండ్ రన్నర్ అప్ షార్లట్ గ్రాంట్ అనే ఆవిడ వచ్చింది. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లండ్ కి మిల్లా మాగి ది సన్ అనేటువంటి ఒక టాబ్లైడ్ పత్రికకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో హైదరాబాద్లో జరుగుతున్న ఈ మిస్ వరల్డ్ పోటీల్ని కడిగి పారేసింది. పొద్దున లేచి లేవంగానే మేకప్ వేసుకోవాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేసేవాళ్ళు నిర్వాహకులు మమ్మల్ని 24 గంటలు మేకప్ లోనే ఉండాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచే మంచి డ్రెస్ వేసుకొని ప్రెజెంట్ చేసుకోవాలి. ఇక డిన్నర్ పార్టీల పేరుతోటి నిర్వహించిన కార్యక్రమాలు చాలా ఇబ్బందికరంగా పరిణమించినయి మాకు అంటే పోటీ చేసేటువంటి అమ్మాయిలకి స్పాన్సర్స్ అనే పేరుతోటి అంటే ఈ ఈవెంట్ కి డబ్బులు ఇచ్చిన వాళ్ళ అన్నమాట ఈ మిడిల్ ఏజ్డ్ మెన్ మధ్య వయస్కులైనటువంటి మగవాళ్ళు వీళ్ళని ఎంటర్టైన్ చేయడం మాకు పని అయిపోయింది ఈ డిన్నర్ పార్టీస్ లో టేబుల్ కి ఆరుగురు గెస్ట్లు కూర్చోబెట్టేవాళ్ళు ప్రతి టేబుల్ కి ఇద్దరు ఈ బ్యూటీ కంటెస్టెంట్స్ ని కూర్చోబెట్టేవాళ్ళు వీళ్ళఇద్దరు ఆ మిగతా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి ఈ డిన్నర్ పార్టీల్లో నేను నా ఇంట్రెస్ట్ గురించి మాట్లాడాలి అని అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఆసక్తి చూపించలేదు. మిల్లామాగి యాక్చువల్ గా ఒక లైఫ్ గార్డ్ ఇంగ్లాండ్లో మిస్ ఇంగ్లాండ్ గా ఎంకయిన తర్వాత ఆవిడ సిపిఆర్ అంటే గుండె నెప వచ్చినప్పుడు ఏ విధంగా రీసటేట్ చేయాలి అనేది అలాగే జనరల్ గా ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలి అనేవి స్కూల్ కరిక్రంలో పెట్టాలి అనేటువంటి ఒక ఉద్యమానికి నాయకత్వం వహిస్తుంది. సో వాటి గురించి తాను మాట్లాడదాం అనుకుందట. కానీ ఈ అటెండ్ అయినటువంటి ఈ మిడిల్ ఏజ్ మెన్ కి వాటి పట్ల ఎటువంటి ఆసక్తులు లేవు ఎంతసేపటికి వాళ్ళు ఏవో చిల్లర సరదా మాటలు మాట్లాడాలి నేను అన్నట్టుగా ఉండేది అని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. అందాల పోటీలో అంటే డ్యూటీ విత్ ఏ పర్పస్ అనుకొని నేను ఇండియా వెళ్ళాను కానీ అక్కడ నన్ను ఒక ఆట బొమ్మలాగా చూసినట్టుగా అనిపించింది. అందుకే పోటీలో కొనసాగలేకపోయాను అని చెప్పింది. మిల్లా మాగే మాటలు సహజంగానే మిస్ వరల్డ్ పోటీల మీద ప్రభావం చూపిస్తాయి అందువల్ల వెంటనే ఈ నిర్వాహకులు రియాక్ట్ అయ్యారు. మిల్లా చెప్పేవన్నీ అబద్ధాలు హైదరాబాద్లో ఉన్నంత కాలము ఆమె చాలా ఎంజాయ్ చేసింది అని చెప్పి కొన్ని వీడియోలను రిలీజ్ చేశారు. మాకేమో ఇంటి దగ్గర అంటే ఇంగ్లాండ్లో ఏదో అత్యవసర పరిస్థితి ఉంది ఎమర్జెన్సీ వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇట్లా మాట మార్చింది అని చెప్పి వాళ్ళ ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు. సన్ పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కాకుండా మిల్లా మాగి కొంతంగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇందులో ఏముందంటే ఇండియాలో పేదరికాన్ని చూసి తట్టుకోలేకపోయాను మమ్మల్ని బస్సుల్లో తిప్పినప్పుడు రోడ్ల పక్క ఇటువంటి వాళ్ళు కుప్పల తెప్పలుగా కనిపించారు వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఈ నిర్వాహకులు మమ్మల్ని వారించారు నన్ను మాట్లాడనివ్వలేదు అని కూడా చెప్పింది. being out india never experienced to someవatic class system out there and i have witnessed you know first hand that sort of poverty before and you know geting into coaches most evenings and been driven though the streets of india it didn't sit well with me ఒక పక్కన మాకు బాగా డబ్బులు ఉన్న వాళ్ళతోటి డిన్నర్ పార్టీలు ఏర్పాటు చేస్తే మరో పక్కన ఇట్లా ఆకలితో అడుక్కునే వాళ్ళని చూసి తట్టుకోలేకపోయాను అని కూడా చెప్పింది. ఇక ఈ వ్యవహారం మీద నా కామెంట్ కొన్నాళ్ళ క్రితం వరకి ఈ మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ మిస్ ఎర్త్ లాంటి పోటీల పట్ల జనంలో చాలా క్రేజ్ ఉండేది. అయితే ఇవాళ ఈ పోటీలకి పెద్దగా రెలవెన్స్ లేదు. ఎందుకంటే అందానికి వీళ్ళు నిర్వచించే ప్రమాణాలని ఆ స్టాండర్డ్స్ ని బ్యూటీ స్టాండర్డ్స్ అంటారు కదా వాటిని అన్ని దేశాలు అన్ని సమాజాలు ఒకే రకంగా చూడవు. అది గాక కాలంతో పాటు ఈ బ్యూటీ స్టాండర్డ్స్ కూడా మారిపోతుంటాయి. గ్రీక్ శిల్పాలు చూడండి అందులో ఆడవాళ్ళంతా చాలా బొద్దుగా ఉంటారు. ఇండియాలో టెంపుల్స్ లో ఉండే విగ్రహాలు చూడండి అందానికి నిర్వచనం కొంచెం వేరుగా ఉంటుంది అక్కడ. ఈ కారణాల వల్ల అందం అంటే ఏమిటి అనేదానికి ఒక యూనివర్సల్ డెఫినిషన్ అనేది ఏమీ లేదు. అందువల్ల ఒకటితో పోలిస్తే ఈ ప్రపంచ అందాల పోటీలకి ఇప్పుడంత ఫాలోయింగ్ లేదు అంత క్రేజ్ లేదు. ఒకప్పుడు ఇండియా నుంచి సుష్మితా సేన్ ఐశ్వర్య రాయ్ డయానా హేడెన్ యుక్తాముఖి ప్రియాంక చోప్ర లారా దత్త ఇట్లాంటి వాళ్ళంతా గెలిచిన టైంలో ఈ అందాల పోటీలు అంటే దేశంలో చాలా క్రేజ్ ఉండేది. ఈ పోటీల్ని లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా చేస్తారు హైదరాబాద్లో మే 31న జరిగే అందాల పోటీల ఫైనల్స్ ని సో ఈ లైవ్ బ్రాడ్కాస్ట్ ద్వారా ఈ పోటీల నిర్వాహకులు వందల కోట్ల రూపాయల బిజినెస్ చేసేవాళ్ళు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఒకటేమో సోషల్ మీడియా డామినెన్స్ పెరిగిపోయింది. టీవీ లైవ్ షోలకి అంత డిమాండ్ లేదు అందాల పోటీలను చూసేవాళ్ళు బాగా తగ్గిపోయారు. ఇంతకుముందు చెప్పినట్టు అందాన్ని నిర్వచించడంలో వచ్చిన మార్పులు ఇవన్నీ కలిసి ఇప్పుడు ఈ పోటీలు నామమాత్రంగా జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి సమయంలో హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో అనేటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి కానివ్వండి ఆయన గవర్నమెంట్ లో ఉన్నటువంటి మరి బ్యూరోక్రాట్స్ కానివ్వండి మిస్ వల్డ్ పోటీలకి హైదరాబాద్ ఆతిధ్యం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించడం ఒక రకంగా కొంచెం విచిత్రమే ఇక మిల్లా మాగి మాటల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది చాలా వరకు నిజం ఉండొచ్చు అయితే అందాల పోటీల్లో వ్యవహారం ఇట్లాగే ఉంటుంది అని తెలియని అమాయకురాలు కాదు ఆమె అందాల పోటీల్లో అందానికి ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది అని తెలియకుండా ఆమె ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది అని చెప్పి అనుకోవడం చాలా కష్టం సమాజంలో మార్పులు తీసుకురావడానికి మంచిని పెంచడానికి మనుషుల ఆలోచన తీరుని ఉదాత్తంగా మలచడానికి అందాల పోటీల్లో పాల్గొన్నాము అని ఎవరు చెప్పినా కూడా అది హిపోక్రసీ లావుగా బొద్దుగా ఉన్నా కూడా అందాల భామగా ఎంపిక చేయాలి అని పాశ్చాత్య దేశాల్లో లో కొంత కాలంగా ఒక ఉద్యమం నడుస్తుంది. అందులో భాగంగా మిల్లా మాగి మిస్ ఇంగ్లాండ్ గా ఎంపికయింది. అందువల్ల హైదరాబాద్ లో జరిగేటువంటి ఈ మిస్ వరల్డ్ పోటీల్లో ఆమెకి అవకాశాలు తక్కువే అని చెప్పాలి. ఆ కారణం చేత బహుశా ఆమెకి సడన్ గా మిస్డ్ పోటీలు ఎంత కాలం చెల్లిన కార్యక్రమమో ఎంత అవుట్డేటెడో అర్థమై ఉంటుంది. అసలు అందాల పోటీల్లో పాల్గొనడం ద్వారా ప్రపంచంలో మార్పులు తీసుకొస్తాం అని ఎవరైనా నమ్మితే అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఉండబోదు. బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రయోజనంతో కూడిన అందం సంకల్పంతో కూడిన సౌందర్యం అనే నినాదం నినాదంగా బాగుంటుంది కానీ అది వాస్తవం కాదు మొత్తంగా ఏమిటంటే అందాల పోటీల్లో పాల్గొనే వాళ్ళు ఆ కార్యక్రమం ఆడవాళ్ళని వస్తువులుగా చూస్తుంది కమోడిటీస్ గా చూస్తుంది అని విమర్శించడం ఎట్లాంటిది అంటే కంబళలో తింటూ పురుగులు ఏరుకోవడం లాంటిది

No comments:

Post a Comment