మీ ఆరోగ్యం మీ చేతుల్లో (1742)
*###################*
*ఆరోగ్య మస్తు*
*====================*
*తల్లిదండ్రులకు సూచనలు*
*++++++++++++++++++*
👉పిల్లలను విసుక్కోకూడదు.
👉చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పాలి.
👉ఏడ్చినపుడు, ఏడుస్తున్నప్పుడు సహనం కోల్పోకూడదు.
👉వాళ్ళముందు అబద్ధాలు ఆడకూడదు.
👉ఇంట్లో వాళ్ళెవరైనా
సరే మర్యాద ఇవ్వడం అవసరం... పని వాళ్ళకు కూడా
'👉ఫోన్'లో మీరు ఇంట్లో ఉన్నా లేరని వాళ్ళతో చెప్పించడం మరియు వాళ్ళు ఉన్నపుడు చెప్పడం మంచిది కాదు.
👉రోజంతా పిల్లలను చదువు, చదువు అని వెంట పడవద్దు. నిర్ణీత సమయం కేటాయించండి.
👉పొగడ్తలు.. వాళ్ళకు ఇవ్వవద్దు.. వాళ్ళ పనికి ఇవ్వండి. పిల్లల ముందు భార్యా భర్తలు తిట్టుకోవద్దు. (ఇదిచాలా ముఖ్యమైనది)
👉జడ్జిమెంట్, ఎవాల్యువేషన్, పొగడ్తలు వాళ్ళకు కాకుండా వాళ్ళు చేసిన పనికి ఇవ్వండి.
👉వాళ్ళు చదువుకొనే సమయంలో మీరు ఒక మంచి పుస్తకం తీసుకొని చదువుకోండి.
👉వాళ్ళతో పని చేయించాల్సి వచ్చినపుడు వాళ్ళతో కలిసి మీరు చెయ్యండి.
👉 చాలా మొండికేస్తే సంయమనం పాటించండి. సైకాలజిస్ట్లను కలవండి.
👉పిల్లలను ద్వేషించకూడదు. తిట్టకూడదు. వాళ్ళకు అన్ని విషయాలు మనం.
ప్రేమతో నేర్పించాలి.
👉నేర్పించటాన్ని కూడా మీరు ప్రేమించండి. జీవితంలో వచ్చే అరుదైన అవకాశం .
👉పిల్లలతో మనకిష్టమైన పనులను అధికారంతో చేయించలేము.
👉పిల్లలకు చాలా "ఇగో" ఉంటుంది. వాళ్ళకు ఇష్టంలేని పనులను బలవంతంగా చేయించవద్దు.
👉తప్పు జరిగితే 'సారీ' ఎవరికయినా చెప్పటం అలవాటు చేసుకోండి.
👉పిల్లలు అడిగిన ప్రశ్నలకు తెలిస్తేనే జవాబులు చెప్పండి. అబద్దాలు చెప్పవద్దు.
👉దేంట్లోనూ ఫెయిల్యూర్ లేదు. జస్ట్ ఫీడ్ బ్యాక్ మాత్రమే ఉంటుంది.
👉అతి ప్రేమ, అతి కోపం అతి మంచిది కాదు. బ్యాలన్స్ ఉండాలి. "అతి సర్వత్ర వర్ణయ్యేత్"
👉పిల్లలకు సాయంత్రం 5 గం॥ల తర్వాత స్టడీ అవర్స్ ఉండని పాఠశాలలో చదివించండి.
👉సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత టైం టేబుల్ నిర్ణయించుకొని ఒక గుంట మంచి టీ.వి. ప్రోగ్రామ్స్ చూడటానికి కేటాయించండి. అస్తమానం టీ.వి. చూస్తే కనెక్షన్ తీసివేయండి. 1 నుండి 2 గంటలు చదవటం, తర్వాత వారికి నచ్చిన కళను ప్రోత్సహించండి.
👉ఇంట్లో పని కల్చర్ని నేర్పించండి. ప్రతి పిల్ల వాడు గొప్ప వ్యక్తి. తల్లి దండ్రులు వారికిష్టమైన రంగాలలో ప్రోత్సహిస్తే చదువుతో పాటు ఆ కళలలోనూ రాణిస్తారు.
👉వీలు చూసుకొని తల్లులు వారితో ప్రతి రోజు షటిల్ లాంటి ఆటలకు కొంత సమయం కేటాయించండి.
👉చదువు, మార్కుల పేరుతో అతిగా దండించే పాఠశాలల నుండి మీ పిల్లలను వత్తిడి లేని పాఠశాలకు మార్చండి.
👉చదువు మార్కుల కొరకు కాదు. వ్యక్తిత్వ వికాసాన్ని, మనోధైర్యాన్ని, ఆరోగ్యాన్ని అభివృద్ధి పరచాలి. చదవాలి కానీ, చదువే జీవితం కాదు. చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే. పిల్లలలోని కళలను చదువుతో పాటు ప్రోత్సహిస్తే వారు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్య వంతులవుతారు.
👉ప్రతిరోజు పాఠశాలలో సాయంత్రం చివరి 45 ని॥లు యోగా తరగతి నిర్వహించమని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంతో విన్నవించుకోండి.
ఆరోగ్య మస్తు యూట్యూబ్ ఛానెల్ లో మరెన్ని హెల్త్ టిప్స్ చూడండి
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు ఓం సర్వేభవంతు సుఖిన: సర్వే సంతు నిరామయా: సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దు:ఖ భాగ్భవేత్
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.
-: ఓం శ్శాంతిః శ్శాతిః శ్శాంతిః
Dr.M Ashok VardhanReddy
MD(AM)
N.L.P BasicPractitioner
Life skills Coach
Impact certified motivational trainer
Secunderabad
8500204522
🧎♀️🩺🏃♀️🧎♀️🏃♀️🩺🧎♀️🏃♀️🩺🧎♀️🏃♀️
No comments:
Post a Comment