_*శ్రీరమణీయం*_
🕉🌞🌎🌙🌟🚩
_*మనసులోకి ఏ కోరిక రాకుండా ఉండటం, వచ్చినా కోరిక బాధించకుండా ఉండగలిగే స్థితిని సంపాదించడం ఎలా సాధ్యమవుతుంది !?"*_
🧘♂️ *''పరిపూర్ణతే సాధకుడి లక్ష్యం ! వెలితిపోతే దుఃఖమే లేదు."* 🧘♂️
*మనవద్ద ఉన్నదాన్ని గానీ, మనసులో లేనిదాన్ని గానీ మనం అడగలేము.*
*ఆత్మసాధకుడికి అంతా తనలోనిదేనని తెలిసినప్పుడు, తనకు ఏది భిన్నం కాదని అర్థమైనప్పుడు కోరిక పోతుంది.*🙏🙏🙏
*భగవద్భక్తుడికి అడగదలుచుకున్నది మనసులోకి రానేరాకపోవటం వల్ల కోరిక అనేది బాధించకుండా ఉంటుంది.*
*శ్రీరామకృష్ణ పరమహంస అనేక వ్యాధులు, ఇబ్బందులతో బాధపడ్డారు. కానీ తాను పూజించే అమ్మవారి ముందు ఏనాడూ వాటిని వ్యక్తం చేయలేదు. కారణం ఆ తల్లి ఉన్నప్పుడు మనసులో ఇంకేవీ ఉండేవికావు.*🙏🙏🙏
*మనసులో లేని వాటిని అడగటం ఎలా సాధ్యం అవుతుంది ? ఆత్మజ్ఞాని ఆత్మకు భిన్నంగా దేన్నీ చూడలేడు. భక్తి పరాకాష్ఠలో భగవంతుడికి భిన్నంగా ఏదీ కనిపించదు. ఏ సాధన అయినా ఫలితం, పరిణామం ఒక్కటే !*
_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"*_
🧘♂️ *''పరిపూర్ణతే సాధకుడి లక్ష్యం ! వెలితిపోతే దుఃఖమే లేదు."* 🧘♂️
🕉🌞🌎🌙🌟🚩
No comments:
Post a Comment