Netaji Subhas Chandra Bose :The Forgotten Hero | Highly Controversial | Biography
https://youtu.be/S2KScUyKFLI?si=TMXAl5YCOY28hCQR
గొప్ప సేనా నాయకుడు ఆయన సాటి లేని మేటి నాయకుడు ది గ్రేట్ నేతాజీ సుభాష్ చంద్రబౌస్ ఒక అసంపూర్ణ జీవిత గాథ సమాజాన్ని చైతన్య పరచడమే కాదు సమాజం యొక్క ఆలోచనా విధానాన్నే మార్చాడు దేశాన్ని తన తల్లిదండ్రుల కంటే అధికంగా ప్రేమించిన వ్యక్తి ఈయనకు దేశం కంటే ఏది ముఖ్యం కాదు సివిల్ సర్వీసెస్ లో అత్యున్నత ర్యాంకు సంపాదించి కూడా దాన్ని వదిలి దేశ సేవకు అంకితమైనాడు. సుభాష్ చంద్రబోస్ కుటుంబం ఒక మధ్య తరగతి కుటుంబం ఆంగ్లేయులకు విరుద్ధంగా ఎవరు గొంతు విప్పేవారు కాదు అటువంటి సమయంలో తన ఎదురులేని నాయకుడు జన్మించాడు. వివేకానందుని రచనల ద్వారా భయాన్ని ఎలా జయించాలో నేర్చుకున్నాడు. ఇతను ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుతున్నప్పుడు సుభాష్ బాబుకి నిజమైన కష్టాలు ఎటువంటివో అర్థమయింది. చిరిగిన బట్టలతో కాలే కడుపులతో ఉన్న వారిపైన ఆంగ్లేయులు దౌర్జన్యం. అసలే మన వాడిది తిరుగుబాటు మనస్తత్వం. మీ రక్తం నాకు ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను ఇది నేతాజీ నినాదం ముజే హూన్ దో మే తుమే ఆజాది దుంగా నమస్తే సదా వత్సలే మాతృభూమే నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త మిత్రులారా భగవంతుడు ఎప్పుడు స్వయంగా రాడు ఆయన మనుష్య రూపంలోనే వస్తాడు. దైవం మనుష్య రూపేనా అంటారు మన పెద్దలు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. ఏ ప్రయోజనమైనా మానవ కళ్యాణమే అంతిమ లక్ష్యం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి సమాజాన్ని చైతన్య పరచడమే కాదు సమాజం యొక్క ఆలోచనా విధానాన్నే మార్చాడు రాజకీయ ఆలోచనా విధానాన్ని మలుకు తిప్పిన వ్యక్తి ఈయన ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే ఈయన దేశాన్ని సర్వోన్నతంగా భావించాడు. దేశాన్ని తన తల్లిదండ్రుల కంటే అధికంగా ప్రేమించిన వ్యక్తి ఈయనకు దేశం కంటే ఏది ముఖ్యం కాదు. ఈయన దేశం కోసం సివిల్ సర్వీసెస్ లో అత్యున్నత ర్యాంకు సంపాదించి కూడా దాన్ని వెదలి దేశసేవకు అంకితమయనాడు. దేశంలోని అనగారిన ప్రజలు ఏ భవిష్యత్తు లేకుండా బతికే బడుగు జీవులు పీడిత తాడితుల కోసం సేవ చేయాలని సివిల్ సర్వీసెస్ టాప్ ర్యాంకును కూడా వదిలి ప్రజాసేవలోకి వచ్చాడు. గొప్ప వ్యక్తిత్వం ఆయనది. గొప్ప సేనా నాయకుడు ఆయన సాటిలేని మేటి నాయకుడు ఎవరి గురించి చెప్పుకుంటున్నామో ఈ పాటికి మీరు గ్రహించగలిగే ఉంటారు. ఆ ఎస్ ఆయనే ది గ్రేట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నమస్కారం మిత్రులారా ఈరోజు మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పుకుందాం. ఆయన జీవిత సంగ్్రహాన్ని అన్ ఇండియన్ బిలిగ్ర అన్ఫినిషడ్ బయోగ్రఫీగా వెలవరించారు. నిజమే ఇది ఒక అసంపూర్ణ జీవిత గాధ ఎందుకు అనేది మీకు ముందు ముందు వివరిస్తాను ఈయన జీవితాన్ని మూడు భాగాలుగా మనం చూడొచ్చు మొదటి రెండు భాగాలు ఆయన జీవితం మూడవ భాగం ఆయన అదృశ్యం గురించి నేతాజీ బాల్యం నేతాజీ చదువు స్కూల్ మరియు కాలేజ్ నేతాజీ ఒక యోగిగా భారత స్వాతంత్ర సమరంలో నేతాజీ నిర్వహించిన పాత్ర ముందుగా ఈ నాలుగు అంశాల గురించి చూద్దాం. ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య బిందువులను కొద్దిగా స్పృశించి ముందుకు నడుద్దాం. ఆయన జననం జనవరి 23, 1897న జరిగింది. ఆయన పుట్టిన ప్రదేశం కటక్ ఇప్పుడది ఒరిస్సాలో ఉంది. అప్పుడు అది బెంగాల్ కు సంబంధించింది. తల్లిదండ్రులు జానకీనాథ్ బోస్ తండ్రి ప్రభావతి దేవి తల్లి భార్య ఎమిలీషంకి పిల్లలు అనిత బోస్ చదువు రవేషా కొలిజియేట్ స్కూల్ కటక్ ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తా యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఇంగ్లాండ్ ఇక సంఘటనలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్వర్డ్ బ్లాక్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హిం ఫౌస్ పోరాటాలు భారత స్వాతంత్ర ఉద్యమం ఆశయాలు దేశభక్తి విశ్వాసం హైందవ ధర్మం రాసిన పుస్తకాలు ది ఇండియన్ స్ట్రగుల్ 1920 టు 1942 అదృశ్యం 18 ఆగస్టు 1945 ముందు బాల్యాన్ని గురించి మనం చూద్దాం అది 19 వ శతాబ్దం 1800 1900 భారతదేశంలో పేదరికం చాలా ఎక్కువగా ఉండేది ఆంగ్లేయులు భారతదేశాన్ని దోచుకున్నారు. ఆనాటి కాలంలో అవినీతి చాలా ఎక్కువగా ఉండేది. ఆంగ్లేయులు అన్ని విధాలా భారతదేశాన్ని నాశనం చేశారు. దేశంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక రకంగా పీడించబడేవాడు. దేశం మొత్తంలో చాలా కొద్దిమంది అంటే ఒకటి లేదా 2 శాతం ప్రజలు మాత్రం ధనికులుగా ఉండేవారు వారు కూడా ఆంగ్లేయులకు లోబడి తమ సొంతవారిని పీడించేవారు. సుభాష్ చంద్ర బోస్ కుటుంబం ఒక మధ్య తరగతి కుటుంబం చాలా గొప్ప ధనవంతులు కాదు అలాగని చాలా పేదవారు కూడా కాదు మధ్య తరగతిలో ఉన్నత మధ్య తరగతి వర్గం వారిది. సుభాష్ చంద్ర బోస్ తండ్రి జానకీనాథ్ బోస్ ఒక న్యాయవాది లాయర్ అంతేకాదు ఆంగ్లేయులకు చాలా గట్టి మద్దతుదారు అది 1897 అప్పటికే మొదటి స్వాతంత్ర సంగ్రాామం అయింది. ప్లాసీ యుద్ధం జరిగిపోయింది. బక్సర్ యుద్ధం జరిగిపోయింది ఆంగ్లేయుల పాలన భారతదేశంలో వేళ్ళు ఉనుకుంది. ఆంగ్లేయులకు విరుద్ధంగా ఎవరు గొంతు విప్పేవారు కాదు అటువంటి సమయంలో మన తిరుగులేని నాయకుడు సుభాష్ చంద్రబోస్ జన్మించాడు. 23 జనవరి 1897న జానకీ బోస్ ప్రభావతి దేవీలకు మన ఎదురు లేని నాయకుడు జన్మించాడు. సుభాష్ చంద్ర బోస్ కుటుంబం చాలా పెద్దది. జానకీనాథ్ బోస్ కు ఎనిమిది మంది మగ సంతానం ఆరుగురు ఆడ సంతానం మొత్తం పిల్లలు 14 మంది ఇంతమంది పిల్లలు ఉన్న ఇంట్లో అందరిపైన దృష్టి కేంద్రీకరించలేరు. అందరిపైన ప్రేమ ఉంటుంది కానీ అందరిని ఒకేలా చూడడం కష్టం. ఈ కారణంగా సుభాష్ చంద్ర బోస్ తనలో తను ఆలోచనల్లో మునిగి ఉండేవాడు ఎప్పుడు ఇంగ్లీష్‌లో వీరిని ఇంట్రావర్ట్ అంటారు అంటే వారి భావాలను ఆలోచనలను బహిర్గతం చేసేవారు కాదు అటువంటి వాతావరణంలో పెరిగిన వారు సహజంగా అలానే ఉంటారు. 14 మంది పిల్లలు ఎవరికి వారు ఉండేవారు. తండ్రి తన వృత్తి వలన చాలా బిజీగా ఉండేవాడు. ఆయన ఆంగ్లేయుల తరఫున ఎక్కువ వాదించేవాడు పాలక పక్షం కాబట్టి ఎప్పుడూ పనివత్తిలో ఉండేవాడు. తల్లి ఇంటి పని వంటపనితో ఆమెకు వీరితో గడిపే సమయమే చాలా తక్కువగా ఉండేది. అటువంటి వాతావరణంలో పెరిగిన సుభాష్ బాబు చాలా సిగ్గరి మనస్తత్వం ఇంత పెద్ద కుటుంబంలో నన్ను ఎందుకు పట్టించుకోరు అనే భావం ఆయన మధ్యలో ఉండేది సుభాష్ బాబు చాలా కష్టపడే మనస్తత్వం కలిగినవాడు తనను తాను చాలా తెలివిగలవాడు అని అనుకునేవాడు కూడా కాదు కానీ అతను చాలా తెలివిగల పిల్లలవాడు. ఆనాటి కాలంలో ఐసిఎస్ ఆరు ఏడు నెలల్లోనే పూర్తి చేశాడు అంటే అతని తెలివిని మనం అంచనా వేయవచ్చు కానీ తనకు తాను గొప్ప తెలివి గలవాడుగా భావించుకోకపోవడం అతడి గొప్పతనం అతని చదువుల గురించి మనం కొంత చూద్దాం. 1902 లో అతని పుట్టిన రోజునాడు అతన్ని బడికి పంపిస్తున్నారని తెలిసినప్పుడు సుభాష్ బాబు చాలా ఆనందించాడు. సహజంగా తల్లితో ఎక్కువ సాన్నిహిత్యం ఉండే పిల్లలు బడికి వెళ్ళనని మారం చేస్తారు. కానీ తల్లిదండ్రుల సంరక్షణ కరువైన వారు బడికి వెళ్ళడానికి ఆనంద పడతారు ఇష్టపడతారు మన సుభాష్ బాబు కూడా అలానే చాలా సంతోషపడ్డాడు. స్కూల్‌కి తీసుకువెళ్ళే రిక్షా ఇంటి ముందు ఆగగానే సుభాష్ పరుగు పరుగున వెళ్లి రిక్షా ఎక్కడానికి పరిగెత్తేవాడు. ఒకసారి అలాగే పరిగెత్తి రిక్షాలో ఎక్కిన్న మొదటి మెట్టు మీద కాళ్ళు పెట్టగానే జారి కింద పడ్డాడు. అతడికి చాలా దెబ్బలు తగిలాయి ఆ రోజుక అతన్ని స్కూల్‌కి పంపించలేదు. స్కూల్‌కి పంపించినందుకు సుభాష్ చాలాసేపు ఏడ్చాడు. దెబ్బలు తగిలినందుకు కాక స్కూల్‌కు వెళ్ళనందుకు ఏడ్చాడు సుభాష్ తన చదువుల గురించి సుభాష్ తన ఇండియన్ పిలిగ్రం అనే పుస్తకంలో ఇలా రాస్తాడు. అది ఒక మిషనరీ స్కూల్ అప్పుడు పాలన అంతా ఆంగ్లేయులది ఆ స్కూల్లో ఇంగ్లీషు బైబిల్ లాంటివే చదివించేవారు తప్ప సంస్కృతం ఇతర భారతీయ చరిత్రకు సంబంధించిన విషయాలు అస్సలు బోధించేవాళ్ళు కాదు ఆంగ్లేయుల పద్ధతులనే నేర్పించేవాళ్ళు హిందుస్తాన్‌లో ఉన్న హిందీ కానీ స్థానిక భాష బెంగాళీ గాని నేర్పించేవారు కాదు అది తనకు చాలా కష్టంగా ఉండేది అని అంటాడు సుభాష్ బాబు ఇక్కడ నుండే సుభాష్ బాబులో దేశం పట్ల ప్రేమ పెరుగుతూ వచ్చింది. స్కూల్లో ఆంగ్లేయుల చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించేవారు అడిగితే అంతే ఆయన సమాధానం వచ్చేది. మనం ఆంగ్లేయుల గురించి ఎందుకు తెలుసుకోవాలి మన గురించి మనం ఎందుకు తెలుసుకోకూడదు అని ప్రశ్న ఉదయించేది సుభాష్ బాబులో ఈ విషయంలో అతడికి చాలా కోపం వచ్చేది అసంతృప్తిగా ఉండేవాడు కానీ స్కూల్లో మాత్రం చాలా సంతోషంగా ఉండేవాడు. ఇతని కోపాన్ని లేదా ఇతని అసంతృప్తిని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. ఆ తర్వాత అతడు రెన్షా కాలేజీలో చేర్చబడ్డాడు. రెన్షా కాలేజీ చాలా పెద్ద కాలేజీ ఈరోజు కూడా ఒరిస్సాలో ఉంది. ఇక్కడి నుండే అసలు కథ మొదలైింది. సుభాష్ బోస్ కు మొదటి నుంచి ఇంటిపైన శ్రద్ధ ఉండేది కాదు. ఇక్కడ సుభాష్ బాబుకు ఒక మిత్ర బృందం తోడైంది. మొదటి నుండి సుభాష్ బాబు కొద్దిగా తిరుగుబాటు మనస్తత్వం ఉండేవాడు. రన్షా కాలేజీలో ఉన్న మిత్ర బృందం కూడా తిరుగుబాటు మనస్తత్వం ఉన్నవారే. సుభాష్ బాబు చిన్నతనం నుండే తనను తాను ప్రశ్నించుకునేవాడు. ఒకసారి అతడు స్వామి వివేకానంద రాసిన ఒక ఆర్టికల్ చదవడం సంభవించింది. ఆ ఆర్టికల్ అతన్ని చాలా ప్రభావితం చేసింది. ఎంత ప్రభావితం చేసింది అంటే ఆయన మార్గంలోనే నడవాలి అని గట్టిగా నిర్ణయం తీసుకునే అంతగా ప్రభావితం చేసింది. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస గురించి చదివాడు అప్పుడు అతని వయసు 12 13 ఏళ్ళు ఇవన్నీ అతనిలోని తిరుగుబాటు మనస్తత్వాన్ని మరి కొంచెం ఎక్కువ చేశాయి. అతడు యోగ మార్గం వైపు వెళ్ళడం మొదలు పెట్టాడు జీవితం అనేది ఏదీ లేదు నేను యోగి కావాలి అనేవాడు నేను ప్రజలకు సేవ చేయాలి కుటుంబం కుటుంబం ఏం లేదు పిల్లల్లో ఇటువంటి ఆలోచనా ధోరణి మొదలైతే మొదటగా బాధపడేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులే యోగి జీవితం గొప్పదే అన్నింటిని క్షజించి ఆనందంగా ఉండగలరు కానీ తల్లిదండ్రులకు మాత్రం చాలా దుఃఖం కలిగిస్తుంది. అతడి నడవడిక చూసి జానకీనాథ్ బోస్ ప్రభావతి దేవి ఏం జరుగుతుందో అని ఆందోళనంతో తలరోలు పట్టుకు కూర్చునేవారు సుభాష్ బాబును మొదట ప్రభావితం చేసినవాడు అతని టీచర్ బేణ మాధవదాస్ బేణ మాధవదాసును చాలా గౌరవించేవాడు సుభాష్ బాబు బేణ మాధవదాసు ను వేరే స్కూల్ కు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మొదటిసారిగా సుభాష్ బాబు ఎక్కి ఎక్కి ఏడవడం జరిగింది. చివరిసారిగా ఆయన క్లాస్ తీసుకోవడానికి క్లాస్ కు వస్తే వచ్చే ఏడుపును అదిమి పెట్టుకోవడానికి సుభాష్ బాబు చాలా కష్టపడ్డాడు. ఆయన క్లాస్ వది మెట్లు దిగుతూ పక్కకు చూస్తే సుభాష్ బాబు కనిపిస్తాడు. సుభాష్ బాబు దగ్గరికి వచ్చి తల నిమరగానే సుభాష్ తనను తాను సంపాదించుకోలేకపోయాడు. వేణి మాధవదాసును తర్వాత కూడా కలుసుకోవడం జరిగేది తర్వాత సుభాష్ తల్లిదండ్రుల మాట వినడం మానేసాడు ఆయన వివేకానందును గురించి చదివిన తర్వాత ఆయన మార్గంలో నడవడం మొదలు పెట్టాడు ధ్యానం చేయడం మొదలు పెట్టాడు జన్షా కాలేజీ స్నేహితులు కూడా సుభాష్ బాబు ఆలోచనలు కలిగినవారే వారు కూడా ఎప్పుడూ దేవుడు ధ్యానం వీటి గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు ఇవన్నీ సుభాష్ బాబును మరో మార్గానికి మళ్ళంచాయి తల్లిదండ్రుల మాట వినకుండా చేసే వరకు తీసుకువచ్చాయి ఇంట్లో చంపకుండా సుభాష్ బాబు అనేక పుణ్యక్షేత్రాలు తిరిగేవాడు స్నేహితులతో కలిసి హరిద్వార్ కేదార్నాథ్ మొదలైన పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ప్రజలకు సేవ చేసేవాడు. అతడికి నిజమైన భారతదేశం ఎలా ఉంటుందో తెలియదు కానీ అతని ఆలోచనలు మాత్రం ఎప్పుడు పేదలకు సేవ చేయాలి అనే ఆలోచనలే ఉండేవి. ఆనాటికి భారతదేశంలో ఉన్న పేదల పరిస్థితి గురించి అతనికి తెలియదు. తన తండ్రి ఆంగ్లేయులకు నమ్మకమైనవాడు సుభాషను కూడా అలానే ఉండమనేవాడు కానీ సుభాష్‌కు ఇది నచ్చేది కాదు వాస్తవం అతనికి తెలియదు వారు ధనవంతులు తండ్రి ఇంటి బాధ్యతలను చూసుకుంటున్నాడు ఇక తన అవసరం ఇంటికే ఉంది కాబట్టి తను ప్రజల ఉద్ధారణకు పని చేయాలి అనుకునేవాడు. ఇక్కడ మనం ఒక సంఘటన గురించి చెప్పుకోవాలి ప్రెసిడెన్సీ కాలేజీలో చదివేటప్పుడు తన ఇంటి నుండి బయటకు రాగానే ఒక ముసలి ఆమె అడుక్కు తింటూ కనిపించేది. ఆమె చాలా దయనీయమైన స్థితిలో ఉండేది. బట్టలు చిరిగిపోయి ఉండేవి శరీరం ముడతలు పడి ఉండేది ఆమెను చూస్తే సుభాష్ బాబు మనసులో అనేక భావాలు మిగిలేవి. ఒకవైపు తాను అన్ని అమరణ జీవితం మరోవైపు ఈ దీనులు ఒక్క పూట తిండికి కూడా నోర్చుకొని అభాగ్యులు మనుషులంతా ఒకటే అయినప్పుడు ఈ తేడాలు ఎందుకు ఇలాంటి ప్రశ్నలతో మనసు నిండిపోయేది. తనకు పెట్టిన ఆహారం ఆ ముసలి ఆమెకు ఇచ్చివేసి తను ఖాళీ కడుపుతో ఉండేవాడు. వివేకానంద రామకృష్ణ పరమహంసల రచనలు ఎక్కువగా చదివేవాడు. వేదాల్లో ఉన్న శాస్త్రీయ దృక్పదాన్ని గురించి అధ్యయనం చేసేవాడు. నిజానికి సుభాష్ బాబు చాలా భయస్తుడు చీకటన్నా పాములన్నా చాలా భయపడేవాడు కానీ ఈ భయాలన్నిటి మీద విజయం సాధించడానికి ముఖ్య కారణం వివేకానందుని స్ఫూర్తి. వివేకానందుని రచనల ద్వారా భయాన్ని ఎలా జయించాలో నేర్చుకున్నాడు. ఒకసారి ఒక సాధువు వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆ సాధువుతో సుభాష్ బాబు చాలాసేపు సంభాషించాడు. భగవంతుని ఎలా పొందాలి యోగం అంటే ఏమిటి యోగి ఎలా ఉండాలి ధ్యానం ఎలా చేయాలి మొదలైన విషయాలన్నీ వారి సంభాషణలో చర్చకు వచ్చాయి. చివరిగా యోగి భగవంతుని పొందే మార్గంలో తల్లిదండ్రులను గౌరవించడం వారి మాట వినడం అలవాటు చేసుకోవాలి అని చెప్పాడు. రోజు నిద్ర లేవగానే నీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించు అని చెప్పాడు. ఈ మాటలు సుభాష్ బాబు పైన బాగా పని చేశయి. సుభాష్ బాబు దినచర్య ఆ రోజు నుంచి మారిపోయింది. ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అనే మాట అతడి మనసులో ముద్ర వేసుకుంది. రోజు నిద్ర లేవగానే తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం మొదలు పెట్టాడు. ఈ మార్పు అతడి తల్లిదండ్రులను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. తిరుగుబాటు తత్వం ఉన్న ఈ పిల్లవాడు ఇంత త్వరగా ఎలా మారిపోయాడు అని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేవారు. మొదటి నుండి తల్లిదండ్రుల మాట వినకపోయినా తల్లిదండ్రులు అంటే చాలా గౌరవం ఉండేది సుభాష్ బాబుకు కానీ అతనికి యోగి కావాలనే ఆలోచన అతనిలో తిరుగుబాటు మనస్తత్వాన్ని ప్రేరేపించింది అంతేకానీ తల్లిదండ్రులు అంటే చాలా గౌరవం సుభాష్ బాబుకు ఇలా రోజు తన దినచర్య తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కారం చేయడంతో మొదలయ్యేది. ఇది అతని తల్లిదండ్రులకు కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. తను ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుతున్నప్పుడు సుభాష్ బాబుకు నిజమైన కష్టాలు ఎటువంటివో అర్థమయింది. భయంకరమైన వివక్ష అతని కళ్ళకు కనిపించింది. భారతీయులను కొట్టేవారు భారతీయుల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించేవారు. ట్రాన్‌లో బస్సులో వెళ్ళేటప్పుడు భారతీయులను ఆంగ్లేయులు చాలా చులన భావంతో చూసేవారు అనరాని మాటలు అనేవారు. తమ దేశంలో తాము చాలా వివక్షకు గురి కావడం సుభాష్ బాబును కలచివేసింది. భారతీయులకు కుక్కలకు ప్రవేశం లేదు అనే బోండ్రులు ఉండేవి. ఆంగ్లేయులు భారతీయులను ఇష్టం వచ్చినట్టు పుట్టిన వారిపై ఏ చర్యలు ఉండేవి కాదు ఆంగ్లేయులు భారతీయులను ఎంత నీచంగా చూసేవారో నేడు మనం ఊహించడం కూడా కష్టమే ఒక పక్క పేదరికం మరో పక్క దోపిడి ఇది కాగా అప్పుడప్పుడు వచ్చే కరువు ఆ పైన ఆంగ్లేయుల దౌష్యం పేదలకు కనీసం శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కాదు చిరిగిన బట్టలతో కాలే కడుపులతో ఉన్నవారి పైన ఆంగ్లేయులకు దౌర్జన్యం ఇక్కడి జమీందారులు కూడా బారిదారులలోనే నడుస్తూ ప్రజలను ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్నారు. ఇవన్నీ గమనించిన సుభాష్ బాబు మనసు చెదిరిపోయింది. అసలే మన వాడిది తిరుగుబాటు మనస్తత్వం ఆంగ్లేయులకు సరైన జవాబు ఇచ్చేవాడు సుభాష్ తన ఎదురుగా ఏదైనా తప్పు జరుగుతుంది అంటే వారికి వారి భాషలోనే సమాధానం చెప్పేవాడు. ఈ మనస్తత్వం సుభాష్ లో ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందింది. సుభాష్ చంద్రబోస్ కు గాంధీకి మధ్య ఉన్న తేడా ఇదే అందుకే సుభాష్ చంద్రబోస్ గొప్ప నాయకుడయనాడు. గాంధీ అంటే సుభాష్ చంద్రబోస్ కు గౌరవమే కానీ ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకం గాంధీ అహింసా సిద్ధాంతం ద్వారా స్వాతంత్రాన్ని సంపాదించాలని కోరుకునేవాడు. సుభాష్ చంద్ర బోస్ కూడా స్వాతంత్రాన్ని కోరేవాడే కానీ అది అహింస సిద్ధాంతం వల్ల గాని అహింస వల్ల గాని స్వాతంత్రం సంపాదించడం ముఖ్యం ఎలాగైనా స్వాతంత్రాన్ని పొందాలి అనేది సుభాష్ బాబు సిద్ధాంతం ఫలితం ముఖ్యం కానీ ఎలా వచ్చింది ఎలా సంపాదించాం అనేది ముఖ్యం కాదు శత్రువుకు శత్రువు తనకు మిత్రుడు అందుకే జర్మనీతో చేతులు కలిపాడు సుభాష్ చంద్రబోస్ రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఆంగ్లేయులకు బద్ధ శత్రువు ఆంగ్లేయుల నడుములు విరగగొట్టింది సుభాష్ చంద్రబోస్ అడాల్ గారిని వెళ్లి కలిసాడు మీ రక్తం నాకు ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను తుముజే కూల్ దో మై తుమే ఆజాది దుంగా ఇది నేతాజీ నినాదం ఈ విషయాలన్నింటిని గురించి మనం ఇంకొంచెం విపులంగా చెప్పుకున్నాం. స్వామి వివేకానంద శ్రీ రామకృష్ణ పరమహంసల ప్రభావం భగవంతుడు పేదల రూపంలో ఉంటాడు కాబట్టి పేదలకు సేవ చేస్తే భగవంతుని సేవించినట్లే అనేది స్వామి వివేకానంద ఫిలాసఫీ తమ దగ్గరకు వచ్చినవాడు ఉద్ద చేతులతో వెళ్ళకూడదు అనేది స్వామి వివేకానంద శ్రీ రామకృష్ణ పరమహంసల శవదం చాలా చిన్న వయసులోనే సుభాష్ బాబు భగవంతుని వెదకడం మొదలు పెట్టాడు. భగవంతుడు ఎవరు నేను ఎందుకు జీవిస్తున్నాను అసలు నేను ఎందుకు పుట్టాను అనే ప్రశ్నలు సుభాష్ బాబును నిరంతరం వెంటాడుతూ ఉండేవి. తన జీవితాంతం వరకు ఆయన వివేకానంద బోధల పైనే ఆధారపడి జీవనం కొనసాగించాడు. ఆయన హింసావాది అనుకోకూడదు వివేకానంద శిష్యుడు ఎప్పటికీ హింసావాది కాడు కాలేడు. కానీ హింసను ఎదిరించేవాడు అవుతాడు. ఏ సమయానికి ఏది సరైందో ఏది అవసరమో అది తప్పకుండా చేయాలి. కర్తవ్య నిర్వహణ అనేది చాలా ముఖ్యం భగవద్గీతను విన్న అర్జునుడు కర్తవ్యాన్ని తెలుసుకొని యుద్ధం చేశాడు కానీ తపస్సుకు వెళ్ళలేదు. సుభాష్ చంద్రబాస్ కూడా స్వామి వివేకానంద బోధనలతో ప్రభావితమైనటువంటి వాడు మాటలతో వింటే సరే లేకపోతే నాలుగు తెగిలించి అయినా తను అనుకున్నది సాధించాలి అనేవాడు సుభాష్ బాబు దెబ్బలకు అలవాటు పడిన భూతం మాటలకు మారుతుందా నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండేవాడు తాను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా కుటుంబానికి తెలియనిచ్చేవాడు కాదు పేదల కోసం అతను ఇంటింటికి వెళ్లి అడుక్కు తినేవాడు పేదలకు సహాయం చేయాలి తన దగ్గర డబ్బులు లేదు కాబట్టి ఇంటింటికి వెళ్లి భిక్ష అడిగేవాడు మీకు చేతనైనంత సహాయం చేయండి ఇదంతా పేదలకు మీరు చేసే సహాయం మీకు కలిగింది ఏదైనా ఇవ్వండి అవి నేను పేదలకు చేరుస్తాను అని చెప్పేవాడు ఆయనతో ఆజాద్ హిందూ ఫౌజీలో పనిచేసిన ఒక వనిత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్తుంది నేను చాలా డిప్రెషన్ కి గురై ఉన్నాను ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ నా వైపు చూశాడు ఆయన చూపులోని ప్రభావం నా ఆందోళనను దూరం చేసింది. నేను డిప్రెషన్ నుంచి బయటపడ్డాను ఆయన చూపులలో ఒక సకారాత్మక భావన ఉట్టిపడుతూ ఉంటుంది అని చెప్పింది. అంత తీక్షణమైన ప్రభావవంతమైన ఆధ్యాత్మికత కలిగిన చూపులు సుభాష్ చంద్రబోస్ చూపులు ఇప్పుడు మనం ఆయనను కాలేజీ నుండి ఎలా తీసేసారు ఆయన రాజకీయ జీవితం ఏమిటి అనే విషయాలు చూద్దాం. ఆయన పనులతో విసిగిపోయిన తల్లిదండ్రులు సుభాష్ బాబును కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో జరిపించారు. ఇక్కడ ఉన్న సాంగత్యం స్నేహితులు అంత మంచివారు కాదు అనేది వారి ఉద్దేశం ప్రెసిడెన్సీ కాలేజీ చాలా పెద్ద కాలేజీ సర్ సివి రామన్ ఆ కాలేజీ నుంచి వచ్చిన వాడే అక్కడి నుండే అనేకమంది చాలా గొప్ప గొప్పవారు బయటకు వచ్చారు. అది 1913 ఆ సమయంలో కలకత్తాలో ఆంగ్లేయుల పాలన జరుగుతూ ఉండేది. ఆంగ్ల ప్రభుత్వం కూడా కలకత్తా నుండే ఎక్కువ పాలన కొనసాగిస్తూ ఉండేది. ఇక ఆంగ్లేయుల దౌర్జన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుభాష్ బాబు మెట్రిక్ పరీక్షలో యూనివర్సిటీలో రెండవ ర్యాంకులో పాస్ అయ్యాడు. ఎంత తిరిగినా ఎంత స్నేహితులతో ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమైనా తన చదువును మాత్రం ఆశ్రద్ధ చేసేవాడు కాదు. పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు చదివిన విషయం ఏదైనా సరే బాగా విశ్లేషించుకునేవాడు. అది అలానే తన మనసులో ముద్రించుకునేవాడు మనవాడు ప్రెసిడెన్సీ కాలేజీలో కూడా చాలామంది స్నేహితులను సంపాదించుకున్నాడు. అక్కడ అతనిది చాలా పెద్ద గ్రూపు 1905 నుండి దాదాపు 1920 వరకు బెంగాల్ విభజనకు సంబంధించిన పోరాటం జరుగుతూ ఉండేది. ఆ సమయంలో అక్కడ చాలా విప్లవాత్మకమైన ఆందోళనలు జరుగుతూ ఉండేవి. మన విప్లవకారులను ఆంగ్లేయులు టెర్రరిస్టులుగా చూసేవారు ఆ సమయానికి అంటే 1913 సమయానికి మన సుభాష్ బాబు ఇంకా పరిపక్వత చెందే వయసుకు వచ్చినవాడు కాదు కానీ ప్రతి విషయాన్ని చాలా విశ్లేషణ చేసుకునేవాడు ఆయన ప్రవృత్తి దేశానికి ప్రజలకు సేవ చేయడం దానికి ఉన్న ఒకే ఒక మార్గం రాజకీయాలు ఆయన రాజకీయాల్లో కూడా నిర్మాణాత్మక రాజకీయాలను ఇష్టపడేవాడు 1945 ప్రాంతంలో లో ఆయన భారతదేశ పరిపాలనకు ఒక రూట్ మ్యాప్ తయారు చేశాడు. భారతదేశ కరెన్సీ ఎలా ఉండాలి విద్యా వైద్యం ప్రజలకు సదుపాయాలు ఎలా ఉండాలి పరిపాలన విధానం ఎలా ఉండాలి అనే అనేక విషయాల పైన ఆయన ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేశాడు. ఈ విషయం చాలా మందికి తెలియపోవచ్చు. ఈనాటికి ఆ డాక్యుమెంట్ మనకు ఆర్క్యూస్ లో దొరుకుతుంది. ఇది ఆయన నిర్మాణాత్మక రాజకీయాలకు ఒక ఉదాహరణ. ఆ సమయంలో ఆయన భారతదేశం వచ్చి ఉంటే ఇక్కడ ప్రజా ఉద్యమం ఊపుదిద్దుకునేదే ఆయనే మనకు మొదటి ప్రధానిగా ఉండేవాడేమో కానీ భగవంతుడి నిర్ణయం మరోలా ఉంది. సరే ఈ విషయం గురించి విపులంగా కాస్త తర్వాత మాట్లాడుకుందాం. ప్రెసిడెన్సీ కాలేజీకి ఆ రోజుల్లో పెద్ద కాలేజీల నుండి విద్యార్థులు వచ్చేవాళ్ళు మద్రాస్ నుండి ఆంధ్రా నుండి ఇలా దేశం నలువైపుల నుండి విద్యార్థులు అక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడ మన సుభాష్ బాబుకు రన్షా కాలేజీలోని సమూహం కంటే పెద్ద సమూహమే ఏర్పడింది. ఒక రకమైన ఆలోచన విధానం ఉన్న అనేకమంది మిత్రులు దొరికారు. వారు ఆధ్యాత్మిక విషయాలను పంచుకునే వాళ్ళు ముందే చెప్పుకున్నాం సుభాష్ బాబు వివేకానందుల ప్రభావానికి లోనై ఉన్నాడని ఇక్కడ మరో మహాపురుషుని ప్రభావం సుభాష్ బోస్ పై పడింది. అది అరవింద ఘోష్ ఆ సమయంలో విప్లవ వీరుడుగా అరవింద ఘోష్ కు చాలా గొప్ప పేరు ఉంది. బాంబు పేరుడు కేసులో అరవిందులపై కేసులు పెట్టబడ్డాయి. దాంతో అరవిందులు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు. అరవిందులు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడని తిరిగి వచ్చి స్వాతంత్రం ఇప్పిస్తాడని అందరూ అనుకునేవారు. అదే సమయంలో బాలగంగాధర్ తిలక్ కూడా చాలా ప్రసిద్ధి ఉండేది. ఆయనను బడా దాదా అని అరవింద ఘోష్‌ను చోటా దాదా అని పిలిచేవాళ్ళు కాలేజీలో ఎక్కువమంది వీరి గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు. వీరే దేశానికి స్వాతంత్రం సంపాదించి పెడతారని చర్చలు చేస్తూ ఉండేవారు గాంధీజీ పేరును కూడా చెప్పుకునేవారు కానీ అంత ఎక్కువగా కాదు సహాయ నిరాకరణోద్యమం తర్వాత గాంధీజీ పేరు ప్రసిద్ధమైంది. ఆ సమయంలో ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థుల్లో నాలుగు రకాల వర్గాలు ఉండేవి మొదటి వర్గంలో చాలా ధనవంతుల పిల్లలు జమీందారులు రాజులు ఆంగ్లేయ అధికారుల పిల్లలు వీళ్ళకు అహంకారం ఎక్కువ వీళ్లే గొప్పవాళ్ళు అనే భావం వీళ్ళ అందరి మీద అధికారం చలాయిస్తూ తక్కిన వారందరినీ చాలా చిన్న చూపు చూసేవాళ్ళు రెండవ వర్గంలోని పిల్లలు ఎప్పుడు చదువుకుంటూ చదివే లోకం అనుకునే పిల్లలు పుస్తకాల పురుగులు అంటాం కదా అటువంటి వారు ఇక మూడో గ్రూపు వీళ్ళు అన్ని విషయాలు తెలుసుకుంటూ స్వతంత్ర భావాలు కలిగినటువంటి వాళ్ళు ఈ గ్రూపులోనే మన సుభాష్ బాబు చేరింది. ఈ గ్రూప్ లో ఎక్కువ శాతం యువకులు రామకృష్ణ పరమహంస వివేకానంద ప్రభావానికి లోనైన వారే దేశానికి సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలి అంటే వీరి మార్గంలోనే నడవాలి అని గట్టిగా నమ్మేవారు ఇక నాలుగవ వర్గం వారు విప్లవ భావాలు కలిగినటువంటి యువకులు వీరిది చాలా ప్రమాదకరమైన గ్రూపు విద్రోహానికి ప్రణాళికలు రచించడం విద్రోహ చర్యలు చేయడం మొదలైన పనులు చేసేవాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే విప్లవం కోసం ఆయుధాలు ధరించే గ్రూప్ ఇది అప్పుడప్పుడు వీరి కోసం పోలీసులు రాత్రులు రైడ్ చేసేవారు అప్పుడప్పుడు సుభాష్ బాబు గరికి కూడా వచ్చి వేదికి వెళ్ళేవాడు. ఏదైనా విప్లవ సాహిత్యం కానీ ఆయుధాలు కానీ దొరుకుతాయని ఆ రోజుల్లో ప్రెసిడెన్సీ కాలేజీ రాజకీయాలకు నిలయంగా మారింది. సుభాష్ బాబు మొదటి నుండి ఆధ్యాత్మిక తత్వం కలిగిన వాడని చెప్పుకుంటున్నాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి మిత్రులు కూడా అటువంటి వారే జత కావడంతో అతనిలోని ఆధ్యాత్మిక తత్వం ఇంకా ఎక్కువయింది. తన తరగతి పుస్తకాలు చదివేవాడు ఒకసారి చదివితే అతనికి గుర్తుండిపోయేవి కానీ చదువు అంటే ఒక వ్యర్థమైన వ్యవహారం అని అతని ఆలోచన ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం కానీ చదువు వల్ల ప్రయోజనం ఏమీ లేదు అనేది అతని భావన తన స్నేహితులతో కలిసి ఇంటింటికి వెళ్లి భిక్ష అడిగేవాడు పేదల కోసం మీరు దానం చేయండి అని ప్రార్థించేవాడు ఆనాడు పేదరకం చాలా ఎక్కువగా ఉండేది. ఆయన తనకు ఉన్నదంతా పేదల కోసం ఖర్చు చేసేవాడు ఇది ఆయనకు పేద ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఒక మంచి కుటుంబంలో నుండి వచ్చిన వారికి ఇటువంటి ఆలోచనలు ఉండడం చాలా అరుదు తన సుఖాలను సంతోషాలను పేదల కోసం చజించడం అనేది చాలా తక్కువ మంది చేయగలరు. బహుశా ఈ సద్గుణమే సుభాష్ బాబును నేతాజీని చేసిందేమో చదువు సంపద అధికారం సుఖాలు ఇవన్నీ వ్యర్థమైన విషయాలు నేను మంచి పని చేయాలి మంచి చేయాలి అంతే అనే మనస్తత్వం అలవడింది సుభాష్ బాబుకు ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడే మూడు నాలుగు రోజులు తిరగడానికి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు ఇంటికి దూరంగా ఉన్నాడు అడిగేవాళ్ళు కూడా ఎవరు లేరు నెలల తరబడి ఇంటికి వెళ్ళేవాడు కాదు కనీసం ఉత్తరం కూడా రాసేవాడు కాదు చాలా చాలాసార్లు కాలేజీలో క్లాసులకు కూడా హాజరయ్యేవాడు కాదు. సేవా కార్యక్రమాల్లోనే ఎక్కువ కాలం గడిపేవాడు. సుభాష్ బాబు తిరుగుబాటు మనస్తత్వం అక్కడ లెక్చరర్లు గమనించారు. సెలవులు ఇస్తే కూడా ఇంటికి వెళ్ళకుండా గ్రామాలకు వెళ్లి పేదలకు సహాయం చేసేవాడు. ఒకసారి ఒక గ్రామానికి సహాయం చేయడానికి మరియు వాళ్ళకు విద్య నేర్పించడానికి సుభాష్ బాబు తన గ్రూప్ తో కలిసి వెళ్ళాడు. గ్రామస్థులు వీళ్ళని కనీసం ఆహ్వానించలేదు పైగా వీరిని చూసి దూరంగా ఉన్నారు కారణం ఏంటని ఆరాధిస్తే అసలు విషయం బయటపడింది. గ్రామస్థులు వీళ్ళను పన్ను వసూలు చేసే అధికారులు అనుకుంటున్నారు. ఆనాటి కాలంలో గ్రామాల కాస్త శుభ్రమైన బట్టలు లేదా సూటు బూటు వేసుకొని వెళితే వారు పన్ను వసూలు చేసేవాళ్లే ఆనాటి కాలంలో ఆంధ్ర ప్రభుత్వం భారతీయుల రక్తం పీల్చి పన్నులు వసూలు చేసేవాళ్ళు పన్నుల పైన పన్నులు వేసి ప్రజలను దోచుకునేవాళ్ళు అందుకని వీళ్ళను గ్రామస్థులు వ్యతిరేకించారు. ఒకసారి కటక్ అంటే ఇంటికి వెళ్ళిన సమయంలో దేశంలో కలగా వ్యాపించి ఉండింది. కలల రోగులకు సేవ చేయడానికి నడుం కట్టాడు మన నాయకుడు. ఆ సమయంలో నిజమైన భారతదేశ చిత్రం సుభాష్ బాబుకు కనిపించింది. చిన్న చిన్న పురుగులు చచ్చినట్టు మనుషులు చూస్తున్నారు. చచ్చిన శవాలను తీసే దిక్కు కూడా లేదు. అసలు ప్రాణాలకు విలువే లేదు. కీటకాలు చచ్చినట్లు మనుషులు చస్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదు. తల్లులు బిడ్డల శవాలను పెట్టుకొని ఏడుస్తుంటే బిడ్డలు తల్లిదండ్రుల శవాలను పెట్టుకొని ఏడుస్తున్నారు. అన్న చెల్లెలు తమ్ముడు తల్లి తండ్రి ఇలా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు కరోనా మహమ్మారికి బెలవుతుంటే ప్రతి ఇల్లు ఒక శోక సముద్రం లాగా తయారయింది. ఆ దృశ్యాలు చూసిన సుభాష్ బాబు చాలా దృఢమైన నిశ్చయానికి వచ్చాడు. బాధకు బదులు సమస్యకు పరిష్కారం వైపు అతని ఆలోచనలు పరుగుపెట్టాయి. ఇది సుభాష్ బాబు వ్యక్తిత్వం సుభాష్ బాబు వ్యక్తిత్వం చాలా గొప్పది ఆయనలోని నాయకత్వ లక్షణాలు ఆయనను కాలేజీ స్టూడెంట్స్ కౌన్సిల్ హెడ్ గా ఎన్నుకున్నారు. అది 1916 ఆంగ్లాన్ని బోధించే ఆంగ్లేయ బోధకుడు మిస్టర్ ఓ కొంతమంది విద్యార్థులను కొట్టాడు. కొంతమందిని బాగా దెబ్బలు తగిలేలా కొట్టాడు. విద్యార్థులు తప్పు లేకుండానే ఈ దండన విధించడం జరిగింది. విద్యార్థులు కారిడార్‌లో నడిచి వెళ్తున్నారు. మిస్టర్ ఓ కి ఇది ఇష్టం లేదు అందుకని కొట్టాడు విషయం స్టూడెంట్స్ కౌన్సిల్ హెడ్ సుభాష్ బాబుకి చేరింది. అతను ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి మిస్టర్ ఓ చేత క్షమాపణ చెప్పించండి లేదా స్టూడెంట్స్ అందరం స్ట్రైక్ చేస్తాం అని చెప్పాడు. మిస్టర్ ఓ డిపార్ట్మెంటల్ హెడ్ అంతేకాకుండా ఆంగ్లేయుడు పైగా కొట్టిందా భారతీయ విద్యార్థులను ఇది పెద్ద విషయం కాదు ఆనాడు సర్వసాధారణమైంది అందుకని ప్రిన్సిపాల్ మిస్టర్ ఓ చేత క్షమాపణ చెప్పించడానికి నిరాకరించాడు. సుభాష్ బాబు మేము స్ట్రైక్ చేస్తున్నామ అని ప్రకటించాడు. స్ట్రైక్ మొదలైంది. పత్రికలన్నీ పతాక శీర్షికతో స్ట్రైక్‌ను గురించి రాశయి వివక్షకు నిదర్శనం ఈ సంఘటన అని కథనాలు విలువరించాయి. ప్రెసిడెన్సీ కాలేజీ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి జరిగింది. అంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన వివక్ష అలవాటయినటువంటి భారతీయ విద్యార్థులు తమ బాధను మింగుకొని మినకుండిపోయేవారు కానీ ఇప్పుడు సుభాష్ బాబు నాయకత్వం మొత్తం విద్యార్థులందరూ కాలేజీని బాయికాట్ చేశారు. ఇదే సుభాష్ బాబులో ఉండే నాయకత్వ పఠిమ. అతను విద్యార్థులతో మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే అతను చెప్పే ప్రతి మాట విద్యార్థుల్లో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుతూ పోరాట పటిమన వెలికి తీసే విధంగా ఉంటుంది. అతని మాటను ఎవ్వరు కాదనడానికి లేకుండా మాట్లాడేవాడు. అంత కన్విన్సింగ్ గా ఉండేది అతని సంభాషణ. అక్కడి నుండి అసలు కథ మొదలైంది. తప్పని పరిస్థితుల్లో మిస్టర్ ఓ క్షమాపణ చెప్పాడు. భారతీయుల విషయంగా అందరూ ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకున్నారు. సుభాష్ బాబుకు కాలేజీలో బయట చాలా ప్రశంసలు అందాయి. విషయం అంతా సద్దుమడిగింది కానీ కొద్ది రోజుల తర్వాత ఇదే సంఘటన మరలా పునరావృత్తం అయింది. మిస్టర్ ఓ మరలా కొంతమంది విద్యార్థులను కొట్టాడు. ఈసారి విషయం తిరగబడింది. విద్యార్థుల్లో ఆత్మగౌరవం పెరిగింది. దాని ఫలితంగా మిస్టర్ ఓ విద్యార్థులను కొట్టగానే ఆ విద్యార్థులు మిస్టర్ ఓ ను తిరగబడి కొట్టారు. ఇదంతా సుభాష్ బాబు ఎదురుగానే జరిగింది. ప్రిన్సిపాల్ సుభాష్ బాబుని పిలిపించి ఎందుకు వెనక దెబ్బ తీశారు అని అడిగాడు. సుభాష్ బాబు ధైర్యంగా సార్ వెనుక దెబ్బ తీయడం పిరికి వాళ్ళు చేసే పని ధైర్యవంతులు ఎప్పుడు ముందు నుండే పోరాడుతారు. మేము వెనక దెబ్బ తీయలేదు ముందు నుండే కొట్టామ అని సమాధానం ఇచ్చాడు. ఆనాటి కాలంలో అధికారులందరూ భారతీయుల వైపే ఉండేవారు కానీ వారి పిరికితనం వల్ల ఆ విషయం బహిరంగంగా ఒప్పుకునేవారు కాదు ప్రిన్సిపాల్ కి సుభాష్ బాబు అంటే ఇష్టమే ఇతను తను చేసిన పనిని బహిరంగంగా ఒప్పుకోవడం వల్ల ప్రిన్సిపాల్ కూడా ఏమి చేయలేకపోయాడు. నువ్వు నాకు చాలా తలనొప్పిగా తయారయ్యావు సుభాష్ ఇంకా ఇప్పుడు నేను ఏమి చేయలేని పరిస్థితి నేను కాలేజీ నుండి ఎక్స్పెల్ చేస్తున్నాను అని ప్రిన్సిపాల్ సుభాష్ బాబును కాలేజీ నుండి తీసివేసాడు. సుభాష్ బాబు ఏమాత్రం జంకకుండా చిరునవ్వుతో ధన్యవాదాలు సార్ అని బయటక వచ్చాడు. అతన్ని కాలేజీ నుండి తీసివేయడమే కాకుండా ఇక ఏ కాలేజీలోనూ అడ్మిషన్ ఇవ్వకుండా చేశాడు. విషయం ఇంట్లో తెలిసింది. ఇంటి పేరు చెడిందని అందరూ చాలా బాధపడ్డారు. ఇప్పటివరకు ఆ కుటుంబంలో ఇటువంటి సంఘటన జరగలేదు. పిల్లవాడి జీవితం నాశనం అయిందని చింతించారు. ఇక ఏ కాలేజీలో కూడా సుభాష్ బాబుకు అడ్మిషన్ ఇవ్వరు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి కుటుంబమైనా ఇలానే బాధపడుతుంది. పిల్లవాడికి ఇంకా భవిష్యత్తు లేదని తెలిసినప్పుడు ఏ కుటుంబమైనా పడే ఆవేదనే ఆ కుటుంబం కూడా అనుభవించింది. సుభాష్ బాబు పై అధికారులకు అపీల్ చేశాడు. విషయం పై అధికారుల దాకా వెళ్ళింది. నిజ నిర్ధారణ కోసం అసుతోష్ ముఖర్జీ అనే ఒక రిటైర్డ్ జడ్జీ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారు. సుభాష్ బాబుకు ఒక మంచి అవకాశం తను క్షమాపణ చెబితే మరలా కాలేజీలోకి తీసుకుంటారు. అందరూ సుభాష్ బాబు తప్పును ఒప్పుకొని క్షమాపణ చెబుతాడు అని సమస్య సద్దు మణగుతుంది అని అనుకున్నారు కానీ కమిటీ ముందు సుభాష్ బాబు తను చేసిన పనిని సమర్ధించుకోవడమే కాకుండా తన వాదనా పటిమతో తన తప్పు లేదని వాదించాడు కాలేజీలో జరుగుతున్న వివక్షను బయట పెట్టాడు. తన వాదన విన్న తర్వాత తనను మరలా కాలేజీలోకి తీసుకుంటారు అని అనుకున్నాడు కానీ అసుతోష్ ముఖర్జీ అతన్ని పూర్తిగా కాలేజీ నుండి తొలగించమని తీర్పు చెప్పాడు ఈ విషయంలో సుభాష్ బాబు చాలా బాధపడ్డాడు. తన భవిష్యత్తు నాశనమైందని చింతించాడు. అక్కడి నుండే సుభాష్ బాబు రాజకీయ రంగ ప్రవేశం మొదలైంది. ఆ సమయంలో కలకత్తాలో బాలగంగాధర్ తిలక్ ఉద్యమం కొనసాగుతూ ఉండేది. 167 సమయంలో హోమ రూల్ స్వరాజ్య ఉద్యమం కొనసాగుతున్న సమయం అది. సరిగ్గా అదే సమయంలో సుభాష్ బాబు అన్న దగ్గర నుండి కటక్ తిరిగి రమ్మని ఉత్తరం వచ్చింది. కటక్ కి తిరిగి వెళ్తూ తాను చేయవలసిన పనుల గురించి ఆలోచించాడు. బాగా లోతుగా ఆత్మ విమర్శ చేసుకున్నాడు. ఆత్మనత భావం అతని నుండి తులిగిపోయింది. ఆ స్థానంలో ఆత్మవిశ్వాసం చోటు చేసుకుంది. తను ఏం తప్పు చేశాడు ఇతరుల హక్కుల కోసం పోరాడాడు అది తప్పు ఎలా అవుతుంది తనను తాను సమాధాన పరుచుకోగలిగాడు. ఇంటికి చేరిన సుభాష్ బాబుకు చాలా చేదైనటువంటి స్వాగతం లభించింది. అందరూ సుభాష్ బాబును తప్పుపట్టారు అయితే సుభాష్ బాబు ఇంతకుముందులా భయపడడం బిడియ పడడం తనలో తనే ఆలోచించుకోవడం అంటే ఇంట్రావర్ట్ గా ఇలాంటివి తన నుండి దూరమైనవి అని గుర్తించాడు. ఇంట్లో వారి మాటలు అతన్ని ఇప్పుడు అంతగా బాధించడం లేదు. ఎలాగు కాలేజీ సీటు రాలేదు. ఖాళీగా కూర్చునే బదలు ప్రజలకు సేవ చేస్తానని నిర్ణయించుకున్నాడు. తను నేర్చుకున్న హోమియో వైద్యం ద్వారా ప్రజలకు సేవ చేయాలని కటక్‌లో హోమియో కిట్ తీసుకొని ప్రజలకు వైద్య సహాయం అందించడం మొదలు పెట్టాడు. వేగు ద్వారా చనిపోయిన అనాధ శవాలకు వారి ధర్మానుసారంగా కణనం క్రియాకర్మలు చేయించేవాడు. సుభాష్ చాలా సున్నితమైన మనసు మానవత్వం కలిగినటువంటివాడు. సాటి మనుషుల బాధలను చూసి తట్టుకోలేకపోయేవాడు. ఒక స్కాటిష్ చర్చ్ కాలేజీలో అతనికి మరలా అడ్మిషన్ దొరికింది. అక్కడ ఇండియన్ ఆర్మీ ఒక కోర్సు నడుపుతోంది సైనిక శిక్షణ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఎన్సిసి అట్లా సుభాష్ బాబు ఆ కోర్సులో కూడా చేరి సైనిక శిక్షణ తీసుకున్నాడు. ఇండియన్ టెర్రిటోరియల్ ఆర్మీలో సుభాష్ బాబుకు శిక్షణ ఇవ్వబడింది. ఇది ఇప్పటి ఎన్సిసి లాంటిదే. అయితే ఆనాడు ఇంకాస్త ఎక్కువగా ట్రైనింగ్ ఉండేది. ఇక్కడ సుభాష్ బాబు చదువు బాగా కొనసాగింది. అక్కడే అతను బిఏ పూర్తి చేశాడు ఎంఏ ఫిలాసఫీ పూర్తి చేశాడు ఇంట్లో వారికి అతని ప్రవర్తన పైన విభేదం ఉన్నా అతని తెలివి తేటల పైన వారికి పూర్తి నమ్మకం ఉండేది. సుభాష్ బాబు అన్న శరత్ చంద్రబోస్ ఇంగ్లాండ్ వెళ్లి ఐసిఎస్ కు ప్రిపేర్ కమ్మని సలహా ఇచ్చాడు. ఐసిఎస్ అనేది అత్యున్నతమైనటువంటి విద్య. భారతీయులు ఐసిఎస్ పూర్తి చేయడం అనేది అసంభవమైన విషయం. అటువంటి కోర్సుకు సుభాష్ బాబును వెళ్ళమన్నారు అంటే సుభాష్ పైన వారికి ఎంత నమ్మకం ఉండేదో ఆలోచించుకోవచ్చు. తండ్రి మాటలు ఇంట్లో వాళ్ళ మాటలు వింటూ సుభాష్ కు ఒక గట్టి పట్టుదల ఏర్పడింది. తనేందో నిరూపించుకోవాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు కదిలాడు. ఈ రోజుల్లో యూపిఎస్స చదవడం ఇంట్లో కూర్చొని చదవచ్చు కానీ ఆనాటి కాలంలో ఐసిఎస్ చదవాలి అనిఅంటే ఇంగ్లాండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళవలసిందే 15 సెప్టెంబర్ 1919న సుభాష్ బాబు ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్ళాడు. ఇంగ్లాండ్‌లో సుభాష్ కు ఇంటి జ్ఞాపకాలు చాలా ఎక్కువగా వచ్చేవి అయితే కేంబ్రిడ్జ్ వాతావరణం సుభాష్ బాబుకు బాగా నచ్చింది. అక్కడ భారతీయులకు మంచి గౌరవం లభించేది. భారతుల లాగా భారతీయులను తక్కువగా చూసేవాళ్ళు కాదు అక్కడ పుస్తకాలు చదువుకోవడానికి చాలా లభించేవి సుభాష్ బాబు పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటు భారతదేశంలో భారతీయులను హీనంగా చూస్తారు. ఇంగ్లాండ్‌లో భారతీయులను సమానంగా చూస్తారు ఇది ఎలా సాధ్యం అనచయతకు గురి అయితే అణగారిపోయిన వాళ్ళను హీనంగానే చూస్తారు అనే సత్యం సుభాష్ బాబుకు బాగుపడింది. సుభాష్ బాబు రాత్రింబవళ్ళు ఐసిఎస్ పూర్తి చేయడానికి శ్రమించాడు. చాలా మందికి కనీసం సంవత్సరం రోజులు పట్టే ఈ కోర్సు సుభాష్ బాబు ఆరు నెలల్లోనే పూర్తి చేశాడు. ఇక్కడ ఒక సంఘటన చెప్పుకోవాలి ఐసిఎస్ పరీక్షా ఫలితాలు వచ్చిన రోజు ఫలితాలు చూసుకున్న సుభాష్ బాబు చాలా నిరాశకలోనయ్యాడు లిస్ట్ లో అతని పేరు లేదు. సరే ఈ అంకం ముగిసింది ఇక మూటాములా సద్దుకొని భారత్ తిరిగి వెళ్ళాలి అని నిర్ణయించుకొని తన గదికి వెళ్లి హాయిగా నిద్రపోయాడు. ఆయన స్నేహితుడు ఒకడు వచ్చి సుభాష్‌ని నిద్రలేపి శుభాకాంక్షలు తెలిపాడు. సుభాష్ ఆశ్చర్యంగా ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నావ్ నా పేరు లిస్ట్ లో లేదు కదా అన్నాడు అరే నీ పేరు సాధారణ పాస్ లిస్ట్ లో లేదు టాపర్స్ లిస్ట్ లో నీ పేరు ఉంది అని మిత్రుడు చెప్పాడు. ప్రపంచంలో అతి పెద్ద కోర్సు అన్నింటికంటే కఠినమైన పరీక్ష అటువంటి పరీక్షలో టాపర్ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉంది సుభాష్ బాబు పేరు ఆనాటి కాలంలో గవర్నర్లు వైస్రాయులు మొదలైన అత్యున్నత పదవుల్లో ఉండే వారందరూ ఐసిఎస్ పాస్ అయి వచ్చిన వాళ్లే కానీ సుభాష్ బాబు చాలా విచిత్రమైన మనస్తత్వం కలిగినవాడు చాలా ఆలోచించాడు ఏ నిర్ణయం తీసుకోవాలో అనే దాని పైన చాలా లోతుగా విశ్లేషించుకున్నాడు తన అన్న అన్న శరత్ చంద్రబోస్‌కు ఒక లేఖ రాశడు అది 17 పేజీల లేఖ దాని సారాంశం మాత్రం నేను ఇక్కడ వివరిస్తాను. నేను ఆంగ్లేయుల దోపిడి వ్యవస్థలో భాగస్తుడిని కాదలుచుకోలేదు. నాకు ఐసిఎస్ లో చేరాలని లేదు కానీ నన్ను నేను నిరూపించుకోవడానికి మాత్రమే నేను ఐసిఎస్ చేరాను నేను ఐసిఎస్ పదవిలో చేరను అని లేఖ సారాంశం ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎవరైనా ఐఏఎస్ పాస్ వదిలివేస్తారా ఎవ్వరు వదలరు సుభాష్ బాబు తన దేశం కోసం తన దేశానికి సేవ చేయడానికి ఐసిఎస్ ను తిరస్కరించాడు. నేను రాజకీయాల్లో చేరి దేశ సేవ చేస్తాను. ఈ రాజకీయాల ద్వారానే నా దేశ అభివృద్ధికి పాటుపడతాను అని నిర్ణయం తీసుకున్నాడు. ఆలోచించండి ఐసిఎస్ వదిలాడు అంటే వినేవాళ్ళు ఏమంటారు వీడికి ఏమైనా పిచ్చా అటువంటి అత్యున్నతమైన పదవి లభిస్తూ ఉంటే వద్దంటాడు వీడు కాస్త విపరీత ధోరణ కలిగినవాడు అంటారు కదా కానీ ఎవరేమన్నా తను ఏం చేయదలుచుకున్నాడో ఆ కార్యాన్ని చేయడానికి దృడనిశేయుడు అయినాడు. తన దేశాన్ని ఏ విధంగా తీర్చి దిద్దాలో అతనికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. తను అనుకున్న ఆశయం కోసం ముందుకు సాగడంలో ఐసిఎస్ అడ్డంకి కాకూడదు. తను ఇంకా ప్రజా జీవితంలోనే ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాడు. సోల్జర్స్ హూ ఆల్వేస్ రిమైన్ ఫెత్ఫుల్ టు దర్ nేషన్ హూ ఆర్ ఆల్వేస్ ప్రిపేర్డ్ టుసాక్రిఫైస్ దర్ లైవ్స్ ఆర్ ఇన్విన్సిబుల్ సైనికులు తమ దేశం పట్ల ఎల్లప్పుడూ చాలా నమ్మకంగా ఉంటారు. వారు తమ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సదా సిద్ధంగా ఉంటారు. 1922 నుండి 1945 వరకు అంటే ఆయన అదృశ్యమయ్యేంత వరకు జరిగిన సంఘటనలని ఇప్పుడు చూద్దాం.ఆ ఆ సమయంలో భారతదేశంలో ఉన్న పరిస్థితులు చరిత్ర వీటన్నింటిని ఇక్కడ మనం చర్చిద్దాం. భారతదేశానికి స్వాతంత్రం నేతాజీ వల్లే వచ్చింది అని ఈ విషయాన్ని నిరూపిస్తూ మన ది మదన్ గుప్త YouTube ఛానల్ లో ఇంతకుముందే రెండు వీడియోలు విడుదల చేశం. ఆ వీడియోలు కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు లింక్ ఇవ్వబడుతుంది అవి కూడా చూడండి. మనకు స్వాతంత్రం వచ్చే సమయానికి ఇంగ్లాండ్ ప్రధాని అట్లీ ఆయన 1945 నుండి 1951 వరకు ఆయన ఇంగ్లాండ్ ప్రధానిగా ఉన్నాడు. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత స్వాతంత్రం ఆరడం కంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిన తర్వాత 1956 లో ఆయన భారత్‌లో పర్యటించడానికి వచ్చాడు. ఆయన కలకత్తా గవర్నర్ జస్టిస్ పివి చక్రవర్తికి అతిధిగా రెండు రోజులు ఉన్నాడు. పివి చక్రవర్తి ఆయనతో చర్చించిన విషయాలను ఒక లేఖగా వ్రాశాడు. ఆ లేఖ సారాంశం మనం ఇప్పుడు చూద్దాం. మీరు భారత్ ను ఎందుకు వదలవలసి వచ్చింది 1947 సమయానికి మీకు ఏ సమస్యలు లేవు కదా రెండవ ప్రపంచ యుద్ధంలో మీరు గెలిచారు క్విట్ ఇండియా ఆందోళన అణగారిపోయింది. మీకు కావలసిన మద్దతు లభించింది. మీ పాలనా వ్యవస్థలన్నీ ఇక్కడ చాలా బలంగా వేళ్ళూనుకొని ఉన్నాయి. ఇంకో 100 సంవత్సరాలు మీరు మీ పాలనను ఇక్కడ కొనసాగించగలిగేవారు కదా అటువంటి పరిస్థితుల్లో మీరు భారత్ ను ఎందుకు వదిలారు అని ప్రశ్నించాడు. అందుకు అట్లీ సమాధానం ఇస్తూ సుభాష్ చంద్రబోస్ కారణం అని చెప్పాడు. 1945లో సుభాష్ చంద్రబోస్ అదృశ్యమైన తర్వాత భారతదేశ సైన్యం నావీి బ్రిటిష్ వారి కోసం పనిచేసే ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అన్నీ తిరుగుబాటు ప్రకటించాయి. ఇక ఆలస్యం చేస్తే ప్రజలు తిరుగుబాటు జరుగుతుంది. ఒక్క బ్రిటిష్ పౌరుడు కూడా భారత్ వదిలి వెళ్ళలేడు అటువంటి పరిస్థితుల్లో భారత్ ను వదలక తప్పలేదు అని అట్లీ సమాధానం ఇచ్చాడు. ఇండియన్ నేవీ షిప్స్ పైన సుభాష్ చంద్రబోస్ చిత్రాలు అతికించారు. కాన్పూర్ కరాచీ మొదల అన్ని చోట్ల ఉన్న నావీ షిప్పుల పైన సుభాష్ చంద్రబోస్ చిత్రాలు అతికించడమే కాకుండా సైనికులందరూ ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరి తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. సుభాష్ చంద్రబోస్ అదృశ్యం కాకుండా ఉంటే భారతదేశానికి బహుశా ఆయనే మొదటి ప్రధాని అయ్యేవాడేమో భారతదేశపు దశ దిశ మరో రకంగా ఉండేది. ఐసిఎస్ టాపర్ అయి కూడా ఐసిఎస్ ని వదులుకున్నాడు. ఇంగ్లాండ్ నుండి తిరిగి భారత్ వచ్చాడు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ కొద్దిగా చరిత్ర చెప్పుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధంలో మహాత్మా గాంధీ భారత ప్రజలను బ్రిటిష్ వారికి సహాయం చేయమని కోరాడు. దీనికి ప్రతిగా ఆంగ్లేయులు గాంధీకి ఇచ్చింది ఏమ లేదు. ఆ తర్వాతే జలియన్ వాల భాగవదంతం జరిగింది. ఆ తర్వాత 1920 గాంధీ సహాయ నిరాకరణమాన్ని మొదలుపెట్టాడు. 19 22 లో చోరీ చోరా సంఘటన జరుగుతుంది. ఆంగ్లేయులు దౌష్ట్యాన్ని ఎదుర్కునేందుకు భగత్ సింగ్ రాజ్‌గురు చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవ్యులు తయారైనారు. ఈ నేపథ్యంలోనే సుభాష్ చంద్రబోస్ ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చి క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టాడు. భారత్ తిరిగి వచ్చిన తర్వాత ఆ సమయంలో చిత్తరంజన్ దాస్ స్వరాజ్య పార్టీని స్థాపించి ఎలక్షన్స్ లో గెలిచాడు. ఈ ఎన్నికలు ఆంగ్లేయుల పాలనా విధానంలో ఒక భాగం 1923 లో భారత్ తిరిగి రాగానే చిత్తరంజన్ దాస్ ఆధ్వర్యంలోని స్వరాజ్య పత్రికను నడిపే బాధ్యత బోస్ తీసుకున్నాడు. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ గాను బెంగాల్ స్టేట్ కాంగ్రెస్ కు సెక్రెటరీ గాను బాధ్యతలు స్వీకరించాడు ఫార్వర్డ్ అనే న్యూస్ పేపర్లు జర్నల్స్ విలువరించాడు వీటన్నిటికీ చిత్తరంజన్ దాస్ ఆర్థిక సహాయం అందించేవాడు. ఆ సమయంలో 10 సార్లు జైలుకు వెళ్ళాడు సుభాష్ బాబు 11వ సారి జైలు శిక్ష విధించినప్పుడు సుభాష్ చంద్రబోస్ భారతదేశం వదిలి ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు. ఈ విషయం గురించి కాస్త తర్వాత చెప్పుకుందాం. బ్రిటిష్ వారికి బోస్ కంట్లో నలకలాగా తయారైనాడు. బోస్ ను చంపడమో లేకపోతే జైళ్లలో ఉంచడమో చేయాలని బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించుకున్నారు. 1924 లో క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొని కలకత్తా మేయర్ గా ఎన్నుకోబడ్డాడు సుభాష్ బాబు స్వరాజ్యం కోసం చేసే పోరాటంలో సుభాష్ బాబు చాలా క్రియాశీలక పాత్ర పోషించడం వల్ల అదే సంవత్సరం ఆయనను బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి మాండలి జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు క్షయ వ్యాధి సోకింది. 1927 లో ఆయన విడుదలయిన తర్వాత నేషనల్ కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రెటరీగా ఎన్నుకోబడ్డాడు. నెహ్రూతో కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. 1928 చివర్లో బోస్ జాతీయ కాంగ్రెస్ మీటింగ్ ను కలకత్తాలో ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత సివిల్ డిసోబిడియన్స్ కింద బోస్ మరలా అరెస్ట్ చేయబడ్డాడు. మరలా 1930 లో కలకత్తా మేయర్ గా ఎన్నికయ్యాడు. గాంధీ మరియు బోస్ వాళ్ళ మధ్య విభేదాలు చాలా ఎక్కువగానే ఉండేవి కానీ అవి వ్యక్తిగత విభేదాలు కావు ఆ విభేదాలు సైద్ధాంతిక పరమైన విభేదాలు గాంధీది అహింసా సిద్ధాంతం కానీ బోస్ ది దానికి వ్యతిరేకం 1929లో జరిగినటువంటి అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ మీటింగ్ లాహోర్‌లో జరిగింది. ఆ మీటింగ్ లో భారత్ కు పూర్తి స్వాతంత్రం సంపాదించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సహాయ నిరాకరణోదమం ఉప్పు సత్యాగ్రహం రౌండ్ టేబుల్ సమావేశం అరెస్టులు ఇవన్నీ జరిగాయి. వీటన్నిటి తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ని తీసుకొచ్చింది. పూర్తి స్వాతంత్రం అంటున్న కాంగ్రెస్ కు ఇది ఒక ఆశ చూపించడం లాంటిది. పూర్తి స్వాతంత్రం కాకుండా కొంత స్వాతంత్రాన్ని ఇవ్వడం ఎన్నికల ద్వారా ప్రతినిధులను ఎన్నుకోవడం ఎన్నికైన ప్రతినిధుల సలహాతో ఆంగ్లేయులు పాలించడం పగ్గాలన్నీ తమ చేతిలో పెట్టుకొని వీళ్ళకు లాలిపాప్‌లు ఇచ్చింది. 1935లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నెక్కింది. 1935 లోనే రెండవ ప్రపంచ యుద్ధం మొదలయింది. అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ పూర్తి స్వాతంత్రం కోసం అని పట్టుపడదాం అని సుభాష్ చంద్రబోస్ చెప్పాడు కానీ గాంధీ అందుకు అంగీకరించలేదు 39లో కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు జరిగాయి. అప్పటికే సుభాష్ బాబు పేరు కాంగ్రెస్ లో మారుమోగిపోతుంది. ప్రజల్లో సుభాష్ బాబు తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ ఎన్నికల్లో గాంధీ పట్టాభి సీతారామయ్యను కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నిలబెట్టాడు. అంతేకాకుండా పట్టాభి గెలుపు నా గెలుపు అని ప్రకటించాడు. పట్టాభి సీతారామయ్యకు పోటీగా సుభాష్ చంద్ర బోస్ ప్రెసిడెంట్ గా నిలబడి గెలుపొందాడు. అది గాంధీకి తీరని వ్యదన కలిగించింది. సంపూర్ణ స్వరాజ్య సాధనకు చేయవలసిన ఉద్యమం కోసం సుభాష్ చంద్రబోస్ ప్రణాళికలు సిద్ధం చేశాడు కానీ నెహ్రూ, గాంధీ పటేల్ వల్ల ఈ ముగ్గురి వల్ల ఉద్యమం మొదలు పెట్టకుండానే ఆగిపోయింది. సుభాష్ చంద్రబోస్ తన ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఈ విషయంపై గాంధీ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ లో అనేకమంది నాయకులు అసంతృప్తిగా ఉండేవారు. వారందరితో కలిసి 22 జూన్ 1939న సుభాష్ బాబు బెంగాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ను స్థాపించాడు. కాంగ్రెస్ అనవసరంగా హిందూ ముస్లిం ఐక్యతను గురించి ఎక్కువ దృష్టి పెడుతూ ఉంది. అది అనవసరమైన విషయం. భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యత ఉంది దాని గురించి ఆలోచించవలసిన పని లేదు అనేది సుభాష్ బాబు అభిప్రాయం. గాంధీ తర్వాతి కాలంలో నేతాజీ ఔన్నత్యాన్ని త్యాగాన్ని సాహసాన్ని గుర్తించాడు. నా శవం మీదనే దేశ విభజన జరగాలన్న గాంధీ దేశ విభజన జరిగిన తరువాత నా బిడ్డ బోస్ ఇప్పుడు ఉంటే దేశ విభజన జరిగేది కాదు అని అన్నాడు. నేతాజీ గాంధీ పైన ఉన్న గౌరవానికి చనంగా తన సైన్యంలోని ఒక రెజిమెంట్ కు గాంధీ పేరు పెట్టాడు. పోరాట సమయం 1940 43 సుభాష్ చంద్రబోస్ మరలా అరెస్ట్ చేయబడ్డాడు. ఆయన ఆరోగ్యం బాగలేని కారణంగా ఆయన విడుదల చేయబడ్డాడు. ఇక్కడి రాజకీయాలతో ఇక్కడి రాజకీయ నాయకులతో విసిగిపోయి ఉన్నాడు. తనే భరతమాత విముక్తికి మరో మార్గాన్ని ఎంచుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. తన ఆరోగ్యం బాగుపడిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మళ్లా అరెస్ట్ చేస్తారు. ఇంటి చుట్టూ బ్రిటిష్ వాళ్ళు కాపలా ఉంచారు. తన ప్రతి కదలికను బ్రిటిష్ వాళ్ళు గమనిస్తున్నారని సుభాష్ బాబుకి తెలుసు అందుకని 1941 జనవరి 17 అర్ధరాత్రి దాదాపుఒటిన్నర గంటల సమయంలో పఠాన్ వేషం వేసుకొని తన అన్న సహాయంతో సుభాష్ బాబు తప్పించుకున్నాడు. కలకత్తా నుండి ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని అక్కడి నుండి రష్యా చేరుకున్నాడు. రష్యాలో స్టాలిన్ ను కలిసి భారతదేశ స్వాతంత్రం కోసం సహాయం చేయమని కోరాడు. తనను తాను పాలించుకునే స్థితి భారత్‌కు లేదని స్టాలిన్ తిరస్కరించాడు. రష్యా తన అభ్యర్థను తిరస్కరించిన ఆయన పట్ల చాలా గౌరవాన్ని చూపింది. అంతేకాకుండా సుభాష్ బాబుకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించింది. జర్మనీ చేరేందుకు కావలసిన ఏర్పాట్లు కూడా చేసింది. అక్కడి నుండి జర్మనీ చేరుకున్న సుభాష్ బాబు జర్మనీలో హిట్లర్ ను కలిశాడు. హిట్లర్ తన పూర్తి సమ్మతిని తెలియజేయకపోయినా సుభాష్ బాబును రెఫ్యూజీగా ఉండి తన ప్రయత్నాలు తాను కొనసాగించేందుకు చివరకు ఒప్పుకున్నాడు. అక్కడి నుండి సుభాష్ బాబు ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేయడంలో నిమగ్నమయ్యాడు. యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డ భారతీయ సైనికులను ఒప్పించి భారత స్వాతంత్రం కోసం పోరాడడానికి సిద్ధం చేశాడు. జర్మనీ 3వేల మంది సైనికులను సుభాష్ బాబుకు అప్పగించింది. భారత్ నుండి తప్పించుకున్న తర్వాత భారత ప్రజల్లో నేతాజీ ఏమయ్యాడో అనే ఆందోళన ఎక్కువయింది. గొప్ప నేత స్వాతంత్రం ఆయనే తీసుకువస్తాడని ప్రజలందరూ నమ్మారు. ఒక్కసారిగా ఆయన అదృశ్యం అవ్వడంతో భారత ప్రజానీకం చాలా నిరాశకులుంది. ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత మొదటిసారిగా సుభాష్ చంద్రబోస్ బెర్లిన్ రేడియో నుండి భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. నేను సుభాష్ చంద్ర బోస్ ను మాట్లాడుతున్నాను నేను సజీవంగానే ఉన్నాను త్వరలోనే భారతదేశాన్ని విముక్తం చేస్తాను అని ప్రకటించాడు. భారత ప్రజల ఆనందానికి అంతు లేదు అందరి ఆశలు నమ్మకాలు సుభాష్ బాబు పైనే ఈ ప్రకటన వినడంతోటే అందరి కళ్ళ నుండి ఆనందాశ్రువులు రాలాయి. జర్మనీ నుంచి భారత్‌లోని ఆంగ్లేయులతో యుద్ధం చేయడం చాలా కష్టం. ఆ సమయంలో బ్రిటిష్ కు వ్యతిరేకంగా జపాన్ కూడా యుద్ధం చేస్తుంది. జపాన్ నుండి తన కార్యం సాధించుకోవాలని జర్మనీ సహాయంతో జలంతర్గామిలో 26 రోజులు ప్రయాణం చేసి జపాన్ చేరాడు. ఆ తర్వాత ఆయన రాస్ బిహారీ బోస్ ను కలవడం జరిగింది. అప్పటికే రాస్ బిహారీ బోస్ ఒక ఆర్మీని సిద్ధం చేసి ఉన్నాడు. రాస్‌బిహారి ఆశయం కూడా నేతాజీ ఆశయమే రాస్‌బిహారి అభ్యర్థనతో ఆ సైన్యానికి నేతృత్వం వహించడానికి నేతాజీ సమ్మతించాడు. ఆ సైన్యమే ఆజాద్ హిందూ ఫౌస్ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆ కాలంలో స్త్రీల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. వారిని ఉద్ధరించడం తన మొదటి కర్తవ్యంగా నిర్ణయించుకున్నాడు నేతాజీ తన ఆజాద్ హిందూ హౌస్ లో మొదటి రెజిమెంట్‌ను ాన్సీ రాణి జ్ఞాపకార్థం రాణి ఆఫ్ జాన్సీ రెజిమెంట్ గా నామకరణం చేసి మొదలు పెట్టాడు. ఆ రెజిమెంట్ కు కమాండర్ గా లక్ష్మీ స్వామినాథన్ నియమితురాలయింది. ఇది పూర్తిగా స్త్రీల సైన్యం దేశ స్వాతంత్రంలో స్త్రీలు కూడా భాగం పంచుకోవాలి అనేది నేతాజీ ఆశయం. జపాన్ నుండి మయన్మార్ అంటే నేటి బర్మ కోహిమాల మీదుగా భారత సైన్యం ఇంపాల్ చేరుకుంది. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకొని ముందుకు నడుద్దాం. సైన్యం నడిచే దారిలో ఉన్న గ్రామాలు నగరాల్లో నేతాజీ సైన్య సమీకరణ సైన్యం కోసం ధన సమీకరణ చేసేవాడు. ఆయన నిలబడి ఉపన్యాసం ఇస్తే ప్రజలు తండోపదండాలుగా వచ్చేవారు స్త్రీలు వారి వంటి మీద నగలన్నీ తీసి భారత స్వాతంత్ర నిధికి సమర్పించేవారు తుమహారా కూన్ ముజేదో మై తు తుంకో ఆజాది దుంగా మీ రక్తం నాకు ఇవ్వండి మీకు స్వాతంత్రం నేను ఇస్తాను. జై హింద్ అని గర్జించేవాడు ఈ జై హింద్ అనే నినాదం ఏదైతే ఉందో అది నేతాజీ ఇచ్చిందే హిందువులు ముస్లింలు అనే తేడా ఉండేది కాదు. ఐన్ఏ లో చాలా మంది ముస్లింలు పని చేసేవాళ్ళు ఐఎన్ఏలో చాలామంది కమాండర్లు ముస్లింలు బర్మాలో సైనికనిధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో నేతాజీ మాట్లాడిన తర్వాత ఒక ముస్లిం లేచి తన ఆస్తి అంతా ఒక కోటి రూపాయలు ఉంటుందని తన ఆస్తి మొత్తాన్ని అయ్యన్ఏ నిధికి ఇస్తున్నానని ప్రకటించాడు. నేతాజీ అతన్ని దగ్గరకు పిలిచి ఉన్నదంతా దేశం కోసం ఇస్తే నీ కుటుంబం గడిచేది ఎలాగు అని అడిగాడు. అందుకు అతడు నేను నా కుటుంబం అంతా సైన్యంలోనే చేరి దేశమాత విముక్తి కోసం పోరాడతాం అని సమాధానం చెప్పాడు. నేతాజీకి వేసే మాల ఆనాటి కాలంలో ఒక పైసా ఉండేది. ఉపన్యాసం అయిన తర్వాత ఆ మాలను వేలం వేసేవాళ్ళు ఒక్కొక్క మాల 15 నుంచి 20 రూపాయల వరకు పాడేవాళ్ళు. అలా ఆయన సైన్య ధన సమీకరణలు చేస్తూ సైన్యాన్ని ముందుకు నడిపేవాళ్ళు. మొట్టమొదటగా బర్మాను ఆక్రమించుకున్నారు. దురదృష్ట వశాత్తు జపాన్ బ్రిటన్ చేతిలో ఓడిపోయింది. అలాగే అజాద్ హింద్ ఫౌజ్ కూడా బ్రిటిష్ సైన్యం చేతిలో ఓడిపోయింది. అనేకమంది అజాద్ హింద్ ఫౌజ్ సైనికులను సైన్యాధిపతులను భారత్‌లోని బ్రిటిష్ సైన్యం యుద్ధ ఖైదీలుగా పట్టుకుంది. వారి పైన కేసులు పెట్టి వారిని శిక్షించే ప్రక్రియకు భారత్‌లోని బ్రిటిష్ ప్రభుత్వం తెరవేసింది. వీటినే రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ అని పిలుస్తారు. ఈ రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ లో చాలా ప్రముఖమైనది ఐఎన్ఏ సైన్యాధిపతుల పైన జరిపిన ట్రైల్స్ షానవాజ్ హుసేన్ గురుబక్ష సింగ్ తిల్లో బికే సహగల్ వీరి పైన జరిగిన ట్రైల్స్ చాలా ముఖ్యమైనయి. ఈ ట్రైల్స్ కు విరుద్ధంగా అటు ప్రజల్లో ఇటు బ్రిటిష్ సైన్యంలోని భారత సైనికుల్లోనూ చాలా ఆక్రోశం ఉండేది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. తను ఏమి చేయకపోతే తమ పరువు పోతుందని కాంగ్రెస్ అయ్యన్ఏ తరపున వాదించడానికి సిద్ధపడింది. నెహ్రూ సైతం నల్లకోటు వేసుకొని కోర్టుకు హాజరయ్యాడు. ఇదంతా ప్రజలను మోసం చేయడానికి తప్ప కాంగ్రెస్ కి ఎటువంటి సానుభూతి లేదు. అది ఎలక్షన్లు జరగబోయే సమయం ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి అందుకోసం కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ ఇది. ఈ విషయాన్ని గురించి భారతదేశ స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది అనే పేరుపైన ఉన్న నేను ప్రత్యేకంగా రెండు వీడియోలు చేసిున్నాను మీరు అవి మన మదన్ గుప్త ఛానల్ లో చూడొచ్చు. కింద డిస్క్రిప్షన్ లో వాటి లింక్స్ ఇవ్వబడ్డాయి. 1946 లో జరిగిన ఈ ట్రైల్స్ వల్ల భారత సైన్యంలో తిరుగుబాటు వచ్చింది. 1857 పరిస్థితులు మడలా తల ఎత్తేలా కనిపించాయి. 145 లో సుభాష్ చంద్రబోస్ ప్రయాణిస్తున్నటువంటి విమానం ప్రమాదానికి గురి అయింది. అందులో ఉన్న నేతాజీ మరణించారు. కానీ ఈయన మరణం వెనుక ఇప్పటివరకు చేదించబడని రహస్యాలు అనేకం దాగి ఉన్నాయి. అందుకని నేతాజీ మరణం అనే దానికంటే మనం నేతాజీ అదృశ్యం అనే పదం వాడడం బాగుంటుంది. ఈ అదృశ్యం తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడు కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటి 1955 లో ఏర్పాటు చేయబడింది. దాన్ని షానవాస్ కమిషన్ అని పిలుస్తారు రెండవ కమిషన్ 1970 లో ఏర్పాటు చేయబడింది. దాని పేరు కోస కమిషన్ షానవాస్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేతాజీ విమాన ప్రమాదంలో మరణించాడు. ఆయన శరీరం థర్డ్ డిగ్రీ బర్న్స్ కు గురయింది. ఇదే విషయాన్ని 1970 లో ఏర్పాటైన కోస్లా కమిషన్ కూడా నిర్ధారించింది. కానీ 1999 లో ఏర్పాటైన ముఖర్జీ కమిషన్ 2005లో తన నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ముందు కమిషన్ల నివేదికకు పూర్తి విరుద్ధంగా ఉంది. అసలు విమాన ప్రమాదమే జరగలేదని జరగని ప్రమాదంలో నేతాజీ మరణించడం అనేది అవాస్తవమని ఈ నివేదిక పేర్కొంది. ముందరి రెండు కమిషన్లు తైవాన్ గవర్నమెంట్ ను అసలు సంప్రదించనే లేదు. తైవాన్ను సంప్రదించిన ముఖర్జీ కమిషన్ 18 ఆగస్టు 1945న ఏ విమాన ప్రమాదం జరగలేదు అని సరే మరణించని సుభాష్ చంద్రబోస్ ఏమయ్యాడు? ఈ విషయంపై అనేక కథనాలు వెలుగు చూసాయి చాలామంది ఆయనను రష్యాలో లేబర్ క్యాంపులకు తీసుకెళ్ళారని ఆయన అక్కడే మరణించాడని కథనాలు రాశారు కానీ ఈ కథనానికి ఏ ఆధారం లేదు. అనుజద్దరు చేసినటువంటి పరిశోధనల్లో నేతాజీ అదృశ్యమైన తర్వాత సన్యాస జీవితాన్ని గడిపాడని గుమనామి బాబా అనే పేరుతో ఆయన భారత్‌లోనే అయోధ్యలో జీవించాడని నిరూపించారు. అనుజ గారు చేసిన పరిశోధన చాలా వరకు ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది. ఎందుకంటే గుమనామి బాబా ఎవరికీ తన ముఖం చూపించేవాడు కాదు. ఆయన చనిపోయినప్పుడు ఆయన పెట్టెలో దొరికిన కొన్ని వస్తువులు కొన్ని స్వదస్తూరితో రాసిన లేఖలు దొరికాయి. ఆ లేఖలను నేతాజీ దస్తూరితో ప్రపంచ ప్రఖ్యాత సెఫాలజిస్ట్ ద్వారా పరిశీలింపజేశారు. రెండు వ్రాతలు ఒకటే అని ఆ సెఫాలజిస్ట్ నిర్ధారణ చేశాడు. అంతేకాకుండా కొన్ని వస్తువులు కూడా నేతాజీ ఉపయోగించిన వస్తువులను పోలి ఉన్నాయి. మనం ముందు నుండి చెప్పుకున్నాం నేతాజీకి ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఇష్టం అని బహుశా తను పరాజయం పొందాడని ఈ నిర్ణయం తీసుకున్నాడేమో కానీ ఆయన వల్లనే దేశానికి స్వాతంత్రం లభించింది అనేది మాత్రం నిర్వివాదాంశం. ఏది ఏమైనా అటువంటి మహానాయకుడు భారత రాజకీయాలకు దూరం కావడం మాత్రం భారతదేశ దురదృష్టం ఇంత గొప్ప మహానాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకు దక్కలేదు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎర్రకోటలో ఆయన స్మారకాన్ని స్థాపించడం ఆయనకు నివాళి అర్పించడం ఆహ్వానించదగ్గ పరిణామం నేను నా శ్రీమతి అయోధ్య వెళ్ళాం. అక్కడ గుమనామి బాబా కూడా సుభాష్ చంద్ర బోస్ గారి సమాధిని దర్శించాం సమాధి చుట్టూ తిరిగాం సుభాష్ చంద్రబోస్ గారికి నివాళలు అర్పించాం. మిత్రులారా అనుజదార్ గారి వీడియోలు చూడండి. మీకు కొంత అవగాహన ఈ విషయం మీద వస్తుంది. మిత్రులారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవ మరి ఇదంతా రీసెర్చ్ చేసి వీడియోగా తీసుకురావడానికి అనేకమైన ఆర్థిక ఒడుదుడుకులను ఎదుర్కుంటూ ఉన్నాం మేము ఒక్కొక్కసారి ఈ ప్రయత్నాన్ని ఆపేద్దామా అనే ఆలోచన కూడా మనసులో మెదులుతుంది. అయినా నేను చేయగలిగినంత చేద్దామని ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మీ ఆర్థిక సహాయం మాకు ఎంతైనా అవసరం వీడియోలో చూపించినటువంటి అకౌంట్ కి కానీ లేదా బార్కోడ్ ని స్కాన్ చేసి కానీ మీ సహాయ ధనరాశిని మాకు పంపించవచ్చు. మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మన ది మదన్ గుప్తా ఛానల్ ని వెంటనే సబ్‌స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్‌స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మా వీడియోలు విడుదల అయినప్పుడల్లా మీకు సందేశం వస్తుంది మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి మీ మిత్రులకు కూడా మన డి మదన్ గుప్త ఛానల్ ను పరిచయం చేయండి జై హింద్ జై మా భారతి నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్త
No comments:
Post a Comment