🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏
*🌼 ఒక యోగి ఆత్మకథ-21*
*(🖌️రచన :- శ్రీ పరమహంస యోగానంద)*
*🌼5-అధ్యాయం*
*🌼“గంధబాబా”/అద్భుతాల ప్రదర్శన*
చిన్న ఆపరేషన్లు చేసేటప్పుడు వైద్యులు, మత్తుమందు ఇస్తే అపాయానికి గురికాగల వ్యక్తుల విషయంలో, సమ్మోహన శక్తినే ఒక విధమైన మానసికమైన మత్తుమందుగా ఉపయోగిస్తారు. కాని ఇది, తరచుగా సమ్మోహన స్థితికి గురి అయే వాళ్ళకి హాని చేస్తుంది. కొంతకాలం గడిచేసరికి, వ్యతిరేక మానసిక పరిణామం ఒకటి, మెదడులోని కణాల్ని అస్తవ్యస్తం చేస్తుంది. సమ్మోహనమన్నది ఇతరుల చేతనా పరిధిలోకి అనధికారంగా ప్రవేశించడం.
దీని తాత్కాలిక దృగ్విషయాలకీ దివ్యసాక్షాత్కారం పొందినవాళ్ళు చూపే అద్భుత శక్తులకూ పోలిక లేదు. భగవత్పరమైన జాగృతి పొందిన నిజమైన సాధువులు, సృజనాత్మక విశ్వస్వాప్నికుడికి అనుగుణంగా శ్రుతి కలిపి, తమ ఇచ్ఛాశక్తితో ఈ స్వాప్నిక ప్రపంచంలో మార్పులు తీసుకువస్తారు.
గంధబాబాగారి లాటివాళ్ళు ప్రదర్శించే అద్భుత చర్యలు చూసి తీరవలసినవే అయినా, అవి ఆధ్యాత్మికంగా నిరుపయోగమైనవి. వినోదం చేకూర్చడానికి మించి వీటికి వేరే ప్రయోజనం ఏమీ లేకపోవడంవల్ల ఇవి, దేవుడికోసం జరిపే తీవ్రమైన అన్వేషణను పక్కలకి మళ్ళిస్తాయి.
అసామాన్య శక్తుల ఆడంబర ప్రదర్శనను గురువులు నిరసించారు. అబూ సయీద్ అనే పారశీక మార్మికుడు, నీటిమీదా గాలిలోనూ అంతరిక్షంలోనూ తాము ప్రదర్శించగల అద్భుతశక్తుల్ని చూసుకొని గర్వించే కొందరు ఫకీర్లను చూసి నవ్వాడు.
“నీళ్ళలో కప్ప కూడా హాయిగానే ఉంటుంది!” అంటూ మెత్తని మందలింపుతో ఎత్తిపొడిచాడు అబూ సయీద్, “కాకీ రాంబందూ గాలిలో సులువుగా ఎగురుతాయి. సైతాను తూర్పునా పడమటా కూడా ఒకేసారి కనిపిస్తాడు.
నిజమైన మానవుడు ఎవడంటే, తన తోటివాళ్ళలోనే ధార్మిక జీవనం గడుపుతూండేవాడూ, క్రయవిక్రయాలు సాగిస్తూనే ఒక్క క్షణం కూడా దేవుణ్ణి మరిచిపోనివాడూ!” మరో సందర్భంలో ఈ పారశీక దేశికోత్తముడు, ధార్మిక జీవనాన్ని గురించి తనకుగల అభిప్రాయాలు ఇలా చెప్పాడు: “నీ మనస్సులో ఉన్నది పక్కకి పెట్టెయ్యడం (స్వార్థంతో కూడిన కోరికలు, ఆశయాలు); నీ చేతిలో ఉన్నది ఉదారంగా ఇతరులకు ఇవ్వడం, ఆపదలు పిడుగుద్దులు వేస్తున్నప్పుడు ఏనాడూ చలించక పోవడం!”
కాశీఘాట్ గుడిదగ్గర తటస్థపడ్డ సమదర్శి అయిన మునికాని, టిబెట్టులో శిక్షణపొందిన యోగికాని, గురువుకోసం నాకుగల ఆకాంక్షను తీర్చలేదు.
నా హృదయానికి, ప్రేరణలకోసం, అధ్యాపకుడు అవసరం లేకపోయింది; “ధైర్యం వహించు!” అంటూ దానంతట అది కేక వేసింది. అది అరుదుగా నిశ్శబ్దంలోంచి వెలువడేది కావడంవల్ల గట్టిగా మారుమోగింది. చివరికి నేను మా గురువుగారిని కలుసుకున్నప్పుడు, ఆయన కేవలం తమ ఆదర్శ మహనీయతవల్ల నే నిజమైన మానవుడి ప్రమాణాన్ని ఉద్బోధించారు.
క్రీ. పూ. పదోశతాబ్దిలో ఇజ్రాయిల్ దేశాన్ని పాలించిన వీర ప్రభువు. పరిపాలనలో అతడు చూపిన వివేకాన్నిబట్టి, ధర్మాన్నిబట్టి ఈనాటికీ అతడి పేరు జ్ఞాని అనే మాటకు పర్యాయపదంగా ప్రసిద్ధిచెందింది.
కాళికాదేవి, ప్రకృతిలోని శాశ్వత నియమానికి ప్రతీక. సాంప్రదాయికంగా ఈమెను, నేలమీద పడుక్కొని ఉన్న శివదేవుని- లేదా అనంతుని.
రూపం మీద నిలబడి ఉన్న చతుర్భుజ మూర్తిగా చిత్రిస్తారు. ఎందుచేతనంటే, ప్రకృతి-అంటే దృగ్విషయక ప్రపంచం- కార్యకలాపాలు నిర్గుణ బ్రహ్మనుంచి ఉత్పన్నమవుతాయి. ఈమె నాలుగు చేతులూ నాలుగు మౌళిక లక్షణాలకు ప్రతీకలు: వాటిలో రెండు శుభంకరమైనవి, రెండు వినాశకరమైనవి; ద్రవ్యానికి అంటే సృష్టికి- మౌలికమైన ద్వంద్వం.
గ్రీకు పురాణ కథలో వచ్చే రాక్షసి.
దీని తల స్త్రీది; శరీరం సింహానిది కాని, కుక్కది కాని; రెక్క లుంటాయి. ఈ రాక్షసి, థీబ్స్ అనే ప్రాచీన గ్రీకు నగరంలో, వచ్చేపోయేవారిని యక్షప్రశ్నలు వేసి, జవాబు చెప్పలేని వాళ్ళను తినేసేదని ప్రసిద్ధి.
విశ్వభ్రాంతి; దీనికి వాచ్యార్థం “కొలిచేది” అని. మాయ అనేది సృష్టిలోని ఇంద్రజాల శక్తి; దీనివల్ల అమేయం, అఖండం అయిన పరమాత్మలో పరిమితులూ, విభాగాలూ కనిపిస్తూ ఉంటాయి.
‘మాయ’ను గురించి ఎమర్సన్ ఈ కింది పద్యం రాశాడు (దాన్ని అతడు Mala అన్న వర్ణక్రమంలో రాశాడు)
అభేద్యమైన దాన్ని కల్పిస్తుంది మాయ,
లెక్కలేనన్ని సాలెగూళ్ళు ఆల్లుతూ;
ఉల్లాసకరమైన దాని చిత్రరూపాలు విఫలంకా వెన్నడూ,
ఒకదాని మీ దొకటి పడుతుంటాయి, తెరమీద తెరలా:
మోసపోవడానికి తపించేవాణ్ణి
తప్పకుండా నమ్మిస్తుంది ఈ మోహకారిణి.
ఋషు లంటే “ద్రష్టలు” అని అర్థం; కచ్చితంగా కాలనిర్ధారణ చేసి చెప్పడానికి వీలులేనంత సనాతనమైన వేదాలకు కర్తలు వీరు.
పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు చేతననుగురించి సాగించిన పరిశీలనలు చాలవరకు, అవచేతన మనస్సుకూ, మనోవ్యాధి చికిత్సాశాస్త్రం ద్వారానూ మనోవైజ్ఞానిక విశ్లేషణద్వారానూ నయంచేసే మనోవ్యాధులకూ పరిమితమైనవి.
సామాన్య మానసిక స్థితులకూ వాటి భావోద్రేక, సంకల్ప విషయిక అభివ్యక్తులకూ మూలాన్ని గురించి, మౌలిక నిర్మాణాన్ని గురించి జరిగిన పరిశోధన చాలా స్వల్పం; నిజంగా మౌలికమయిన ఈ విషయాన్ని భారతీయ దర్శనశాస్త్రం ఉపేక్షించలేదు.
సశేషం:-
No comments:
Post a Comment