*ప్రాచీనమైన, అరుదైన కధ*:
*చెళ్ళపిళ్ళరాయడు చరిత్ర*
రచన : తాళ్ళపాక అన్నయాచార్యులు
(అన్నమయ్య మనవడు)
పరిష్కర్త : ఆశావాది ప్రకాశరావు
యాక్షగానం నుండి తెలుగు వాడుక భాష లోకి అనువాదం చేసినవారు
శ్రీ ముళ్ళపూడి శ్రీదేవి గారు
అరుదైన కధలు పుస్తకాలు వున్నట్టే అతి అరుదైన కధలు పుస్తకాలు కొన్ని ఉంటాయి. అలాంటి అరుదైన కధలు ఎక్కడా వినపడవు, అలాంటి పుస్తకాలు ఎక్కడా కనబడవు. ఈ చెళ్ళపిళ్ళరాయడు చరిత్ర అతి అరుదైన కధ, పుస్తకాల జాబితాలోకి వస్తుంది. ఇలాంటి కధలకి కాలదోషం పట్టకూడదు..పట్టదు. అందుకే మట్టిలో మాణిక్యం లాగా పాత పుస్తకాల దొంతరలో ఎక్కడో అట్టడుగున దొరికింది.
అన్నమయ్య రచనలు విశ్వప్రసిద్ధి..మరి ఆయన మనవడు తాళ్ళపాక అన్నయాచార్యుల రచనలు...అసలు అన్నమయ్య సంతానం గురించి ఎవరూ ఎక్కడా ప్రస్తావించరు. వారి రచనలు కూడా బహు అరుదు. అందుకే మనవడు అన్నయాచార్యులు రచించిన ఈ చెళ్ళపిళ్ళరాయడు చరిత్ర అతి అరుదైన కధ.
108 తిరుపతులలో ఒకటైన మైసూరు రాష్ట్రంలోని మేల్కొటేలో యాదవాద్రిగిరి పై వెలసిన శ్రీవేంకటేశ్వరుడి మరో పేరే ఈ చెళ్ళపిళ్ళరాయడు. మేల్కొటేలో రామానుజులవారు 12 సంవత్సరాలు నివాసమున్నారని చెప్తారు. ఈ కధలో ఆయన ఒక ముఖ్య భూమిక నిర్వహించారు.
ఈ ద్విపద కావ్యం యక్షగాన రూపంలో తాళపత్రాల మీద అన్నయాచార్యులచే రచింపబడింది. ఈ కధని ఆశావాది ప్రకాశరావు అనే ఆయన 1981 లో తాళపత్రాల నుండి కాగితాల మీదకి మొదటిసారిగా ఉన్నది ఉన్నట్టుగా పరిష్కరించారు. అప్పట్లో 1500 ప్రతులు వేస్తే అన్నీ కనుమరుగైపోయాయి. అదృష్టం కొద్దీ ఇన్నేళ్ళకి నాకు ఒక ప్రతి కంటపడింది.
హిందూ ముస్లిం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ కధ. ఆనాటి ఢిల్లీ నగర వర్ణనలు, అప్పటి సామాజిక పరిస్థితులు, రాజులు, సుల్తానులు, చక్రవర్తులు ఒకపక్క, ఇటు దక్షిణ భారత దేశ హైందవ సాంప్రదాయ బ్రాహ్మణులు వారి తిరుగుబాటు...ఈ మధ్యలో బీబీ నాంచారి..చెళ్ళపిళ్ళరాయడి ప్రణయం నేపథ్యంలో కడు ఆసక్తికరంగా సాగుతుంది కధ.
మన పురాణాల మీద ఆసక్తి, అభిలాష ఉన్న ప్రతి ఒక్కరు తప్పక చదవాల్సిన కధ.
🪷
*ప్రచురణకర్త :*
*పైడిఘంటం హరికృష్ణ*
*(స్పందన పబ్లికేషన్స్)*
*(కథల ప్రపంచం వాట్సప్ గ్రూప్)*
No comments:
Post a Comment