Tuesday, November 4, 2025

 *🔊హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన డిసెంబరు 19 నుంచి*

*🍥హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన(38వ) డిసెంబరు 19 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కమిటీ ప్రకటించింది. హైదరాబాద్‌ ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటుచేసే ప్రదర్శన గోడపత్రికను సోమవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో పుస్తక ప్రదర్శన సలహాదారులు ప్రొ.కోదండరాం, సీనియర్‌ సంపాదకుడు కె.రామచంద్రమూర్తి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలోని తప్పిదాలు, లోపాలను సరిదిద్దుకుని అందంగా, విజ్ఞానదాయకంగా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రదర్శనలో పుస్తకావిష్కరణలు, సాహితీ చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని అధ్యక్ష, కార్యదర్శులు డా.యాకూబ్‌ షేక్, ఆర్‌.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ప్రదర్శనలో పాల్గొనేందుకు నవంబరు 30వ తేదీ వరకు అన్ని పనిదినాల్లో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కార్యాలయంలో దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో పుస్తక ప్రదర్శన కోశాధికారి పి.నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు బి.శోభన్‌బాబు, సంయుక్త కార్యదర్శి కె.సురేశ్, కార్యవర్గ సభ్యులు ఎ.జనార్దన్‌ గుప్తా, యు.శ్రీనివాసరావు, టి.సాంబశివరావు, స్వరాజ్‌కుమార్, డి.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.*

No comments:

Post a Comment