: 🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(259వ రోజు):--
ఈ రెండున్నరేళ్ళూ మీరు చేసి నది చదవటం మాత్రమే. పుస్తకాలు చూస్తూ చదివారు. మీరు కంఠస్థం చేసిన కొన్నివిషయాలు మళ్ళీ చెప్ప గలరు కూడా. అది వల్లించటం మాత్రమే. మీ వల్లించేశక్తివల్ల ఇతరు లకు ఉపయోగమేమీ ఉండదు. మనం చేయటానికి ప్రయత్నిస్తున్నది ప్రచారం. దానికి ఆచారం అవసరం. ప్రచారకుడంటే భగవంతుడే తన అవసరాలన్నిటినీ తీరుస్తాడనే విశ్వాసంతో సంచరించే సాధువనీ, ఆచారం అంటే క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక జీవనాభ్యాసం అనీ అర్థం చెప్పుకోవాలి.
అందుచేత, మీసాధన నియమం తప్పకుండా చేయండి. ఒక్కరోజైనా ధ్యానం చేయకపోతే, ఆరోజు మీరు చెప్పే మాటలకు విలువేమీ ఉండదు. సాధన సరిగా చెయ్యని నలుగురైదు గురు బ్రహ్మచారులు ఇతరులకు సరిగా బోధించలేకపోయారు. దీనికి విరుద్ధంగా, మంచి విద్యార్థులు కారనుకున్న కొందరు తమ సాధన వల్ల మంచి అధ్యాపకులు కాగలిగారు. ఈవిషయం శాస్త్రాల్లో చెప్పబడినదే కాక, నా 28 ఏళ్ళ అను భవం కూడా : నియమం ఉల్లంఘిం చకుండా సాధనచేసేవారు చక్కగా బోధించగలరు. అందుకే, రోజూ ధ్యానం చెయ్యండి, గ్రంథపఠనం చెయ్యండి, చదివినదానిని మననం చెయ్యండి, తర్వాత సేవ చెయ్యండి. పరమసత్యాన్ని గురించి నిరంతర ధ్యానంలో ఉన్నపుడు, మనసు ఆ సత్యంలో ఐక్యమౌతుంది. ఇదే నిజ మైన అభ్యాసం, ఆచరణ.
ఈపని మీ సాధనకు ఒకగొప్ప అవకాశం. మనసమాజం మిమ్మల్ని సాధువుగా గౌరవించటానికి మన దేశపు సాంప్రదాయమే కారణం. కాని, దీని అర్థం మీ స్వప్రయత్నం ద్వారా మీరు అభివృద్ధిచెందాల్సిన అవసరంలేదని కాదు. సాధన నియమనిష్ఠలతో కొనసాగించాలి ; కష్టపడి పనిచేయాలి; తద్వారా మీకు చేతనైనంత వరకూ ఈ మహాసత్యా న్ని మీ జీవితంగా చేసుకోవాలి. గృహస్థులకు మీ అంత పరిపూర్ణంగా జీవించడం సాధ్యంకాకపోవచ్చు ; సమాజంలో జీవించడానికి రోజూ ఎన్నో విషయాల్లో రాజీపడాల్సి వస్తుంది. మీకు మాత్రం అటువంటి హద్దులు లేవు.
బ్రహ్మచారుల్లారా, రాజీపడ కుండా జీవించండి ; సమాజానికి నిజమైన సేవకులుగా మిమ్మల్ని మలుచుకోండి. ఈ దేశానికి మీసేవ అవసరం ఎంతైనా ఉంది. గడచిన 30 సం.రాల్లో ఎంతో సాధించటం జరిగింది; ఈనాడు ప్రజలకు వేదాంతవిషయాల్లో ఆసక్తి పెరగడ మే దీనికి తార్కాణం. నేను ఈపని మొదలుపెట్టినప్పుడు అటువంటి దేమీ లేదు. ఇప్పుడు అందరూ "స్వామీజీ మావద్దకొక బ్రహ్మచారిని పంపండి; మాకతని అవసరం ఎంతై నా ఉంది" అంటూ జాబులు వ్రాస్తు న్నారు. వారికి అవసరమైనంతమం ది సేవకుల్ని మేం తయారుచేయలేక పోతున్నాం.
ఇదే మీకున్న అవకాశం. దీనిని సద్వినియోగం చేయండి. ఇది జరగా ల్సినది 'ఇప్పుడే, ఇక్కడే' అని గ్రహించండి.
____
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment