💐శ్రీకామేశ్వర్యైనమః💐
శంకరభగవత్పాదులు తమ లలితా పంచకంలో ఈ విధంగా చెప్పారు.
*ప్రాతర్వదామి లలితే* *తవ పుణ్య నామ*
*కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి* . *శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి* .. 5..💐
ఈ శ్లోకంలో లలితా దేవిని కామేశ్వరిగా , కమలగా , మహేశ్వరిగా, శ్రీ శాంభవిగా, పరా గా జగజ్జననిగా , వాగ్దేవిగా ,త్రిపురేశ్వరి గా కీర్తించారు. ఇవన్నీ లలితాదేవి పుణ్యనామాలు. లలితాదేవి ఈ నామాలు ప్రాతఃకాలంలో ఉచ్ఛరిస్తున్నాను అని శంకరభగవత్పాదులు మనను కూడా ఆవిధంగా దేవీపుణ్యనామాలు స్మరించాలని చెప్పకుండానే ఆదేశిస్తున్నారు. భగవత్పాదులు బోధించకుండానే శిష్యపరంపరకు ఏది చెయ్యాలో స్ఫురింపజేస్తారు.
అంతేగాక ప్రతీ స్తోత్రం లోనూ ఏదో ఒక శ్లోకంలో అనేకత్వాన్ని ఏకతత్వానికి ఆన్వయిస్తారు. అనేక నామ ,రూపాలతో ఉన్న దేవీదేవతా భావనను- చిన్న గీతను - ఏమాత్రం ఖండన , దూషణలు చెయ్యకుండా, ఏకతత్వ పరబ్రహ్మ అద్వైత భావనతో చెరిపివేస్తారు. ఇది తెలుసుకోకుండా కొందరు శంకరభగవత్పాదులు ద్వైతాన్ని సమర్ధించారు అంటారు. కానీ భగవత్పాదులు ప్రతీ గీతనూ , తమదైన పెద్దగీత గీసి చిన్నది అయ్యేటట్లు చేశారు.
💐శ్రీకామేశ్వర్యైనమః💐.
No comments:
Post a Comment