Wednesday, November 26, 2025

 చిత్త భ్రాంతి కలుగుతోంది
చిన్మయము తొలగుతోంది
లౌకిక లంపటము
నన్ను బాధిస్తోంది
అభిలాష నిరుపయోగమౌతోంది
శాంతికాముకత పరిహసిస్తోంది
జన్మసంస్కారం మలినాలను
           తాకవద్దంటోంది
దేహస్వభావం విషయాలను
           వదలనంటోంది
చిక్కు సమస్యయే జీవనమైపోయింది
కర్మేంద్రియ సముదాయం
        తనవైపు తిప్పుకుంటోంది 
నారాయణోపదేశము
మనోబలాన్ని నూరిపోస్తోంది
ఆత్మ తత్వ వాసికి సంకటమేలంటోంది
హృదయాంతర శోధనకు
          విజయమేనంటోంది
తిరుగులేని తీర్పుయై నన్ను శాసిస్తోంది 
మంత్రబద్దమయ్యింది మానసము
పులకితమయ్యింది అంతరము
చిత్త భ్రాంతి తొలగుతోంది
చిన్మయము కలుగుతోంది
లౌకికము నన్ను చేరనంటోంది
అభిలాషే ఆద్యమై శాంతి సూత్రమయ్యింది
మంత్రబద్దమయ్యింది మానసము
పులకితమయ్యింది అంతరము.           

No comments:

Post a Comment