Wednesday, November 5, 2025

 *ఏడాది నిండిన తన బిడ్డకు పుట్టినరోజు వేడుక చేస్తుంది తల్లి. ఆ బిడ్డకు ఏవేవో అలంకరించి మురిసిపోతుంది. ఇవేవీ ఆ బిడ్డకు తెలియదు... ఆ బిడ్డకు కావలసినది తల్లి ఒడి ఒక్కటే. అలాగే మన జీవితంలో మనకు లభించేటివన్నీ భగవంతుడు మనకు అలంకరించుకుని చూసుకునే ముచ్చటే. ఏమైనా రానీ, ఏమైనాగానీ భగవంతుని శిశువుగా మనముందాం....* 
శ్రీకాళహస్తీశ్వర శతకంలో దూర్జటి కవి మంచి శరణాగతి పద్యం చెప్పారు... నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసారమోహంబు పై కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుదింపనీ, మేలు వ చ్చిన రానీ, యవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా!

***

పరమేశ్వరా!

*నేను నిన్ను సేవిస్తుండగా, నాకు కష్టాలు రానీ, సుఖాలు రానీ, నన్ను సామాన్యుడు అననీ, గొప్పవారు అననీ, సంసారవ్యామోహము కలుగనీ, జ్ఞానము కలుగనీ, గ్రహాచారము నన్ను క్రుంగదీయనీ లేక మంచి చేయనీ, అవి అన్నీ నాకు ఆభరణాలు వంటివే అవుతాయి. నీ పాదసేవ చేస్తున్న నాకు అన్నీ నీ అనుగ్రహాలుగానే కనిపిస్తాయి.*

***

చివరగా ఈ వ్యాసాన్ని గురువాక్యంతో ముగుస్తాం... *"అన్నిటికీ సిద్ధపడి ఉండడమే మహాసిద్ధి."*

No comments:

Post a Comment