Tuesday, November 4, 2025

 సేవలు!
*******
సేవ 
గొప్పమాట!
చేస్తేనే కదా!

సేవపేరుతో 
చేసేది 
వ్యాపారం!

చెప్పేదేముంది!
మీకూతెలుసు 
ఎలాంటి సేవలో!

దైవ సేవ
దేశ సేవ
ప్రజా సేవ!

వైద్యసేవ
విద్యాసేవ
న్యాయసేవ!

వినోద సేవ
రాజకీయసేవ
పౌర సేవ!

సర్కారు సేవ
దళారీ సేవ
కాంట్రాక్ట్ సేవ!

కొనుగోలు సేవ
అమ్మకాల సేవ
మార్కెట్ల సేవ

బియ్యంపంపిణీ సేవ
ఇళ్లనిర్మాణ సేవ
ఉచితపథకాల సేవ!

తుఫాను సేవ
భూకంపాల సేవ
కరువుకాటకాల సేవ!

సేవలుబాబోయ్
సేవలు
అన్నీ సేవలే!

సాహిత్యం
కళలు
ఇవీ సేవలే!

ఇంకావున్నాయ్
ఎన్ జి ఓల సేవ
పరస్పర లాభాలసేవ!

అధికారులసేవ
అనితరసాధ్యం!
అది లంచాలసేవ!

కంపెనీల సేవ
బ్యాంకుల ఎల్ ఐ సిల 
పెట్టుబడులసేవ!

వేలకోట్లుఎగ్గొట్టేపెద్దలకు
ప్రభుత్వ ఉచిత
మినహాయింపుల సేవ!

వెతకాలేకాని
ఎన్నో సేవలు!
అందరూ దేశ సేవకులే!
(ఒక్క నక్సలైట్లుతప్ప)

దైవదర్శనానికి
దారులన్నీ
కొండమీదికే!

కోట్ల కోసం
కోటి సేవలు
అన్నీ ఆర్ధికమే!

సేవలుబాబోయ్
సేవలు
బహుళార్ధక సేవలు!

వివిధసేవలతో
దేశం
(పు)రోగమిస్తోంది!

సేవకులంతా
ప్రజా ప్రేమికులు
ని'స్వార్ధ' సేవకులు!

పుణ్యాత్ములుంటారు
కాదనను కాని
పాపమేపెరిగిపోతోంది!

పెద్దల పాపాలు
పేదలకు శాపాలు
పట్టుబడితే జైళ్లు!

భూదేవి భరించలేక
గుడ్లు
తేలేస్తోంది!

పదండిముందుకు
పదండితోసుకు
పోదాంపోదాం సేవలకి! 
       *******
-తమ్మినేని అక్కిరాజు
       హైదరాబాద్
      30-10-2025

No comments:

Post a Comment