*చివరికి మిగిలేవి*
అవినీతికి, అక్రమాలకు పాల్పడితే
చివరకు మిగిలేవి అవమానాలే
అన్యాయాలకు దౌర్జన్యాలకు పాల్పడితే
చివరికి మిగిలేవి క్రిమినల్ కేసులే
వెన్నుపోట్లుకు, కత్తిపోట్లుకు పాల్పడితే
చివరికి మిగిలేవి ఎదురుదెబ్బలే
అసూయ ద్వేషాలను వదలకపోతే
చివరికి మిగిలేవి ఇబ్బందులే
అహంకారం,అత్యాశను విడిచిపెట్టకపోతే
చివరికి మిగిలేవి కష్టాలే
తాగుడుకు, జూదానికి బానిసలైతే
చివరికి మిగిలేవి కన్నీళ్లే
పొరపాట్లు, లోటుపాట్లను సరిదిద్దుకోకపోతే
చివరికి మిగిలేవి బాధలే
ఏది మంచో ..ఏది చెడో
నీ మనసును అడుగు
ఎలా వదులుకోవాలో
నీ అంతరాత్మను అడుగు
లింగాల నరసింగరావు
సీనియర్ జర్నలిస్ట్
విజయనగరం
9440593971
9848730909
No comments:
Post a Comment