శ్రీరాముడు అయినా శ్రీకృష్ణుడు అయినా శాస్త్రం చెప్పినట్లుగానే నడుచుకునేవారు, చేయమనేవారు ఇతరులను:
తస్మాత్ శాస్త్రం ప్రమాణం
తే కార్యాకార్య వ్యవస్థితౌ,
జ్ఞాత్వా శాస్త్రవిద్యానోక్తం
కర్మ కర్తుమిహార్హసి "
- భ.గీత 16:24
పరమాత్మ అన్నారు అర్జునుడితో " శాస్త్రాలు ఎలా చెబుతున్నాయో అలా చెయ్యి. ఏది చెయ్యమందో అది చెయ్యి, ఏది వద్దందో అది మానేయి " అని.
ఎంత అద్భుతం. పరమాత్మ తను చెప్పింది చెయ్యమనలేదు. శాస్త్రాలు ఏది చెబుతున్నాయో అది చెయ్యి అన్నారు.
" వేదో2ఖిల ధర్మమూలం " - అన్ని ధర్మములకూ మూలం వేదమే. వేదం నుంచే ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు వచ్చాయి. ఏది చెప్పినా ధర్మం గురించే.
శ్రీరాముడు కూడా ఏది చెప్పినా " శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి, ఋషులు ఇలా తెలియచేస్తున్నారు " అనేవారు ఎప్పుడూ.
సనాతనధర్మానికి పునాదులు అద్భుతమయిన, శక్తివంతమయిన మన " గ్రంధరాశి, ఋషులు, తీర్థాలు, క్షేత్రాలు ". ఋషులు తాము దర్శించి, ఆచరించిన తరువాత దానిలోని మంచిని మాత్రమే లోకకళ్యాణం కోసం మనకు అందించారు.
వివేకానందులు చికాగో సర్వమతసమ్మేళనంలో " సోదరసోదరీమణులారా, ప్రపంచమతాలకు తల్లి అయిన సనాతనధర్మం, భారతదేశప్రజల తరపున మీకు నమస్కరిస్తున్నాను " అన్నది సత్యం ఇచ్చిన ధైర్యం వలన. అంతమంది వివిధమతాధిపతులు మాట్లాడిన ప్రదేశం వివేకానందుల మాటలనే ఎందుకు ప్రతిధ్వనిస్తూంది. చికాగోలోని ఒక వీధి " వివేకానందుడు వీధి " ఎందుకు అయింది. ఋషులు వేసిన సనాతనధర్మ పునాదుల పటిష్ఠత అది. ఎందరో మూర్ఖులు దాన్ని పడగొట్టాలని ప్రయత్నించినా, ప్రయత్నిస్తూన్నా తట్టుకుని నిలబడగలుగుతూందంటే దాని విలువ, విశాల విస్త్రృతభావన అటువంటిది కనుక.
ప్రపంచశాంతికి మన సనాతనధర్మం తప్ప వేరే దారి లేదు.
అటువంటి నిత్యనూతనమయిన మన సనాతనధర్మం గౌరవాన్ని పెంపొందించే బాధ్యత మనందరిదీ.
No comments:
Post a Comment