వైకుంఠం అనే పేరు విష్ణుమూర్తికి సంబంధించింది కదా. మరి శివుడు కొలువుంటాడని చెప్పే స్మశానాలకు కొన్ని చోట్ల వైకుంఠధామం అని ఎందుకు పేరు పెడతారు?
వైకుంఠం అనేది శ్రీమహావిష్ణువు యొక్క నివాస స్థలం దానికి త్రిపాద్ విభూతి అని పేరు వికుంఠము అనగా నాశనము లేనిది శాశ్వతమైనది ఎప్పుడూ ఉండేది అని అర్థం. ఈ విశ్వమంతా కూడా ఒక భాగం అనుకుంటే దీనికి మూడు రెట్లు పెద్దదిగా ఉంటుంది వైకుంఠం అందుకే దాన్ని త్రిపాద్ విభూతి అంటారు విష్ణుభక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ల ఆత్మలను విష్ణు దూతలు వచ్చి వైకుంఠానికి తీసుకెళ్తారు అని చెప్తారు. అలాగే శివ భక్తులు ఎవరైనా అనగా చనిపోతే వాళ్ళ జీవాత్మ కైలాసం చేరింది అంటారు లేకపోతే శివైక్యం చెందారు లేదా కైవల్యం పొందారు అని అంటారు ఇంకా పరమపదప్రాప్తి, పరమపదించినారు అని నిర్యాణము చెందారు అంటారు శివుడు ఉండే భూమి రుద్రభూమి దానికే మరుభూమి అదే స్మశానము. రుద్రుడు స్మశానాధిపతి ప్రమథ గణాలకు అధిపతి. ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న ఏదో ఉందో ఆ శవాన్ని తీసుకెళ్లేటువంటి ప్రదేశమువైకుంఠధామము అని పెట్టడంలో వారు ఆ చనిపోయిన జీవుడు వైకుంఠానికి వెళ్ళాడు లేదా పరమపదించినాడు అని చెప్పిన దానికి పర్యాయంగా ఈ పదం వాడినట్లుగా తెలుస్తోంది. కానీ వాస్తవంగా ఆ పేరు అలా పెట్టకూడదు స్మశానము అంటే రుద్రభూమి అది ఖచ్చితంగా శివుడి యొక్క ఆవాస స్థానానికి మరో స్థానము అనవచ్చు. అక్కడ ఉండే భూతగణాలకు రుద్రగణాలని పేరు కావున రుద్రభూమి అనేపేరే సార్థకం. వైకుంఠము అంటే మాత్రము అది శ్రీమహావిష్ణువు స్థానం. ఎవరైనా విష్ణుభక్తులు మరణించినచో వారిని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకెళ్ళుతారు అని అంటారు కాబట్టి అలాంటివారి పార్థివదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్ళేప్పుడు అలాంటి సమయంలో ఆ చనిపోయినవారి జీవాఆత్మను ముక్తాత్మ అంటారు. ఆజీవుడిని పరమపదించినారు అని అంటారు జీవాత్మయొక్క ప్రయాణాన్ని వైకుంఠయాత్రగా చెబుతూ పరమపదోత్సవం అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జరిపి ఆరోజు బంధుమిత్ర వర్గాలకు వైకుంఠసమారాధన పేరుతో భూరిభోజనాలు ఏర్పాటు చేస్తారు. అందువలన శ్మశానవాటికలు ఎప్పటికైనా రుద్రభూమి అనడమే సరైనది శ్మశానవాటికలకు అధిపతి కూడా రుద్రుడే అందువలననే అన్నపూర్ణాదేవితో పరమశివుడు కొలువైయున్న కాశీక్షేత్రమును మహాశ్మశానం అంటారు ఈ భూమిపైన ఉండే శ్మశానాలకన్నింటికన్న గొప్ప శ్మశాశనం కాశీక్షేత్రం. కావున శ్మశానానికి వైకుంఠధామము అని పెట్టడం సరైనది కాదు.
No comments:
Post a Comment