Tuesday, November 4, 2025

 ఎక్కడుందో రైతు పంటలకు క్షేమం...
ఎవరిస్తారో రైతు ధాన్యాలకు సంక్షేమం...
దేహనికి,దేశానికి అన్నం పెట్టే పెద్దవాడు...
కరువు,కాటకాలొచ్చినప్పుడు అతని కంటే లేడు పేదవాడు...

గాలులు,జోరు వానలను తట్టుకుంటు సాగుతాడు...
కష్టాలను,కన్నీళ్లను నెట్టుకుంటూ కదులుతాడు...
మట్టితల్లినే అమ్మకడుపుగా నమ్ముకోని పెరుగుతాడు...
ఆ మట్టితల్లే మోసం చేసినా నిందించకుండా సాకుతాడు...

మండే,ఎండకు తోడునీడై రోజంతా గడుపుతాడు...
వానచినుకును పలకరించి చుట్టంలా మారిపోతాడు...
గాలితో సోపతి కట్టీ వాడు పంటకు ఊపిరిపోస్తాడు...
గాలి,వానలు రాళ్ళు కురిపించి నా...స్నేహం వీడని గొప్ప స్నేహితుడు...

పాలకుల రాజ్యాలకు ధాన్యాన్ని తెచ్చిపెడతాడు...
పాలన సరిగా సాగడానికి ధనరాశులను పోస్తాడు...
అప్పులు ఎన్నో ఉన్నా కానీ... ఏ రాజ్యాన్ని ఆశించడు...
అప్పులు ఎన్నో అయినా కానీ...ఏ రాజు దరికి పోడు...

No comments:

Post a Comment