Saturday, November 1, 2025

 అరుణాచల శివ 🙏
సర్వమూ శివమయంగా ఎలా తెలుసుకోవాలి !?

ప్రకృతి ప్రభావం చేత ఏర్పడే గుణాలు లేకుండా చూడగలిగిన రోజు మనకు సర్వమూ శివమయంగా తెలుస్తుంది. 

మామిడుపండు చాలా రుచిగా ఉంటుంది. ఆ రుచి తెలియని పిల్లవాడికి ఆ పండు ఒక బొమ్మతో సమానం. 

ఆ మాధుర్యాన్ని చవిచూసిన తర్వాత మనలో ఆ రుచికోసం తపన మొదలవుతుంది.

ఇలా మొదలైన తపనే మనలో ఏర్పడే గుణం. 

ఇప్పుడు గుణం మామిడిపండులో ఉందా ? లేక మనసులో ఉందా ? అంటే ఆ రెండింటి సంబంధంలో ఉంది.

మామిడిపండులో రుచి ఉన్నది కనుక మనలో కోరిక కలిగింది. 

ఈ ప్రకృతి అంతా చైతన్యంతో నిండి ఉంది. మామిడిపండులో మనలోనూ చైతన్యం ఉంది.

కానీ ఇప్పుడు ఏర్పడిన ఈ రుచి అనే గుణం ఈ ఆ రెండింటినీ చైతన్యంగా కాక ప్రాపంచిక వస్తువులుగా భాసించేలా చేస్తుంది. 

ఒక్క మామిడిపండునే కాదు, మనం చేసే ప్రతిదాన్ని దాని గుణాలతో కలిపి చూస్తున్నాం. అందుకే అది మనను ప్రభావితం చేస్తుంది.

ప్రకృతి ప్రభావం చేత ఏర్పడే గుణాలు లేకుండా చూడగలిగిన రోజు మనకు సర్వమూ శివమయంగా స్పష్టంగా అర్ధమవుతుంది !

_ శ్రీరమణీయం నుండి...

ఓం నమో భగవతే శ్రీ రమ ణాయ🙏🙏

🪷🪷🪷🪷🪷

No comments:

Post a Comment