262వ భాగము
🕉️ అష్టావక్ర గీత🕉️
అధ్యాయము 18
శ్లోకము 50
స్వాతంత్ర్యాత్సుఖమాప్నోతి స్వాతంత్య్రాల్లక్షతే పరం|
స్వాతంత్ర్యాన్నిర్మృతిం స్వాతంత్ర్య తత్పరం||
సుఖము సుఖాతీతమైన ఆనంద స్థితి చివరగా ఆత్మానుభవాన్ని కూడా స్వతంత్రం వల్లనే లభిస్తాయి.
దేనితోను బంధింపబడకుండా స్వతంత్రంగా ఉన్న మనసుతోనే ఆత్మానుభవాన్ని పొందగలగటం సాధ్యమవుతుంది .మంచిదైనా చెడ్డదైనా సరే ఆలోచన ఉందంటే మనసులో వికారము కలిగినట్టే కదా? సరోవరం ఉపరితలం కల్లోలితమైనప్పుడే తరంగాలు కనిపిస్తాయి. ఏ సదాచార నియమాలైన ధార్మిక విలువలైన చివరగా ధ్యానించే మనసైన సరే మనసు కల్లోలిత అయినప్పుడే భాగంగా భావిస్తుంది. బావ రహితంగా ఉండగలగటమే అమనస్కంగా ఉండటం. అదే నిచ్చల నిజ చైతన్య స్వరూప దర్శనం, అనుభవం. ధ్యాననిస్టులైన సాధకులకు ఈ సత్యాన్ని ఇక్కడ అష్టావక్ర మహర్షి సూచిస్తున్నారు.
తెలివిహీనుడై ప్రాపంచిక విషయ సుఖ భోగాలలో మునిగితేలుతూ ఆలోచనారహితుడై విచక్షణ శూన్యుడైన మూడుడు ఆత్మానుభవములో ఉన్నాడని ఇక్కడ అర్థం కాదు. సంసిద్ధత అర్హత తెలివి లేని కొంతమంది యదేచ్ఛగా భోగాలను అనుభవించడమే ఆత్మ దర్శనానికి మార్గమని కూడా అనుకోవచ్చు. వారిని గర్హించకూడదు వారిని చూసి జాలిపడాలి. వారు నమ్మిన సిద్ధాంతాన్ని సమాజానికి బోధించ పూనితే అంతకంటే హానికరమైనది ఏదీ ఉండదు. వారు సమాజానికి చీడపురుగులై ఇంకా హీనస్థితికి దిగజార్చి మనుషులను మృగతుల్యులుగా మారుస్తారు. ఈ అష్టావక్ర గీత ప్రాధమిక దశలో ఉన్న సాధకులను ఉద్దేశించి చెప్పినది కాదని మొదటి నుండి హెచ్చరిస్తూనే ఉన్నాము. సాధనా చతుష్టయ సంపన్నులై శాస్త్ర అధ్యయనం చక్కగా చేసి ధార్మిక జీవనం జీవిస్తూ అంతరంగ శుద్ధి నిచ్చల మనోబుద్దుల శాంతిని సాధించి సత్యాన్వేషణ కోసమే జీవిస్తున్న ఉత్తమాధికారులకు అర్హులకు ఈ గీత ఉద్దేశించబడినది. అహంకారాన్ని తద్వారా చూడబడే ప్రపంచపు స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకొని భావములో భావముతో గుర్తింపబడే భావనామయ జగద్బృమను విడనాడాలి అని ధృడ సంకల్పముతో ధీరత్వంతో ఆఖరి అడుగు వేయబోయే సత్యాన్వేషకులకు సాధక శ్రేష్ఠులకు మాత్రమే ఈ గీత సరి అయిన ప్రయోజనాన్ని ఇవ్వగలదు.🙏🙏🙏
No comments:
Post a Comment