What should be done to get rid of lust..? | Chaganti Pravachanalu | AnanthaSpiritualWorld
https://youtu.be/XErqkxQBwtE?si=VcJ3xydK4FMVyJmI
Default Title
https://www.youtube.com/watch?v=XErqkxQBwtE
Transcript:
(00:00) జ్ఞానేంద్రియ కర్మేంద్రియములనుఇచ్చి మనసునిచ్చి బుద్ధినిచ్చి ఇంత శక్తిని మనుష్యునకు పెట్టినటువంటి పరమేశ్వరుడు వీటిని ఎలా వాడుకోవాలో చెప్పకపోతే నాశనం చేసేయడానికి ఒక్క ఇంద్రియం చాలు ఒక్క కన్ను బాగా పని చేసినందుకు ఒక జాతి జాతి నశించిపోతుంది. చూపుకి ఆకర్షింపబడుతుంది దీపపు పురుగు దీపాన్ని చూసి అది తినే వస్తువు అనుకని వెళ్లి దీపం మీద వాలుతుంది.
(00:29) రెక్కలు ఊడి కింద పడిపోతుంది అరేయ్ ఇన్ని పురుగులు కింద పడిపోయాయి మనం ఎందుకురా వాళ్ళమని ఆలోచించావు వెళ్లి వాలుతూనే ఉంటాయి కింద పడిపోతూనే ఉంటాయి కుప్పలు కుప్పలుగా పడిపోతాయి రెక్కలు పక్కన పడిపోతాయి పురుగులు తెల్లవారి లేచి కాకులు బల్లులు తినేస్తాయి కన్ను బాగా పనిచేసినంత మాత్రం చేత ఒక జాతి జాతి అంతా నశిస్తోంది చెవి లౌల్యములు పొంది ఉన్న కారణం చేత ఒక జాతి జాతి మొత్తం పోతోంది లేడికి పాట వినడం అంటే ఇష్టం అది లతా మంగేష్కర్ పాడిందా ఎమ్మ సుబ్బలక్ష్మి గారు పాడారా దానికి అనవసరం పాట వింటే చాలు వేటగాడు చెట్టు మీద కూర్చుని కింద వల
(01:10) పన్ని చెట్టు మించి పాట పాడతాడు పిచ్చిలేడి పైకి చూస్తూ పాట వినబడుతున్న దిశగా చెవి పెట్టి పరిగెత్తుక వస్తుంది కింద ఉన్నటువంటి వలలో కాళ్ళు పడి కింద పడుతుంది. కింద పడి పడడం ఏమిటి కాళ్ళకి బలం ఉంటే లేచి పారిపోతుందని చెట్టు దిగి వచ్చినటువంటి వేటగాడు మొట్టమొదట దొంగ పెట్టి దాన్ని కాళ్ళ మీద కొట్టి కాళ్ళు విరిచేస్తాడు ఇక ఆ లేడి పరిగెత్తలేదు ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాడు అన్నది నేను చెప్పక్కర్లేదు కేవలం చెవికి లౌల్యం ఉంటే ఒక జాతి నశించిపోతుంది నాలుకకి లౌల్యం ఉంటే ఒక జాతి పోతోంది చేప కడుపు నిండా ఉన్నా సరే చేప నీటి అడుగు భాగం నుంచి వెళ్ళిపోతుంటే
(01:52) ఒక చిన్న సూదిని ఉంచి దానికి ఎర పెట్టి వానపావుని కోసి ముక్క తొడిగి పైన పేకబెత్తం పెట్టి కర్రకి తాడు కట్టి లోపలికి వదులుతాడు చేపని పట్టేవాడు అలా వెళ్ళిపోతున్న చేప కడుపు నిండుగా ఉన్న ఒక్కసారి ఎర్రని కొరికి రుచి చూద్దాం అని కొరుకుతుంది లోపల ఉన్న సూది అంగిట్లో గుచ్చుకుంటుంది ఆ పైనున్న పేకబెత్త నీటిలో ములుగుతుంది చేప పడిందని గుర్తురిగి ఇలా అంటాడు ఆ త్రాటితో పాటుగా చేప వచ్చి గట్టు మీద పడిపోతుంది నీటిలోనుంచి బయట పడగానే కొట్టుకుంటుంటే దాని నోట్లో నుంచి ఆ సూది తీసేసి బుట్టలో పడేస్తాడు.
(02:30) కడుపు నిండుగా ఉన్నా కూడా ఒకసారి ఎర్రని కొరకాలనేటటువంటి భ్రాంతితో రసేంద్రియమునందు లౌల్యమును పొందినటువంటి చాపల జాతి అంతా అప్పటి నుంచి ఇప్పటివరకు అలా నశించిపోతూనే ఉంది. ఇక వాసన వాసన చేత భ్రమించి వాసన చేత లౌల్యమును పొంది నశించిపోతున్నటువంటి జాతి ఒకటి ఉంది. తుమ్మెద ఉంటుంది అది పద్మంలో ఉండేటటువంటి మకరందం తాగడానికి వెళుతుంది. వెళ్లి పద్మంలో కూర్చుని మకరంద పానం చేసేస్తుంది కడుపు నిండిపోయింది ఎగిరి వెళ్ళిపోవచ్చుగా ఆ కేసరముల నుండి వచ్చేటటువంటి పుడి వాసన చూస్తూ ఎంత బాగుందో ఈ వాసనని పద్మంలో పడుకుంటుంది కడుపు నిండ తేనె తాగిందేమో తేనెకి మత్తఎక్కించే గుణం ఉంటుంది నిద్ర
(03:15) పట్టేస్తుంది సాయంకాలం అవ్వగానే పద్మానికి ముడుచుకునే లక్షణం ఉంటుంది చంద్రోదయానికి ముడుచుకుంటుంది. ముడుచుకుంది కాబట్టి ఇప్పుడు అందులో ఉన్నటువంటి తుమ్మీదకి పైకి రావడం చేత కాక కొట్టుకుంటూ ఉంటుంది. సాయంకాలం అయితే నీళ్లు తాగడానికి ఏనుగులు వస్తాయి. వచ్చి సరోవరంలో ఉన్న పద్మం యొక్క తూడు తమ తొండంతో పెరికి బయట పారేసి తమ కాలితో తొక్కుతాయి తొక్కినప్పుడు లోపల ఉన్నటువంటి తుమ్మెద ఏనుగు యొక్క పాద తాకిడికి మరణిస్తుంది.
(03:47) అంటే కేవలముగా వాసనా లౌల్యము చేత పద్మంలో పడుకుందాం అనుకునేటటువంటి తుమ్మెదల జాతి అంతా కూడా ముక్కు యొక్క తన్మాత్ర అయినటువంటి వాసన యందు లౌల్యమ ఉన్న కారణం చేత నశించిపోతుంది. ఏనుగుకి స్పర్శేంద్రియమునందు లౌల్యం ఆడ ఏనుగు కనపడితే ఒకసారి ఇలా రాసుకోకపోతే అది ఉండలేదు అందుకే పెద్ద గొయ్యి తవ్వి పుచ్చుకర్రలు పరిచి దాని మీద గడ్డి వేసి ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతారు మట్టితో చేసి ఆడ ఏనుగు కనపడగానే దాన్ని ఒరుసుకుందాం అని వచ్చి ఒక్కసారి ఆ ఆడ ఏనుక్కి తన చర్మాన్ని ఇలా ఇలా రుద్దుతుంది ఆ ఊగడంలో బరువుకి కర్రలు విరిగి గోతిలో పడిపోతుంది ఇక దానికి ఆహ ఆహారం పెట్టరు నీళ్ళ ఇవ్వరు అది
(04:32) సుష్టించిపోయి నీరస పడిపోతే ఆ తిచ్చి నాలుగు చెరుకు కర్రలు పెట్టినటువంటి వ్యక్తి ఆ అంకుశాన్ని చేతితో పట్టుకొని కుంభస్థలం మీద పొడుస్తుంటే తలలోంచి వచ్చిన పోటుకి భయపడిపోయి ఆ అంకుశం చూసిన మామటిని చూసిన భయపడిపోయి ఇంత పెద్ద ప్రాణి అతను ఏం చెప్తే చేస్తుంది అంకుశం అంటే ఎంత భయం అంటే దాని ముందరి రెండు కాళ్ళ ముందు అంకుశాన్ని పెట్టి మామటి పక్కన పక్కన కూర్చుంటాడు తొండం ఇలా ఊపుతుంది కాళ్ళు వెనక్కి కాడిస్తుంది తప్ప ముందరికాలు ఎత్తి మాత్రం అంకుశం మించి బయటికి వేయదు బయటికి వేస్తే అది పెట్టి తలలో పొడుస్తాడని భయం తను కేవలం వేరొక
(05:16) ఏనుక్కి శరీరాన్ని రుద్దుకోవాలన్న కోరికకి స్పర్శేంద్రియ లౌల్యానికి ఏనుగు నశించిపోయింది ఏనుగుల జాతి అంతా నశించిపోతుంది ఐదు ఇంద్రియాలు బలంగా ఉన్నటువంటి మనిషి ఏ శాస్త్రము ప్రమాణంగా లేకపోతే ఒరేయ్ నువ్వు పాడైపోతావురా వాటిని ఇలా వాడుకో అని చెప్పేవాడు లేకపోతే ఈ ఐదు ఇంద్రియములను పట్టుకొని మనసు లాగేస్తే ఎంత పతనం అయిపోతాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో చిట్టచివరికి ఎలా పాడైపోతాడో ఎన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా మారిపోతాడో అని పరమ కరుణామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు వేదాన్ని ప్రమాణంగా ఇచ్చాడు ఇచ్చి ఆచారకాండాన్ని నిర్ణయం చేశాడు ఒరేయ్ నాయనా
(06:02) మీరు మీకు ఇచ్చిన ఇంద్రియాలని ఇలా వాడుకోండి ఇంద్రియముల యొక్క ఉద్ధతిని ఇలా తగ్గించుకోండి అందుకే ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే కామము అర్థము ఈ రెండిటిని కూడా ఈ రెండు పొటమరించకుండా ఉండవు ఈ రెండు ప్రతి మనుష్యుని యందు పొటమరించి తీరుతాయి అవి లేకుండా ఎవరు ఉండడు కానీ భగవంతుడు చెప్పిన మార్గంలోకి మళ్ళస్తారు ఆ మార్గంలోకి మళ్ళితే అది బంధన హేతువు కాదు ధర్మం ఒక చట్రము ఆ చట్రంలోంచి మీరు వెళ్ళినంత కాలం సురక్షితం పట్టాల మీద రైలు వెళ్ళినంత కాలం రైలు సురక్షితం ఆకాశంలో వెళ్లి క్షేమంగా భూమి మీదకి దిగితే విమానం సురక్షితం నీటిలోనే ప్రయాణం చేస్తే ఓడ
(06:46) సురక్షితం ధర్మ చట్రంలోకి ఇమిడితే మనం సురక్షితం ధర్మం ఎవరు చెప్పాలి అంటే వేదం చెప్తుంది ఇలా బ్రతుకు స్నానం ఇలా చెయ్ నిద్ర ఇలా అన్నం ఇలా తిను బట్ట ఇలా కట్టుకో నిద్ర ఇలా నిద్రపో తాంబోలం ఇలా వేసుకో ఆశ్రమం ఇలా ఉండు వర్ణము ఇలా ఉండాలి అందుకే ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే వర్ణాశ్రమముల మీద ఆధారపడుతుంది. ధర్మము ఇక దేని మీద ఆధారపడదు వేదమతము నందు నిర్వందంగా నిర్భయంగా చెప్పవలసిన మాట ఇదే ఇంకొక మాట చెప్పడం సాధ్యం కాదు ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే వర్ణము ఆశ్రమము ఈ రెండిటి మీద ఉంటుంది ధర్మం అందుకే ఇంత పెద్ద సముద్రమంత వాంగ్మయం
(07:35) ఎందుకు రావలసి వచ్చిందంటే అసలు ధర్మము అనేటటువంటిది అందరికీ ఒకటి ఎప్పుడు కానే కాదు నేను ఒక మాట చెప్పి ఇది ధర్మం అండి అన్నాను అనుకోండి కానీ కాదు నేను ఇక్కడ కూర్చుంటే నాకో ధర్మం ఉంటుంది ఈ వేదిక మీదకి ఎక్కాలంటే నాకో ధర్మం ఉంటుంది ఈ వేదిక మించి దిగేటప్పుడు నాకో ధర్మం ఉంటుంది అక్కడ కూర్చుంటే మీకో ధర్మం ఉంటుంది మాట్లాడితే నాకో ధర్మం ఉంటుంది నేనే వచ్చి శ్రోతగా ఉంటే నాకో ధర్మం ఉంటుంది నేను ఇంటికి వెళ్ళిపోతే ఒక ధర్మం ఉంటుంది నా భార్య ముందు ఉంటే ఒక ధర్మం ఉంటుంది వర్ణము ఆశ్రమము అన్ని ధర్మాలు ఒకలా ఉండవు ఏ వర్ణము వారి ధర్మము ఆవర్ణమే బ్రాహ్మణుని ధర్మము
(08:15) బ్రాహ్మణునిది వైశ్యుని ధర్మము వైశ్యునిది క్షత్రియుని ధర్మము క్షత్రియునిది నాలుగవ వర్ణము వారి ధర్మము నాలుగవ వర్ణము వారిది ఇందులో మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి వేదము ఎవరిని తక్కువ చేసి చూడదు ఏ ఒక్కరు కూడా తరించడానికి తలుపులు ముయ్యడం వేదం యొక్క ఉద్దేశ్యము కానే కాదు ఎవరు ఏది చేసినా చేయమన్నది చేసిన వాళ్ళందరూ తరిస్తారని వేదం ఎలుగెత్తి చాటుతుంది మీరు కావాలంటే పంచమవేదం అయిన మహాభారతం చూడండి మహాభారతంలో వ్యాసుడు ఒకటికి పది మార్లు చెప్తాడు లోక ప్రసక్తులు వచ్చినప్పుడు వర్ణ ధర్మాలని ఎవరు పాటించారో వాళ్ళందరూ ఆయా ఉన్నత లోకాలకు చేరుకుంటారు అన్ని
(08:59) వేళలా ఒకరి ధర్మాన్ని ఒకరు పట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు చాలామంది ఏమనుకుంటారంటే వేదం బ్రాహ్మణులకు మాత్రమే బ్రాహ్మణులు పక్షపాతం బ్రాహ్మణులు ఒక్కళ్లే తరించడానికి అలా ఉంటుంది మిగిలిన వాళ్ళ వాళ్ళక అవకాశం ఇవ్వలేదు అనుకుంటారు నేను నిజంగా మీతో వేదంలో బ్రాహ్మణుని యొక్క జీవితం గురించి చెప్పాను అనుకోండి మేము ఇలా పుట్టడం ఎంత అదృష్టమో అంటారు మీరు వేదం చదువుకున్న బ్రాహ్మణుడు కనబడితే నమస్కారం చేసి పరమ భక్తితో ఆయన చెప్పినట్లు చేస్తే చాలు తరించిపోతారు ఒకరు జీవితాంతం త్యాగమూర్తి అయ వేదం చదువుకున్నందుకు త్రికాలముల యందు సంధ్యావందనం చేస్తూ వేద మంత్రాలని ఆమనాయం
(09:39) చేస్తూ ఎప్పుడు ఆ వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతుకుతూ త్యాగేనైకే అమృతత్వమానసుహై బ్రాహ్మణుడు బ్రతకడం అంటే అంత తేలికైనటువంటి మాట కాదు అంత కష్టపడి బ్రతుకుతాడు బ్రాహ్మణుడు అందుకే ఎవరికి ఏది ధర్మమో అది వాళ్ళకి ధర్మం అని చెప్పింది అంత వాంగ్మయం ఎందుకు వచ్చిందంటే వర్ణాన్ని బట్టి ధర్మం చెప్పింది ఆశ్రమాన్ని బట్టి ధర్మం చెప్పింది ఒకడి ధర్మం ఒకడికి ఉండదు ధర్మం అనేటటువంటిది ఇది మీరు ధర్మం పట్టుకోండి మీ అందరూ సంతోషంగా ఉంటారు అన్నమాట అన్వయం అవ్వదు ఎందుచేత ఒక్క మాట అందరికీ అన్వయం ఎప్పుడూ కాదు సామాన్య ధర్మములని కొన్ని ఉంటాయి అవే
(10:19) అన్వయం అవుతాయి అహింస అది కూడా మళ్ళీ కొందరి దగ్గరికి వెళ్ళేటప్పటికి మారిపోతుంది మహాభారతంలో మాంసాన్ని అమ్మినటువంటి వ్యక్తి ఒకాయన ఉన్నాడు ఆయనకి వృత్తి రీచా అది ధర్మం అయిపోయింది అప్పుడు ఆయనకి దోషం రాలేదు అది అందుచేతనే ధర్మం అన్నది ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి బ్రహ్మచారికి ధర్మం వేరు బ్రహ్మచారిగా ఉన్నంత కాలం ఆయన ధర్మమే ఏమి అంటే గురువుగారిని సేవించడం గురుపత్ని పెట్టిన అన్నం తినడం అహంకారం అంతటిని విడిచిపెట్టడం వేదం చదువుకోవడం బ్రహ్మచారికి ఉపవాసం లేదు ఏకాదశి ఉపవాసంలో మినహాయింపబడిన వాళ్ళలో బ్రహ్మచారి ఒకడు
(10:56) ఎందుకంటే బ్రహ్మచారి బలంగా ఉండాలి బాగా చదువుకోవాలి అందుకే మేము వేద పాఠశాల పెట్టాం కానండి వేద విద్యార్థులకు అన్నం మాత్రం పెట్టమని ఎవరు అనరు వేద పాఠశాల పెట్టారు అంటే అన్నం కూడా పెట్టవలసిందే ఎందుకంటే బ్రహ్మచారి అన్నం తినకుండా వేదం ఎక్కడి నుంచి చదువుకుంటాడు బ్రహ్మచారికి ఉపవాసం లేదు ఎందుకు లేదు అంటే బలంగా ఉండాలి బాగా చదువుకోవాలి బాగా ఆమనాయం చేయాలి స్వరం పెట్టి అందుకే బ్రహ్మచారి యొక్క ధర్మం వేరు కాటుక పెట్టుకోకూడదు తాంబూలం వేసుకోకూడదు ఆయన ఎక్కడ కూడా అద్దం చూసుకోకూడదు భోగం పట్ల అనురక్తితో ఉండకూడదు దానం పట్టకూడదు రేపటికని దాచుకోకూడదు ఆకలి వేస్తే సన్యాసి
(11:34) ఎలా పెడతాడో అలా భిక్ష కోసం పెడతాడు గృహస్తుకి ప్రధాన ధర్మం ఏమిటి అంటే బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడం మరి బ్రహ్మచారి ధర్మం ఒకటి బ్రహ్మచారికి చెప్పిన ధర్మాన్ని సభలో చెప్పి మీ అందరూ పాటించండి అంటే ఎలా కుదురుతుంది కుదరదు బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది నేను చెప్పే మాటల్లో ధర్మం బ్రహ్మచార్యులు పట్టుకోవాల్సింది బ్రహ્ર్చార్యులు పట్టుకోవాలి గృహస్తు గృహస్తు యొక్క ధర్మం గృహస్తుది గృహస్తు దానం పట్టొచ్చు భోగం వేదం ఎలా చెప్పిందో అలా అనుభవించవచ్చు ఎందుకని మీరు ఋషుల యొక్క వేదం యొక్క ఈశ్వరుడి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి
(12:10) అసలు మనుష్యునికి కామము లేకుండా ఉండడం సాధ్యము కానే కాదు కామము పొటమరించి తీరుతుంది. వస్తువుల పట్ల కామం విడిచిపెట్టండి ఎవరో మహా పురుషులు పుట్టుక చేత నిస్సంగులైన సుఖ బ్రహ్మ వామదేవుడు వంటి వారిని పక్కన పెట్టండి నూటికి 99 మంది నూటికి నూరు మంది స్త్రీ పురుష సంబంధమైన కామం కూడా పొందుతారు గర్భాష్ట్రమంలో ఉపనయనం చేయమని ఎందుకు చెప్పారు గర్భాష్టమం అంటే బ్రాహ్మణుడికి అమ్మ కడుపులో ఉన్న 10 నెలలు కూడా లెక్కలో పెట్టుకొని ఏడు సంవత్సరముల రెండు నెలలు వచ్చేటప్పటికి ఉపనయనం చేయమన్నారు ఎందుకు అంటే లింగ వివక్ష తెలుస్తుంది కాబట్టి ఆయన యొక్క యొక్క తేజస్ శక్తిని ఓజో శక్తిగా
(12:48) మార్చడానికి ప్రయత్నం చేసింది శాస్త్రం కాబట్టి ఇప్పుడు బ్రహ్మచారికి ఉండేటటువంటి ధర్మం ఒకటి గృహస్తు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన ఒక వయసు వచ్చిన తర్వాత బ్రహ్మచారిలో కామము పొటమరిస్తే బలవంతంగా కామాన్ని తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు అనుకోండి అది పాము తలమీద కాలు పెడితే కొంత కాలం అయిన తర్వాత బాగుంటుంది పాము నా కాలు కింద ఉంది కదా నన్ను ఏం చేస్తుంది అనుకుంటాడు కానీ పడగ పరగ మీద కాలు పెట్టి నించున్నవాడు అలాగే నించోలేడు అది తోక కదుపుతుంది కాలుని చుట్టుకుంటుంది బుస కొడుతూ ఉంటుంది భయపడిపోయి కాలు తీసేస్తాడు కాలు తీయగానే పాము చేసే మొదటి పని ఏమిటంటే
(13:29) ఏ కాలుతో తొక్కాడో ఆ కాలునే కాటేస్తుంది ఇంద్రియాల్ని బలవంతంగా తొక్కి పెడితే ఇంద్రియములు కాట్లు వేస్తాయి మళ్ళీ పతనం అయిపోతాడు పతనం అయిపోకుండా ఉండడానికి ఆశ్రమము మార్పు అన్న కట్టు వేస్తారు కట్టు విప్పరు కట్టు మీద కట్టు వేస్తే కట్టు జారిపోతుంది. బ్రహ్మచర్యశ్రమము మీదే గృహస్థాశ్రమం అన్న కట్టు వేస్తారు. వేస్తే ఇప్పుడు ఆమె ధర్మపత్ని అంతే కానీ ఆమె కామపత్ని కాదు ఆమెను స్వీకరించి తన యొక్క కామం ఆమె యందు ఉంచుకుంటాడు ఆమెతో కలిసి యజ్ఞం చేస్తాడు ఆమెతో కలిసి యాగం చేస్తాడు ఆమెతో కలిసి భోగం అనుభవిస్తాడు దాని వలన అర్థం కలిగింది పుత్రుడు పుత్రిక ఆడపిల్ల
(14:13) పుట్టింది కాబట్టి కన్యాదానం చేసి దశపూర్వేషాం దశాపరేషాం మగపిల్లవాడు పుట్టాడు కాబట్టి ఆయనకి ఉపనయనం చేస్తే రేపు పొద్దున్న తండ్రి శరీరం పడిపోయిన తర్వాత గయా శ్రాద్ధం పెట్టి ఇంట్లో పూజా మందిరంలో మంగళహారతి ఇస్తూ గోత్రనామాలతో పూజ పరంపరాగతంగా నడిచేటట్టు చేస్తాడు కాబట్టి ధర్మపత్ని వలన ధర్మబద్ధమైన కామము వలన అర్థము కొడుకు కూతురు కలిగారు గృహస్తుకు ఉండేటటువంటి ధర్మం వేరు బ్రహ్మచారి ధర్మం వేరు మారిపోయింది.
(14:41) వానప్రస్తు ఆయన ధర్మం వేరు సన్యాసి ఆయన ధర్మం వేరు అందుకే మీరు చూడండి బ్రహ్మచారికి కానీ గృహస్తుకి కానీ వానప్రస్తుకి కానీ సన్యాసికి కానీ నాలుగు ఆశ్రమాల్లో ఏ ఆశ్రమానికి కూడా ధర్మము నుండి మినహాయింపు మాత్రము లేదు ఎవరికైనా సరే నిన్ను ధర్మం నుంచి మినహాయించేశాం నీకు ధర్మం అన్వయం అవ్వదు అనేటటువంటి ఆశ్రమము మాత్రము ఉండదు సనాతన ధర్మంలో అందరూ ధర్మాన్ని పట్టుకోవలసిందే సన్యాసి కాషాయం కట్టుకున్న ఆయనకో ధర్మం ఉంది ఆయన అగ్నిహోత్రం చేయకూడదు అగ్నిహోత్రం మీద తన కొరకు అని వండుకోకూడదు భిక్షావందనం ద్వారా వచ్చినటువంటి అన్నాన్ని మాత్రమే తినాలి అగ్ని
(15:27) సంపర్కాన్ని విడిచిపెట్టేసాడు కాబట్టి ఆయన శరీరం పడిపోయిన తర్వాత శరీరాన్ని కూడా అగ్ని సంస్కారం చేయరు భూమిలో పెట్టి దాని మీద తులసికోట పెడితే బృందావనం శివలింగం పెడితే అధిష్టానం అంటే సన్యా సన్యాసికి కూడా ధర్మం ఉంది సన్యాసి వాహనం ఎక్కకూడదు సన్యాసి కేవలం పాదచారి అయ తిరగాలి పీఠాధిపతి అయ పీఠ పరంపర పీఠంలో ఉండేటటువంటి వైభవం అంతా వెనక ఏనుగులు గుర్రాలు ఒంటెలు వస్తున్నా సరే తాను శిష్యులు మోసిన పల్లకీలో కానీ కాలి నడకన కానీ వెళ్ళాలి తప్ప వాహనం ఎక్కి సన్యాసి ఎన్నడూ తిరగరాదు అది సన్యాసికి ప్రధాన ధర్మం చాతుర్మాస్య వ్రతం చేయడం సన్యాసికి
(16:08) ప్రధాన ధర్మం ఇవి నేను విడిచిపెడతా అన్నప్పుడు సన్యాసాశ్రమ ధర్మాన్ని అనుసరించినట్లుగా చెప్పడం చాలా కష్టం అవుతుంది. ధర్మము ధర్మమే ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళైనా ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి ధర్మాన్ని పాటించవలసిందే అన్ని ఆశ్రమాల్లోకి సర్వోత్కృష్టమైన ఆశ్రమం ఏది అని అడిగారు. రామాయణం చెప్పినా, భారతం చెప్పినా, భాగవతం చెప్పినా, అన్ని ఆశ్రమములలోకి గొప్ప ఆశ్రమం ఏది అంటే గృహస్తు యొక్క ఆశ్రమమే.
(16:36) ఎందుచేత అంటే గృహస్థ అనేటటువంటి వాడు లేనినాడు బ్రహ్మచారికి అన్నం లేదు సన్యాసికి భిక్ష లేదు అసలు ఇంతమందికి భిక్ష పెట్టి సన్యాసి వైరాగ్యం వచ్చి శరీరం ఉంటే ఉంది పడిపోతే పడిపోయింది అని బతుకుతాడు బ్రహ్మచారి ఎవరో పెట్టిన అన్నంతో వేదన నేర్చుకుంటాడు గృహస్తు 10 మందిని పిలిచి ఆతిధ్యం ఇచ్చి పంచయజ్ఞములు చేసి సమాజం నిలబడేటట్టు చేసి తను తరించేవాడు గృహస్తు అందుకే గృహస్తాశ్రమ ధర్మము అన్ని ధర్మములలో లోకి గొప్పది ధర్మంలో బాగా కిందకి రావడానికి అవకాశం అందుకే గృహస్తుకి కల్పించారు.
(17:12) ఎందుకు కల్పించారు అంటే మీరు వేదంలో వేదం స్పృషించనటువంటి అంశం ఉండదు బట్ట కట్టుకోవడం దగ్గర నుంచి స్నానం వరకు స్పృషిస్తుంది. స్నానంలో గృహస్తు దగ్గరికి వచ్చేటప్పటికి ఒకవేళ నువ్వు చన్నీటి స్నానం చేయలేకపోతే తల మించి నీళ్లు పోసుకోలేకపోతే విభూతి ఒంటి మీద చల్లుకో చాలు నీ స్నానం అయిపోయినట్టే నువ్వు సంధ్యావందనం చేయలేక మృత్యుశయ్య మీద ఉంటే నీ కొడుకు సంధ్యావందనం చేసి నోట్లో తీర్థం పోస్తే సంధ్యావందనం చేసినట్లే అంటే ధర్మం నుంచి మినహాయింపు ఇవ్వలేదు ధర్మంలో ఆచరణమునందు గృహస్తుకు ఉండేటటువంటి కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం కిందకి వెళ్ళడానికి
(17:53) అవకాశం ఇచ్చింది. ఒకరోజు ఏ కారణం చేతనో సంధ్యావందనం చేయడం కుదరలేదు సంధ్యావందనం చేసేవాడికి చెప్పి వెళ్ళవచ్చు అయ్యా మీరు అర్గ్యం ఇచ్చిన జలం ఉంచండి నేను వస్తానని చెప్పి వెళ్లి అర్గ్యం ఇచ్చిన జలాల్లోనుంచి తీర్థం పుచ్చుకొని అప్పుడు తను అన్నమో పలహారమో తినొచ్చు అప్పుడు సంధ్యావందనం చేసినట్టే ఎందుకు ఇచ్చింది గృహస్తుకి మినహాయింపు అంటే గృహస్తు అనేకమైన ఒత్తిడుల మధ్య ఉంటాడు అందుకే ధర్మాన్ని అంత కఠినంగా పట్టుకోమంటే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అన్నీ వదిలిపెట్టేసిన ఇష్టం వచ్చినట్టు తిరిగని మాత్రం వేదం ఒప్పుకోదు అవకాశాన్ని
(18:30) శరీరమునకు ఉండేటటువంటి దౌర్బల్యాన్ని దృష్టిలో పెట్టుకొని అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్తుంది చాలామంది తెలియక ఒక మాట అంటూ ఉంటారు మూఢాచారాలుండి అంటారు మూఢాచారాలు మూఢాచారాలు అని చెప్పినటువంటి వాళ్ళందరి యొక్క కోరిక ఏమిటంటే ఆవుని చంపేయాలి కాబట్టి ఆవుని చంపేస్తున్నాం అంటే బాగుండదు కాబట్టి దానికి కుక్క అని పేరు పెట్టి కొట్టడం కుక్క అని పేరు పెడుతున్నాం కదా ఆవు అని తెలిసి కుక్క అంటూ కొట్టి ఆవుని చంపడం ఎటువంటిదో వేదం చదవకుండా రామాయణ భారత భాగవతాలు చదవకుండా వేద ధర్మం ఎంత గొప్పదో తెలుసుకోకుండా వేదము మౌడ్్యము ఇది మూఢాచారం అని మాట్లాడడం కూడా అంతే దారుణం ఆవుని చంపి
(19:10) కుక్కని చంపానని చెప్పడం ఎంత తప్పో వేదం చదవకుండా మూఢాచారం అని చెప్పడం అంతే తప్పు వేదం ఎక్కడా కూడా మీరు ఇలాగే చేసి తీరండి ఇలా చేయకపోతే పాడైపోతారు అందం ఏ భూమికలో ఉన్నవాడైనా చేయడానికి అవకాశం ఇస్తుంది ఆచారకాండ మనసుని శుద్ధి చేయడానికి పనికొస్తుంది అందుకే మీరు ఏది పట్టుకోవడానికి ఎంత ఏ స్థితిలో ఉన్నారో చూస్తుంది ఏకాదశి ఉపవాసం చేయండి ఏకాదశి ఉపవాసం బ్రహ్మచారికి వద్దు కాయి కష్టం చేసేవాడికి వద్దు గర్భిణికి వద్దు అప్పుడే ప్రసవమైనటువంటి తల్లికి వద్దు 80 సంవత్సరములు వయసు దాటిన నటువంటి వృద్ధునకు వద్దు మినహాయింపులు ఇచ్చింది ఎందుకని ఆ
(19:54) వ్యక్తి ఉపవాసం చేస్తే శరీరం పడిపోతుంది అందుకే వారికి ఉపవాసం నుంచి మినహాయింపిచ్చింది వేదం ఎక్కడ ఇలా చెయ్యి చూపించి మనుష్యులు పాడైపోయేటట్టు ఆచారం పాటించమని చెప్పింది ఎక్కడా వేదం అలా చెప్పలేదు అలా నువ్వు అనుకుంటున్నావు ఏమీ చదువుకోకుండా వేదం చదివితే వేదం మనిషి తరించడానికి ఎన్ని మార్గాలు చెప్పిందో అర్థం అవుతుంది అందరికి సాధారణంగా అందరిలో ఉండే అభిప్రాయం ఏమిటంటే అసలు ఇంత ఆచారకాండ ఎందుకు అంటారు నేను ఒక్క మాట చెప్తాను జ్ఞాపకం పెట్టుకోండి ఆయన ఎక్కడో అమెరికాలో చదువుకని వచ్చాడు ఒక గోరు చుట్టు వేసినప్పుడు వచ్చినటువంటి పుండు కొయ్యడం ఆయనకి అలవ ఒక కోసేయగలడు
(20:35) కానీ ఆయన అలా కొయ్యడు ఒక గోరు చుట్టు కొయ్యాలి అంటే ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ ఏ సూటు వేసుకోవాలో సూట్ వేసుకుని ఆ శస్త్ర చికిత్స చేయవలసిన గదిలోకి వెళ్లి కోస్తున్నాడు నాలుగు వీధుల కూడలలో లో నిలబడి వాహనాలని నియంత్రించేటటువంటి రక్షక భటుడు తాను ఎలా పడితే అలా నించో నించుని చేతిలో ఆ సౌజ్ఞ పట్టుకోవచ్చు కానీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రములను ధరిస్తున్నాడు.
(21:03) కొంత కొంత చోట్ల కొంత కొంతమంది కార్మికులు ఒక రకమైన దుస్తులు ధరిస్తారు ఇవ్వాళ అనేకమైనటువంటి చోట్ల ఆ ఉద్యోగానికి చెందిన వాళ్ళమో అని గుర్తుపట్టడానికి వీలైనటువంటి పత్రాన్ని మెడలో వేసుకుంటారు ఒక బ్యాడ్జ్ వేసుకుంటారు ఒక టోకెన్ని ఒక ట్రైన్ వెళ్ళడానికి ఒక సిగ్నల్ ఇస్తారు ప్రమాదం ప్రమాదం కాదు వెళ్ళవచ్చు వెళ్ళకూడదు అని చెప్పడానికి ఇవన్నీ దేనికి వచ్చాయి ఆచారము అంటే ఇలా పాటిస్తే నువ్వు క్షేమంగా ఉంటావు నువ్వు భద్రంగా ఉంటావు ఏమీ పాటించకుండా మనసుని మీరు స్వచ్ఛంగా ఉండమన్నారు అనుకోండి ఒక్కనాటికి సాధ్యం కాదు మనసు అలా ఆ మాట వినదు మనసు కొన్ని కోట్ల జన్మల
(21:45) నుంచి స్వేచ్ఛగా తిరగడానికి అలవాటు పడిపోయింది మీరు పూజకి కూర్చోగలరేమో మనసుని పూజలో కూర్చోబెట్టండి ఇలా కూర్చోగానే పూజలో మనసు కూడా కూర్చుంది అనుకోండి వాడు యోగి ఇక వాడికి సాధన అక్కర్లేదు మనం పూజకు కూర్చుంటాం పరికరాలన్నీ పెట్టుకుంటాం కానీ పువ్వు తీసి ఈశ్వరుడి మీద వేస్తుంటే మొదటి నామానికి ఉంటుంది రెండో నామానికి వెళ్ళిపోతుంది ఎక్కడికో ఏదో ఆలోచిస్తూఉంటుంది ఆ మనసుని నియంత్రించాలంటే మనసుని వెనక్కి తీసుకురావాలంటే మనసు ఏ కారణముల చేత బాగా ఉద్వేగాన్ని పొందుతుందో వాటిని నియంత్రిస్తారు ఒక క్షేమంగా వెళ్ళాలి అనుకుంటే ఒక కారుకి రెండు ఉండాలి యక్సిలరేటర్ ఈ కారుకి
(22:28) బాగుంటుందండి తొక్కితే 120 కిలోమీటర్లు వెడుతుంది గంటలో మిమ్మల్ని రాజమండ్రి తీసుకెళ్తాను కోటేశ్వరారు అంటే నేను ఎక్కి కూర్చున్నాను అనుకోండి తొక్కాడు 120 కిలోమీటర్లు వెడుతుంది కుక్క అడ్డు వచ్చింది దీనికి బ్రేక్ లేదండి అన్నాడు అనుకోండి ఏమనా పనికవస్తుందా నా ప్రయాణం కారుకి యక్సిలరేటర్ ఒకటే కాదు ప్రధానం బ్రేక్ కూడా ప్రధానం ఎంత వేగంగా వెడతావో అంత అదుపులో కూడా ఉంచగలిగినది ఒకటి ఉండాలి ఎంత వేగంగా మనసు వెళ్ళగలగదో దాన్ని భగవంతుని వైపుక ఆ వేగాన్ని తిప్పడానికి పరికరం కావాలి అది ఆచారకాండ నేను తెల్లవారు జామున లేచి స్నానం చేశాను
(23:04) ఈశ్వరుడి కొరకు పూజక వెళ్ళాలి నేను ఒక ప్రత్యేకమైన బట్ట కట్టుకున్నాను ఈశ్వరుడి యందు నా మనసు నిలబడాలి నేను ఒక పూజా మందిరాన్ని నిర్ణయం చేసుకొని వెళ్లి ఒక దర్భాసనం మీద కూర్చున్నాను నా మనసు నిలబడాలి వేద మంత్రాన్ని విన్నాను నా నాడులు ఆ సాత్వికమైన గుణం చేత నొక్కబడాలి ప్రాణాయామం చేశాను ఊపిరిని నియంత్రించడం వల్ల మనసు నిలబడాలి మనసు నిలబడింది కాబట్టి భగవదారాధన యందు నేను రమించాలి అప్పుడు క్రమంగా మనసు యొక్క వేగం అంతా ఈశ్వరుడి వైపుకు తిరుగుతుంది.
(23:37) అస్తమానం ఆయన్నే పట్టుకోవడం అలవాటు చేసుకుంటుంది. ఆ మనసుంటే చాలదా అండి అంటాడు ఒకడు మనసుంటే చాలదా నిజమే మీ నేనేం పూజలు చేయనండి మనసు ఉంటే చాలదా ఎందుకండి ఇవన్నీ అంటాడు మంచిదే నేను కాదన్నా హైదరాబాద్లో నా కొడుకు ఉన్నాడు నేను కాకినాడలో ఉన్నాను కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు వచ్చాయి ఎవరో తీసుకొచ్చి బుట్టతో పళ్ళు ఇచ్చారు ఆ పళ్ళు ఇలా గడ్డి విప్పి చూడగానే వచ్చిన వాసన చూసి నా కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు కొత్తపల్లి కొబ్బరి పండు అంటే ఎంత ఇష్టమో హైదరాబాద్లో ఉన్నాడు పాపం అని నాకు తెలిసిఉన్న వాళ్ళని పిలిచి ఓ బుట్టలో పెట్టి కాస్త ఇది బస్సుకి ఇచ్చి మావాడి
(24:13) ఇంటి దగ్గర ఆగే బస్ స్టాప్ లో డ్రైవర్ ని అడిగి తీసుకోమని చెప్పండి ఫోన్ చేస్తాను కాస్త బస్సులో పంపిద్దురు అని పంపించాను ఏ కొడుకు మీద ప్రేమ ఉంటే చాలదా మనసు ఉంటే చాలదా మామిడి పళ్ళు ఎందుకు పంపించావు ఏ కొడుకు విషయంలోకి వచ్చేటప్పటికి మనసు ఉంటే సరిపోలేదు మామిడి పళ్ళు పంపిస్తావా ఈశ్వరుడి విషయంలో మాత్రం మనసు ఉంటే చాలదా ఉపచారాలు ఎందుకా దాన్ని మెట్ట వేదాంతం అంటారు కాబట్టి అవి ఎందుకు వచ్చాయి అంటే ఆచారకాండ ఎందుకు వచ్చింది అంటే నీకు ప్రీతి భగవంతుని యందు ఉద్దీపనం కావడానికి అది ఎంత ఉద్దీపనం కావాలి అంటే కష్టంలో సుఖంలో ఎప్పుడైనా భగవంతుడే
(24:49) జ్ఞాపకం వచ్చేటట్టుగా మనసు సత్వగుణంలోకి వెళ్ళాలి అంటే ఆచారకాండ పాటించాలి ఆచారకాండ పాటించకపోతే మనసుని అలా నిలబెట్టడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు ఎక్కడో మహాత్ములు ఉండొచ్చు ఏ స్థితిలో కూడా భగవంతుే ఆరాధించిన వాళ్ళు అప్పై దీక్షితుల వారిని ఒక మహానుభవ వాడు ఉండేవాడు ఆయన శిష్యులని పిలిచి చెప్పాడు ఏమయ్యా నేను పిచ్చెక్కే మందు తాగుతాను ఆ మందు తాగితే గంటసేపు పిచ్చెక్కుతుంది నేను లోపలికి వెడతాను మీరు బయట తలుపులు తాళం వేసేయండి ఆ గంట సేపు పిచ్చెక్కినప్పుడు మనసు నా యొక్క వశంలో ఉండదు కదా వదిలి పెట్టేసాను ఇప్పుడంటే ఆచారంతో పట్టుకున్నాను నేను నా మనసు మీద ఎంత
(25:29) అధికారం సంపాదించానో తెలియాలి దానికి విచ్చలవిడితనం కల్పిస్తాను ఒక గంట పిచ్చ ఎక్కేటట్టు ఆ పిచ్చెక్కినప్పుడు నా మనసు ఏం చేస్తుందో మనసు ఏం చెప్తే నేను ఏం చేస్తున్నానో గురువుగారు కదా అని మొహమాట పడకండి నేను ఏం మాట్లాడానో ఏం చేశానో వ్రాయండి గంట పోయాక పిచ్చి తగ్గిపోతుంది బయటికి వచ్చి చూస్తాను అన్నారు ఆయన పిచ్చెక్కగానే ఒక గంట సేపు ఆ ద్రవ్యాన్ని స్వీకరించినందుకు గంట సేపు పిచ్చెక్కినప్పుడు ఆయన పరమేశ్వరుడి మీద స్తోత్రం చేశారు.
(26:02) ఆ గంట పిచ్చిలో ఆయన చేసినటువంటి స్తోత్రం ఉన్మత్తశతి అని ఆయన చేసినటువంటి ప్రత్యేకమైన శ్లోకాలకు దాని పేరే ఉన్మత్త శబ్దంతో వచ్చింది పిచ్చి ఎక్కినప్పుడు రచించినది అని అంటే మనసు అంత ఉన్మాదంలో ఉన్నప్పుడు కూడా ఈశ్వరుని పట్టుకుంది అలా పట్టుకోగలగాలి అంటే మనుష్య జన్మ సార్ధక్యం పొందాలి అంటే ఆచారకాండ ధర్మము అవసరం అందుకే మీరు సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే రెండే అక్షరాలు ధర్మం ఈ ధర్మం ఎక్కడ ఉంటుంది అంటే వేదమునందు ఉంటుంది ఏ వర్ణం వాడు ఎలా బతకాలి ఎక్కడ ధర్మం ఎలా ఉంటుంది ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ ప్రసంగం అక్కర్లేదు దీని
(26:43) గురించి నిరంతరం మారిపోయేది ధర్మం నిరంతరం మారిపోయే ధర్మం ధర్మ చట్టంలోకి ఇమిడితేనే కర్మగా ఉండాలి. ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే నేను మీతో ఇందాక మనవి చేశ ఇక్కడ కూర్చుంటే నాది చెప్పే ధర్మం అక్కడ కూర్చుంటే వినడం ధర్మం నేను కార్ ఎక్కితే డ్రైవర్ నాకన్నా చాలా తెలివైనవాడు కార్ని ఎలా నడపాలో అతనికి తెలుసని నేను కూర్చోవాలి ఇో ఒక మాట చెప్పొచ్చు రెండు మాటలు చెప్పొచ్చు 80 కిలోమీటర్ల కన్నా వెళ్ళకయ్యా వానబడిందిగా రోడ్డు తడిసి ఉంది అనొచ్చు అంతేగాని స్టీరింగ్ ఇలా పట్టుకో ఇలా తిప్పుతుంది కాళ్ళు ఉన్నాయా యక్సిలరేటర్ మీద ఉందా బ్రేక్ మీద ఉందా
(27:22) ఇన్నా అనుకోండి ఉపద్రవం వస్తుంది. అక్కడ అతను పెద్దవాడు అతను నడుపుతాడు నేను క్షేమంగా ఉంటాను ఎక్కడి ధర్మం అక్కడ ఇక్కడ ఉపన్యాసం చెప్పినట్టు కార్లో డ్రైవర్ కి చెప్పాను అనుకోండి వాడు రాజానగరంలో అదిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఎక్కడ ఉండేటట్టు అలా ఉండాలి నేను రేపు నా కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి నా పై అధికారి కనపడితే మీ అందరూ నాకు నమస్కారం చేయొచ్చు నేను ఆయనకి ముందు నమస్కారం చేస్తాను ఎందుచేత అంటే ఆయన విష్ణు స్వరూపం నాకు అధికారి అధికారం ఉంది అంటే విష్ణువు కాబట్టి నాకు ప్రత్యక్షంగా వెంకటాచలంలోని వెంకటేశ్వరుడే అలా కూర్చుని ఉన్నాడు అయ్యా నమస్కారం అండి
(27:58) నా సీట్లో కూర్చుంటాను అలా నమస్కారం పెట్టడానికి నా మనసేం తబ్బిబ్బ అయిపోదు ఏడు ఇంతమందితో నమస్కారం పెట్టించుకున్నవాడిని నేను వీనికి నమస్కారం పెట్టడం ఏమిటని నాకేం నలుగుడు ఉండదు ఎందుకు ఉండదు అంటే ధర్మానుష్టానం చేత శాంతిగా ఉంటాను అక్కడ నేను ఒక స్థాయి నా పైవాడు కనబడితే నమస్కారం నా కిందివాడు కనబడితే అతను సక్రమంగా పని చేయడం ఎలా చేయాలో నేను చెప్తాను క్షణక్షణం మారిపోతుంది ధర్మం నా భార్య ముందు నించుంటే నాది ఒక ధర్మం నా కొడుకు ముందు నించుంటే ఒక మాట మాట్లాడినా నా కొడుకు అది ఆదర్శవంతంగా ఉండాలి నాన్నగారే ఇలా మాట్లాడతారు మనం ఎందుకు మాట్లాడకూడదు
(28:32) అనేలా నేను మాట్లాడకూడదు నా కూతురు దగ్గర నించుంటే అది రేపు అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ధర్మం పాటించాలో నేను అలా పాటించ అలా మాట్లాడాలి నేను వీధిలోకి వస్తే పౌరుడిని కాబట్టి పన్నులు కట్టడంలో 10 మందితో కలిసిపోయి సహజీవనం చేయడంలో ఒక పౌరుడిగా ధర్మం పాటించాలి ధర్మం అనేటటువంటిది ప్రతి క్షణం మారిపోతుంది ప్రతి క్షణం మారిపోయేటటువంటి ధర్మం ఎలా పట్టుకోవాలి ఎలా ఉండాలి అని చెప్పగలిగినది వేదం ఒక్కటే ఒక తండ్రిగా నువ్వు ఎలా ఉండాలో వేదం చెప్తుంది ఒక తల్లిగా ఎలా ఉండాలో వేదం చెప్తుంది ఓ కొడుకుగా ఎలా ఉండాలో వేదం చెప్తుంది ఓ శిష్యుడిగా ఎలా ఉండాలో వేదం
(29:13) చెప్తుంది స్నానం ఎలా చేయాలో వేదం చెప్తుంది అందుకే వేదము సంహిత పాఠము ఆరణ్యకము బ్రాహ్మణము అని మూడుగా వస్తూ ఉంటుంది. సంహిత పాటము అంటే వేదం అందరూ నేర్చుకుంటారు సంహిత మంత్ర భాగాన్ని ప్రధానంగా సంకలనం చేస్తారు అది బ్రాహ్మణము అనేటప్పటికి యజమాని యొక్క క్షేమం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి హోమ రూపంలో దాన్ని అనుష్టాన పర్యంతంలోకి తీసుకొచ్చినప్పుడు దానికి మార్గదర్శనం చేసేటటువంటి సూచి ఏది ఉంటుందో దాన్ని బ్రాహ్మణం అంటారు ఆరణ్యకము అని ఒక భాగం ఆరణ్యకము అన్న భాగాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి కోవాలి వేదంలో అసలు ఈ వేదంలో చెప్పిన ధర్మం
(29:55) పాటించడం కానీ వేదాన్ని పట్టుకోవడం కానీ ఈ ధర్మానుష్టానం కానీ దేని కొరకు అంటే కేవలం పుణ్యం కోసం కాదు కేవలం పుణ్యం సాధించుకున్నారు అనుకోండి పర్వతాల పర్వతాలంతా పుణ్యం సాధించేశరు దాన్ని చాలా వేగంగా ఖర్చు పెట్టించడం పరమేశ్వరుడికి తెలుసు ఒక రాష్ట్రపతిని చేసి ఐదేళ్ళు కూర్చోపెట్టాడు అనుకోండి వెయి జన్మల పుణ్యం పోతుంది.
(30:20) ఎందుకంటే అంత పెద్ద భవంతిలో ఉన్నందుకు అన్ని గుర్రాల రథం ఎక్కినందుకు అంత రక్షణ కల్పించుకున్నందుకు ప్రథమ పౌరుడు అనిపించుకున్నందుకు ఈ గౌరవాల్లో పోతుంది. అదే అరణ్యకము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ మంత్ర భాగాన్ని పరిశీలనం చేసి అందుకే అరణ్యంలో కూర్చుంటాడు రిషి ఏకాంతమునందుండి బాగా మననం చేసి అందులో ఉన్నటువంటి విషయాన్ని గురించి బాగా ఆలోచించి దాన్ని జ్ఞానంగా పరిణితిలోకి తెచ్చుకుంటాడు అలా తెచ్చుకునేటటువంటి ప్రక్రియ చేత చిత్తశుద్ధి కలుగుతుంది ఈ చిత్తశుద్ధి జ్ఞానం పొందడానికి కారణం అవుతుంది.
(30:59) ఆవు పాలు పట్టుకొచ్చారు అనుకోండి అయ్యా కోటేశ్వరారు పాలు తాగండి అని తెచ్చారు చెంబుతో ఇలా పోయండి అన్నాను ఇలా పాత్ర పట్టాను ఆ పాత్ర లోపల బూడిది ఉంది అయ్యయ్యో దాని నిండ బూడిది ఉందండి అందులో ఎలా తాగుతారు పక్కన పెట్టేయండిఅని ఇంకో పాత్ర తెచ్చారు అసలు పాత్రకి శుద్ధి లేకుండా అందులో పదార్థం ఎలా పోస్తారు పాత్రకి శుద్ధి కావాలి పాత్రకి శుద్ధి లేనిది కాదు ఉన్నదే దానికి తర్వాత మలినం అంటుకుంది మీరు బాగా గమనించండి మీ దగ్గర ఒక రాగి పాత్ర ఉంది నేను దాన్ని మీరు బాగా శుభ్రం చేయండి అని కొంత చింతపండు కొంత ఉప్పు దానితో పాటుగా కొంచెం ఆవుపేడ ఇచ్చాను ఇప్పుడు ఈ మూడు
(31:37) కలిపి రాగి పాత్ర తోమారు మీరు ఇప్పుడు ఈ రాగి పాత్ర తోమవడానికి మీరు ఉపయోగించిన చింతపండు ఉప్పు ఆవు పేడ పోనీ పేడ పక్కన పెట్టండి ఈ చింతపండు ఉప్పు చారు కాచుకోవడానికి పనికొస్తాయా మళ్ళీ ఇక పనికి రావు కానీ దేనికి పనికి వచ్చాయి పాత్ర మిరిసిపోతూ తయారయింది పాత్ర మెరిసిపోతూ తయారయ్యేటట్టు చింతపండు ఉప్పు చేశయా మెరిసిపోతూ ఉన్న పాత్రకి పట్టుకున్న మలినాన్ని పోగొట్టాయా కొత్తగా మెరిసేట్టు చేయలేదు ఆ మెరుపు దానికి ఎప్పుడ ఉంది ఇప్పుడు ఆ మెరుపుకి అడ్డంగా మలినం వచ్చింది ఆ మలినం పోయేటట్టు చేశయి చింతపండు ఉప్పు మలినం పోగొట్టడానికి ఉపయోగించిన చింతపండు ఉప్పు ఇక
(32:21) ఉపయోగించుకోవడానికి పనికిరావు అలాగే ఇక్కడ పట్టుకున్నటువంటి మాలిన్యాన్ని తొలగించడానికి పుణ్యకర్మ చేశారు అనుకోండి ఎందుకు చేస్తున్నావు ఈ పుణ్యకర్మ చిత్తశుద్ధి కొరకు చిత్తశుద్ధి కొరకు కర్మ చేశారు అనుకోండి అందుకే ఇష్టాపూర్తములను ఎందుకు చేస్తారఅంటే చిత్తశుద్ధి కొరకు చేయాలి ఇప్పుడు ఏమైంది చిత్త శుద్ధి ఏర్పడింది చిత్తము శుద్ధి పొందితే ఏదో ఒకనాడు ఈశ్వరుడి కారుణ్యము కలుగుతుంది అది ఎప్పుడు కలుగుతుంది అంటే చెప్పడం కష్టం ఎప్పుడో కలుగుతుంది కలిగిన ఉత్తరక్షణంలో జ్ఞానము కలుగుతుంది జ్ఞానము కలిగితే అంతటా ఉన్నది బ్రహ్మమే అన్నది ఎరుకలోకి వస్తుంది
(32:58) అనుభవంలోకి వస్తుంది. అది ఎప్పుడు కలుగుతుంది అన్నది చెప్పలేం అది భక్తితో కర్మాచరణం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అన్నం ఉండేవాడు ఏం చేస్తాడు ఓ కుక్కర్ తీసుకొస్తాడు కుక్కర్ శుభ్రంగా కడుగుతాడు అందులో నీళ్ళు పోస్తాడు ఓ డబ్బా బియ్యం పోస్తే రెండు డబ్బాలు నీళ్ళు పోస్తాడు ఆ కుక్కర్ మీద మూత పెడతాడు దాని మీద ఓ గ్యాస్కెట్ పెడతాడు పెట్టి మూత పెడతాడు మూత పెట్టి దాని మీద కూత వేసే పరికరాన్ని పెడతాడు నాలుగు వైపులా కొట్టి చూస్తాడు అగ్నిహోత్రం మీద పెడతాడు అగ్ని వెలిగిస్తాడు లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ అన్నం మెతుకు ఎప్పుడు అవుతుందో తెలుసుకుంటాడా అక్కర్లేదు
(33:33) అన్నపుమిత ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకు అయిపోగానే కుక్కరే కూసేస్తుంది అగ్నిని ఆపేస్తాడు కుక్కర్ని పెట్టేటప్పుడు అశ్రద్ధగా పెట్టారుఅనుకోండి మూత పేలిపోతుంది కర్మ చేసేటప్పుడు భక్తితో భక్తితో అన్న మాటకు అర్థం ఏమి అంటే పరమేశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో అలా అది ధర్మం అలా బ్రతికిన వాడికి చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి వలన జ్ఞానము కలుగుతుంది ఆ చిత్తశుద్ధికి ఉపకరణముగా వేద మంత్రం మారడాన్ని ఆరణ్యకం అంటారు.
(34:03) ఆరంజకం తర్వాత ఉపనిషత్తు వస్తుంది అందుకే ఉపనిషత్తు జ్ఞాన భాగం గురు శిష్య సంవాదంగా ఉంటుంది. అటువంటి వేదము సమస్తము మనకు ఆలవాలం ఇహమునందు సుఖానికి కానీ పారలౌకిక సుఖానికి కానీ జ్ఞానానికి కానీ పునర్జన్మ లేకుండా ఉండడానికి కానీ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడానికి కానీ జీవితాన్ని శాంతియుతంగా ఉంచుకోవడానికి కానీ అందరూ వేదాన్ని నమ్మి బ్రతికారు అనుకోండి ఎవరు ఎవరి జోలికి వెళ్లరు అందరూ వేద ధర్మాన్ని పాటిస్తే వేరొకడి వేరొకడికి ఉపకారం ప్రత్యేకం అక్కర్లేదు పరమ పరమ ప్రశాంతంగా పరమ శాంతీయుతంగా అయిపోతుంది జీవితం కృష్ణదేవరాయుల వారు వాముక్తమాల్యత రాస్తూ
(34:44) ఒక మాట అన్నాడు ఏదో ఆ ఎంత చమత్కారంగా చెప్పాడంటే ధర్మం అన్న మాటని అక్కడ బాతుల్ని తీసుకెళ్లి నది వడ్డున పెట్టి ఓ చిన్న తడిక కడతారు చిన్న దడి ఓ ఇంత ఎత్తు ఉంటుంది అవి దూకి వెళ్ళవు బాతులు వదిలేస్తారు అందులో ఓ బాతు వెళ్లి ఒక్క బాతు ఎందుకో తడికి దూకేసి పడుకుంది ఆ కాలవ కట్టున వెళ్ళిపోతున్నాడు ఒక రైతు ఆయన అనుకున్నాడట అరెరే ఎవరో పంతులు గారు తెల్లవార కట్ట నదిలో స్నానం చేశాడు నదిలో స్నానం చేసి ఆ తడి బట్ట విప్పేసి పొడి బట్ట కట్టుకుంటాడు అంటే అందులో ఎంత ధర్మం ఉంది స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేయకూడదు వేదంలోనే ఉంది ఆ
(35:24) మాట సూర్యుని యొక్క కిరణముల యందే మలినము వాయువు నీరు అగ్ని నాలుగు ఉంటాయి ధర్మానుష్టానం లోకంలో తగ్గిపోతే అగ్నితో కూడుకున్న వర్షం పడుతుంది అని ఉంది వేదంలో మెరుపులు ఉరుములు పిడుగులు ఎక్కువ పడతాయి. కాకుండా ధర్మాన్ని అందరూ పాటిస్తే వర్షం పడుతుంది. వ్యక్తుల యొక్క ఆయుర్దాయం ఎందుకు తొందరగా తగ్గిపోతుంది అంటే వేదం చెప్పింది ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే నీటి యందు ఉన్న అగ్ని రోగ రూపంలో దహించేస్తుంది అవతలవాడి శరీరాన్ని అని నీటి యొక్క అధిదేవత వరుణుడు జలాది దేవత అయిన వరుని పట్ల అపచారమే దిగంబర స్నానం చేయడం ధర్మాన్ని ధర్మంగా పాటించాలి
(36:07) బ్రాహ్మణుడు స్నానం చేశాడు అంటే లోకానికి ధర్మం చెప్పవలసినవాడు ఆయన స్నానం అంటే తల మునక వేసేటట్టుగా చేయాలి చెంబుతో నీళ్లు తీసి పోసుకోవడం కాదు అందుకని నదికి వచ్చి స్నానం చేశడు తడి బట్ట వదిలేసాడు పొడి బట్ట కట్టుకున్నాడు ఇప్పుడు ఈ తడి బట్టను ఏం చేస్తాడు ముద్ద కింద కింద పడుతుంది అది కింద పడిన ముద్ద కింద కింద పడిన బట్ట తీసి జాడించుకొని పట్టుకుపోతాడు ఎవరో ఒకాయన మర్చిపోయి వెళ్ళిపోయాడు ఆ తెల్లటి బట్ట పంచి అక్కడ ఉండిపోయింది ఆ వెళ్ళిపోతున్నటువంటి రైతు చూసాడు అరేరే అగ్రహారంలో పంతులు గారు ఎవరో స్నానం చేసి బట్ట విడిచిపెట్టేసాడు కాబట్టి ఇప్పుడు
(36:41) నేను ఆ బట్ట పట్టికెళ్లి ఆయనకి ఇచ్చేయాలి అగ్రహారానికి పెట్టుకెళ్లి అయ్యా పంతులు గారు ఎవరిది ఈ పంచ అని అడిగితే ఎవరో ఒకరు గుర్తుపడతారు అని గబగబా పంచ పంతులు గారిది అనుకని వచ్చి పట్టుకోబోయాడు అది బాతు కదిలిపోయింది అన్నారు కృష్ణదేవరాయుల వారు అంటే ఒక బాతుని అడ్డుపెట్టి పడుకున్న బాతుని అడ్డుపెట్టి ఆముక్తమాల్యదా కాలంనాడు ధర్మం ఎలా ఉందో చెప్పాడు కృష్ణదేవరాయుల వారు వేద ధర్మాన్ని చూపిస్తారు అది రచన చేయగలిగినటువంటి వాడికి వేదమునందు అనురక్తి ఉండాలి వేదము తెలిసిఉన్నవాడై ఉండాలి విశ్వనాథ సత్యనారాయణ గారి చెలియలికట్ట అని పుస్తకం
(37:14) రాశరు అంతా వేదధర్మమే సాంఘిక నవలలా ఉంటుంది కానీ అసలు ఏకపత్నీ వ్రతం అంటే ఏమిటో మీరు చెలీలి కట్టా పుస్తకం చదవాలి అలాగే వేయి పడగలు రాశడు మహానుభావుడు సహస్రపన్ అది వేద ధర్మం వేయి పడగలు అద్భుతమైనటువంటి సాంఘిక నవల కానీ అది ఉన్నదంతా వేద ధర్మమే అందులో కాబట్టి వేదంలో ఉన్న విషయాన్నే చెప్తారు ఎక్కడ ఏది ధర్మమో ఆ ధర్మమును పాటించడం అంటే వేదము తెలుసు తెసుకుంటేనే వేదము తెలియనప్పుడు స్మృతి పురాణము శిష్టాచారము అంతరాత్మ ఇవి పట్టుకున్ననాడు చేసిన ప్రతి పని ధర్మ చకట్రంలోకి ఇమిడుతోందో లేదో చూసుకున్నాడు ధర్మ చకట్రంలోకి ఇమిడిందా నువ్వు నిచ్చిన
(37:58) పైకి ఎక్కావు ధర్మ చకటంలోకి ఇమిడలేదా కిందకి దిగావు ఒక్కటే గుర్తు తాటిని ఇలా తిప్పితే కట్టేసాను అదే తాటిని ఇలా తిప్పితే విప్పేసాను ధర్మ చట్రంలోకి విప్పితే బంధనాల నుంచి విడిబడుతున్నావు ధర్మ చట్రంలోకి ఇమడని పనులు చేస్తే బంధనాల్లో ఇరుక్కుంటున్నావు కట్టబడుతున్నావు చేయడం ప్రధానం కాదు ఎలా చేస్తున్నావ్ ప్రధానం ఎలా చేస్తున్నావో అలా చేయాలంటే వేదాన్ని చదువుకోవాలి లేదా ఇటువంటి వేద పండితులు కనపడ్డప్పుడు వాళ్ళకి నమస్కరించి అడగాలి స్మృతి పురాణ గ్రంథములను చదువుకోవాలి అంత గొప్ప వేదం అందుకే ఆ వేదం అనుశృతంగా ఎప్పుడ అలా పరంపరాగతంగా వెడుతూనే ఉండాలి ఆ
(38:39) వేదశాస్త్ర పరిషత్తులు ప్రత్యేకంగా శ్రావణమాస సంలో ఈ సభలు చేసి వేద పండితులందరూ ఇళ్లకి కూడా వస్తూఉంటారు ఎందుకంటే శ్రావణ మాసం అంతా వర్షాలు ప్రారంభం అవుతాయి లక్ష్మీకారకమైనటువంటి నెల విష్ణు సంబంధమైనటువంటి నెల విష్ణువు స్థితికారుడు బ్రతకాలి అంటే విష్ణువు యొక్క అనుగ్రహం అందుకని ఈ శ్రావణ మాసంలో వేదం విష్ణువు యొక్క స్థానం కనుక వేద పండితులు కూర్చుని వేదం చదివినా వేదం విన్నా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఆహ్వానించి వారిని కూర్చోబెట్టి వారొక్క పన్నం చదివితే సంతోషపడి మనకుఉన్న దానితో వారిని సత్కరించిన వారి ఆశీర్వచనం మనల్ని రక్షిస్తుంది అందుకే శ్రావణ మాసంలో
(39:19) వేదశాస్త్ర పరిషత్తులు జరగాలి అని పెద్దలు నిర్ణయం చేశారు అంత గొప్ప వేదశాస్త్ర పరిషత్తు శ్రావణ మాసంలో అందున ఏ నది యొక్క నీళ్లు తాగి బతుకుతున్నామో ఏ నది యొక్క నీరు ధారణాశక్తికి కారణమైందో అటువంటి పవిత్ర గోదావరి తీరంలో ఉన్నటువంటి ఈ రాజమహేంద్రవరంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ప్రదోష వేళలో వచ్చి కూర్చుని వేద ధర్మము అనేటటువంటి విషయం గురించి నాలుగు మాటలు మాట్లాడడానికి నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ అలాగే వేరొక్కసారి వేదం చదువుకున్న వాళ్ళ అంటే పతాక స్థాయి వారు
(40:00) కనబడితే గౌరవించవలసిందే కానీ అంత పవిత్రమైన సభలో వేదం చదువుకున్న విద్వాంసులు కింద కూర్చుని ఉండగా ఎత్తైన ఆసనంలో కూర్చుని ప్రసంగించినటువంటి నా పాపము పరమేశ్వ యొక్క నిర్హేతుక కృప చేత కాల్చబడు గాక వారు నన్ను మన్నించదరు గాక అని వేరొక్కసారి వారిని క్షమాపణ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను
No comments:
Post a Comment