కాళికా దేవికి అసలైన భక్తుడు? | The Biggest Devotee Of Kali | SadhguruTelugu
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_uOe5UV_Lpc
Transcript:
(00:05) అతంది ఎనిమిదేళ్ల పెల్లాడి మనస్తత్వం కాళికాదేవి భక్తుడు ఇన్ని జన్మల ఆరాధన తర్వాత కూడా ఆమె స్పందించలేదు. రాజు రాజ్యంలో అందరికంటే ముద్దఎవరో వెతకమని తన సైనికులకు చెప్పాడు వాడిని పట్టుకు రండి నా కూతుర్ని వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు కానీ ఆ అమ్మాయి మాత్రం ప్రతిక్షణం అతన్ని వెయి రకాలుగా చీదరించుకుంటూ నిరంతరం ఈసడించుకుంటూ ఉండేది.
(00:34) దాంతో తను కాళీ గుడికి వెళ్ళాడు. ఆమె పాదాల చెంత చేరి తల బాదుకోవడం మొదలు పెట్టాడు. తల పగిలి రక్తం కారసాగింది. బయట నుండి స్వరం వినిపించింది. నేను కాళికాదేవిని వచ్చాను తలుపు తీయ్ తను తలుపు తెరిచాడు. [సంగీతం] అసలు ఈ స్త్రీ తత్వ ఆరాధన ప్రాముఖ్యం ఏమిటి? కొన్ని అద్భుతమైన నిదర్శనాలు ఉన్నాయి. అతని పేరు కాళిదాసు అంటే కాళికాదేవి దాసుడు కాళికాదేవి భక్తుడు తెలుసా కథలు ప్రచారంలో ఉన్నప్పుడు
(01:20) కొంచెం అదనపు హంగులు చేరుతుంటాయి. కానీ ముఖ్యం ఏమిటంటే ఆ కథ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కథలోని వాస్తవాలు కాదు ఆ కథలోని ఆంతర్యం ముఖ్యం చాలా జన్మలుగా కాళిదాసు కాళికాదేవికి గొప్ప భక్తుడు తను గత జన్మలో అంతటి భక్తి ఉన్నా కూడా ఆమె ప్రత్యక్షం కాలేదని చాలా నిరాశ చెంది చెందాడు ఆమె తనకోసం ఏమి చేయలేదని ఈ ఆమెపై కాస్త నిరాశతో చనిపోయాడు.
(02:02) ఇన్ని జన్మల ఆరాధన తర్వాత కూడా ఆమె పలకలేదే అని ఇక ఈ జన్మలో తన పేరు మరేదో ఉండేది మనకు తెలీదు తను కాస్త అమాయకుడిగా పుట్టాడు. పెద్దయ్య కూడా అతనికి ఎనిమిదేళ్ల పిల్లాడే బుద్ధి ఉండేది. సాధారణంగా ఎనిమిదఏళ్ళప్పుడు ప్రజలు ముద్దుగా ఉన్నాడు అంటారు. అదే 18 ఏళ్ళ వచ్చాక కూడా అలాగే ఉంటే మొద్దు వెధవ అంటారు. హలో
(02:46) ఎస్ ఆర్ నో [నవ్వు] అతనికి అదే జరిగింది. ఊరి వాళ్ళంతా అతన్ని ఓ పల్లెటూరి వెర్రివాడు అనుకునేవారు. అక్కడున్న రాజుకి స్థానిక రాజుకి ఓ కూతురు ఉండేది. తను మహా మేధావిని అని గర్వపడేది. బహుశా అయి ఉండొచ్చు. తను ఒక ప్రజ్ఞావంతుడినే పెళ్లి చేసుకోవాలనుకుంది. మహిళలకు తెలుసు అలాంటి వ్యక్తి దొరకడం గగనం అని. ఎందుకంటే అంత తెలివైన వాడైతే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు.
(03:29) చూడండి జోక్ అనేది రెండంచుల కత్తి లాంటిది అవునా [నవ్వు] ఎందరో యువరాజులు ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చారు. యువరాణి కదా యువరాజునే పెళ్లి చేసుకుంటుంది. ఎందరో వచ్చారు కానీ వాళ్ళందరినీ ఆమె మూర్ఖులని తృణీకరించింది. వీళ్ళు నాకు ఏమాత్రం తూగరు అని తోసిపుచ్చేది. కేవలం తిరస్కరించడమే కాకుండా మూర్ఖులని అవమానించడం వల్ల మెల్లగా చుట్టుపక్కల రాజులంతా ఈ చిన్న రాజ్యానికి బద్ధ శత్రువులయ్యారు ఎందుకంటే వాళ్ళను కాదనడమే కాకుండా దేవర్ కాల్డ్ ఫూల్స్ బై దిస్ గల్
(04:13) ఈ పిల్ల వాళ్ళను మొద్దులని వెక్కిరించింది. దాంతో ఆ తండ్రికి నలుమూలల నుండి రాజకీయ సైనిక ఒత్తిడి పెరిగింది. ఆయనకు ఆ అమ్మాయిపై విపరీతమైన కోపం వచ్చి ఇలా అన్నాడు. మూర్ఖురాలా ఈ రాజ్యంలోనే అందరికంటే వెర్రి వెధవతో నీకు పెళ్లి చేస్తాను. అప్పుడే నీకు బుద్ధి వస్తుంది అన్నాడు. ఆమెను బాగా తిట్టి రాజ్యంలో అందరికంటే మొద్దు ఎవరో వెతకమని తన సైనికులకు చెప్పాడు వాడిని పట్టుకు రండి నా కూతుర్ని వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు.
(04:52) వాళ్ళు గాలిస్తున్నారు. అప్పుడు ఓ గ్రామంలో ఓ యువకుడు కొమ్మపై కూర్చుని తను కూర్చున్న వైపునే నరుకుతున్నాడు. సరిగ్గా మన తరం పర్యావరణ విషయంలో చేస్తున్నట్టే తెలుసా మనమంతా ఆ కోవకే చెందుతాం. అది చూసి వాళ్ళు ఇలా అనుకున్నారు ఇంతకంటే మూర్ఖత్వం ఉండదు కూర్చున్న కొమ్మనే నరుకుతున్నాడు. వీడు సాఫల్యం అయితే విఫలం అవ్వడం తప్పదు.
(05:26) ప్రస్తుతం మన తరం స్థితి కూడా అదే మనం విజయం సాధించామంటే కుప్పకోలుతాం. మనం విజయం అనుకుంటున్నది ప్రస్తుతం అంత వినాశకరంగా ఉంది. సరే వాళ్ళు ఆ కుర్రాణని పట్టుకొని వెళ్లి వీడికంటే పెద్ద వెధవ ఉండడు యువరాణని పెళ్లి చేసుకోవడానికి వీడే సరైన జోడి అన్నారు. వాళ్ళకు బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ప్రతిక్షణం అతన్ని వెయి రకాలుగా చీదరించుకుంటూ నిరంతరం ఈసడించుకుంటూ ఉండేది.
(06:01) ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా కొన్ని నెలల తర్వాత అమాయకుడైన ఈ వ్యక్తికి కూడా చాలా అవమానకరంగా అనిపించింది. ఎందుకంటే ఆమెది చాలా పదునైన నాలుక. దాంతో ఒకరోజు రాజభవనాన్ని వదిలి అడవిలోకి పారిపోయాడు. కేవలం ఆమె మాటల వాడి నుండి తప్పించుకోవడానికి. అడవిలో ఒక పురాతన కాళికాదేవి ఆలయం ఉంది. సాధారణంగా కాళీ ఆలయాలు అడవి లోపలే ఉంటాయి.
(06:39) ఎందుకంటే అక్కడ జరిగే కొన్ని క్రతువులు ఒక విధంగా ఉంటాయి. సమాజం వాటిని అంగీకరించలేకపోవచ్చు. కాళీ గుళ్ళలో జరిగే తంతుల్ని సాధారణ సమాజం జీర్ణించుకోవడం ఎన్నో సార్లు కష్టంగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ అడవి మధ్యలోనే ఉంటాయి. తను ఆ కాళీ ఆలయానికి వెళ్ళాడు. ఒక స్త్రీ పెట్టే కష్టం నుండి తప్పించుకోవడానికి ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది.
(07:10) ఆమె పాదాల చెంత చేరి తల బాదుకోవడం మొదలెట్టాడు. ఎటువంటి ప్రార్థన గానీ మంత్రం గానీ మరేమీ లేదు. కేవలం పాదాల దగ్గర తల బాదుకుంటున్నాడు. రక్తం కారటం మొదలైంది. రక్తం చుక్కలు ఆమె పాదాలపై పడ్డాయి. లోపల గడియ పెట్టుకున్నాడు. సైనికులు వచ్చి తనని పట్టుకొని మళ్ళీ తన భార్య దగ్గరకు తీసుకెళ్తారేమో అన్న భయంతో అప్పుడు బయట నుండి ఓ స్వరం వినిపించింది.
(07:40) నేను కాళీదేవిని నేను కాళికా దేవిని వచ్చాను తలుపు తీయ్ అప్పటికి విపరీతమైన ఆవేశంతో ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు వచ్చావు ఒక్కసారిగా అంతా గుర్తొచ్చి ఇన్ని జన్మలుగా ప్రార్థించాను జపించాను ఆరాధించాను నువ్వు రాలేదు ఇప్పుడుఎందుకు వచ్చావు నేను తలుపు తీయను అన్నాడు అప్పుడు కాళికాదేవి పదే పదే దయచేసి తలుపు తీయ అని పిలిచింది. ఆమెను వెక్కిరించడానికి ఎందుకంటే తను ఇంకా ఎనిమిదేళ్ల పిల్లాడి మనస్తత్వంతోనే ఉన్నాడు తలుపు కొంచెం తీసి ఆమె వైపు నాలుక చాచాడు.
(08:20) ఆమె అతని నాలుకను తాకింది. అండ్వన్ హస్ కన్సిడర్డ్ అప్పటిదాకా రాజ్యమంతా ఎవరినైతే మహా మూర్ఖుడు అనుకున్నారో తను అకస్మాతుగా అపర పండితుడయ్యాడు. ఇది కాళిదాసుకు ఆపాదించబడిన గాధ. భారతదేశంలో కాళిదాసుని సాహిత్యం కవిత్వం విషయంలో షేక్స్పియర్ కంటే మిన్నగా భావిస్తారు. వారిని పోలుస్తారు. కాళిదాసు షేక్స్పియర్ల తులనాత్మక అధ్యయనాలు భారతదేశంలో ఉన్నాయి.
(08:59) అనేకమంది పండితులు భాషపై ఆయనకున్న పట్టు మేధస్సు వ్యక్తీకరణ రీచ్య ఆయనను చాలా ఉన్నత స్థాయిలో చూస్తారు. దురదృష్టవశాత్తు ఆయన రచనలు చాలా స్వల్పంగానే మిగిలాయి అయినప్పటికీ ఆ కొద్దిపాటి సృజన కూడా అత్యున్నత ప్రమాణాలతో ఉంటుంది. అకస్మాతుగా తను కవిత్వాన్ని సాహిత్యాన్ని అప్పటికప్పుడు అల్లడం మొదలుపెట్టాడు. ఒకచోట కూర్చుని శ్లోకాలను వల్లించేవాడు రాసి పెట్టుకున్నవి కాదు అలా ఆసువుగా వచ్చేసేవి అతని వాక్కు అంతటి అద్భుతమైన స్థాయికి చేరింది కొత్త శ్లోకాలను అప్పటికప్పుడు అలా చెప్పేసేవాడు ఇది చాలామందికి జరిగింది.
(09:46) నేను మీకు ఇది చెప్పాలి ప్రపంచంలో విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు రాజకీయ సున్నితత్వం వల్ల నేను ఇప్పుడు వారి పేర్లు చెప్పదలుచుకోలేదు. సిగ్నిఫికెంట్ మన్ జస్ట్ లుక్ అప్ హిస్టరీ గత రెండు శతాబ్దాల్లో తమ తల్లుల నీడలో పెరిగిన ప్రముఖ వ్యక్తులు వారి దృష్టిలో తల్లి ఒక దేవతలాగే నిలిచిపోయింది ఆమె కేవలం మమకారం చూపే తల్లిగా తగ్గిపోలేదు ఆమె ఒక చండీలా ఉంది.
(10:21) బిడ్డ పట్ల కఠినంగా ఉండే దేవత గత రెండు శతాబ్దాల్లో వారు చేస్తున్న పనుల్లో ప్రపంచంలో గొప్ప శిఖరాలకు ఎదిగిన ఎందరో వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే ఒక రకంగా వారు స్త్రీ తత్వ ఆరాధనలో ఉన్నారు మీరు గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే స్త్రీ తత్వం అనేది లింగం కాదు అదొక పార్శ్వం ఈ పార్శ్వం ప్రాముఖ్యం ఏమిటంటే ఈ పార్శ్వం నుండి స్పందన పొందటం సులభం.
(10:54) మనం పురుషత్వంగా భావించే ఇతర పార్శ్వం కన్నా ఎందుకంటే ఇది భిన్నంగా రూపొందించబడింది. దేనికన్నా ఏది శ్రేష్టమైంది అని కాదు అలాంటిది ఏమీ లేదు. ఇది భిన్నమైంది అంతే మీరందరూ ఈ గణిత మేధావి గురించి వినే ఉంటారు. కొన్నేళ్ల క్రితం ఆయనపై ఒక సినిమా కూడా వచ్చింది. రామానుజన్ గణితాన్ని ఎలా అవలీలగా కురిపించారో వెరీ కాంప్లెక్స్ చాలా సంక్లిష్టమైన గణిత సూత్రాలను 20వ శతాబ్దం ఆరంభంలో అసలు బ్లాక్ హోల్స్ అనే ఊహే లేని కాలంలోనే ఆయన వాటిని వివరించే గణితాన్ని
(11:38) సృష్టించారు. సాధారణంగా శాస్త్రీయ ప్రక్రియలో లేదా శాస్త్రీయ పరిశోధనలో ఎప్పుడూ కూడా మొదట ఒక సిద్ధాంతం ఉంటుంది. అది ఎలా ఉండవచ్చనే ఒక భావన ఆపై వీలైతే ఒక ప్రయోగాత్మక నిరూపణ కోసం ప్రయత్నిస్తారు లేదా కొన్ని ఇతర అంశాలకు గణిత శాస్త్ర ప్రాతిపదిక వాడతారు. కానీ ఆయన గణితాన్ని అందించారు. అసలు ఆ భావనే లేకముందే అదంతా దేని గురించి అనేది ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
(12:15) కానీ ఆయన గణితాన్ని ధారగా కురిపించారు. వాళ్ళు ఇది ఎక్కడి నుండి వస్తుంది అని అడిగారు. గణితంతో నిండిన నోట్ బుక్కులకు నోట్ బుక్కులు ఆయన ఇచ్చేశారు. తన మరణ సయ్యపై ఉండి దురదృష్ట వశాత్తు ఆయన చాలా అల్ప వయసులోనే చనిపోయారు. ఆయన నా దేవి గణితాన్ని శ్రవిస్తోంది అంటాడు. ఇవి కొంచెం పెంచి చెప్పిన కథలుగా అనిపించొచ్చు కానీ జరగగలిగే పరిణామాలకు ఇవి విరుద్ధం ఏమీ కాదు ఎవరైతే దేవీ కృపను పొందుతారో
(12:59) మీరు జీవితంలో ఏ రంగంలో ఉన్నా మీరు వ్యాపారవేత్త కావచ్చు ఎందులోనూ నిపుణులు కావచ్చు కళాకారులు సంగీత విద్వాంసులు యోగి మీరు ఎవరైనా సరే ఇఫ్ యు వాంట్ టు పిచ్ అప్ యువర్ యక్టివిటీ టు అనదర్ diైమెన్షన్ ఆఫ్నో మీరు మీ కార్యదక్షతను సరికొత్త స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటే మీకు దేవి అనుగ్రహం అవసరం.
(13:30) ఈ అనుగ్రహం పొందిన వారు సహజంగానే ఇతరులు విస్మయపడే రీతిలో ఎదుగుతారు. ప్రపంచంలో అభివ్యక్తీకరణ పొందాలనుకుంటే మీకు దేవి అనుగ్రహం అవసరం. దాన్ని మీరు మంత్రాన్ని జపించడం ద్వారా పొందుతారా గుడికి వెళ్ళడం ద్వారా పొందుతారా లేదా మీలోని ఆ పార్శ్వాన్ని గుర్తించడం ద్వారా పొందుతారా లేదా స్త్రీ తత్వానికి ప్రణమిల్లడం ద్వారా పొందుతారా లేక ప్రకృతిలో లీనం అవ్వడం ద్వారా పొందుతారా ఎలా అన్నది ముఖ్యం కాదు కానీ మనం స్త్రీత్వంగా పిలిచే ఆ పార్శ్వం మీకు వసమైనప్పుడు ప్రపంచంలో మీరు వ్యక్తపరిచే తీరు అద్భుతమైన పరిణితిని పొందుతుంది. అందుకే
(14:16) పురుషులకు కూడా ఈ భైరవి సాధనను అందుబాటులోకి తెస్తున్నాం.
No comments:
Post a Comment