◼️ *|| " బ్యాంకులు అంటే భారం ... బ్యాంకులు అంటే భయం ... బ్యాంకులు అంటే బరితెగింపు " ||* ◼️
*ఒడిశా:*
▪️పాపం.. అమాయకుడు ఇంతకంటే ఏమి చేయగలడు?.
▪️ఒడిశాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సోదరి బ్యాంక్ ఖాతా నుంచి రూ.20,000 తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తికి, ఆమె స్వయంగా రావాలని అధికారులు చెప్పడంతో.
▪️ఆమె మరణించిందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో, తీవ్ర నిరాశకు లోనైన ఆ వ్యక్తి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
▪️సోదరి సమాధిని తవ్వి, ఆమె అస్థిపంజరాన్ని బ్యాంక్‌కు తీసుకెళ్లి మరణాన్ని నిరూపించే ప్రయత్నం చేశాడు.
▪️ఈ ఘటన వ్యవస్థలో అవగాహన లోపం, మానవత్వం కొరవడిన తీరుపై తీవ్ర చర్చకు దారితీసింది.
▪️కాగా, ఎవరు క్లెయిమ్ చేయని బ్యాంక్ ఖాతాల్లో కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు ఉందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్యాంక్ రూల్స్, అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి అలాగే ఉండిపోతున్నాయి.
No comments:
Post a Comment