Spanish American Girl visiting Ramanasrama
Author Name:Telugu Books
Youtube Channel Url:https://www.youtube.com/@telugubooks1031
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xyV30nrCm1k
Transcript:
(00:01) 1938 లో రమణాశ్రమం వచ్చిన స్పానిష్ అమెరికన్ వనిత మెర్సడెస్ డి అకోస్త ఆమె రమణభక్తురాలు హాలీవుడ్ సినిమాలకు స్క్రిప్ట్ రాస్తుంది. 24 సంవత్సరాల తర్వాత ఆమె ఒక పుస్తకం రాసింది. హియర్ లైస్ ద హార్ట్ ఆ పుస్తకం పేరు అందులో ఆమె పాతికేళ్ల భక్తి నిక్షిప్తం చేసింది. ఆమె మొదట పాల్ బ్రంటన్ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా చదివి ప్రభావితురాలయింది.
(00:36) ఆమె అంటారు ఆ పుస్తకం చదివిన తర్వాత నాలుగు రోజుల పాటు నేను వేరొక విషయం ఆలోచించలేకపోయాను. నా మనసంతా శూన్యమైంది. నన్ను రమణ మహర్షి ఆత్మ పూనినట్లయింది. ఎవరితోనూ మాట్లాడబుద్దయ్యేది కాదు నేను మహర్షిని కలుసుకోగలనని గట్టిగా నమ్మకం కలిగింది. ఆమె రమణ మహర్షి సన్నిధికి వచ్చి వాలిపోయింది. ఏ ప్రశ్నలు అడగవలసిన అవసరం కనిపించలేదు.
(01:03) ఆమెకు అనుమానాలన్నీ తీరిపోయాయి. ఎన్నో ప్రశ్నలు తయారు చేసుకుని వచ్చి చివరికి రెండే ప్రశ్నలు అడిగింది భగవాన్ని నా అంతరాత్మ చెప్పినట్లు నడుచుకోమంటారా నీ అంతరాత్మ గురించి నాకు ఏం తెలుసు నీ ఆత్మ చెప్పినట్లు చేయి ఆత్మ నడిపించినట్లు నడువు ఎవరు ఎవరిని అనుసరించాల్సిన పని లేదు మతాలు గురువుల్ని గురించి హృదయంలోకి చచ్చుకుపోతే మతాలు ఉండవు గురువులు ఉండరు ఆత్మ దర్శనం అవుతుంది అది చాలు మొదటిసారిగా డి అకోస్త మహర్షిని కలిసినప్పుడు ఆయన పాదాల చెంత ఎదురుగా కూర్చు ని ఆయన కళ్ళలోకి చూసింది.
(01:37) మహర్షి ఆమె కళ్ళలోకి ప్రేమగా చూశారు. ఆ క్షణంలో నన్ను నేను మరిచిపోయాను ఏమని వర్ణించను నాలోని ఆత్మ ఉన్నత శిఖరాన్ని చేరినట్లు అనిపించింది. అప్పుడు భగవాన్ మందహాసం చేశారు అప్పటి ఆనందం నేను జన్మలో మర్చిపోలేను. ఒక్క క్షణం చాలు అప్పుడు వచ్చిన మార్పు జీవితాంతం సరిపోతుంది. అమెరికా తిరిగి వెళ్ళిన తర్వాత ఆమె కొన్ని ప్రశ్నలు భగవాన్కి పంపింది.
(02:02) మరొక అమెరికన్ భక్తుడు తెచ్చి భగవాన్కి ఇచ్చాడు. ఆమె పేరు గేహగ్స్ గేహగ్స్ కొంతకాలంగా ఆశ్రమవాసి ఆమె పంపిన ప్రశ్నలు పునర్జన్మలు గతం భవిష్యత్తుకు సంబంధించినవి. పునర్జన్మ వాస్తవమా? నిజంగానే పునర్జన్మ ఉంటుందా? ఇప్పటి జన్మ వాస్తవం అయితే పునర్జన్మ వాస్తవమే. ఇంతకుముందు జన్మించి ఉండటం నిజమైతే మళ్ళీ జన్మించడము నిజమే అవుతుంది. మరణం అంటే ఏమిటి? పుట్టడం అంటే ఏమిటి? ఎందుకు శరీరానికి పుట్టడం చావడం రెండు తప్పనిసరి పనులు.
(02:33) మరణానికి మరొక జన్మకు రావడానికి మధ్య విరామం ఎంత? ఒక్కొక్కరు ఒక ఏడాది లోపే జన్మిస్తారు లేదా మూడు సంవత్సరాలు పట్టవచ్చు లేదు వేల సంవత్సరాలు పట్టవచ్చు అయినా కాలాన్ని కొలవడం ఎలా? శూన్యానికి విరామం ఏమిటి? అసలు కాలం అంటేనే శూన్యం కదా మనిషికి గతజన్మల జ్ఞానం ఉండదు. ఎందుచేత గతించినవన్నీ బ్రమలు కరిగిపోయిన కలలు వాటి జ్ఞాపకాలతో ఏం పని నీవు ఒక్కసారి ఆత్మలోకి ప్రస్తావినిస్తే గతంలో పని లేదు భవిష్యత్తు అవసరం ఉండదు నిజానికి వర్తమానం సైతం శూన్యం అయిపోతుంది ఏమీ మిగలదు ఆత్మ కాలాతీతం కాలరహితం ఈ శరీరాన్ని వదిలిన ఆత్మ వెంటనే మరొక శరీరాన్ని ఆశ్రయిస్తుందా
(03:12) శరీరం ఆధారం లేకుండా జీవి ఉండదు ఎటువంటి శరీరాన్ని కోరుకుంటుంది అది ఏ రూపాన్నైనా తీసుకోవచ్చు సూక్ష్మ శరీరం కావచ్చు స్థూల శరీరం కావచ్చు ఆత్మకు ఏదో ఒక శరీరం ఆధారంగా ఉండాలి. స్థూలం అంటే భౌతిక శరీరం అనే కదా అదే మనకు తెలుస్తుంది. ఆ తేడా నీకు అర్థం కావడానికి మాత్రమే జ్ఞానికి శరీరాల తేడా ఉండదు మరలా జన్మించడానికి కారణం ఏమిటి? తీరని కోరికలు నెరవేరని ఆశయాలు కోరికలు తీర్చుకోవాలన్న తపనతో మళ్ళీ జన్మిస్తారు.
(03:43) ప్రతి శరీరానికి ప్రతి జన్మలో తీరని కోరికలు కొన్ని మిగిలి ఉంటాయి. కొన్ని కొత్తగా ఏర్పడుతూ ఉంటాయి అందుచేతనే మనిషి మళ్ళీ మళ్ళీ జన్మించడం జరుగుతోంది. ఈ జవాబుల చివరగా భగవాన్ ఒక సందేశం ఇలాగ ఇచ్చారు. నీ ప్రశ్నలు మంచివే బాగున్నాయి టీ అకోస్తాతో చెప్పు అతిగా ఆలోచించవద్దని ధ్యానం చేసుకుంటూ ఆలోచనలని దూరం చేసుకోమను చాలు మనసు ఆత్మతో లయిస్తే ప్రశాంతత లభిస్తుంది.
(04:10) ఆధ్యాత్మ పరులు హృదయ గుహలో విశ్రమించడం నేర్చుకోవాలి. ఆ పని సహజంగా జరుగుతుంది జరగాలి. ఇప్పుడు ఈ ప్రశ్నలు ఏవి మిగలవు ప్రశ్నించే అవసరం ఉండదు అలా స్థిమితంగా ఉండడం అకర్మణత్వం కాదు మౌనంగా నిశశబ్దంగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండడం ఒక్కటే నిజమైన పని
No comments:
Post a Comment