Friday, April 17, 2026

Gleeden- Extra-marital Dating App | వివాహేతర డేటింగ్.. 40లక్షల మంది రహస్యంగా..@99TVEntertainment-u9q

Gleeden- Extra-marital Dating App | వివాహేతర డేటింగ్.. 40లక్షల మంది రహస్యంగా..@99TVEntertainment-u9q

Author Name:99TV Entertainment

Youtube Channel Url:https://www.youtube.com/@99TVEntertainment-u9q

Youtube Video URL:https://www.youtube.com/watch?v=cjuu4ZBVp5A



Transcript:
(00:00) నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక భారతదేశం అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇక్కడ వివాహ బంధం అంటే ఏడు జన్మల ముడి అని పవిత్రమైన బంధం అని నమ్ముతాం. కానీ ఆధునిక డిజిటల్ యుగంలో ఈ నిర్వచనాలు మారిపోతున్నాయా మన కళ్ళ ముందే ఒక నిశశబ్ద విప్లవం సారీ ఒక నిశశబ్ద మార్పు చోటు చేసుకుంటుంది. అది కూడా మన స్మార్ట్ ఫోన్ల ద్వారానే హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా బెంగళూర్లోని ఒక గృహిణి.
(00:28) వీరంతా తమ రోజువారి జీవితంలో చాలా సాధారణంగా కనిపిస్తారు. కానీ వారిలో కొందరి స్మార్ట్ ఫోన్లలో ఒక రహస్యమైన యప్ ఉంది. అదే గ్లిడన్ సాధారణ డేటింగ్ యాప్ లకు దీనికి ఉన్న తేడా ఏమిటంటే ఇది ప్రత్యేకంగా వివాహ బంధంలో ఉండి కూడా కొత్త పరిచయాలను ఉత్తేజాన్ని కోరుకునే వారి కోసం రూపొందించబడింది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.
(00:49) భారతదేశంలో ఈ యాప్ వినియోగదారుల సంఖ్య ఏకంగా 40 లక్షల మార్కును దాటేసింది. ముఖ్యంగా మన భాగ్యనగరం హైదరాబాద్ ఈ విషయంలో టాప్ గేర్లో దూసుకుపోతుందట. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల్లో బెంగళూర్ 18% వాటాతో మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ 17%తో అతి తక్కువ తేడాతో రెండో స్థానంలో నిలిచింది. అంటే సౌత్ ఇండియాలో ఈ రెండు ప్రధాన నగరాలు ఈ కొత్త ట్రెండ్ కు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి.
(01:12) ఢిల్లీ ముంబై వంటి మెట్రో నగరాలను కూడా హైదరాబాద్ వెనక్కి నెట్టడం ఇప్పుడు సామాజిక విశ్లేషకుల్ని నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా ఈ బాటలో వేగంగా పయనిస్తున్నారు. గత రెండేళ్ల గణంకాలు గమనిస్తే ఈ యాప్ ను వాడే మహిళల సంఖ్య 148% పెరిగింది. ప్రస్తుతం ఉన్న వినియోగదారుల్లో 35% మంది మహిళలే ఉన్నారు.
(01:36) ఒకప్పుడు వివాహిత సంబంధం అంటే అది పురుషులకే పరిమితం అనే ఒక తప్పుడు భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ హద్దులు చెరిగిపోతున్నాయి. మహిళలు కూడా తమ జీవితంలో ఏదో వెలితి ఉందని దాన్ని భర్తీ చేసుకోవడానికి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లను ఆశ్రయిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ యాప్ వినియోగించే సమయాల గురించి వింటే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. భారతీయులు సగటున రోజుకు ఒక గంట నుంచి గంటన్నర సమయాన్ని ఈ సీక్రెట్ చాటింగ్ కోసం కేటాయిస్తున్నారు.
(02:01) ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచిమూడు గంటల మధ్యలో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆఫీస్ పనుల మధ్యలో లేదా ఇంట్లో భోజనం ముగించి విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ పరిచయాలు పుట్టుకొస్తున్నాయి. ఇక రాత్రి 10 గంటల తర్వాత అంటే ఇంటి సభ్యులంతా నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఈ డిజిటల్ తెరలు తెరుచుకుంటున్నాయి. వయసు విషయంలో కూడా ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తోంది.
(02:21) ఈ యాప్ లోని పురుషులు ఎక్కువగా 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న యువతల కోసం వెతుకుతుంటే మహిళలు మాత్రం 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండి జీవితంలో స్థిరపడిన పరిణితి చెందిన పురుషులను కోరుకుంటున్నారట. అసలు భారతీయులు ఎందుకు ఈ వైపు మొగ్గు చూపుతున్నారు దీనిపై గ్లీడెన్ ప్రతినిధి సైబెల్ షిడెల్ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.
(02:43) భారతీయులు ఇప్పుడు తమ వ్యక్తిగత ఆనందానికి స్వేచ్ఛకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని తమకు నచ్చిన విధంగా జీవించాలనే కోరిక వారిని ఇలాంటి ప్రయోగాల వైపు నడిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఇలాంటి విషయాలు రహస్యంగా ఉండేవి. కానీ ఇప్పుడు సాంకేతికత దానికి ఒక సురక్షితమైన దారిని చూపించింది. కేవలం మెట్రో నగరాలకే ఇది పరిమితం కాలేదు. లక్నో చండీగడ్ పాట్నా వంటి నగరాల్లో కూడా ఈ మార్పు కనిపిస్తోంది.
(03:06) సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న అసంతృప్తి కమ్యూనికేషన్ గ్యాప్ పని ఒత్తిడి లేదా కేవలం ఒక కొత్త అనుభూతిని పొందాలనే తపన. కారణం ఏదైనా కావచ్చు. కానీ ఫలితం మాత్రం వివాహ బంధాల పునాదులను కదిలిస్తాఉంది. దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛగా చూడాలా లేక నైతిక విలువల పతనంగా భావించాలా అనేది సమాజం ముందున్న పెద్ద ప్రశ్న. ఒకవైపు డిజిటల్ విప్లవం వల్ల ప్రపంచం దగ్గరవుతుంటే మరోవైపు అదే డిజిటల్ ప్రపంచం పక్కనే ఉన్న మనుషుల మధ్య గోడలు నిర్మిస్తోందా అనే సందేహం కలగకమానదు.
(03:34) 40 లక్షల మంది భారతీయులు ఒక రహస్య యాప్ లో సభ్యులుగా ఉన్నారంటే అది కేవలం ఒక సంఖ్య కాదు. మనం మారుతున్న సామాజిక మనస్తత్వానికి అది ఒక అద్దం. చివరిగా ఒక మాట. ఫోన్లలో యాప్లు అప్డేట్ అవుతున్నాయి. టెక్నాలజీ మారుతోంది. కానీ మనుషుల మధ్య ఉండాల్సిన నమ్మకం ప్రేమానురాగాల పరిస్థితి ఏంటి? హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాల్లో కనిపిస్తున్న ఈ గణంకాలు రేపటి భారతీయ కుటుంబ వ్యవస్థకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి ఆలోచించాల్సిన విషయం ఇదే

No comments:

Post a Comment