Why Parents Feel Lonely in Old Age? The Hidden Truth About Children & Expectations
Author Name:కాలగతి
Youtube Channel Url:https://www.youtube.com/@RaviSankarTekuru
Youtube Video URL:https://www.youtube.com/watch?v=z5QMee7AgG0
Transcript:
(00:03) హాయ్ హలో వెల్కమ్ టు కాలగటి అండి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వృద్ధాప్యము పిల్లలు సో లేటర్ ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రశ్నలు వాటికి వాటిలకి నా ఎక్స్పీరియన్స్ లో ఎదురయింది నేను తెలుసుకున్నది ఈరోజు మీతో పంచుకోవాలి అనుకొని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. మీ అనుభవాలు మీరు కూడా పంచుకోవచ్చు నేను టైం ఇస్తాను ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళందరికీ కూడా టైం ఇస్తాను.
(00:39) ఒక ప్రశ్న అడుగుతాను జీవితంంతా పిల్లల కోసం కష్టపడి వాళ్ళ చదువు కోసం నిద్ర మానేసి వాళ్ళ భవిష్యత్తు కోసం మన కోరికలు చంపుకొని చివరికి వృద్ధాప్యంలో ఎందుకు ఒంటరిగా మిగిలిపోతున్నామో ఆలోచించారా విచిత్రమైన విషయం ఏంటంటే చాలాసార్లు మనల్ని ఒంటరిగా చేసేది మన పిల్లలు కాదు మన అంచనాలు అవును ఈ మాట కఠినంగా అనిపించొచ్చు కానీ ఈరోజు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీరు మీ జీవితాన్ని మీ పిల్లల్ని మీ ప్రేమను మరియు మీ బాధను కూడా కొత్త కోణంలో చూడడం మొదలు పెడతారు.
(01:17) జ్యోతిష్యం చెప్పే ఒక కర్మసూత్రం ప్రతి మనిషి వృద్ధాప్యంలో ఎదుర్కొనే ఒక గొప్ప పరీక్ష ఇవన్నిటిని కలిపి ఈరోజు మనం ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం వదిలేస్తే వస్తుంది పట్టుకుంటే పోతుంది. ఇది విశ్వం ఎందుకు ఇలా పని చేస్తా ఉంది. ఈ డిస్కషన్ ఫస్ట్ నుంచి చివరిదాకా ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఆద్యంతం వినాలి అని కోరుకుంటున్నాను.
(01:44) మీ జీవితంలో చాలా సంవత్సరాలు మిమ్మల్ని బాధిస్తున్న ఒక ప్రశ్నకు ఈరోజు సమాధానం దొరకొచ్చు. ఒకసారి మీ కళ్ళు మూసుకోండి ఒక వ్యక్తిని ఊహించుకోండి. ఆయన పేరు రామయ్య ఉదయం 5దు గంటలకు లేస్తాడు 40 సంవత్సరాలుగా ఉదయం 5దు గంటలకు లేస్తున్నాడు ఎందుకో తెలుసా తన కోసం కాదు తన ఇద్దరు పిల్లల కోసం ఎండలో కాలిపోయాడు వర్షంలో తడిచాడు అప్పులు చేశాడు పండగ రోజున కొత్త బట్టలు కొనుక్కోపోయినా పిల్లలకు మాత్రం కొత్త బట్టలు కొనిచ్చాడు తన కలలు పక్కన పెట్టాడు వాళ్ళ కలలు నెరవేర్చాడు సంవత్సరాలు గడిచాయి పిల్లలు పెద్దయ్యారు.
(02:20) ఒకరు అమెరికాకి వెళ్ళారు మరొకరు హైదరాబాద్ పోయారు. ఇప్పుడు రామయ్యకి 65 సంవత్సరాలు ఒక పెద్ద ఇల్లు ఉంది ఒక పెన్షన్ వస్తాఉంది ఒక బ్యాంకు బాలెన్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ సాయంత్రం 6 గంటల తర్వాత ఇంట్లో ఒక విచిత్రమైన నిశశబ్దం గడియారం టిక్ టిక్ అనే శబ్దం కూడా ఎక్కువగా మదిని తొలిచే విధంగా వినిపిస్తా ఉంది. ప్రతి ఐదు నిమిషాలకి ఫోన్ చూస్తాడు ఎవరైనా కాల్ చేస్తారా అని లేదు ఫోన్ చేయలేదు మళ్ళీ చూస్తాడు మళ్ళీ చూస్తున్నాడు.
(02:46) రాత్రి భోజనం చేస్తూ ఒకప్పుడు నలుగురు కూర్చున్న టేబుల్ వైపు చూశాడు. ఇప్పుడు ఒక ప్లేటు ఒక కుర్చి ఒక మనిషి అప్పుడు అతని మనసులో ఒక ప్రశ్న మొదలయింది. నేను ఎక్కడ తప్పు చేశాను వాళ్ళ కోసం బతికాను కదా అయితే వాళ్ళు ఎందుకు దూరమయ్యారు మీకు తెలుసా ప్రపంచంలో లక్షలాది తల్లిదండ్రులు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ వాళ్ళు వెతుకుతున్న సమాధానం తప్పుచోట వెతుకుతున్నారేమో సమస్య పిల్లల్లో ఉండకపోవచ్చు.
(03:16) సమస్య ప్రేమలో ఉండకపోవచ్చు సమస్య ప్రేమ రూపంలో దాగిన అంచుల్లో ప్రేమ రూపంలో దాగి ఉన్న అంచుల్లో మనం కనుక్కోవచ్చు. ఈరోజు మనం అదే రహస్యాన్ని తెరవబోతున్నాం ఎందుకంటే కొన్నిసార్లు జీవితంలో మనల్ని బాధించేది మనం కోల్పోయిన మనుషులు కాదు వాళ్ళ గురించి మనం సృష్టించుకున్న కథలు ప్రేమ లేక స్వాధీనమా నా పిల్లలు తప్పు చేయలేదు నేను ప్రేమ అని అనుకున్న దాంట్లో ఒక దాగిన స్వార్థం కూడా ఉండి ఉండొచ్చు.
(03:52) ఒక ప్రశ్న అడుగుతాను ఒక తల్లి తన కొడుకుని ప్రేమిస్తుంది అది సహజం ఒక తండ్రి తన కూతురిని ప్రేమిస్తడు అది కూడా సహజం కానీ ఆ ప్రేమ ఎప్పుడు బాధగా మారుతుంది ఎప్పుడు ఒంటరితనంగా మారుతుంది ఎప్పుడు కన్నీళ్లుగా మారుతుంది ప్రేమ వల్లే కాదు ప్రేమతో పాటు దాగి వచ్చిన అంచనాల వల్ల ఒక రైతు కథ చూద్దాం ఒక రైతు ఒక మామిడి మొక్కను నాటాడు రోజు నీరు పోసాడు ఎరువులు వేసాడు పశువులు తినకుండా కాపాడాడు సంవత్సరాలు గడిచాయి చిన్న మొక్క పెద్ద పెద్ద చెట్టు అయింది.
(04:23) ఒకరోజు ఆ చెట్టు నీడల్లో కూర్చొని రైతు ఇలా అనుకున్నాడు. ఈ చెట్టు నేనే నాటాను సరే ఈ చెట్టు నా వల్లే పెరిగింది సరే కానీ తర్వాత ఇలా అనుకున్నాడు ఇది నా చెట్టు కాబట్టి దీన్ని కొమ్మలు ఎటు పెరగాలో నేనే నిర్ణయిస్తాను అని ఇక్కడే సమస్య మొదలవుతుంది. పిల్లలు కూడా అలాగే మనం వారికి జన్మనిస్తాం వారిని పెంచుతాం వారిని చదివిస్తాం వారికి విలువలు నేర్పిస్తాం కానీ వారి జీవితాన్ని మాత్రం మనం సృష్టించలేం.
(04:51) ఎందుకంటే వారు మన ఆస్తి కాదు మన ద్వారా ఈ ప్రపంచంలో వచ్చిన ఒక స్వతంత్ర జీవితం జీవితంలో ఒక గొప్ప అపోహ ఏంటంటే నేను నీకోసం అంత చేశాను అందుకే నువ్వు నాకోసం ఉండాలి ఈ మాట బయట రాకపోయినా చాలా మంది చాలా మంది తల్లిదండ్రుల హృదయంలో ఉంటుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి మీ తల్లిదండ్రులు మీకోసం చాలా చేశారు కదా అందుకే మీరు వారి దగ్గర జీవితాంతం ఉన్నారా లేదు ఎందుకు ఎందుకంటే జీవితం ముందుకు కదులుతుంది ప్రకృతి వెనక్కి నడవద్దు.
(05:25) ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం చేద్దాం మీ చేతిలో ఒక పిట్ట ఉందని ఊహించుకోండి ఒక బర్డ్ చాలా అందమైన పిట్ట అది మీకు చాలా ఇష్టం దాన్ని కోల్పోవాలని మీకు లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు దాన్ని గట్టిగా పట్టుకుంటారా ఎంత గట్టిగా పట్టుకుంటే అది ఊపిరాడ చనిపోతుంది ఎంత స్వేచ్ఛని ఇస్తే అంత కాలం మీ దగ్గర ఉంటుంది మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంది.
(05:52) ఇదే ప్రేమ యొక్క రహస్యం ఆస్ట్రాలజీలో జ్యోతిష్యంలో రాహువు ఏమంటాడంటే ఇంకా నా దగ్గరే ఉండాలి ఇంకా నాతోనే మాట్లాడాలి ఇంకా నన్నే గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రేమలా కనిపిస్తుంది కానీ లోపల భయం కూడా ఉంటుంది ఒంటరిగా మిగిలిపోతామేమో అని భయం మర్చిపోతారేమో అని భయం అవసరం లేకుండా పోతానేమో అని భయం కేతువు ఏమంటాడంటే ప్రేమించు కానీ బంధించకు ఆశీర్వదించు నియంత్రించకు తోడుగా ఉండు కానీ కేంద్రంగా మారాలి అని ప్రయత్నించకు ఇప్పుడు ఒక చేదు నిజం ఉంది చాలా మంది పిల్లలు తల్లితండ్రుల నుంచి దూరంగా వెళ్ళడం లేదు.
(06:27) వారు తమపై పెట్టబడిన భావోద్వేగా బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఫోన్ కాల్ ఒక గిల్టీ ప్రతి సందర్శన ఒక పరీక్ష ప్రతి నిర్ణయం ఒక వివరణగా మారినప్పుడు ప్రేమ క్రమంగా బాధ్యతగా మారిపోతుంది. ఇక్కడే ప్రాబ్లం బిగిన్ అయితోంది. ఇక్కడే ప్రాబ్లం అనేది బిగిన్ అవుతుంది. ప్రేమ మనం ప్రతి ఫోన్ కాల్ మాట్లాడుతాం ఆ ఫోన్ కాల్ ఒక గిల్టీగా మారకూడదు ప్రతి సందర్శన అంటే మనం కలుసుకుంటాం అది ఒక పరీక్షలా మారకూడదు. ప్రతి నిర్ణయం ఒక వివరణగా
(07:13) మారినప్పుడు ప్రేమ క్రమంగా బాధ్యతగా మారిపోతుంది. ఒక చెట్టు నీడని ఇస్తుంది కానీ ఆ చెట్టు ఇలా అడగదు నేను నీడని ఇచ్చాను కాబట్టి నువ్వు నా కిందే కూర్చోవాలి సూర్యుడు వెలుగు ఇస్తాడు కానీ ఇలా చెప్పడు నేను వెలుగు ఇచ్చాను కాబట్టి నన్నే చూడాలి నది నీరుని ఇస్తుంది కానీ ఇలా అడగదు నేను నీరు ఇచ్చాను కాబట్టి నా దగ్గరే ఉండాలి.
(07:37) ప్రకృతి ప్రేమిస్తుంది కానీ స్వాధీనం చేసుకోదు. అందుకే నిజమైన ప్రేమ ఒక గుర్తు ఉంది. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మీకు దూరంగా ఉన్న మీ ఆశీర్వాదం మాత్రం వాళ్ళతో పాటే వెళ్తే అది ప్రేమ అతను మీ దగ్గర లేకపోతే మీకు కోపం వస్తే అది ప్రేమ కాదు అది అంచన అది స్వాధీనం అదే రాహువు ఈరోజు మీరు మీకే ప్రశ్న వేసుకోండి నాకు నా పిల్లలు కావాలా లేక వాళ్ళ ద్వారా నాకు కలిగే ప్రాముఖ్యత కావాలా ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే మీ ఒంటరితనం సగం కరిగిపోతుంది ఎందుకంటే మనల్ని బాధించేది పిల్లల దూరం కాదు వాళ్ళ గురించి మనం సృష్టించుకున్న హక్కు అనే
(08:16) భావన 100 సంవత్సరాల క్రితం కుటుంబాలు ఎందుకు విడిపోలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఒక రైతు ఉన్నాడు అతని కొడుకు కూడా రైతే కోడలు కూడా రైతే కోడల్ని కూడా రైతు కుటుంబం నుంచే తెచ్చుకున్నాడు మనవడు కూడా రైతే అందరికీ ఉదయం ఒకేలా అందరికీ సమస్య ఒకేలా అందరి లక్ష్యం ఒకేలా అందరి జీవితం ఒకేలా పొలానికి వెళ్తే అందరూ కలిసి వెళ్తారు పంటక వస్తే అందరూ కలిసి కోస్తారు నష్టం వస్తే అందరూ కలిసి భరిస్తారు లాభం వస్తే అందరూ కలిసి ఆనందిస్తారు.
(08:54) అంటే కుటుంబాన్ని కట్టుపడేసింది రక్త సంబంధం కాదు ఉమ్మడి జీవన విధానం సో పొలం పనులు చేసేవాళ్ళు లేదా బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే ఇంకోటి ఏదో చేసేవాళ్ళు కానీ కుటుంబం అంతా కలిసి ఒకే వృత్తిని చేసేది. ఇప్పుడు ఏం మారింది ఒక రైతు తను పడ్డ కష్టాలు తన కొడుకు పడకూడదు అని ఆ కొడుకుని చదివించాడు. కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేశడు.
(09:21) ఎందుకంటే తనలాగా కష్టపడకూడదు దర్జాగా బతకాలి ఈ ఈ మట్టి పిసకడము మట్టిలో పని చేయడము చెమట వర్చడం ఇవన్నీ కాకుండా ఏస రూమ్లో కూర్చోవాలి ఏసి ఆ చెమట పట్టకుండా కష్టపడకుండా అతను పని చేయాలి అని కోరుకున్నాడు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశాడు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది పొలం దగ్గర ఉండదు కదా సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ఎక్కడో హైదరాబాద్ మెట్రో సిటీస్ బెంగళూరు హైదరాబాదు లేకోతే అమెరికాను అక్కడ ఉంటుంది.
(09:51) సో కొడుకు హైదరాబాద్ వెళ్ళాడు తర్వాత అమెరికాకి వెళ్ళాడు అతని ప్రపంచం మారిపోయింది. కొడుకు ప్రపంచం మారిపోయింది. తండ్రి ఆలోచన ఇన్ని సంవత్సరాల ఇన్ని ఈ సంవత్సరం వర్షాలు ఎలా పడతాయో అని తండ్రి ఆలోచన. కొడుకు ఆలోచన ఏఐ వల్ల ఉద్యోగం పోతుందేమో అని కొడుకు ఆలోచన ఇక్కడ ఆలోచన డిఫరెంట్ అయిపోయింది ఇద్దరు భయాలు వేరు ఇద్దరి కలలు వేరు ఇద్దరి భాష వేరు ఇద్దరి ప్రపంచం వేరు ఇప్పుడు కొడుకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు.
(10:20) ఆమె చిన్నప్పటి నుంచి నగర జీవితం చూసింది కార్పొరేట్ సంస్కృతి వారాంతపు జీవితం చూసింది. ఇప్పుడు ఇక్కడ సమస్య బిగిన్ అవుతుంది. ఇప్పుడు గ్రామం నుండి వచ్చిన అత్తమామలు ఆమె ప్రపంచానికి అపరిచితులు. అత్తగారి ప్రపంచం ఇంట్లో అందరూ కలిసి తినాలి కోడల ప్రపంచం ప్రతి ఒక్కరు వాళ్ళకి సొంత స్పేస్ అనేది ఉండాలి. కట్టిపడి ఇక్కడ రెండు తప్పు కాదు కానీ రెండు వేరు వేరు అసలు ఘర్షణ ఇక్కడే మొదలవుతాయి.
(10:59) ఘర్షణ డబ్బు వల్ల కాదు ఘర్షణ ప్రేమ లేక కాదు ఘర్షణ వస్తుంది ఎందుకంటే ఒకరిని మరొకరు అర్థం చేసుకునే భాషను కోల్పోయారు. తల్లిదండ్రులేమో రైతు కుటుంబాన్న నుంచి వచ్చారు కాబట్టి అందరూ కలిసి తినాలి అందరూ కలిసి కూర్చోవాలి ఇది పద్ధతి ఇది మా కట్టుబాటు అని వాళ్ళు అంటారు. సో ఇక్కడ పని చేసే వృత్తి వేరు అక్కడ పని చేసే వృత్తి వేరు ఈమె ఏమంటుంది అంటే నాకంటూ ఒక ఫ్రీ స్పేస్ కావాలి కదా నేను ఆ టైం లో నేను బిజీగా ఉంటాను నాకు కాల్స్ వస్తాయి మీటింగ్స్ ఉంటాయి సో [గొంతు సవరించుకోవడం] నాకు చేయాల్సిన పనులు వేరేగా ఉండాయి నేను అట్లా కలిసి తినలేకపోవచ్చు ఆ టైంకి కుదరకపోవచ్చు
(11:40) అలా సో ఘర్షణ డబ్బు వల్ల కాదు ప్రేమ లేక కాదు ఘర్షణ వస్తుంది ఎందుకంటే ఒకరిని మరొకరు అర్థం చేసుకునే భాషను కోల్పోయారు తండ్రి అంటాడు నేను ఇంత కష్టపడి చదివించాను కొడుకు అనుకుంటాడు నాన్న నా పరిస్థితి అర్థం చేసుకోవడం లేదు అని కోడలు అనుకుంటుంది నా మీద చాలా అంచనాలు పెడుతున్నారు నేను ఏదేదో చేయాలి అనుకుంటున్నారు నేను అలాంటి పరిస్థితుల్లో నేను పుట్టలేదు అలాంటి పరిస్థితుల్లో నేను పెరగలేదు అని చెప్పేసి ఆమె అనుకుంటుంది అత్త అనుకుంటుంది నేను ప్రేమతోనే చెబుతున్నాను ఎందుకు అంత ఈసడించుకుంటుంది కోడలు అని చెప్పేసి అత్త అనుకుంటుంది
(12:16) ఇక్కడ ఎవరు చెడ్డవారు కాదు కానీ అందరూ బాధపడుతున్నారు. జ్యోతిష్య కాలంలో ఇది చాలా ఆసక్తికరమైన విషయం పాత కాలంలో పంచమభావం పిల్లలు దశమ భావం వృత్తి ఒకే దారిలో ఉండేవి అందరూ కలిసి అగ్రికల్చర్ చేసేవాళ్ళు అందరూ కలిసి ఒక బిజినెస్ చేసేవాళ్ళు కుటుంబం మొత్తం కూడా ఒకే జీవనాధారం ఉండేది. ఇప్పుడు కొడుకు డాక్టర్ కూతురేమో యాక్టర్ ఓకే సో కోడలేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అల్లుడేమో ఐపిఎస్ డిఫరెంట్ వృత్తులు అన్నమాట.
(12:50) వాళ్ళకు వాళ్ళే అడ్జస్ట్ కాలేకపోతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు ఉంది. తండ్రి రైతు అయినప్పుడు కొడుకుని కూడా రైతు చేయాలి. దశంభ భావం వరసత్వంగా కొనసాగేది. ఇప్పుడు పంచం భావం వేరైపోయింది దశం భావం వేరైపోయింది. తండ్రి రైతు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనవడు ఏఐ ఇంజనీర్ ప్రతి తరం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతా ఉంది.
(13:17) అందుకే కుటుంబ ఘర్షణలు పెరిగిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళ భాష వేరు వీళ్ళ భాష వేరు మరి పరిష్కారం ఏంటి అందరూ ఒకే వృత్తిలో ఉండాలి. అనేది ఒక పరిష్కారం కావచ్చు కానీ ఆధునిక ప్రపంచంలో అది సాధ్య పడకపోవచ్చు. ఎందుకంటే రేపు రైతే తన కొడుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు రైతే తన కొడుకుని డాక్టర్ని చేస్తున్నాడు. ఓకే తాను పడ్డ కష్టం కొడుకు పడకూడదు అని కానీ ఇక్కడే ప్రాబ్లం బిగిన్ అవుతుంది.
(13:46) అందుకే పరిష్కారం వృత్తి ఒక్కటి చేయడం కాదు పరిష్కారం ఉమ్మడి ధ్యేయం ఒక ఫ్యామిలీకి ఒక పర్పస్ ఉండాలి కలిసికట్టుగా పని చేసే ఒక పర్పస్ ఉండాలి. తండ్రి రైతు కావచ్చు, కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు కోడలు డాక్టర్ కావచ్చు కానీ వాళ్ళందరూ ఒక ఉమ్మడి లక్ష్యంతో ముడిపడి ఉండాలి మనం మన కుటుంబం కలిసి ఒక ఫార్మింగ్ అభివృద్ధి చేద్దాం ఒక ల్యాండ్ ని అభివృద్ధి చేద్దాం.
(14:13) మనం మన కుటుంబం అంతా కలిసి ఒక విద్యాసేవ చేద్దాం. మన కుటుంబం మన వంశ పారంపర్యంగా మనము ఒక కులదేవతని దగ్గర ఆ గుడిని డెవలప్ చేద్దాం. ఇట్లా ఉమ్మడి ఆశయం ఒకటి ఉండాలి కుటుంబానికి వృత్తులు వేరు కావచ్చు కానీ ధ్యేయం ఒకటిగా ఉంటే కుటుంబం నిలుస్తుంది. సింహం ఏనుగు జింకా కోతి అన్ని ఒకేలా ఉండవు కానీ అడవి వాటి అన్నిటిని కలుపుతుంది. ఎందుకంటే అవి ఒకే జాతి కావడం వల్ల కాదు ఒకే పర్యావరణ వ్యవస్థలో భాగం కావడం వల్ల అలాగే కుటుంబము అందరూ ఒకే వృత్తి చేయడం వల్ల కుటుంబం నిలవదు అందరూ ఒకే హృదయంతో ఉండడం వల్ల కుటుంబం నిలుస్తుంది.
(14:56) కాబట్టి మీ ఆలోచన కొంచెం విస్తరించి చెప్పాలి అంటే కుటుంబాలు విడదీసింది వృత్తి మార్పులు కాదు ఉమ్మడి జీవన ధ్యేయం లేకపోవడం ఒకప్పుడు కుటుంబం ఒక వృత్తి చుట్టూ ఏర్పడేది ఇప్పుడు వృత్తులు వేరైపోయినాయి కానీ కుటుంబం నిలవాలంటే ఒక ఉమ్మడి విలువ ఉమ్మడి ధ్యేయం ఉమ్మడి సంస్కృతి తప్పనిసరిగా కావాలి. ఇది వృద్ధాప్యం పిల్లలు సంయుక్త కుటుంబాలు ఆధునిక జీవితం జ్యోతిష్యం ఈ అన్ని అంశాలని కలిపే చాలా బలమైన ఈరోజు మీటింగ్ అవ్వాలి.
(15:30) ఇక్కడ దారి తప్పిపోతుంది కుటుంబ విలువలు దారి తప్పిపోతున్నాయి ఎందుకంటే కొడుకు భాష తండ్రికి అర్థం కాదు తండ్రి భాష కొడుకు అర్థం కాదు అర్థం చేసుకోవాలన్నా కూడా ఘర్షణ ఇస్తుంది. ఒక తరం తన పిల్లల పైన పైకి తీసుకెళ్ళడానికి కష్టపడింది. ఇప్పుడు మా తాతలు మా తండ్రులు వీళ్ళందరూ కూడా కష్టపడితే మేము ఈ స్టేజ్లో ఉన్నాం కానీ పైకి వెళ్ళిన తర్వాత ఆ ఆ పిల్లలు తిరిగి తమ మూలాలను ఎలా గౌరవించాలో నేర్చుకోవడం ఇది వృత్తి సంఘర్షణ కాదు ఇది గౌరవ సంఘర్షణ ఒక కథ చెప్పుకుందాం ఒక కుమ్మరి ఉన్నాడు రోజంతా మట్టిలో పని చేసేవాడు చేతిలో చేతి చేతులు మట్టితో నిండిపోయేవి బట్టలు
(16:16) మట్టితో నిండిపోయేవి కానీ ఆ మట్టిలోనే ఆ మట్టితోనే తన కొడుకుని చదివించాడు తనకు తెలీదు కంప్యూటర్ అంటే ఏమిటో కానీ కానీ తన కొడుకు కంప్యూటర్ ముందర కూర్చోవాలని కథలు కన్నాడు. తనకి ఇంగ్లీష్ రాదు కానీ తన కొడుకుకి ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడాలి ప్రపంచంతో ఇంగ్లీష్లో సంబోధించాలి అని కోరుకున్నాడు.
(16:35) తనకు తెలిీదు ఎయిర్ కండిషన్ ఆఫీస్ ఏందో కానీ తన కొడుకు ఎండలో కాకుండా చల్లని గదిలో పని చేయాలని ఆశించాడు. ఇక్కడి వరకు ప్రేమ ఉంది. కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది అమెరికాకి వెళ్ళాడు. తర్వాత ఒకరోజు తన ఆఫీస్ లో ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు అడిగారు మీ నాన్న ఏం చేస్తాడు అని ఇక్కడే అసలు పరీక్ష బిగిన్ అయింది. సో కొడుకు గర్వంగా మా నాన్న కుమ్మరి ఆయన చేతుల్లో వేల కుటుంబాలు వాడిన కుండలు పుట్టాయి అంటే అతను నిజంగా ఎదిగినవాడే కానీ అది చెప్పడానికి సిగ్గుపడితే అతను ఉద్యోగంలో ఎదిగాడు కానీ మనిషిగా ఎదగలేదు.
(17:18) ఇలా తయారు చేసింది ఎవరు తల్లిదండ్రులే ఆ కొడుకు అలా ప్రవర్తించేలా తయారు చేసింది ఎవరు తల్లిదండ్రులు అలా ఆ స్టేజ్ కి వీళ్ళ తాహతకు మించి ఆ స్టేజ్ కి చేర్చినప్పుడు ఆయన సూటు బోటు వేసుకొని ఎయిర్ కండిషన్ లో కూర్చొని కంప్యూటర్ ప్రోగ్రాం చేస్తూ అందరితో ఇంగ్లీష్ లో మాట్లాడే వ్యక్తి ఇక్కడికి వచ్చి మా నాన్న మట్టిలో పని చేస్తాడు.
(17:45) ఆ మట్టినే చేతులకు పూసుకుంటాడు చొక్కాకు పోసుకుంటాడు అని చెప్పాలి అంటే సిగ్గుచేటటు అవుతాడు. ప్రాబ్లం ఇక్కడే వస్తుంది ఎందుకంటే ఇక్కడ స్టేటస్ మార్చేశడు తల్లితండ్రులు కొడుకు యొక్క స్టేటస్ ని మార్చేశారు వాళ్ళ చేజేతులా వాళ్ళు మార్చారు ఎందుకు కొడుకు సంతోషంగా ఉండాలి కానీ ఆ సంతోషంలో ఈ స్టేటస్ మారిపోయింది కాబట్టి ఇక్కడ ఈ గౌరవంలో తేడాలు వస్తాయి అనేది మర్చిపోయారు.
(18:12) అసలు పేదరికం ఏది మట్టి తాకడం పేదరికం కాదు కుండలు చేయడం పేదరికం కాదు వ్యవసాయం చేయడం పేదరికం కాదు తన తల్లిదండ్రులు వృత్తిని అవమానంగా చూడడం అసలు పేదరికం ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని తయారు చేసింది అదే మట్టి ఆ డాక్టర్ని తయారు చేసింది అదే వ్యవసాయం ఆ ఏఎస్ అధికారిని తయారు చేసింది అదే కూలి పని మూలాన్ని మర్చిపోయిన చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒకరోజు ఎండిపోతుంది.
(18:41) ఇక్కడ తల్లిదండ్రుల పొరపాటు కూడా ఉంది. ఇక్కడ మరో కోణం ఉంది. తండ్రి ఇలా అనుకుంటాడు నేను నీ కోసం అంద చేశాను ఈ వాక్య ఈ వాక్యంలో ప్రేమతో మొదలవుతుంది కానీ కొన్నిసార్లు బంధనంగా మారుతుంది. ఎందుకంటే కొడుకు కూడా ఇలా అనుకుంటాడు నేను నా జీవితాన్ని నేను జీవించకూడదా అని చెప్పి ఈ రెండు సత్యాలు డీకు ఉంటాయి. తండ్రి సత్యం ఏంది నేను నిన్ను నిర్మించాను కొడుకు సత్యం ఏంది నేను నా జీవితాన్ని నిర్మించాలి.
(19:07) రెండు నిజాలే ఇది చాలా ఆసక్తికరం. పంచమ భావం పిల్లల గురించి చెప్తుంది నవమ భావం దశమ భావం తండ్రి గురించి చెప్తుంది. వృత్తి గురించి చెప్తుంది. ఆధునిక కాలంలో పంచమ భావం దశమ భావాన్ని దాటి పరిగెడుతాఉంది. తండ్రి రైతు కొడుకు ఇంజనీర్ మనవడు ఏయ శాస్త్రవత ప్రతి తరం మునుపటి తరాన్ని మించి వెళ్తాఉంది. సమస్య ఎదగడంలో లేదు సమస్య ఎదుగుతున్నప్పుడు వేర్లను కోసేయడంలో ఉంది.
(19:38) కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయి ప్రజలు అనుకునేది కోడలు వచ్చింది కాబట్టి నా కొడుకుని దూరం చేసింది నిజానికి [గొంతు సవరించుకోవడం] అది కాదు కోడలకు ఒక కొత్త ప్రపంచం నుండి వచ్చింది ఆమె తప్పు కాదది అత్తమామలు కూడా ఒక పాత ప్రపంచం నుండి వచ్చారు అది వాళ్ళ తప్పు కాదు సమస్య ఏంటంటే ఇద్దరి మధ్య ఆ భాష వీళ్ళకి చెప్పేవాళ్ళు ఈ భాష వాళ్ళకి చెప్పేవాళ్ళు లేడు ఒక సాంప్రదాయం మాట్లాడుతున్నారు మరొకరు ఆధునికత మాట్లాడుతున్నారు సాంప్రదాయానికి ఆధునికతకి అనుసంధానం చేసే మధ్యలో కొడుకో కూతురో ఎవరో నలిగిపోతా ఉన్నారు ఎందుకంటే భాష వేరు ప్రేమ వేరు
(20:15) కానీ అర్థం చేసుకోవడంలో పద్ధతి వేరు మరి పరిష్కారం ఏంది పిల్లల్ని రైతులుగానే ఉంచడం కాదు పిల్లల్ని కుమ్మరులుగానే ఉంచడం కాదు ప్రపంచం మారుతోంది వృత్తులు మారుతున్నాయి. కానీ ఒక విషయం మారకూడదు గౌరవం తండ్రి మట్టితో కుండలు చేశాడు నేను కోడితో సాఫ్ట్వేర్ చేస్తున్నాను కానీ మా ఇద్దరి పని ఒకటే ప్రజల జీవితాలని ఉపయోగకరంగా మార్చడు అని కొడుకు చెప్పగలగాలి.
(20:48) నా కొడుకు నాలాగా జీవించడం లేదు కానీ అతను నాకంటే పెద్ద ప్రపంచంలో జీవిస్తున్నాడు నేను అతన్ని ఆశీర్వాద ఆశీర్వదిస్తాను అని తండ్రి చెప్పగలగాలి. అప్పుడు ఘర్షణ తగ్గుతుంది. ఈ మొత్తం విషయాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే కుటుంబాలను విడదీసింది వృత్తులు మార్పులు కాదు మూలాల పట్ల గౌరవం తగ్గడం మరియు కొత్త ప్రపంచాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. మట్టి నుండి మైక్రో చిప్పు వరకు ప్రయాణం సమస్య కాదు మట్టి నుండి మైక్రో చిప్ వరకు వెళ్లి మట్టిని అవమానించడం సమస్య.
(21:16) ఇది చాలా శక్తివంతమైన సామాజిక సమస్య కొడుకుని మార్చేసింది తల్లిదండ్రులే కొడుకు బాగా ఉండాలి అని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి తాహతకు మించి లక్షలు లక్షలు అప్పులు చేసి అతన్ని ఒక అప్గ్రేడ్ చేశారు. సో అప్పటిదాకా వారు తాతలు తండ్రులు అంతా కూడా ఒక వృత్తిని చేస్తూ వచ్చారు ఒక బిజినెస్ చేస్తూ వచ్చారు.
(21:42) వాళ్ళకంటూ ఒక సామాజికత ఉంది వాళ్ళకంటే ఒక కట్టుబాట్లు ఉన్నాయి ఆ కట్టుబాట్లకు అతీతంగా కొడుకునో కూతుర్నో హై లెవెల్ లో అప్గ్రేడ్ చేశారు. చేసినప్పుడు అతని భాష మారుతుంది అంటే కట్టుబాటు మారుతుంది అతని వేషధారణ మారుతుంది. దానికి అనుగూణంగా మనం వెళ్ళగలగాలి. సో కొడుకు అంతే గౌరవంతో వాళ్ళని పైకి తీసుకురావాలి కానీ ఇక్కడ ఇంకో సమస్య ఏందంటే కోడలు వస్తుంది లేకపోతే అల్లుడు వస్తాడు వాళ్ళు అదే స్థాయిలో వస్తారు ఇప్పుడు డాక్టర్ని చదివించారు మీ కొడుకుని డాక్టర్ని చదివిపిస్తే కోడలు గాని అల్లుడు గాని అదే స్టేటస్ కి సంబంధించిన వాళ్ళని
(22:26) తీసుకొచ్చి పెళ్లి చేయాల్సి వస్తాం. కొడుకు అర్థం చేసుకుంటాడు ఏందంటే నా తల్లిదండ్రులు కుమ్మరి లేకతే వ్యవసాయ పనులు చేస్తాడు అని వాళ్ళతో సరదాగా మాట్లాడగలుగుతాడు మింగిలు అవ్వగలుగుతాడు కానీ కోడలు వాళ్ళకు ఉండే అలవాట్లు కావచ్చు వాళ్ళకు ఉండే నాగరికతలు కావచ్చు ఏమ పట్టకపోవచ్చు ఇక్కడే సమస్యలు బిగిన్ అవుతున్నాయి. ఈరోజు ఈ సమస్య ఈరోజు నాకు రావచ్చు నా పిల్లలకు రావచ్చు రేపు మీకు రావచ్చు మీ పిల్లలకు రావచ్చు ఎవ్వరికైనా ఈ కర్మ అనేది చుట్టుకోవచ్చు
(23:13) కర్మ యొక్క కనిపించిన ఉచ్చిది ఇప్పటివరకు మనం ఒక విషయం అర్థం చేసుకున్నాం పిల్లల్ని మనల్ని ఒంటరి చేయడం లేదు మన అంచనాలే మనల్ని వంటర్ చేస్తున్నాయి కానీ ఇప్పుడు అసలు ప్రశ్న మొదలవుతుంది ఎందుకు ఎందుకు మనిషి ప్రేమించిన ప్రతిదాని అతుక్కుపోతున్నాడు ఎందుకు వదలలేకపోతున్నాడు ఎందుకు నా అనే భావన అంత బలంగా ఉంటుంది దీనికి జ్యోతిష్యంలో ఒక అద్భుతమైన సమాధానం ఒక చిన్న విషయం గమనించారా ఒక వ్యక్తి పిల్లల గురించి బాధపడతాడు మరో వ్యక్తి డబ్బు గురించి బాధపడతాడు ఇంకో వ్యక్తి ప్రేమ గురించి బాధపడతాడు మరొకరు గౌరవం గురించి వస్తువులు వేరు కానీ బాధ మాత్రం
(23:46) ఒకటే ఎందుకు ఎందుకంటే సమస్య బయట లేవి సమస్య లోపల ఉంది. చంద్రుడు అంటే మనసు మన భావోద్వేగాలు మన భద్రత మనకు సుఖాన్ని ఇచ్చే విషయాలు రాహు అంటే ఇంకా కావాలి ఇంకా నా దగ్గర ఉండాలి ఇంకా పోకూడదు అనే తీరని ఆకలి ఒక చిన్న పిల్లవాడిని ఊహించుకోండి అతనికి ఒక బొమ్మ ఉంది ఇంకో పిల్లవాడు ఆ బొమ్మ వైపు చూస్తే చాలు వెంటనే ఆ బొమ్మను గట్టిగా పట్టుకుంటాడు ఎందుకు బొమ్మ మీద ప్రేమ వల్ల కాదు పోతుందేమో అన్న భయం వల్ల ఇక్కడే జరుగుతోంది సమస్య కొడుకో కూతురో మీరు పెళ్లి చేస్తారు.
(24:25) పెళ్లి చేసినప్పుడు వచ్చే అల్లుడో లేకపోతే కోడలో మీరు పెంచిన బొమ్మ మీద హక్కు తెచ్చుకుంటారు అప్పుడు ఆ బొమ్మను మీరు బిగుసుగా పట్టుకుంటారు. మళ్లా ఒకసారి చెప్తున్నా కదా ఒక చిన్న పిల్లవాడిని ఊయించుకోండి అతనికి ఒక బొమ్మ ఉంది ఇంకో పిల్లవాడు ఆ బొమ్మ వైపు చూస్తే చాలు వెంటనే ఆ బొమ్మను గట్టిగా పట్టుకుంటారు. ఎందుకు ఆ బొమ్మ మీద ప్రేమ వల్ల కాదు పోతుందేమో అని భయం వల్ల ఇదే జరుగుతాఉంది ప్రతి కుటుంబంలో బొమ్మ మారుతాంది పిల్లలు వస్తారు మనవాళ్ళు వస్తారు కుటుంబం వస్తుంది కానీ లోపల పని చేసే శక్తి మాత్రం అదే ఇది నా దగ్గరే ఉండాలి అని రాహువు ఒక విచిత్రమైన గురువు అతను మనకి
(25:09) సుఖం ఇవ్వడు కానీ సుఖం కోసం పరిగెత్తేలాగా చేస్తాడు దాహం తీర్చడు కానీ నీళ్ళ కోసం పరిగెత్తేలాగా చేస్తాడు. రాహువు ఉన్న చోట ఎప్పుడు అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు మనం కేతువు గురించి మాట్లాడుకుందాం కేతువు వైపు తిరుగుదాం రాహువు దగ్గర నుంచి రాహువు పట్టుకో అని చెప్తే కేతువు చెప్తాడు వదిలేయ్ రాహువు చెప్తాడు ఇది నీది కేతువు చెప్తాడు ఈ ప్రపంచంలో ఏది నీది కాదు అందుకే జీవితంలో ఒక దశ వస్తుంది ఎక్కడైతే మనిషి వదిలేయడం నేర్చుకొని పోతాడో అక్కడి నుంచి బాధ మొదలవుతుంది.
(25:42) సో మనిషి వదిలేయడం నేర్చుకోకపోతే బాధ అనేది తన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మీ చిన్నప్పటి స్నేహితులు ఎక్కడున్నారు మీతో ప్రతిరోజు మాట్లాడుతున్నారా లేదు కదా కానీ జీవితం కొనసాగింది. మీ మొదటి ఉద్యోగం మీ మొదటి ఇల్లు మీరు మొదటి కొనుక్కున్న బైక్ ఎక్కడున్నాయి వాటిని కూడా ఒకప్పుడు ఇవి లేకుండా నేను ఉండలేను అని మీరు అనుకొనే ఉంటారు.
(26:13) ఇప్పుడు జీవితం ముందుకు వెళ్ళిపోయింది. అయితే పిల్లల విషయంలో మాత్రం ఎందుకు ఆగిపోతున్నాం అక్కడ ప్రేమతో పాటు ఒక గుర్తింపు కూడా కలిసిపోయింది. ఒక తండ్రి ఇలా అనుకుంటాడు నా పిల్లల కోసం నేను బతికాను నిజం కానీ క్రమంగా వాక్యం ఇలా మారిపోతుంది అందుకే వాళ్ళు కూడా నాకోసం బతకాలి అని ఇది కనిపించని కర్మ కర్మ అంటే కేవలం పాప పుణ్యాలు కాదు కర్మ అంటే మనం ప్రపంచాన్ని చూసే విధానం మన అంచనాలు మన బంధాలు మన భయాలు శని గ్రహం ఇక్కడే రంగంలోకి వస్తాడు శని ఒక విషయం నేర్పిస్తాడు.
(26:48) నువ్వు ఒంటరిగా నిలబడగలవా ఇది శని యొక్క పరీక్ష అందుకే చాలామంది జీవితాల్లో 60 తర్వాత 70 తర్వాత ఒంటరితనాన్ని ఎదురుకుంటున్నారు ఇది శాపం కాదు గ్రహాలు నేర్పించే పాఠం ఇది శని ఒక ప్రశ్న అడుగుతాడు నీ పిల్లలు లేకపోతే నువ్వు ఎవరు నీ ఉద్యోగం లేకపోతే నువ్వు ఎవరు నీ డబ్బు లేకపోతే నువ్వు ఎవరు నీ పాత్రలు లేకపోతే నువ్వు ఎవరు చాలామందికి ఈ ప్రశ్న సమాధానం ఉండదు అందుకే ఒంటరితనం భయంగా అనిపిస్తుంది కానీ గురువు వస్తే ఆయన ఒక గొప్ప రహస్యం చెప్తాడు నీ జీవితానికి అర్థం ఇతరులు నిన్ను గుర్తుపెట్టుకోవడంలో లేదు నువ్వు ఎవరో తెలుసుకోవడంలో ఉంది.
(27:26) ఇది వృద్ధాప్య జ్ఞానం పిల్లలు ప్రేమ కోసం ఎదురు చూసే మనిషి ఎప్పుడు ఆకలిగానే ఉంటాడు. ప్రేమగా మారిపోయిన మనిషి ఎప్పుడు నిండుగానే ఉంటాడు. అందుకే కర్మ యొక్క గొప్ప రహస్యం ఏంటంటే నువ్వు ఎంత పట్టుకుంటే అంత జారిపోతుంది. నువ్వు ఎంత వదిలేస్తే అంత సహజంగా అది తిరిగి వస్తుంది. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను ఈ కర్మ కేవలం పిల్లల విషయంలోనే కాదు భార్య భార్యా భర్తల మధ్య కూడా ఉంది స్నేహితుల మధ్య కూడా ఉంది డబ్బు విషయంలో కూడా ఉంది ఆధ్యాత్మికతలో కూడా ఉంది.
(27:59) దేవుని కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే అక్కడ కూడా బాధే వస్తుంది. ఎందుకంటే విశ్వం మొత్తం ఒక నియమంతో నడుస్తుంది. ప్రేమ అనేది ప్రవహించాలి స్వాధీనం చేసుకోకూడదు ఇప్పుడు మనం ఇంకా లోతుకి వెళ్దాం నిజంగా పిల్లలు ఎందుకు దూరం అవుతారు వాళ్ళు మారిపోయారా లేక ప్రకృతి వారిని నడిపిస్తుందా తర్వాత మనిషి జీవితంలో అత్యంత తప్పుగా అర్థం చేసుకునే సత్యాన్ని మనం వెనక్కి తీద్దాం.
(28:24) పిల్లలు ఎందుకు దూరం అవుతారు ప్రకృతి యొక్క రహస్య ప్రణాళిక ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఒక పక్షి గుటిని ఎందుకు కడుతుంది పిల్ల పక్షి ఇప్పటికీ ఆ గుట్టలోనే ఉండడానికా లేక ఒక రోజు రెక్కలు వచ్చాక ఏరిపోవడానికా ఈ జవాబు అందరికీ తెలుసు పక్షులు ఎందుకు గూడు కడతాయి ఎందుకు గుడ్లు పెడతాయి పిల్లల్ని ఎందుకు పెంచి పెద్ద చేస్తాయి ఆ గూట్లో ఉండడానిక రెక్కలు విప్పుకొని ఆకాశాన్ని చూడడానికా ఎగరడానిక గూటి శాశ్వత నివాసం కాదు అది ఒక శిక్షణ కేంద్రం ఇక్కడే చాలా మంది తల్లిదండ్రులు చేసే పెద్ద పొరపాటు ంది వాళ్ళు గూటిని కడతారు కానీ పక్షి ఎగిరిపోవడానికి
(29:03) సిద్ధమైనప్పుడు గూటినే శాశ్వత బంధంగా మార్చాలని చూస్తారు. ఒకసారి ఊహించండి పిల్ల పక్షి మొదటిసారి గూటి అంచును నిలబడి ఉంది. కింద లోతైన లోయ ఉంది ముందు తెలియన ప్రపంచం అది భయపడుతుంది. కానీ తల్లి పక్షి ఏం చెప్తుంది బాబు నువ్వు చిన్నవాడివే ఇక్కడే ఉండు అంటుంది. కొన్నిసార్లు స్వయంగా ఆ తల్లి పక్ష తోసేస్తుంది నువ్వు ఎదగాలి ఎగరాలి అని ఎందుకంటే ప్రేమ ఎప్పుడు పట్టుకోవడం కాదు కొన్నిసార్లు వదిలేయడం ప్రకృతిలో ప్రతి జీవి ఇదే పాఠం చెప్తుంది.
(29:35) చెట్టు తన విత్తనాన్ని శాశ్వతంగా పట్టుకోదు నది తన నీటిని నిల్వ చేసుకోదు మేఘం తన వర్షాన్ని దాచుకోదు. సూర్యుడు తన కాంతిని బంధించడు. అయితే మనిషి మాత్రమే ఎందుకు పట్టుకుంటున్నాడు ఎందుకంటే మనిషికి జ్ఞాపకాలు ఉన్నాయి. పిల్లవాడు మొదటిసారి నడిచిన రోజు గుర్తుంటుంది తండ్రికి మొదటిసారి నాన్న అన్న రోజు కూడా గుర్తుంటుంది మొదటి స్కూల్ రోజు కూడా గుర్తుంటుంది ఆ జ్ఞాపకాలన్నీ అమూల్యమనియి కానీ ఒక సమస్య ఉంది.
(30:02) మనకు పిల్లలు కనిపించడం లేదు వారి చిన్ననాటి జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి అందుకే 35 ఏళ్ల వయసున్న కొడుకు కూడా ఇంకా నాకు చిన్న పిల్లవాడే అని తల్లి చూస్తుంది. 40 ఏళ్ల కూతురిని కొడిచేసి నా చిన్న పాపే అని తండ్రి అనుకుంటాడు. కానీ జీవితం ముందరకి వెళ్ళిపోతుంది పాత్రలు మారిపోతున్నాయి కొత్త కొత్త వాళ్ళ జీవితంలోకి వస్తున్నారు. అల్లుడని కోడలని మనవళ్ళని మనవరాళ్ళని సో పంచం భావం నుంచి సప్తం భావానికి ప్రాణం ప్రయాణం పిల్లల నుంచి సృష్టి పెంపకం సప్తమ భావంలో స్వతంత్ర వ్యక్తిత్వాలు సొంత నిర్ణయాలు సొంత కుటుంబం సొంత ప్రపంచం పిల్లలు పంచమం భావంలో శాశ్వతంగా ఉండరు
(30:44) ఒకరోజు వాళ్ళు సప్తమ భావంలోకి ప్రవేశిస్తారు. అప్పుడు వారి మీ పిల్లలు మాత్రమే కాదు ఎవరికో భర్త ఎవరికో భార్య ఎవరికో తల్లి ఎవరికో తండ్రి కూడా అవుతాడు మీ కొడుకే మీ కూతురే ఈ మార్పు అంగీకరించలేకపోతే బాధ మొదలవుతుంది. ఒక చిన్న కథ చెప్తాను ఒక తోటమాలి ఉన్నాడు అతను ఒక చిన్న మొక్కను నాటాడు ప్రతిరోజు నీళ్లుు పోసాడు ఎండ నుంచి కాపాడాడు గాలికి అడ్డుగా నిలబడ్డాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మొక్క పెద్ద చెట్టు అయింది అప్పుడు కూడా అతను అతనే అదే పని చేస్తున్నాడు.
(31:17) చెట్టుక ఎండ తగలకుండాక మొత్తం కూడా కప్పేసాడు గాలి తగలకుండా అడ్డుకున్నాడు ఫలితం చెట్టు బలహీనమైపోయింది. ఎందుకంటే చిన్న మొక్కకు రక్షణ అవసరం పెద్ద చెట్టుకి స్వేచ్ఛ అవసరం పిల్లల విషయంలో కూడా ఇదే ఐదేళ్ల వయసులో రక్షణ 25 ఏళ్ల వయసులో స్వేచ్ఛ చాలా మంది తల్లిదండ్రులు ఈ తేడాను గుర్తించలేకపోతున్నారు. నేను చెప్తుండేది నీ మంచికేరా బాబు అని తల్లిదండ్రులు వాపోవడం నేను నీకోసమే చెప్తున్నానురా అని చెప్పేసి తండ్రి ఆవేదన చెందడం నేను అనుభవంతో చెప్తున్నాను అని తల్లి చెప్పడం ఈ వ్యాఖ్యలు మంచివే కానీ వాటి వెనక ఒక రహస్య కోరిక ఉంటుంది నా మాటే వినాలి ఇక్కడే దూరం మొదలవుతుంది.
(31:57) ఇప్పుడు ఒక కఠినమైన సత్యం పిల్లలు తల్లిదండ్రులని వదిలి వెళ్లరు వాళ్ళు తమ జీవితానికి వెళ్తారు ఇది చాలా పెద్ద తేడా మీ కొడుకు మీకు వ్యతిరేకంగా వెళ్ళడం లేదు అతను తన ప్రయాణంలో ముందుకు వెళ్తున్నాడు. మీ కూతురు మిమ్మల్ని మర్చిపోవడం లేదు ఆమె తన పాత్రలో జీవిస్తాంది. ఈ సత్యం సత్యాన్ని అర్థం చేసుకునే రోజు మనసులో సగం బాధ కరిగిపోతుంది.
(32:23) ఇప్పుడు మరో కోణంలో చూద్దాం ఎందుకు కొంతమంది పిల్లలు తరచు ఫోన్ చేస్తారు ఎందుకు కొంతమంది దూరంగా ఉంటారు జవాబు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. భయం వల్ల నిలిచిన సంబంధాలు కాలంతా బలహీన పడిపోతాయి. స్వేచ్ఛ వల్ల నిలిచిన సంబంధాలు కాలంతా బలపడతాయి. అందుకే కొందరు తల్లిదండ్రులు ఇలా అంటారు నేను పిల్లల మీద ఎప్పుడు ఒత్తిడి పెట్టలేదు కానీ వాళ్ళు ప్రతిరోజు మాట్లాడుతారు నాతో ఎందుకంటే ప్రేమ అక్కడ బాధ్యత కాదు ప్రేమ అక్కడ ఎంపిక ఎంపికలో వచ్చిన ప్రేమ ఇప్పుడు నిజమైంది.
(32:52) మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేక వాళ్ళు మీ దగ్గర ఉండాలని కోరుకుంటున్నారా ఈ రెండిటి మధ్య తేడా అర్థమైన రోజు వృద్ధాప్యం వండ్రతనం కాకుండా జ్ఞానంగా మారుతుంది. ఎందుకంటే నిజమైన తల్లిత అందుకే ప్రకృతి ప్రతి తల్లితండ్రుకి ఒక పాఠం చెప్తుంది నీ చేతిని పట్టుకొని నడిపించు కానీ ఒకరోజు ఆ చేతిని వదిలేయ్ నీ ప్రేమని ఇవ్వు కానీ వారి జీవితాన్ని తీసుకోకు వారికి రెక్కలు ఇవ్వు గూటిలో పెట్టి సంకెళ్లు వేయొద్దు.
(33:30) ఇక్కడ మరో గొప్ప రహస్యం ఉంది పిల్లల్ని వదిలేయడం సులభం కాదు ఎందుకంటే అసలు సమస్య పిల్లలు కాదు మన ఖాళీ జీవితం మనం మరచిపోయిన కలలు మనం కోల్పోయిన వ్యక్తిత్వం మనకు మనమే తెలియకపోవడం అప్పుడు ప్రశ్న పిల్లలు తమ జీవితానికి వెళ్ళిపోయిన తర్వాత మన జీవితం ఏంటి వృద్ధాప్యం అనేది ముగింపు కాదు రెండో జన్మ వృద్ధాప్యం అనేది ముగింపు కాదు ఇది రెండో జన్మ పిల్లలు వెళ్ళిపోయాక మీరు ఎవరు ఇప్పుడు మనము ఈ ఉపన్యాసంలో అత్యంత ంత ముఖ్యమైన స్థలానికి వచ్చాం ఒక ప్రశ్న అడుగుతాను మీ పేరు తీసేస్తే మీ ఉద్యోగం తీసేస్తే మీ పిల్లలు తీసేస్తే మీ కుటుంబ బాధ్యతలు తీసేస్తే మీరు ఎవరు ఈ ప్రశ్న
(34:10) వృద్ధాప్యంలో ప్రతి మనిషికి ముందుకు వస్తుంది. 40 ఏళ్ల వయసులో రాదు 50 ఏళ్ల వయసులో కూడా అంతగా రాదు కానీ 60 70 ఏళ్ల వయసులో ఒక్కసారిగా వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఒక పాత్రలో జీవించాం నేను తండ్రిని నేను తల్లిని నే కుటుంబం పెద్దని నేను సంపాదించే వాడిని కానీ కాలం చెప్తుంది నీ పాత్ర పూర్తయింది అని అప్పుడు మనిషి భయపడతాడు ఎందుకంటే తన పాత్ర తానే అనుకుంటున్నాడు ఇంకా ఒక నటుడు సినిమా పూర్తఅయ్యాక కూడా అదే పాత్రలో తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది రాముడు పాత్ర చేసిన నటుడు షూటింగ్ పూర్తఅయ్యాక కూడా నేనే రాముడిని అని తిరిగితే ఎలా ఉంటుంది
(34:44) ఎందుకంటే పాత్ర ముగిసిపోయిందే కానీ జీవితంలో మనం అదే చూస్తాం తున్నా నేను తండ్రిని అనేది పాత్ర నేను తల్లిని అనేది పాత్ర నేను ఉద్యోగిని అనేది పాత్ర కానీ నేను అనే వ్యక్తి వాటిన్నిటికీ ముందు ఉంటాడు నేను అనేది జ్యోతిష్యంలో ఇదే లగ్న రహస్యం లగ్నం అదే చెప్పుకుంటే పంచమ భావం పిల్లలు దశమ భావం ఉద్యోగం సప్తమ భావం భార్యా భర్తలు చతుర్థ భావం తల్లి ఈ అన్నిటికీ ముందు మొదటి భావం ఉంటుంది అదే లగ్నం అంటే మీరు మీ అసలు ఉనికి అనేది తెలుసు సుకోవాలి సమస్య ఏంటంటే మన జీవితంఅంతా ఇతరుల భావాల కోసం పరిగెడతాం పిల్లల కోసం డబ్బు కోసం గౌరవం కోసం కుటుంబం కోసం
(35:28) చివరికి మన వ్యక్తిత్వాన్ని మర్చిపోతాం మన లగ్నాన్ని మర్చిపోతాం లగ్నం అనేది యాంకర్ పాయింట్ మనల్ని మనం మర్చిపోతాం అందుకే చాలా మంది వృద్ధాప్యంలో ఇలా అంటారు ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియడం లేదు ఎందుకంటే ఇప్పటి వరకు ఇతరుల కోసం జీవించారు తమ కోసం కాదు ఒక తండ్రి తన కొడుకు ఇంట్లో ఉండగా రోజు బాధపడ్డాడు ఎందుకు కొడుకు చెడ్డవాడు కాడు చెడ్డవాడు కాదు అతని జీవితం కేంద్రం కొడుకు అయిపోయాడు.
(35:57) కొడుకు బిజీగా ఉంటే అతనికి ఆనందం పోయేది కొడుకు మాట్లాడితే అతనికి ఆనందం వచ్చేది అంటే తన జీవితం తన చేతుల్లో నుంచి కొడుకు చేతుల్లోకి వెళ్ళిపోయింది. కొడుకు వచ్చి మాట్లాడితేనే ఆనందం కొడుకులు దూరంగా వెళ్తే బాధ అంటే తన యాంకరింగ్ పాయింట్ ఏదైతే ఉందో అతని కొడుకు మీద పెట్టేసుకుంటాడు. తన కొడుకు విషయంలో కొడుకు జీవితం గురించి ఆలోచించి తన జీవితాన్ని మర్చిపోయాడు.
(36:24) పిల్లలు నీ జీవితంలో ఒక భాగం మాత్రమే వాళ్లే నీ జీవితం కాదు ఇది చాలా కఠినమైన సత్యం కానీ విముక్తి కూడా ఇదే ఒకసారి ఊహించుకోండి మీరు ఒక తోటను పెంచారు చెట్లు పెద్ద పండ్లు ఇచ్చాయి ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఆ చెట్లను చూస్తూ మిగతా జీవితం అంతా కూర్చుంటారా లేక మరో కొత్త మొక్కను నాడుతారా జీవితం రెండవది కోరుకుంటుంది వృద్ధాప్యం అంటే ముగింపు కాదు ప్రకృతి భాషలో చెప్పాలంటే అది ఒక సర దరిద్ర ఋతువు అది కొత్త వసంతానికి సిద్ధం చేసే కాలం మన పురాణాల్లో కూడా ఇదే ఉంది.
(37:03) బ్రహ్మచర్యం గ్రహస్థం వానప్రస్తం సన్యాసం నాలుగు ఫోర్ టైప్స్ మనకి మన లైఫ్ లో విధించారన్నమాట వాళ్ళు నాలుగు రకాల ఆశ్రమ ధర్మాలని మన పురాణాలు చెప్తున్నాయి బ్రహ్మచర్య ఆశ్రమం గృహస్థ ఆశ్రమం, వానరప్రస్థాశ్రమం, సన్యాసం వానర ప్రస్తం అంటే అడవికి పారిపోవడం కాదు బాధ్యతల కేంద్రం నుండి తన కొడుకుకో కూకూతురుకో ఇంటి నెక్స్ట్ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో ఆ బాధ్యతలు పెట్టి అతను వానర ప్రస్తం చేయడం ఆత్మ కేంద్రానికి ప్రయాణం నువ్వు ఎవరో తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. ఇప్పటివరకు
(37:48) నా పిల్లలు అని జీవించాను ఇప్పుడు నేను ఎవరు అని తెలుసుకునే సమయం వచ్చింది. కొత్త విద్య నేర్చుకోవచ్చు పిల్లలకు బోధించొచ్చు పుస్తకాలు రాయొచ్చు సేవ చేయొచ్చు ధ్యానం చేయొచ్చు యాత్రలు చేయొచ్చు మీరు 70 ఏళ్ల వయసులో కూడా కొత్త జీవితాన్ని మొదలు పెట్టొచ్చు షో ఎందుకంటే వయసు శరీరానికి వస్తుంది ఆత్మకు కాదు ఒక విత్తనం చెట్టు అవుతుంది చెట్టు పండ్లుని ఇస్తుంది పండ్లు నేలపై పడతాయి.
(38:15) కథ అక్కడ అక్కడితో ముగిసిపోదు మళ్ళీ విత్తనాలు పుడతాయి. అదే జీవితం అందుకే పిల్లలు దూరమయ్యారని బాధపడే బదులు మీరు మీ దగ్గరికి వచ్చారా అని ప్రశ్నించు ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయాక మిగిలేది ఒంటరితనం కాదు మిగిలేది అసలు మీ వ్యక్తిత్వం ఇప్పుడు ఈ ఉపన్యాసంలో మనము అత్యంత శక్తివంతమైన భాగానికి వెళ్దాం ఒక తల్లితండ్రి పిల్లలపై అంచనాలు ఎలా వదులుకోవాలి ప్రేమను కోల్పోకుండా బంధాన్ని కోల్పోకుండా ఆసక్తిని వదిలి ఆశీర్వాదంగా ఎలా ఎలా మారాలి ఇదే చివరి రహస్యం ప్రేమను వదిలేయకు అంచనాలను వదిలేయ్.
(38:58) పిల్లలు మిమ్మల్ని వంటరి చేయలేదు వారు మీ వారిపై మీరు నిర్మించుకున్న అంచనాలే మిమ్మల్ని ఒంటరి చేసి ఈ మాట మొదట వినడానికి కఠినంగా అనిపించొచ్చు కానీ కాసేపు ఆలోచించండి. మీ కొడుకు రోజు ఫోన్ చేయాలని ఎవరు నిర్ణయించారు మీ కూతురు ప్రతి పండగకి మీ దగ్గర ఉండాలని ఎవరు నిర్ణయించారు మీ మనవళ్ళు మీతో ఎక్కువ సమయం గడపాలని ఎవరు నిర్ణయించారు వాళ్ళా లేదా మీ మనసా బాధను సృష్టించిన పిల్లల ప్రవర్తన కాదు మన అంచనాలే జ్యోతిష్యంలో దీన్ని చంద్రుని స్వభావం అంటారు చంద్రుడు అంటే మనసు జ్ఞాపకాలు అనుబంధాలు ఆశలు అంచనాలు అందుకే చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు
(39:34) మనిషి వాస్తవాన్ని చూడటం తన ఊహని మాత్రమే చూస్తూ ఉంటాడు కొడుకు బిజీగా ఉన్నాడు ఇది వాస్తవం కానీ తండ్రి వాడికి నేను అవసరం లేదు అని అనుకోవడం అపార్థం కూతురు తన పిల్లలతో బిజీగా ఉంది ఇది వాస్తవం నన్ను మర్చిపోయారు అని అనుకోవడం మనసు రాసుకున్న తేలికైన కథ బాధ ఎక్కువగా సంఘటన వల్ల రాదు సంఘటనలకు మనం ఇచ్చే అర్థం వల్ల వస్తుంది.
(40:00) ఇప్పుడు నేను ఒక చిన్న ప్రయోగం చెప్తాను మీ చేతిలో ఒక బొమ్మ ఉంది చాలా అందంగా ఉంది అది అంటే మీకు చాలా ఇష్టం అప్పుడు మీరు ఏం చేస్తారు బొమ్మనెత్తి నేలకేసి కొట్టారు కదా బొమ్మని అపురూపంగా చూసుకుంటారు కదా సో మనము బొమ్మ పోతుందేమో అని గట్టిగా పట్టుకోవడం వదిలేసి ఆ బొమ్మతో ఆడుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు స్వేచ్ఛ కోరుకోవాలి.
(40:30) ఆ బొమ్మ లేకపోయినా మనం బతకడం నేర్చుకోవాలి. ప్రేమ అనేది పంజరం కాదు ప్రేమ అనేది ఆశ్రయం పంజరం చెప్తుంది నువ్వు నాదానివి అని ఆశ్రయం చెప్తుంది నువ్వు ఎక్కడ ఉన్న నా ఆశీర్వాదం నీతో ఉంటుంది అని బంధనం మరియు ప్రేమ మధ్య తేడా ఇదే మహాభారతంలో కూడా ఇదే సూత్రం ఉంది. కుంతీదేవి తన పిల్లల్ని ప్రేమించింది కానీ వారి జీవితాలను జీవించలేదు.
(40:54) యశోద కృష్ణుడిని ప్రేమించింది కానీ ద్వారక వెళ్ళకుండా ఆపలేదు. దశరధుడు శ్రీరాముని ప్రేమించాడు కానీ రాముడు అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు విధిని ఆపలేకపోయాడు. ఎందుకంటే ప్రేమ విధిని నిర్ణయ నియంత్రించదు. ప్రేమ విధిని ఆశీర్వదిస్తుంది. మీ పిల్లలు మీ దగ్గర లేకపోయినా మీ ప్రేమ తగ్గుతుందా లేదు కదా అయితే వారి ఉనికిని ప్రేమిస్తున్నారా లేక వారినే ప్రేమిస్తున్నారా ఈ ప్రశ్నకి నిజాయితగా జవాబు చెప్పిన రోజు మనసులో చాలా భారాలు కరిగిపోతాయి.
(41:26) వృద్ధాప్యం ఒక గొప్ప అపోహ ఉంది వృద్ధాప్యం అంటే ఎదురు చూడటం కాదు వృద్ధాప్యం అంటే పంచడం ఎప్పటివరకు మీరు సంపాదించారు ఇప్పుడు పంచండి ఇప్పటివరకు మీరు నేర్చుకున్నారు ఇప్పుడు నేర్పండి ఇప్పటివరకు మీ కుటుంబాన్ని నిర్మించారు ఇప్పుడు మీరు సమాజాన్ని నిర్మించండి ఇప్పటివరకు మీ పిల్లలకు ఆశ్రయం ఇచ్చారు ఇప్పుడు ప్రపంచాన్ని ఆశీర్వాదం ఇవ్వండి ఇదే వానర ప్రస్తం అడవికి వెళ్ళడం కాదు అహంకారం నుండి బయటకి రావడం నన్ను నన్ను గుర్తుంచుకోవాలి అనే కోరిక నుండి వాళ్ళు సంతోషంగా ఉండాలి అనే ఆశీర్వాదానికి మారడం అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది.
(42:02) మీ శ్రద్ధ కోసం మీరు అడగడం మానేస్తారు శ్రద్ధ మీ దగ్గరికి వస్తుంది. మీరు ప్రేమ కోసం ఎదురు చూడడం మానేస్తారు ప్రేమ మీ దగ్గరికి వస్తుంది. మీరు గుర్తింపు కోసం ప్రయత్నించడం మానేస్తారు. గౌరవం మీ దగ్గరికి వస్తుంది. ప్రతి ఒక్కరి కథలో ఇదే జరుగుతుంది. తన కొడుకు ఇంటికి కేంద్రం కావాలని ప్రయత్నించినప్పుడు ఎవ్వరు అతన్ని చూడలేదు.
(42:25) అతను తన జీవితానికి తిరిగి వెళ్ళినప్పుడు అందరూ అతన్ని వెతికారు. ఎందుకంటే స్వతంత్రంగా నిలబడిన వృద్ధుడు భారంగా కనిపించడు ఆశీర్వాదం లాగా కనిపిస్తాడు కాబట్టి ఈరోజు ఒక చిన్న సంకల్పం చేసుకుందాం నా పిల్లల్ని నేను ప్రేమిస్తాను కానీ వాళ్ళని నియంత్రించను వారి జీవితాన్ని నేను గౌరవిస్తాను వారి నిర్ణయాలను నేను ఆశీర్వదిస్తాను.
(42:46) వాళ్ళు నా దగ్గర ఉన్నా లేక దూరంగా ఉన్నా నా ప్రేమ మారదు. నా ఆనందానికి మూలం నా పిల్లలు కాదు నా అంతరాత్మ వృద్ధాప్యం నా జీవితానికి ముగింపు కాదు నాకు రెండో జన్మ పిల్లలు మీ ఆస్తి కాదు పిల్లలు మీ ప్రతిబింబం కాదు పిల్లలు మీ భవిష్యత్తు భీమ కాదు వాళ్ళు మీ ద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చిన ఆత్మలు మాత్రమే మీ పని వారిని బంధించడం కాదు వారికి రెక్కలు ఇవ్వడం ఎందుకంటే పట్టు వదిలిన చేతుల్లో ప్రేమ ఎక్కువ కాలం ఉంటుంది.
(43:14) అంచనాలు తగ్గిన చోటే గౌరవం పెరుగుతుంది. స్వేచ్ఛ ఇచ్చిన చోటే బంధం శాశ్వతం అవుతుంది. ప్రేమను వదిలేయకు అంచనాలను వదిలేయ్ పిల్లల్ని పట్టుకోకు ఆశీర్వదించు వృద్ధాప్యానికి భయపడకు అది నీ ఆత్మని మళ్ళీ పుడుతున్న కాలం ఇదే జీవితం ఇదే ధర్మం ఇదే అంతిమ జ్ఞానం కూడా సో సమస్య వృత్తి వారసత్వం కాదు విలువల వారసత్వం కావాలి సమస్య యొక్క మూల కారణం మూడు తరాల కథ చెప్పుకుందాం తాత వ్యవసాయం చేసాడు ఉమ్మడి కుటుంబం కుటుంబం కుటుంబానికి చెందిన వ్యక్తి ఇది తరం ఒకటి తరం రెండు తండ్రి సో వ్యవసాయం నుంచి ఉద్యోగానికి మళ్ళాడు
(43:59) పట్టణ జీవితం కుటుంబం ప్లస్ వ్యక్తిగత ఎదుగుదల ఇది తండ్రి పోషించిన తరం రెండో తరం మూడో తరం కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టరో లేకపోతే ఇంజనీరో ఏదో గ్లోబల్ జీవితం వ్యక్తి కుటుంబం సో ఇక్కడ వృత్తి మారలేదు విలువల కేంద్రం మారిపోయింది పరిష్కారం కుటుంబ రాజ్యాంగం ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ ఉండాలి ఉదాహరణకి మన కుటుంబం పెద్దలను గౌరవిస్తుంది నెలక ఒకసారి కలుస్తుంది వంశ చరిత్ర చెప్తుంది కుటుంబ ఆస్తిని కాపాడుతుంది పిల్లలకు మూలాలను పరిచయం చేస్తుంది.
(44:34) జపాన్ చైనా యూదు కుటుంబంలో ఇది కనిపిస్తుంది. పరిష్కారం రెండు ఏందంటే వృత్తి కాదు జ్ఞాన వారసత్వం రైతు కొడుకు రైతు కాకపోవచ్చు కానీ రైతు జ్ఞానం పోకూడదు. సో ఉదాహరణకి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వారాంతలో తండ్రితో కలిసి పొలం సందర్శించాలి భూమి చరిత్ర తెలుసుకోవాలి విత్తనాలు నాటాలి అప్పుడు వృత్తి మారిన మూలాలు చావు పరిష్కారం మూడు కొడుకు అల్లుడు సమీకరణ కోడలు అల్లుడు సమీకరణ ఇక్కడ పెద్ద తప్పు జరుగుతుంది వివాహం తర్వాత ఇది మా ఇంటి పద్ధతి అని చెబుతారు.
(45:05) కానీ కొత్త వ్యక్తి వచ్చినప్పుడు కొత్త సంస్కృతి కూడా వస్తుంది. అత్తగారు నేర్చుకోవాలి కోడలు కూడా నేర్చుకోవాలి సంబంధం అంటే విజయం కాదు అనుసరణ అడాప్షన్ పిల్లలను కృతజ్ఞత నేర్పాలి చాలా కుటుంబాల్లో ఇది మిస్ అయిపోతుంది పిల్లవాడు తెలుసుకోవాలి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం వెనుక తండ్రి చెమట తల్లి త్యాగం తాత కష్టం ఉన్నాయని పాఠశాలలో ఇవి నేర్పరు ఇంట్లో నేర్పాలి.
(45:31) వృద్ధాప్యాన్ని పిల్లల మీద ఆధారపడ ఆధారపరచవద్దు ఇది చాలా ముఖ్యం పాత సమాజంలో పిల్లలే పెన్షన్ ఇప్పుడు పిల్లలకు వారి ప్రపంచం ఉంది. ఆర్థిక స్వాతంత్రం సామాజిక వలయం సేవా కార్యక్రమం ఆధ్యాత్మిక జీవనం వృద్ధాప్యంలో చాలా అవసరం. పరిష్కారం ఆరోది ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది అత్యంత శక్తివంతమైన పరిష్కారం. తండ్రి రైతు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరూ కలిసి ఒక ఫార్మ్ ని బిల్డ్ చేయాలి ఒక ట్రస్ట్ ని బిల్డ్ చేయాలి ఒక YouTube ఛానల్ చేయాలి ఒక కుటుంబ వ్యాపారం చేయాలి ఒక విద్యా సేవ చేయాలి ఏదైనా కలిసి చేయడం నేర్చుకోవాలి ఇక్కడ దారులు వేరైతే బంధాలు తెగిపోతాయి.
(46:07) వృత్తులు వేరైతే ధ్యాయం ఒకటే అవుతుంది. కుటుంబము నిలవాలి అంటే ఆ ధ్యాయం ఒకటే అవ్వాలి. ఈ సమస్య ఒక అందమైన జ్యోతిష్య ఉపమానం. నాలుగో భావం మూలాలు ఐదో భావం పిల్లలు తొమ్మిదవ భావం వంశం 10వ భావం వృత్తి ఆధునిక సమాజంలో 10వ భావాన్ని పెంచింది వృత్తి కెరియర్ డబ్బు కానీ నాలుగో భావం తొమ్మిదవ భావం బలహీనమైపోయినాయి. మూలాలు దెబ్బ తింటున్నాయి.
(46:35) వంశము సంస్కృతి అందుకే పిల్లలను పెద్దవారిగా చేయడమే కాదు. పిల్లలకు వేర్ల మూలాలు కూడా తెలపాలి. రైతు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం సమస్య కాదు కుమ్మరి కొడుకు డాక్టర్ అవ్వడం సమస్య కాదు సమస్య ఏంటంటే అతన్ని ఎక్కడి నుండి వచ్చాడో మర్చిపోడు. చెట్టు ఆకాశాన్ని తాకాలి కానీ వేర్లు భూమిలోనే ఉండాలి వేర్లు కోలిపోయినా ఎదుగుదల చివరికి ఒంటరితనంగా మారుతుంది.
(47:03) ఇది మీ వృద్ధాప్యం పిల్లలు కుటుంబాల పత్తనం ఇవన్నీ కూడా శక్తి కేంద్రంగా సందేశంగా ఈ ఈ వీడియో ఉపయోగించుకోవాలి. సమస్య ఏంది అంటే మీరు మీ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నారు. వాళ్ళు డాక్టర్ అవ్వాలనో యాక్టర్ అవ్వాలనో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనో ఏదో చేస్తున్నారు. కానీ అతనికి వేరే భాష నేర్పించేటప్పుడు మీతో మాట్లాడే భాష మర్చిపోకూడదు.
(47:33) మీకు ఉండే అలవాట్లు మీ కుటుంబ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు తండ్రి జ్యోతిష్యం చెప్తున్నాడు. సో ఇవి వదిలేసి పిల్లవాడిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మార్చేయబాకండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మార్చకపోతే ఈ లోకంలో ఎలా బతకాలి ఇప్పుడు ఉండే ట్రెండింగ్ అదే కదా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయండి.
(47:53) అతనికి జ్యోతిష్యం నేర్పించండి వ్యవసాయం నేర్పించండి వారాంతల్లో వచ్చి మీతో కలిసి పని చేసే విధంగా అతనికి తర్ఫీద ఇవ్వండి మీరే వదిలేసి వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని బాధపడకండి. ఒక మాధ్యమం కావాలి ఒక భాష కావాలి ఒక సరళ కావాలి. తండ్రి జ్యోతిష్యకుడు అయితే పిల్లవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే కూడా జ్యోతిష్యుడుగా మారినప్పుడు జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు వాళ్ళ భాష జ్యోతిష్యం అవుతుంది వాళ్ళు కలుసుకున్నప్పుడు తండ్రి కొడుకు కలుసుకున్నప్పుడు జ్యోతిష్యం గురించి మాట్లాడుకుంటారు.
(48:25) ఆ జ్యోతిష్యం అనేది లేకపోతే ఏం మాట్లాడాలో తెలియదు కొడుక్కి తండ్రికి ఏం మాట్లాడాలో తెలీదు. తండ్రి వ్యవసాయం చేస్తునేటప్పుడు కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్ అయ్యి అతను కూడా ఒక పొలం తీసుకొని వ్యవసాయం చేస్తుంటే ఆ భాష ఒకటి అవుతుంది. నాన్న ఇట్లా కలుపు వచ్చింది ఏం చేయమంటావ అంటే తండ్రి సలహా ఇస్తాడు. అదే అతను వ్యవసాయమే చేయకపోతే తండ్రితో మాట్లాడే భాషను కోలిపోతున్నాడు.
(48:49) తల్లితో మాట్లాడే అనుబంధాన్ని కోలిపోతున్నాడు. సో ఈ విధంగా తయారు చేసింది ఎవరు తల్లిదండ్రులే మళ్ళీ సో వేరు పడిపోయినాక భాష మారిపోయినాక కట్టుబాటు మారిపోయినాక బాధపడడం కంటే ముందరే మీకు వచ్చిన భాష ఏదైతే ఉందో ఆ భాషని కొడుకుకి నేర్పించే విధంగా మీరు తర్ఫీద ఇవ్వాలి. కనీసం మీ కొడుకు మీ చేతిలో లేకపోయినా కూడా మీ మనవాడికి ఆ తర్ఫీద ఇవ్వాలి.
(49:16) మీ మనవరాలికి ఆ తర్ఫీద ఇవ్వాలి వాళ్ళతో మాట్లాడే అనుబంధాన్ని పెంచుకోవాలి. నా దారి వేరో నీ దారి వేరో అనుకుంటే బంధాలు ఎలా కలుస్తాయి కుటుంబం ఎలా నిలబడుతుంది నిలబడతా అక్కడే డవియేషన్స్ వస్తున్నాయి అక్కడే ప్రపంచం మారిపోతా ఉంది. ఇప్పటివరకు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని మలిచారు ఒక డాక్టర్ ని మలిచారు ఒక ఆ ఐఏఎస్ ఆఫీసర్ ని మీరు తీర్చేదిద్దరు. ఇప్పటివరకు మీ కుటుంబం కోసం కష్టపడండి ఇప్పుడు ప్రపంచం కోసం కష్టపడండి మీకు తెలిసింది ప్రపంచం నిర్మించడానికి కష్టపడండి అప్పుడు ప్రపంచమే మీ కుటుంబం అవుతుంది.
(50:00) ఇది స్వార్థం వదిలేయాల్సిన టైం ఇది వృద్ధాప్యం అనేది ఎప్పుడైతే అందరూ నా పిల్లలే అనుకున్నారో ఎప్పుడు అంతా నా కుటుంబమే అనుకున్నారో ఒక కొడుకు రాకపోయినా ఇంకో కొడుకు వస్తాడు. ఒక కూతురు పని చేయకపోయినా ఇంకో కూతురు పని చేస్తుంది. సమాజ సేవలో తరించాలి ఇది టైం మనం మారాల్సిన టైం ఇది ఒక భాషని ఒక అనుబంధాన్ని ఒక వృత్తిని మమేకం చేస్తూ కుటుంబాలు నిలబెట్టుకోవాలి.
(50:31) ఇప్పుడు బాధపడుతున్న తల్లిదండ్రులు రేపు బాధపడబోయే తల్లిదండ్రులు నెక్స్ట్ తరం మీ మనవాళ్ళు మనహరాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు పల్లెటూరులో పుట్టారు మీ కొడుకుని పట్టణంలోకి తీసుకొచ్చారు. మీ పిల్లవాడు పెళ్లి చేసుకొని మనవన్నో మనవరాలుగా ఉంటే వాళ్ళు మెట్రో సిటీలో పుట్టారు వాళ్ళక పుట్టే పిల్లలు ఖండాంతరాలు దాటి అమెరికాలోకి వెళ్తున్నారు. ఇక్కడే సమస్య వస్తా ఉంది.
(51:03) సమస్యకు మూలం ఏందంటే ఒక యాంకరింగ్ పాయింట్ అనేది కావాలి కలిసి సమాజ సేవ చేయండి ఒక భాషను ఏర్పాటు చేసుకోండి కోడలతో మాట్లాడాల్సిన భాష కొడుకుతో మాట్లాడని భాష కూతురితో మాట్లాడాల్ని భాష అల్లుడితో మాట్లాడాల్సిన భాష ఒక యాంకరింగ్ పాయింట్ అనేది ఉండాలి అది ఒక బిజినెస్ కావచ్చు ఒక సమాజ సేవ కావచ్చు లేదా ఒక వ్యవసాయం కావచ్చు ఒక ట్రస్ట్ కావచ్చు ఏదైనా సరే ఒక భాష అనేది ఏర్ప ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే బంధాలు దిగిపోతాయి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు ఏం మాట్లాడాలో మీకు అర్థం కాదు.
(51:40) ఇక్కడే దూరం పెరిగిపోతా ఉంది. బాధ్యతలు కొడుకుకి ఇవ్వాలి ఒక వయసు వచ్చినాక బాధ్యతలు కొడుకు ఇవ్వాలి వాడికి తెలియదయ్యా వాడు చిన్న పిల్లోడయ్యా వాడు సరిగ్గా చేయలేడేమో అయ్యా ఈ మాటలు మీరు కొడుకు మీద ప్రేమను చూపించొచ్చు కానీ కొడుకుకి అవి అవమానంగా మారొచ్చు నేను ఇంత పెద్ద బండి అయ్యాను ఇన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు తయారు చేశాను.
(52:07) ఎందుకు మా నాన్న ఇంకా నన్ను అనుమాన పడుతున్నాడో అవమానిస్తున్నాడు అని కొడుకు అది మీ సైడ్ నుంచి అది ప్రేమ కొడుకు సైడ్ నుంచి అది అవమానం ఇక్కడే ఘర్షణ ఎప్పుడు నాన్న నన్ను తిడతా ఉంటాడు ఎప్పుడు నాన్న నాకు నాకేం తెలియదు అంటాడు. సో ఈ మార్పుకు నాంది ఈ వీడియో కావాలి ఇదిఒక సొల్యూషన్ కావాలి రెండు తరాల మధ్య అంతరం ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని ఫిల్ చేసే ఒక వారద అవ్వాలి ఈ వీడియో ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నా నాకంటే పెద్దవాళ్ళతో నేను సక్రమంగా మాట్లాడగలుగుతున్నా వాళ్ళ బాధలు వినగలుగుతున్న వాళ్ళ వర్షన్ వినగలుగుతున్నా వాళ్ళ భాష అర్థం చేసుకోగలుగుతున్నా
(52:49) ఒక పక్క జ్యోతిష్యం చెప్తున్నా జ్యోతిష్యంలో వాళ్ళ బాధలు ఏదో వింటున్నా భాషను అర్థం చేసుకుంటున్నా వాళ్ళ భాషలో మాట్లాడగలుగుతున్నా సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటాయి. ప్రతి ఒక్కరికీ ఉంటాయి. ఎవ్వరు సుఖంగా ఉన్నారు వాళ్ళు సుఖంగా ఉన్నారు నేను బాధపడుతున్నాను అని కాకుండా ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి బాధలు ఉన్నాయి.
(53:12) ఆ బాధలు అర్థం చేసుకొని ఒక పిల్లర్ గా ఒక ఫౌండేషన్ గా ఎదగాలి. సో ప్రపంచాన్ని మనం ప్రేమించాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కరిని మన పిల్లలు అనుకోవాలి అలా అనుకున్నప్పుడు వృద్ధాప్యం అనేది మిమ్మల్ని బాధ పెట్టదు. ఇది నేను చెప్పాలనుకుంది ఈరోజు ఈరోజు ఒక కన్సల్టేషన్ నన్ను కదిలించింది ఒక ఆవేదన నన్ను కదిలించింది ఎక్కడ సమస్య బిగిన అవుతుంది ఇది ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది ఈ సమస్య ఆ ఆవేదన వ్యక్తపరుస్తా ఉన్నాడు వాళ్ళ భాష అర్థం చే ఇప్పుడు ఇక్కడ ఏందంటే సమస్య అనేది ప్రేమలో కాదు అజ్ఞానంలో ఉంది.
(53:51) ఎందుకంటే ఆ భాష వ్యక్తం చేయలేకపోతున్నారు వాళ్ళకి ఏం కావాలి అనేది వ్యక్తం చేయలేకపోతున్నారు. వాళ్ళకేం వాళ్ళకి ఏం కేర్ తీసుకోవాలో ఆ జ్ఞానం వీళ్ళకి వీళ్ళకి అర్థం కాలేకపోతాి అక్కడే ప్రాబ్లం బిగిన్ అవుతుంది ఎందుకంటే భాష వేరయింది ఆ భాష ఒక్కటి చేయాలంటే నాకు తెలిసిన సొల్యూషన్స్ నేను చెప్పాను ఈ వీడియో ద్వారా ఇది నేను చెప్పాలనుకుంది ఈ వీడియో YouTube లో స్ట్రీమింగ్ అవుతది.
(54:18) మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏదైనా పారదర్శకమైన సూత్రాలు మీ దగ్గర ఉంటే పంచుకోండి ఓకే ఇంకా ఈ సమస్యని పారతరలడానికి అందరూ సుఖంగా ఉండడానికి మీ దగ్గర మీ వంతు కృషి ఏదైనా చేయాలి అనుకుంటే వీడియో కింద కామెంట్స్ లో తెలియజేయండి నాకు ఏదైనా మీరు సలహాలు ఇవ్వాలనుకున్నా కూడా దయచేసి నావాట్ లో నన్ను పింగ్ చేయండి నేను తప్పకుండా ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాను నాకు ఓపిక ఉంది సహనం ఉంది సభోగత సహనంతో నేను మీకు చెప్పేవన్నీ వినగలుగుతాను ఓకే
No comments:
Post a Comment