అర్ధం కాకపోడం వేరు. అర్ధం చేసుకోను అని నీకు నువ్వే ఫిక్స్ అవ్వడం వేరు. నువ్వే రకం? || ANUKULA VEDAM
Author Name:Anukula Vedam
Youtube Channel Url:https://www.youtube.com/@anukulavedam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FcgrExlRu6E
Transcript:
(00:00) సత్యం మనిషి చరిత్రలో ఇంతకంటే అందమైన అబద్ధం మరొకటి లేదు. ఈ మధ్య సమాజంలో ప్రతివాడు సత్యాన్ని వెతుకుతున్నాను అని పెద్ద పెద్ద మాటలని చెప్తున్నారు. దేవుడి కోసమో ధర్మం కోసమో న్యాయం కోసమో పోరాడుతున్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. కానీ అదంతా ఒక పెద్ద డ్రామా మనిషి అనేవాడు ఎప్పుడూ సత్యాన్ని వెతకడు. వాడు వెతికేది సత్యాన్ని కాదు తన బ్రతుకుని సేఫ్ గా ఉంచే ఒక కంఫర్టబుల్ లాజిక్ ని మాత్రమే వాడి ఈగోకి పాలిష్ చేస్తూ వాడి బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచే ఒక్క అబద్ధం దొరికితే చాలు దానికి సత్యం అని పేరు పెట్టి గుడి కట్టేస్తాడు. మనిషికి ఉన్న తెలివికి వాడి
(00:40) సర్వైవల్ కి మధ్య ఎప్పుడైనా ఒకవేళ గొడవ అనేదే గాని వస్తే ఎప్పుడు ఎక్కడైనా గెలిచేది సర్వైవల్ మాత్రమే ఈ ఒక్క నిజాన్ని గాని జీర్ణించుకోగలిగితే ఇక నీకు ఈ ప్రపంచంలో ఏ మనిషి ప్రవర్తన ఆశ్చర్యం కలిగించదు. స ఒక మనిషి ఒక విషయాన్ని మనం ఎంత అర్థమైనట్టు చెప్తున్నా సరే ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు అని నువ్వు జాలి పడాల్సిన అవసరమే లేదు.
(01:05) నువ్వు వాడి దగ్గరికి వెళ్లి ఎన్నో లెక్కలు స్టాటిస్టిక్స్ ప్రూఫ్స్ టేబుల్ మీద పెట్టి గంటల తరపడి వాదిస్తావ్. చూసారండి సిస్టం లో ఎంత అన్యాయం జరిగిపోతుందో సిస్టం లో ఎన్ని లోచుగులు ఉన్నాయో అని గొంతు చించుకుంటావ్ బట్ వాడు మాత్రం దేనికోసమో శూన్యంలోకి చూస్తున్నట్టు ఒక బ్లాంక్ ఫేస్ పెట్టి వింటాడు. నీకేమో కోపం వచ్చేస్తుంటది.
(01:24) ఇంత లాజికల్ గా చెప్తున్నా వీడికి ఎందుకు అర్థం కావట్లేదు అని ఫ్రస్ట్రేట్ అయిపోతుంటావ్. కానీ ఇక్కడ పాయింట్ వాడు అర్థం చేసుకోలేకపోవడం కాదు వాడు కావాలనే అర్థం చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. కానీ ఎందుకో తెలుసా వాడి బ్రతుకు తెరువు వాడి సర్వైవల్ వాడి హోద నువ్వు తప్పుపడుతున్న ఆ సిస్టం మీదే ఆధారపడి ఉన్నాయి. ఒక మనిషి యొక్క బ్రతుకు తెరువు ఏ పునాది మీద అయితే ఆధారపడి ఉందో ఆ పునాదినే కదిలించే ఏ సత్యాన్ని కూడా వాడి మెదడు స్వీకరించదు.
(01:52) వాడి బుర్రకి అకస్మాత్గా తాళం పడిపోద్ది. ఇదొక డిఫెన్స్ మెకానిజం సత్యం ప్రమాదకరమైనదిగా మారినప్పుడు అబద్ధాన్ని గుడ్డిగా నమ్మడమే మనిషికి అత్యంత సురక్షితమైన మార్గం దీన్నే సైకాలజీలో సెలెక్టివ్ బ్లైండ్నెస్ అంటారు. అంటే తమకు నష్టం కలిగించే నిజాన్ని చూస్తూ కూడా చూడనట్టు నటించడం. స నిజంగా నిద్రపోతున్నవాడు ఒక్క కేగతోనే లేచిపోతాడు.
(02:16) వాడికి ఒక చుక్క నీళ్లుు మొహం మీద చల్లితే చాలు లేచి కూర్చుంటాడు. కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్నవాడు దేవుడే దిగి వచ్చిన వాడిని లేపలేడు. ఎందుకంటే కళ్ళు తెరిస్తే వాడికి వాడి అసహ్యమైన నిజ స్వరూపం కనిపిస్తుందన్న భయం కావాలంటే నేను ఇప్పుడు చెప్పబోయేది నిజమో కదా ఆలోచించండి. ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నడిపే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.
(02:36) ఆ హాస్పిటల్ లో పాలరాతి నేలలు ఫైవ్ స్టార్ హోటల్ నే మించే సెటప్ అంతా ఉంటది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి చాలా అమాయకంగా అడగండి. డాక్టర్ గారు అసలు మనిషికి ఏ రోగం రాకుండా ఉండాలంటే సొల్యూషన్ ఏంటి అని అడిగి చూడండి ఆ డాక్టర్ మీకు అసలైన నిజం ఏంటో చెప్తాడు అనుకుంటున్నారా పైన పటారం లోన లోటారం లాంటి ఏవో రెండు మాటలు చెప్తాడు. ఆ బాగా నీళ్లు తాగేయండి యోగా చేసేయండి టెన్షన్ పడకండి అని పై పై సలహాలు ఇస్తాడేమో గానీ అసలైన రూట్ కాజ్ గురించి మాట్లాడడు ఎందుకంటే సమాజం మొత్తం ఆరోగ్యంగా మారిపోతే వాడు హాస్పిటల్ మూసుకోవాలి.
(03:05) వాడు కొన్న కోట్ల రూపాయల మిషిన్లకి ఈ అమ్మాయి వాడు కడతాడు. వాడికి లక్షల్లో జీతం రావాలంటే జనాలు రోగాల బారిన పడుతూనే ఉండాలి. ఒక సిస్టం లో తప్పు జరుగుతూ ఉంటేనే కొందరు జేబులు నిండుతాయి. రోగాలు ఉంటేనే ఫార్మా కంపెనీలు బ్రతుకుతాయి నేరాలు జరిగితేనే లాయర్లు కోర్ట్లు నడుస్తాయి అభద్రతా భావం ఉంటేనే ఇన్సూరెన్స్ కంపెనీలు వర్ధిల్లుతాయి.
(03:25) ఆ తప్పును నువ్వు వాళ్ళకి వేలుపెట్టి చూపించి ఇది న్యాయం కాదు అని ఎంత తార్కికంగా వివరించినా వాళ్ళకి అది అర్థం కాదు ఎందుకంటే ఆ క్షణంలో వాళ్ళకి న్యాయం ధర్మం సత్యం కంటే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళ స్టేటస్ే ముఖ్యం సో వాళ్ళ మనసు ఆ నిజాన్ని ప్రాసెస్ చేయడానికి ససేమిర నిరాకరిస్తది. సమాజం ఎంత మూర్ఖంగా తయారయిందంటే దీనికి అర్థం పట్టే ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది.
(03:50) నీకు జుట్టు కత్తిరించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని ఏనాడు కూడా మంగళలోడి దగ్గరికి వెళ్లి అడగకండి మనం ఎంత అమాయకులం అంటే మనక ఒక సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరిస్తే ఎవడికైతే డబ్బులు వస్తాయో వాడి దగ్గరికి వెళ్లే సలహా అడుగుతాం. ఎంత విడ్డూరం ఒక మంగళ వాడికి బ్రతుకు తెరువు ఆ కత్తిరి మీదే ఉంది. వాడి కంటికి ప్రపంచంలో ఉన్న ప్రతి తలకాయ ఒక నడిచే కస్టమర్ లనే కనిపిస్తది.
(04:13) వాడికి తన సెలూన్ లో ఉండే కుర్చీ ఖాళీగా ఉంటే నిద్ర పట్టదు నువ్వు వెళ్లి ఆ కుర్చీలో కూర్చుంటేనే వాడికి అన్నం దొరుకుతది. అలాంటి వాడి దగ్గరికి వెళ్లి నా జుట్టు బాగుందా కట్ చేయించుకోవాల అని అడిగితే వాడు ఏమంటాడు లేదు సార్ మీ జుట్టు సూపర్ గా ఉంది అద్భుతంగా ఉంది మీరు వెళ్ళిపోండి అని అంటాడా అనడు సార్ బాగానే ఉంది కానీ ఈ సైడ్స్ కొంచెం షేప్ అవుట్ అయినట్టు ఉంది కాస్త ట్రిమ్ చేసామంటే మీకు భలే సెట్ అవుద్దండి అని అంటాడు.
(04:36) సీ వాడు నీకు ఇక్కడ సలహా ఇవ్వట్లేదు వాడు నీ నెత్తి మీద తన వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇక్కడ వాడిని తప్పు పట్టడానికి ఏం లేదు వాడేమి నీకు విలన్ కాదు అది వాడి సర్వైవల్ ఇన్స్టింట్ తన సరుకు నమ్ముకోవడం వాడి ధర్మం మరి ఎవడు తప్పు ఇక్కడ నిష్పాక్షకమైన సలహా కోసం వాడి దగ్గరికి వెళ్ళిన నీదే అసలైన మూర్ఖత్వం. ఈ సూత్రాన్ని మీరు కాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సమాజంలో ప్రతి చోట ఇదే జరుగుతుంది.
(05:01) ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్లి నేను ఈ మ్యూచువల్ ఫండ్ కొనాలా వద్దా అని అడిగితే వాడు కొనొద్దు అంటాడా అరే వాడికి కమిషన్ వచ్చేదే నీ కొనుగోళ్ళ మీద ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ దగ్గరికి వెళ్లి ఇప్పుడు ఇల్లు కొనాలనుకోవడం కరెక్టా కాదా అని అడుగు వాడికి మార్కెట్ మొత్తం పడిపోతున్నా సరే సార్ ఇల్లు కొనాలనుకుంటే మాత్రం ఇంతకంటే కరెక్ట్ టైం ఇంకోటి ఉండదు సార్.
(05:19) సంవత్సరంలో చూడండి రేట్లు డబుల్ అయిపోతాయి అనేగా అంటాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్లి నా బిజినెస్ కి సాఫ్ట్వేర్ అవసరమా కాదా అని అడగండి. వాడు నీకు లేని అవసరాన్ని సృష్టించమారి అమ్ముతాడు. ప్రతి ఎక్స్పర్ట్ వెనక ఒక సేల్స్మెన్ దాగుంటాడు. వాడు నీకు ఎంతగా సహాయం చేస్తున్నట్టు నటించినా నీ భుజం మీద చెయ్యి వేసి ఎంత ఆప్యాయంగా మాట్లాడినా అంతిమంగా వాడు తన సరుకుని నీకు అమ్ముకుంటున్నాడు.
(05:43) వాడికి కావలసింది నీ సమస్య పరిష్కారం అవ్వడం కాదు నీ సమస్య ద్వారా వాడి జేబు నిండటం. ఇక్కడ మీకు కథ చెప్తా వినండి. ఒక ఊర్లో గొర్రెలన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. తమను రోజు రాత్రి ఎవరో ఒకరు వచ్చి తినేస్తున్నారని తమకి భద్రత కొరవైందని బాధపడ్డాయి. దీనికి పరిష్కారం కోసం అడవిలో ఉన్న ఒక పెద్ద సెక్యూరిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాయి.
(06:01) ఆ ఎక్స్పర్ట్ మరి ఎవరో కాదు ఒక ముసలి తోడేలు ఆ తోడేలు దగ్గరికి వెళ్లి ఈ గొర్రెలన్ని తమ బాధని చెప్పుకున్నాయి. అప్పుడు ఆ తోడేలు చాలా గంభీరంగా ఎంతో జాలిగా మొహం పెట్టి అయ్యయ్యో మీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా మీరే మాత్రం భయపడకండి రేపటి నుంచి నేనే మీ మంద కాపలాగా ఉంటాను నా ప్రొటెక్షన్ లో మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని మాటఇచ్చింది.
(06:22) గొర్రెలన్నీ సంబరపడిపోతాయి. తమకు ఒక అద్భుతమైన సలహాదారుడు రక్షకుడు దొరికాడని పండగ చేసుకున్నాయి. ఆ తర్వాత ఏమైందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తోడేలు కాపలా ఉన్న ఆ మందలో రోజు దర్జాగా ఒక్క గొర్రె మాయం అవ్వడం మొదలైంది. ఇక్కడ ఆ తోడేళ్లను తప్పుపట్టి ఏమైనా లాభం ఉందా అది దాని నైజం దాని బ్రతుకు తెరువు అది మరి ఇక్కడ మూర్ఖత్వం ఎవరిది తమని తినేసేవాడి దగ్గరికే వెళ్లి తమను రక్షించమని అడిగిన ఆ గొర్రెలది.
(06:47) ఈరోజు సమాజంలో నువ్వు నేను మనమంతా ఆ గొర్రె లాంటోలమే. మన సమస్యను ఎవడైతే సృష్టించాడో వాడి దగ్గరికే వెళ్లి దానికి పరిష్కారం అడుగుతున్నాం. మనల్ని దోచుకునే వాడినే మనం ఎక్స్పర్ట్ గా దేవుడిగా కొలుస్తున్నాం. నిజం చెప్పాలంటే సత్యం అనేది ఎవ్వడికీ అవసరం లేదు. ఎందుకంటే సత్యం చాలా కఠినంగా ఉంటది. అది నీ బ్రమలన్నిటిని బద్దలు కొడతది.
(07:10) నేను చాలా తెలివైన వాడిని నాకు అన్నీ తెలుసు నేను సురక్షితంగా ఉన్నాను అని నువ్వు వేసుకున్న ఆ ముసుగుని లాగి అవతల పడేస్తది. అందుకే మనుషులు ఎప్పుడు గుంపుల్లో బ్రతకడానికే ఇష్టపడతారు. ఆ గుంపులో అందరూ ఒకే అబద్ధాన్ని నమ్ముతుంటారు కాబట్టి ఆ అబద్ధమే వాళ్ళకి సత్యం లాగా అనిపిస్తది. ఒక అబద్ధం ఒక్కడే చెప్తే వాడిని అబద్ధాలు కోరు అంటారు. కానీ ఒక లక్ష మంది కలిసి ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తే అది సిస్టం అయిపోద్ది ట్రెడిషన్ అయిపోద్ది దాని తర్వాత అదే సైన్స్ అయిపోద్ది.
(07:37) ఇక్కడ ఎవడి సర్వైవల్ ఆడిది ఎవడి ఆటాడిది కానీ నువ్వు మాత్రం ఒక బ్రమలో బ్రతుకుతుంటావ్. సిస్టం నా మేలు కోరుకుంటుంది ఎక్స్పర్ట్స్ అంతా నాకోసమే పని చేస్తున్నారు అని గుడ్డిగా నమ్ముతున్నావ్. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో నీకు జబ్బు తక్కితే వాడికి నష్టం నీ సమస్య తీరిపోతే వాడికి నష్టం నువ్వు సంతోషంగా తృప్తిగా ఉంటే వాడికి నష్టం నువ్వు నిద్రలేచి నిజం తెలుసుకుంటే ఈ మొత్తం సమాజానికే నష్టం.
(07:59) ఎందుకంటే ఈ సమాజం నడుస్తున్నదే మనుషుల భయాల మీద అభద్రత భావాల మీద అజ్ఞానం మీద వాళ్ళు నీకు అమ్మేది ప్రొడక్ట్స్ కాదు వాళ్ళు నీ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. నువ్వు వాళ్ళకి ఒక మనిషివి కాదు నువ్వు కేవలం ఒక కంజూమర్వి ఒక వాకింగ్ ఏటీఎం వి ఇదంతా వినాకు కూడా నువ్వు ఆ మంగళ దగ్గరికి వెళ్లి బాబు నా జుట్టు కత్తిరించుకోవాలా అని అడిగితే నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు.
(08:22) నువ్వు పుట్టినప్పటి నుండి సత్యం అనేది నీ ముందు నగ్నంగా నిలబడి డాన్స్ ఆడుతూనే ఉంది. కానీ నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తున్నావ్ అవునా కదా
No comments:
Post a Comment