కామాఖ్య లో పంచబలుల Package -మేము కూడా ఒక పావురాన్ని | Kamakhya panch bali | Nanduri Srinivas
Author Name:Nanduri Srinivas - Spiritual Talks
Youtube Channel Url:https://www.youtube.com/@NanduriSrinivasSpiritualTalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Xgfz44-2QX8
Transcript:
(00:05) శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ కొన్ని మధ్య మనం కామాక్ష సిరీస్ ప్రారంభించుకున్నాం కదా అమ్మవారి ఇంట్రడక్షన్ వీడియో కొన్ని లక్షల మంది చూశారు ఆ తర్వాత చాలామంది అడిగిన ప్రశ్నలు ఉన్నాయి మెయిల్స్ పంపిస్తున్నారు మెసేజీలోను పెడుతున్నారు ఆ ప్రశ్నలు ఏమిటి అంటే ఏవండీ అందులో ఒక రాజు లక్ష మేకల్ని బలిచ్చాడు ఆలయం పునరుద్ధరించినప్పుడు అన్నారు అదేమిటండి లక్ష జంతువులని అంత దారుణంగా చంపేస్తే ఏ అమ్మవారే ఒప్పుకుంటుందా ఇదొక ప్రశ్న అలాగేనే ఏవండీ శంకరాచార్యుల వారు భారతదేశంలో అన్ని క్షేత్రాల్లోనూ బలులు ఆపేశారు. ఎక్కడైనా వామాచార మార్గంలో ఉపాసన
(00:39) జరుగుతూ ఉంటే శంకరుల వారు సాత్వికాచారంలోకి మార్చారు ఇప్పుడు కాంచీపురం లాంటివి అలాంటి క్షేత్రాల్లో అదే చేశారు కదా మరి శంకరులు ఇక్కడికి వచ్చారు కదా కామాక్షకి అలాంటిది మరి శంకరులు ఎందుకు ఆపలేదు అలాగే ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి అలా బలులు జరిగిపోతుంటే ఎందుకు ఆపలేదు ఇలాంటి ప్రశ్నలు చాలా మంది అడుగుతున్నారు ఇంకొక ప్రశ్న అందరూ అడుగుతుంది ఏంటంటే కాలాపహాడు ఉన్నాడు కదా దుర్మార్గుడు వాడు దండయాత్ర చేసి ఆలయాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసేస్తే ఇంతకుముందు రాజులు కట్టించిన ఆలయాన్ని మరి అమ్మవారు అంత శక్తిమంతమైన అమ్మవారు ఎందుకు ఆపలేదండి అని మంచి ప్రశ్నలు ఇవన్నీను
(01:10) తెలుసుకోవాలని మీ ఆసక్తి బాగుంది ఇవన్నీ చెప్తాను ఇవి అర్థం కావాలి అంటే పురాణంలో కొన్ని రహస్యాలు తెలియాలి. అలాగే కామాక్షి అనగానే అందరూ మొట్టమొదట పంచబలులు అంటారు వాటిల కోసం లక్షలు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు కదా ఆ పంచబలులు తేలిగ్గా ఇచ్చే విధానాలు కూడా ఉన్నాయి కొన్ని అవి కూడా చెప్తాను మీకు ఈ వీడియోలో జాగ్రత్తగా వినండి మీ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్లు దొరుకుతాయి సరే అసలు మొట్టమొదటి బలుల గురించి కామాక్షలో అర్థం కావాలి అంటే పురాణంలో ఉన్న ఒక కథ తెలియాలి.
(01:40) ఇది కాళికా పురాణంలో ఉంది మీకు చెప్పాను కదా వశిష్ట మహర్షి కామాఖ్యలో ఒక రెండు మేజర్ టర్నింగ్ పాయింట్స్ కి కారణభూతులయ్యారు. మొట్టమొదటిది మీకు మొదటి వీడియోలో చెప్పా ఏమిటంటే నరకాసురుడు ఒకసారి మహర్షి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాను అంటే బయటికి గెంటేసాడు. నా అంత మహర్షికి కోపం వచ్చి దుర్మార్గుడా విష్ణు పుత్రుడివై ఉండి నీకు ఇంత అహంకారం రా సరే ఈ రోజు నుంచి పీఠం అదృశ్యం అయిపోతుంది.
(02:03) అలాగనే నువ్వు కూడా నీ తండ్రి చేతిలోనే చస్తావు మళ్ళీ నువ్వు చచ్చాక ఈ పీఠం మళ్ళీ ప్రకటితం అయ్యాక అప్పుడు నేను వస్తాను అని చెప్పి మహర్షి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆయన ఏం చేశారంటే కామాక్షకి కొంచెం దూరంలోనే ఎందుకంటే అమ్మవారి సన్నిధిని వదలదలుచుకోలా కొంచెం దూరంలో గౌహతికి దగ్గరలో ఒక ఆశ్రమాన్ని కట్టుకొని ఉన్నారు ఇప్పటికీ కూడా ఆశ్రమానికి బసిష్ట అని పిలుస్తారు మనం వెళ్లొచ్చు చాలా రమణీయంగా ఉంటుంది అసలు ఆశ్రమం అక్కడికి వెళ్ళిపోయారు అది మీకు మొట్టమొదటి వీడియోలో చెప్పా తర్వాత ఏమైందంటే నరకాసురుడు చనిపోయాక అమ్మవారు మళ్ళీ యోని పీఠం ప్రకటితం అయితే అప్పుడు ఈ మహర్షి
(02:34) మళ్ళీ వచ్చి చక్కగా కామాక్షలో యోనిపీఠం దగ్గర కూర్చుని తపస్సు చేసుకోవడం మొదలు పెట్టారు. ఎందుకు వచ్చేసారండి మళ్ళీ ఆశ్రమం వదిలేసి అంటే గుర్తుపెట్టుకోండి కామాక్షి అనేది ఒక పెద్ద మాగ్నెట్ అంతే జీవితంలో ఒక్కసారి వెళ్ళండి మళ్ళీ వెంటనే ఇంటికి వస్తారు కదా ఒక టూ మంత్స్ కే మళ్ళీ ఒక్కసారి కామాక్షి వెళ్లి వచ్చేస్తే బాగుంటుంది అమ్మని చూసేద్దాం ఆ క్షేత్రం అలా ఆకర్షించేస్తుంది అంత పెద్ద మాాగ్నెట్ అయితే మళ్ళీ ఆ మహర్షి అక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నారు మహర్షులని ఆకర్షిస్తే ఇంక మనలాంటి సామాన్యులని ఎందుకు ఆకర్షించు చెప్పండి సరే ఆయన తపస్సు చేసుకుంటుంటే ఈ
(03:04) లోపల ఏమైంది ఒకసారి యమధర్మరాజు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడట వెళ్లి స్వామి జనమందరూ కూడా కామాక్ష శక్తి తెలిసిపోయి కామరూప క్షేత్రానికి వెళ్ళిపోతున్నారు అక్కడ కుండాల్లో స్నానం చేసేస్తున్నారు అమ్మవారు రక్షణలోకి వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత నా శక్తి పనిచేయట్లేదు ఈ మృత్యు శక్తి వాళ్ళని నియంత్రించలేకపోతున్నాను అని బాధపడ్డాడుట అప్పుడు విష్ణువు నవ్వి నాయనా సర్వదేవైహి సర్వతీర్థైహి సర్వక్షేత్రై స్తదైవచ ఏతత్ వ్యాప్తో కామరూపే నాతోన్యత్ విద్యతే పరం అని పురాణంలో విష్ణుమూర్తి విష్ణు ఉవాచ అని చెప్పిన శ్లోకం ఇది ఏమిటి అంటే సర్వ దేవతల్లో సర్వ తీర్థాల్లో సర్వ
(03:47) క్షేత్రాల్లో ఎక్కడా కూడా ఇటువంటి శక్తి ఉన్న క్షేత్రం ఇంకొకటి కనిపించదు ఇలాంటి క్షేత్రం ఇంకొకటి లేదు అందుకని ఇక్కడ ఉంటే ఎలాగో రక్షణ కలుగుతుంది కదా అందుకని ఆ జనాల్ని అక్కడి నుంచి తరిమేయాలి ఎందుకంటే ఊరికే కోరికలతో వచ్చేస్తున్నారు మీకు గత వీడియోల్లో కూడా చెప్పాను కామాక్ష అనేది అదిఒక తపోభూమి భూమి సాధన చేయదలుచుకుంటే వెళ్ళండి పాములు కోరికలతో వెళ్ళేటట్టయితే చిట్టాలతోటి ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి వెళ్ళవచ్చు అమ్మవారు కూడా కామాఖ్య అంటేనే కోరికలు తీర్చే తల్లి అని కానీ సాధన చేసుకోవడానికి వెళ్ళండి ఆ క్షేత్రాన్ని అలా ఉపయోగించుకోవాలి మనం అయితే అప్పుడు
(04:22) విష్ణుమూర్తి ఏం చేశారంటే ఉగ్రతారాదేవిని పిలిచారట పిలిచి ఇక్కడున్న అందరిని బయటికి పంపించి ఒక్కసారి అని అమ్మవారిని ఆదేశించారు ఆదేశిస్తే అప్పుడు అమ్మవారు ఉగ్రతారాదేవి చాలా ఉగ్ర రూపంలో వచ్చి అందరిని బయటికి తరిమేసి వాళ్ళతో పాటు వశిష్ట మహర్షిని కూడా తరిమేసింది. ఆ మహర్షి నేను వశిష్టుడిని అని చెప్పినా సరే అప్పుడు అమ్మవారు చాలా ఉగ్రమైన స్వరూపంలో ఉండి వినకుండా మహర్షిని కూడా బయటికి తోసేసారు.
(04:47) నా అంతో మహర్షికి కోపం వచ్చి అమ్మ కామాఖ్య అమ్మ నువ్వు అక్కడ పీఠంలో ఉన్నావు నేను ఇక్కడ నీ పుత్రుని తపస్సు చేసుకుంటుంటే ఇంతోటి మహర్షిని నువ్వు కనీసం లెక్క చేయకుండా తారాదేవి నన్ను బయటికి పంపించేస్తున్న నువ్వు విన్నావు కదా సరే నిన్ను శపిస్తున్నాను నేను అని చెప్పి అది శపించారు మహర్షి ఏమిటంటే పురాణంలో చెప్పారు తస్మాత్వం వామ్యభావేనా పూజ్యాభవ సమంత్రిక బ్రమంతి మలేచవత్ యస్మాత్ గణానాం మందబుద్ధయః అని అమ్మవారి వారికి చాలా దారుణమైనవి రెండు శాపాలు ఇచ్చారు వశిష్ట మహర్షి మొట్టమొదటి శాపం ఏమిటి అంటే ఇక్కడి నుంచి నువ్వు బామాచారంలో పూజింపబడతావు ఎక్కువగాను అని
(05:25) అదొక శాపం రెండోది ఏమిటి అంటే కొంతకాలం పోయాక మలేచులు ఉంటారో మందబుద్ధులు అతురుష్కులు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ దండయాత్ర చేస్తారు అని చెప్పి శపించారు ఆయన దారుణమైన శాపాలు అంటే ఏమిటండీ మహర్షి అంతోటి అమ్మవారిని సాక్షాత్ జగజ్జనని శపించగలరా అంటే దేవతలు కూడా మహర్షులకు అలా తలంచ స్తారు మనక చెప్తారు చూడండి దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం అని ఇక్కడ బ్రాహ్మణులు అంటే మళ్ళీ కులాలు తీసుకొచ్చేయకండి అలాంటి బ్రహ్మజ్ఞానుల్ని బ్రాహ్మణులు అని పిలుస్తారు వాళ్ళ అధీనంలో దేవతలు ఉంటారు దేవతలు వాళ్ళు ఏం చెప్తే అది వింటారు అంతే
(06:00) దాంతో అమ్మవారు కూడా ఆ శాపానికి తలవంచారు అందుకే అక్కడ ఇప్పటికీ వామాచారం బలులు అవన్నీ ఇప్పటికీ జరుగుతున్నాయి ఆ తర్వాత కాలాపహాడ దుర్మార్గుడు వచ్చి దండయాత్ర చేసి మొత్తం ధ్వంసం చేసేసాడు కదా దానికి కూడా ఈ మహర్షి శాపమే కారణం ఇలాంటివి ఏవైనా అర్థం కావాలంటే ఏమిటండీ ఆ క్షేత్రాన్ని అలా ఎవడో చేసేస్తుంటే అమ్మవారు చూస్తూ కూర్చున్నారు ఆవిడకి ఏం శక్తి అండి బలులు ఇస్తుంటే అమ్మవారు ఎందుకు తీసుకుంటున్నారండి అంటే అవన్నీ అర్థం కావాలి అంటే పురాణం చదవాలి లేకపోతే ఎవరైనా చదివిన వాళ్ళు చెప్తే వినాలి అప్పుడు అర్థం అవుతాయి సరే ఆ తర్వాత మరి దీన్ని
(06:33) ఇంకెవరు సంస్కరించలేదా అండి అంటే ఇదే సందేహం నాకు వచ్చింది ఎందుకంటే ఆదిశంకరులు కాసేతు హిమాచలం మొత్తం వెళ్లి ప్రతి క్షేత్రంలోనూ వామాచారం ఎక్కడఉందో అక్కడ అన్నీ సంస్కరించారు ఆయన ఉదాహరణకి కాంచీపురం లాంటి చోట్ల కూడా అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉంటే అలాగే మనకి తిరువనిక్కావెల్లి అంటారు జంబుకేశ్వరం అక్కడ ఉంటే అమ్మవారి ఉగ్రకళ్ళన్నీ తీసేసి శాంతింప చేశారు మధురైలోన అలా అన్ని చోట్ల అలాగే ప్రతి చోట సాత్వికాచారాన్ని ప్రవేశపెట్టారు వారు అలాంటిది మరి ఈ క్షేత్రానికి శంకరులు వచ్చారు మీరు కామాక్షి అమ్మవారి ఆలయం పక్కనే ఒక మెట్లు ఉంటాయి ఆ పైకి వెళ్లి చూస్తే అక్కడ ఒక
(07:08) రాతి మీద శంకరాచార్యుల వారి ఆలయం ఉంటుంది ఆ ఆలయం ఎక్కడఉందో అక్కడే కూర్చొని శంకరుల వారు తపస్సు చేశత కామాఖ్యలో మరి వారు వచ్చినా సరే ఎందుకు సంస్కరించలేదు అంటే ఇటువంటివన్నీ కూడా పురాణంలో దొరకనివి ఎందుకంటే పురాణం తర్వాత జరిగిన ఉంటాయి ఏ క్షేత్రంలో అయినా మీరు చూడండి పురాణం వరకు జరిగినవన్నీ వ్యాసమహర్షి పురాణాల్లో రాశారు పురాణం తరువాత చరిత్రల్లో జరిగినవి ఉంటాయి అవైతే స్థల పురాణంలో దొరుకుతాయి లేకపోతే చరిత్రలో దొరుకుతాయి లేకపోతే అక్కడ ఎన్నో నాల నుంచి సాధన చేస్తున్న సాధకులు ఉంటారు వాళ్ళని అడిగితే చెప్తారు నా అదృష్టం కొద్ది కామాఖ్యలో అటువంటి
(07:41) వాళ్ళు ముగ్గురు సాధకులు పరిచయం అయ్యారు అందులో కొంతమందిని అడిగితే నాకున్న ప్రశ్నలు కొన్నిటికి ఈ బలికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు సమాధానం చెప్పారు ముఖ్యంగా శంకరాచార్యుల వారి దానికి సంబంధించి ఒకటి ఒకాయన చెప్పారు ఆయన కూడా చాలా గొప్ప సాధకుడు చిన్న కుర్రవాడే గాని ఏమిటంటే ఇది చాలా చిత్రమైన కథ ఇది శంకర విజయంలో లేదు శంకర విజయంలో కామాక్షికి సంబంధించింది ఒక భయంకరమైన కథ ఉంది అది మీకు తర్వాత ఎప్పుడైనా వీడియోల్లో చెప్తా అసలు ఆశ్చర్యం వేస్తుంది అది వేరే విషయం అయితే గనుక ఈయన ఇంకో కథ చెప్పారు ఇందాక శంకర విజయం అంతా వెతికినా కనిపించలేదు కానీ సాధకులు
(08:15) కామాక్షలో ప్రఖ్యాతమైన కథ ఇది అని చెప్పారు ఏమిటంటే శంకరాచార్యుల వారు ఇక్కడ ఇలాంటి వామాచారం కుదరదు అమ్మవారిని సాత్వికంగానే పూజించాలి అని చెప్పి అది మొత్తం తీసేస్తే అక్కడఉన్న పూజారులకి వాళ్ళకి నచ్చలేదట ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా అక్కడ ఆ రకమైన ఆచారమే చేస్తున్నారు కదా అయినా శంకరుల వారు అంతా తీసేద్దాము అని నిర్ణయింపచేసి హోమం చేయిస్తుంటే విచిత్రంగా ఆ చుట్టుపక్కల ఉన్న మేకలు వాళ్ళు ఏవైతే బలిద్దాము అని తీసుకొచ్చారో ఆయన అవన్నీ దూరం పెట్టిచ్చి హోమం చేయిస్తుంటే విచిత్రంగా అవన్నీ పరిగెత్తుకుంటూ వచ్చి హోమగుండంలో దూకడం ప్రారంభించ ఆశ్చర్యపోయి ఇదేంటి వాటంతట అవి
(08:49) దుక్కేస్తున్నాయి ఎందుకంటే సామాన్యంగా మంట ఉన్న చోటకి జంతువులు రావు సరే అయితే అమ్మవారి నిర్ణయం ఈ క్షేత్రంలో మాత్రం నేను ఏమి మార్చదలుచుకోలేదు అని చెప్పి శంకరాచార్యుల వారు వెళ్ళిపోయారు అని ఆయన నాకు చెప్పారు ఇది శంకర విజయంలో లేదు మళ్ళీ చెప్తున్నా కానీ ఆ సాధకుడు ఒకాయన చెప్పారు అందుకే ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే ఇక్కడ మాత్రం సిస్టం మారదండి అని వారు చెప్పారు సరే ఇంకా మీకున్న ప్రశ్నలు ఒక్కొక్క ఒక్కదానికి మీకు కామాక్ష బలి అనగాని చాలా ప్రశ్నలు వస్తాయి కదా ఒక్కొక్క దానికి సమాధానం చెప్పుకుందాం.
(09:16) మొట్టమొదటిది ఏమిటంటే ఆ నరనారాయణుడు చిల్లారాయి మీకు వాళ్ళ చరిత్ర మొట్టమొదట చెప్పా వాళ్ళు కాలాపహాడి ఆలయాన్ని ధ్వంసం చేసేసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మించినప్పుడు లక్ష మేకల్ని బలి ఇచ్చారు కదా ఎందుకు అలా ఇచ్చారండి అని చాలా మంది అడిగారు నేను ఇదే ప్రశ్న సాధకుల్లో ఒకాయన్ని అడిగితే ఆయన చెప్పింది ఏమిటంటే అమ్మవారు ఇంకా కొంచెం శాంత కళలో ఉండడం వల్లే కాలాపహా లాంటి వాడు దండయాత్ర చేశాడు ఆ తర్వాత ఆలయానికి ఎప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా ఉగ్ర కళని మళ్ళీ పైకి తీసుకురావడానికి అంత బలి ఇచ్చారు ఇప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు అందుకే
(09:51) తీవ్రమైన కళల వల్ల తర్వాత లేచులు కానీ బ్రిటిషర్స్ కానీ వీళ్ళఎవ్వర ఆలయం మీద చెయ్యి వేయలేదు అని ఆయన చెప్పారు. ఇలాంటివి నేను చెప్పాను కదా పురాణాల్లో దొరకవు ఎందుకంటే ఇది బ్రిటిషర్స్ కి సంబంధించిన కథ అందుకని ఆయన చెప్పింది. నేను ఆయన్ని రెండు మూడు ప్రశ్నలు అడిగావి మనఅందరికీ వచ్చే ప్రశ్నలే ఏమిటంటే ఏవండీ మరి అన్ని మేకల్ని చంపుతూ ఉంటే ఇక్కడ రోజు ఇలా బల్లు ఇస్తూ ఉంటే మీకు బాధ లేదా చూసి మీరు ఇంత సాధకులు కదా ఎందుకు ఆపకూడదు అని అడిగా అడిగితే ఆయన నవ్వి ఒక ప్రశ్న అడిగారు మీరు ఏ ఊరిలో ఉంటారు అంటే బెంగళూరులో ఉంటానండి మీ ఊరిలో మటన్ షాపులు
(10:24) ఉన్నాయా అన్నా అవ్వో ఎన్ని ఉన్నాయండి కొన్ని వేలు ఉంటాయేమో ఏ వీధికి వెళ్ళినా సరే ఒక 10 ఉంటాయి మీరు అక్కడికి వెళ్లి ఎందుకు ఆపట్లేదు అంటే అది వాళ్ళ ఆహారం అండి అన్నా ఇది అంటే ఇక్కడ వాళ్ళ సాంప్రదాయము అమ్మవారికి వాటిల్ని సమర్పించాక ఆ జంతువుల్ని స్వీకరించే వాళ్ళు ఉన్నారు మనుషులు ఉన్నారు జీవులు ఉన్నాయి వాటిల వల్ల వాళ్ళు పోషింపబడుతున్నారు ఆపడానికి మీరు నేను ఎవరు ఆ జీవులన్నీ వాటిల ద్వారా పోషింపబడతాయి అని చెప్పి ఇంకా కొన్ని సీక్రెట్స్ చెప్పారు అసలు బాబోయ్ దీనికి సంబంధించినవి అవి మాత్రం వింటే ఒళ్ళు గగురు పడుస్తాయి కానీ అవి అందరికీ
(10:57) తెలియకూడదు అందువల్ల నేను ఈ వీడియోలో అవి చెప్పట్లే ఈ వీడియోలోనే కదా ఏ వీడియోలోనూ చెప్పలే ఆయన అన్నారు అవి అవి మీకు నిషిద్ధం అందుకని మీరు వాటి జోలికి వెళ్ళకండి అవి తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ పని చేస్తున్నారు మనకి ఒక మాట ఉంది శాస్త్రంలో యదన్నాత్ పురుషేభుంతో తదన్నాస్తయ దేవత అని అంటే ఏ జీవుడు ఏదైతే తింటాడో ఆ దేవతకి అదే నివేదిస్తాడు ఆ జీవుడు అని అలా వాళ్ళు నివేదించుకుంటున్నారు మీకేమిటి లలితా సహస్రనామం చూస్తే మీరు బలిప్రియ బలిరూప ఇలాంటి నామాలు ఉంటాయి కదా ఆ నామాలక అయితే అసలు యాక్చువల్ గా తాత్వికమైన అర్థం వేరే ఉంది లేండి బట్ ఆయన చెప్పింది ఏమిటంటే ఆ
(11:31) లౌకికమైన అర్థం చూసినా సరే మీరు ఇదిగో ఇదే అర్థం నేను ఆయన్ని ఇంకో ప్రశ్న అడిగా మనక వచ్చే ప్రశ్న ఈ సాధకులందరూ భలే సమాధానాలు చెప్పారు ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క రకంగాను ఏమిటంటే సరేనండి ఆహారం కోసం అయినా సరే హింసని అమ్మవారు మెచ్చుతారా అమ్మవారు అంటే అమ్మ కదా ఆవిడ ఎలా మెచ్చుతుంది అని అడిగారు అడిగితే ఆయన మీరు ఏం తింటారు అన్నారు అంటే శాఖహారం అండి అన్నా అనేసరికి మీరు మరి రోజు ఈ కూరగాయలు అవన్నీ కోసుకు తింటారు కదా తింటే అది ఆ మొక్కకి హింస కాదా అని అడిగారు పువ్వులు కోస్తారు కదా అంటే నేను చెప్పా ను అదేమి హింస అండి ఇప్పుడు నేను ఒక బెండకాయ ఏదో తుంపాను
(12:05) అనుకోండి ఆ మొక్కకి ఇంకో బెండకాయ వస్తుంది మళ్ళీను అలాగే అక్కడఏదో కొంచెం కొట్టేసామ అనుకోండి ఒక కొమ్మ మళ్ళీ ఇంకో కొత్త కమ్మ వస్తుంది అంతేగన జంతువు కాలో చెయ్యో తీసేస్తే మళ్ళీ కొత్త చెయ్యి కొత్త కాలు రాదు కదా అని ఆయన వెంటనే నవ్వి సరే అయితే అలా మీరు తోటకూర తుంపుకొని తింటూ ఉంటారు గోంగూర తింటూ ఉంటారు కొత్తిమీర తింటూ ఉంటారు అలాగే అరటి చెట్లు అది అయిపోయిన తర్వాత గెల అయిపోయాక చెట్టుని నరికేస్తారు ఇవన్నీ కొమ్మలు తుంపుకుంటారు మొక్కలు పీక్కు తింటారా అని ఆశ్చరిపోయి అవునండి మొక్కలు పీక్కునే తింటాము అన్నా మరి అది హింస కాదా మొక్క మొత్తాన్ని
(12:34) పీకేస్తున్నారు కదా మీరంటే ఒక జీవిని చంపేసినట్టే కదా కందమూలాలు తినే మహర్షి ఉంటారు కదా ఆయనకి మీరు చేస్తున్న తోటకూర గోంగూర కొత్తిమీర ఇవన్నీ హింసలా కనిపించి బాధేస్తుంది ఎందుకంటే ఆ జీవిలో కూడా ప్రాణం ఉంది కదా అని వాళ్ళు రాలిన పళ్ళు అలాగే కందమూలాలు కింద రాలిన ధాన్యం తప్ప ఏవి తినరు మహర్షులు వాళ్ళకి మీరు చేసేది హింస అనిపిస్తుంది మీరు మాంసాహారం తినరు కనుక అది తినేవాళ్ళకి మీకు అది హింస అనిపిస్తుంది అంతేగ గన అమ్మవారికి ప్రకృతిలో ఉన్న అన్ని మీరు నేను చెట్టు మేక దున్నపోత అన్నీ కూడా అమ్మవారి సృష్టేను ఆవిడ నుంచే వస్తాయి మళ్ళీ ఆవిడ
(13:11) నుంచే వెళ్తాయి వెళ్ళే మార్గాలు వేరు వేరు తప్ప చివరికి అక్కడికే చేరుతాయి అని చెప్పి అప్పుడు మళ్ళీ ఆ లలితా సహస్రనామాలే చెప్పారు చెప్పి కామాక్షా దేవికి సంబంధించినవి కూడా అక్కడ యోని యోని నిలయా అని అవన్నీ చెప్పి అమ్మవారే ఇక్కడా కొలువు ఉన్నారు లలితా త్రిపుర సుందరిని అందుకని ఇక్కడ బలులు అలాంటివి ఏమిటి అంటే అది ఇక్కడ ఉన్న మార్గం మీరు విసడించుకోకండిమీ మీకు నచ్చింది అనుకోండి చూడండి నచ్చకపోతే దూరంగా ఉండండి అది ఈ క్షేత్రంలో నియమం అంతే తప్ప ఈసడించుకోవడం లేకపోతే ఇదేమిటి అనడం అలాంటివి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు అని చెప్పారు. నాకు వాళ్ళందరితో
(13:44) మాట్లాడినప్పుడు కొన్నిటికి సమాధానాలు దొరికాయి చివరికి ఈ బలి అనేది నాకు నచ్చని పని అయినా సరే ఆ క్షేత్రంలో అది నియమం కాబట్టి నేను దూరంగా ఉన్నా ఇప్పుడు అక్కడ బలిస్తూ ఉంటే ఏం చేస్తారంటే ఈ డ్రమ్స్ లాంటివన్నీ వాయిస్తారు. పాయిస్తే నాతో పాటు వచ్చిన మిగతా సాధకుల అందరూ వాళ్ళు వెళ్లి చూసి వచ్చారు వాళ్ళు ఏం చెల్లించలేదు.
(14:03) హాయిగా అక్కడికి వెళ్లి నేనేదో కుంకుమ పూజ ఎలా చేస్తా చూస్తాను వాళ్ళు అక్కడికి వెళ్లి అలా చూసి వచ్చారు. నేను మాత్రం నా మార్గం అది కాదు కాబట్టి నేను పక్కకు వెళ్లి అక్కడ హాయిగా కూర్చొని జపం చేసుకున్నా అది నేను చేసిన పని. సరే ఇంతకే అక్కడ అసలు ఈ పంచబలులు ఏమిటి? అక్కడ ఏం జరుగుతుంది అలాగే ఇందాక చెప్పాను కదా పంచబలులు తేలిగ్గా చేసే మార్గం కూడా ఉందని అవన్నీ కూడా ఇప్పుడు చెప్తాం.
(14:21) మొట్టమొదటిది పంచబలులు అంటే ఏమిటి అంటే అవి చాలా ఉన్నాయి కానీ అన్నిటికన్నా ప్రఖ్యాతమైనది ఏమిటంటే దున్నపోతుని మేకని చేపని కుష్మాండం అంటే బూడిది గుమ్మిడికాయని ఇక్షువు అంటే చెరుకుగడిని వీటన్నిటిని బలిస్తారన్నమాట ఇవన్నీ కలిపి చేస్తే దానిని పంచబలి అంటారు దానికి పురాణంలో ఆ బలి ఇచ్చే కత్తిని ఎలా పూజించాలి అలాగే బలి మంత్రాలు ఏమిటి బలిస్తున్నప్పుడు అమ్మవారికి సమర్పించడానికి ఏమిటి అవన్నీ పురాణంలో చెప్పేసారు వాళ్ళు అలాగే చేస్తారు వీటన్నిటికీ చేయడానికి అక్కడ పెద్ద పెద్ద ప్యాకేజెస్ ఉన్నాయి.
(14:56) ఇది బలిచ్చే మొట్టమొదటి మార్గం ఇదే కామాక్షలో ప్రక్షాతంగా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా బలిచ్చేవి ఇంకొక రెండు మార్గాలు కూడా ఉన్నాయి. రెండో మార్గం ఏమిటి అంటే వాటిల్ని అమ్మవారికి వదిలేసి సమర్పించడం అది మేము చేసాం అది ఏమిటంటే అక్కడ మీరు ఆలయం పైన గమనించండి ఎన్ని పావురాలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయో అసలు ఆలయానికి గజపృష్ట గోపురం ఉంటుంది దాని మీద చూస్తే మీరు వేలాది పావురాలు అన్నమాట అవి అలా స్వేచ్ఛగా వాటి పుట్టిల్లు అన్నట్టు తిరుగుతూ ఉంటాయి అలాగే ఆలయం లోపల చూస్తే బోలెడు మేకలు తిరుగుతూ ఉంటాయి మీరు ఆలయం అంతా చూడండి మేకలు అంతా ఎలా తిరుగుతూ
(15:31) ఉంటాయి అసలు అక్కడంతా మేకల వాసనే ఉంటుంది ఆలయం దగ్గరికి వెళ్తే అయితే ఈ బలి ఇచ్చే వాళ్ళు ఎప్పుడ ఆ పావురాల్ని ఈ మేకల్ని వీటిల్ని ముట్టుకోరు ఎందుకు ముట్టుకోరండి అంటే వీటిని మన అమ్మవారికి సమర్పించే ఇంకొక మార్గం అన్నమాట అది తెలిసి అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే నాకు కూడా సంతోషం వేసింది అక్కడ ఒక బోన్లో కొన్ని పావురాలు అమ్ముతున్నారు.
(15:50) అరే పైనన్నవి స్వేచ్ఛగా తిరుగుతున్నాయి అవి లోపల ఉన్నాయి సరే మనం కూడా ఆ రకంగా అమ్మవారికి సమర్పిద్దాం అని చెప్పి మేమందరం తలోక పావురం తీసుకొని అమ్మవారిని స్మరించి హాయిగా సమర్పించి ఆ గోపురం పైకి ఎగిరిపోయి అవి చక్కగా తిరిగితే ఎక్కడ వాటిని మళ్ళీ ఎవ్వరు ముట్టుకోరు అలాగేనే మేకల్ని సమర్పిస్తారు కొంతమంది అలా తీసుకొచ్చి బలి ఇవ్వకుండా బలి ఇచ్చిన అమ్మవారికి సమర్పించడమే ఇది సమర్పించడమే కదా వదిలేస్తే అవి ఆలయంలో హాయిగా తిరుగుతాయి అలా ఒక మేక అయితే ఇంత ఎత్తు అయిపోయింది ఇదిగో మీకు ఫోటోలో చూపిస్తున్నాను చూడండి దాన్ని చూసి ఎంత బాబు ఇంత పెద్ద మేకని ఎప్పుడు చూడలేదు
(16:18) అనుకుంటాం అది ఆలయంలో హాయిగా తిరుగుతూ ఉంటుంది ప్రదక్షణాలు చేస్తూ ఉంటుంది మేక అలా ఎవరో సమర్పించని పెద్దది అయిపోయింది అన్నమాట అలాగే విచిత్రం ఏంటంటే సమర్పించిన పావురాలు పక్కనే పిల్లులు ఉంటాయి పిల్లి అక్కడే ఉంటుంది పావురం అక్కడే ఉంటుంది అవి రెండు అలా తిరుగుతూ ఉంటాయి అంతే ఇది ఇది బలిచ్చే ఇంకొక మార్గం అంటే అమ్మవారికి సమర్పించడం అన్నమాట ఇది కూడా సమర్పించడమే మేము అలాగే సమర్పించాం.
(16:40) ఇంకా ఇంకొక మార్గం ఉంది అది లాస్ట్ ది అది అన్నిటికన్నా తేలికయింది కానీ అన్నిటికన్నా కష్టమైంది. ఇదేమిటండి అలా ఎలా ఉంటుంది అంటే చెప్తా ఇప్పుడు ఈ పంచబలులు ఉన్నాయి కదా వీటిలో ప్రతిది కూడా మనలో ఉన్న ఒక దుర్గుణానికి ప్రతీక ఇప్పుడు దున్నపోతుంది అది ఏమిటంటే మదానికి ప్రతీక కొంతమంది చూడండి కన్ను మిన్ను కానకుండా అవతలు ఉన్నవాళ్ళు మహాత్ములయినా సరే గొప్పవాళ్ళయినా సరే వీళ్ళకి అజ్ఞానం తప్ప ఏం లేకపోయినా సరే కయ్యానికి కాలు దువ్వి ప్రతి వాళ్ళని తిట్టటం అది మదానికి ప్రతీక అది దున్నపోతుకి ప్రతీక మదం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి అక్కడికి వెళ్లి ఆ లోపల
(17:14) ఉన్న దున్నపోతుని పైకి తీసి బలివ్వండి అంటే అమ్మ ఇంకెప్పుడూ నేను ఈ మదాన్ని ప్రదర్శించను నేను ఇక్కడి నుంచి వదిగి ఉంటాను అంటే ఆ దున్నపోతుని బలిస్తే అమ్మవారు ఎంత సంతోషిస్తారో అలాగే ఇప్పుడు చేప ఉంది చేప దేనికంటే ఆశకి ప్రతీక చూడండి ఇంత పెద్ద చేపయినా సరే వాళ్ళ గేలానికి వచ్చిన పురుగు వేస్తే దానికి ఆ పురుగులు ఎన్ని దొరుకుతాయి నీళ్ళలో అయినా సరే అది కూడా తినేయాలని ఏదో ఆశతో వస్తుంది దానికి చిక్కుకుంటుంది చివరికి చస్తుంది అంతేనా అలాగే మనకి కూడా ఎంత ఆశ ఎంత సంపాదించినా సరే ఇంకా సంపాదించాలి రిటైర్ అవుదాం అంటే అదే ఇంకో ఆరు నెలలు పోయాక అవ్వదాం ఇంకో
(17:44) సంవత్సరం పోయాక అవుదాం ఇంకా కొన్ని కోట్లు సంపాదించుకోవాలి ఇలా ఆశ ఉంటుంది కదా ఆ ఆశను తీసుకెళ్లి అక్కడికి ఇచ్చి అమ్మ నేను చేసిన ఉద్యోగం చాలు నువ్వు ఇచ్చిన డబ్బులు చాలు నేను ఇంక ఇక్కడి నుంచి చక్కగా రిటైర్ అయిపోయి హాయిగా మంత్రసాధన చేసుకుంటా తల్లి ఈ జన్మకి సంపాదించుకున్న వచ్చే జన్మకి సంపాదించుకోవాలి కదా పుణ్యాన్ని అందుకని మంత్రసాధన చేసుకుంటాను అని బలి ఇచ్చేసారు అనుకోండి అది చేయపని బలి ఇవ్వడం అలాగే చెరుకుగాడు ఉంది అది కామానికి ప్రతీక అలాంటివి బయటికి తీసి బలి ఇవ్వగలిగితే చాలా కష్టం అది చేయడం కానీ అది చేయగలిగితే అమ్మవారు ఇంకాస అసంతోషిస్తుంది ఇది
(18:15) కామాక్షలో బలులకు సంబంధించిన విషయం అర్థమైందా మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికిందా శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం [సంగీతం] మన ఆధ్యాత్మిక వీడియోల్ని మూడు ఛానల్స్ గా విభజించాం మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి
No comments:
Post a Comment