బంధువులని చుస్తే భయం వేస్తుంది! || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qjA-jX7Co2s
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం బంధువులు ఈ మాట ఎంత బాగుందో కదా వినటానికి ఎంత ఇంపుగా సొంపుగా మనసంతా నిండుగా చాలా బాగుంది. ఆ మాట వినగానే మన చిన్నతనంలోకి వెళ్ళిపోతాం చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకవస్తాయి ఒకరికొకరు బంధువులు సపోర్ట్ చేసుకోవటం నేను ఉన్నాను ఒకరి కష్టంలో ఉంటే మేము ఉన్నామని అందరూ కూడకట్టుకొని హెల్ప్ చేయటం మంచి మాటలు చెప్పటం కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంటే వాళ్ళ పిల్లలు బాగుపడుతుంటే వాడు ఒక వ్యాపారం పెద్ద వ్యాపారమో చిన్న వ్యాపారమో పెట్టుకుంటే సంతోషించే వాళ్ళలో మొదటి స్థానం లో బంధువులే ఉండేవారు మరి ఈరోజు
(00:49) బంధువులు అంటే రాబందులు [సంగీతం] రాబందులు మనిషి మాంసాన్ని అంటే బ్రతుకున్న మనిషిని ఎలా పొడుచుకొని తింటాయో ఈరోజు బంధువులు అంతకన్నా నీచంగా దిగజారిపోయి చంపుకొని కొని తింటున్నారు మాటల యుద్ధం రూమర్స్ క్రియేట్ చేయటం ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవటం ఇదే పనిగా పెట్టుకున్నారు. మరి బంధువులంటే ఎక్కడో బీరకాయ పీచ్ కాదండి మన సొంత తోబుట్టులు తోడపుట్టినోళ్ళు అన్నదమ్ములు వాళ్ళ
(01:34) పెల్లాలు చిన్నాన్నలు పెద్దనాన్నలు మామయ్యలు వాళ్ళ పెళ్ళాలు మేనమామలు అమ్మ చెల్లుళ్లు ఇంకా నాన్న తరుపోళ్ళు మేనత్తలు వీళ్లే మన దగ్గర బంధువులు రక్త సంబంధం ఉన్నవాళ్ళు చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారని తెలుసు కానీ వాళ్లే బాగుండాలి ఎవ్వరు బాగోకూడదు బాగుంటే కళ్ళలో నుంచి రక్తం చుక్కలు వస్తాయి అంటే రక్త కన్నీరు కారుస్తారు. ఎదుగుదలను చూసి వరవలేరు.
(02:11) కన్న తల్లిదండ్రుల దగ్గరే సహాయం పొందుతున్నారు ఏమి చేయకుండా బేవర్స్ బతుకు బతుకుతున్నారు మగపిల్లలు వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు అదే తండ్రికో తల్లికో హెల్త్ బాగోకపోతే ఒక సర్జరీ ఉందా లేదా హాస్పిటల్ చూపించాలా అంటే మొఖం చాటేస్తున్నారు ఈ తిన్న కూడు ఎక్కడిది ఆ పైసలు ఎక్కడివి ఆ రక్త మాంసాలు ఎవరి సొమ్ముతో పెరిగినయి అన్న విషయం కూడా మర్చిపోతున్నారు ఎక్కువగా మాట్లాడితే తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసేస్తారు.
(02:47) కొడుతున్నారు చంపుతున్నారు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో బంధువుల నుంచి ఎటువంటి సహాయం ఆశించకండి ఎందుకంటే ముందుగా ఏడ్చేది వాళ్లే మామూలు ఏడుపులు ఏడవరు అఘోరా ఏడుపులు ఏడుస్తారు. అంతటి కక్ష కుల్లు పెట్టుకొని ఉంటున్నారు. ఎక్కడైనా ఇదే తీరు మీ ఫ్యామిలీస్ లో కూడా ఇలాగే ఉన్నారు. ఎవరి పిల్లలు బాగోకూడదు చదువుకోకూడదు అలాగే వాళ్ళు ఇల్లు కట్టుకోకూడదు ఒక వ్యాపారం చేయకూడదు ఒక ఉద్యోగం వాళ్ళకి రాకూడదు కానీ వాళ్ళక అన్నీ ఉండాలి అన్ని ఉంటాయి అయినా కూడా ఎదటి వాళ్ళ మీద పడే ఏడుస్తూ ఉంటారు.
(03:27) మనం ముందుగా సహాయం ఆశించకుండా మన కాళ్ళ మీద మనం నిలబడండి అంటే దమ్ము ధైర్యం ఉంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడి చూపించండి. ఎవరు హెల్ప్ తీసుకోవద్దు. ముందు అందరూ అనుకుంటారు నాకేంటి నాకు ఇంత బంధువర్గం ఉంది చుట్టాలు ఉన్నారు పక్కవాళ్ళు ఉన్నారు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ నాకు ఏ సహాయం కావాలన్నా నేను అడగగానే చేస్తారు అని అనుకుంటారు బ్రమలో బతుకుతారు.
(03:58) ఇది పచ్చి చేదు నిజం అన్నమాట అంటే మీరు జీర్ణించుకోలేరు ముందుగా వాళ్లే నిరాకరిస్తారు నువ్వు ఎదుగుతున్నావ అంటే ఎదుగురా అది సక్సెస్ అవ్వదు నువ్వు వేరేది చూసుకో అంటారు. నీకు ఒక మంచి జాబ్ వచ్చిందంటే ఇంకో జాబ్ కి ట్రై చెయ్ అంటారు. ఇల్లు కట్టుకుంటున్నాను లేకతే కొనుక్కుంటున్నాను అంటే ఇది బాలేదురా వేరేది చూడు అంటారు.
(04:18) నీ ఎదుగుదల వారు తట్టుకోలేరు. అలాగే ఒక బిజినెస్ పెడుతున్నానురా అంటే రేయ్ ఆ బిజినెస్ నువ్వు లాక్కి రాలేవురా నేను ఎందుకు చెప్తున్నానో విను అది టోటల్ ఫెయిల్ అవుతుంది పెట్టుబళలు ఎక్కువ అవుతాయి నువ్వు మేనేజ్ చేయలేవు అని చెప్తూ ఉంటారు. చివరాకరికి నువ్వు కష్టపడి బిజినెస్ పెట్టుకొని దాన్ని బీల్డ్ చేసి దాన్ని ఎదుగుదల చూస్తే అది వరవలేరు కనీసం నువ్వు భోజనానికి పిలిచినా మొఖం మార్చుకొని తింటారు నీ మీద ఏడుస్తూనే తింటారు.
(04:50) మీ స్నేహితులు కూడా అంతే ఫ్రెండ్స్ ను కూడా సహాయం అడగవద్దు బంధువులు అంటేనే భయమేస్తున్న రోజులు ఇవి కన్న తల్లిదండ్రులకి పిల్లల మీద లేదు అలా ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే పిల్లలకి ఆ తల్లిదండ్రులని గౌరవించడం తెలియట్లేదు వృద్ధాప్యంలో పడ్డ కష్టాలు ఇప్పుడు వాళ్ళు పడ్డ కష్టాలు ఎవర పడిఉండరు ఇదివరకు పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం విలువ వాళ్ళు చెప్పిన మాట జవదాటకుండా చేయటం ఒక గుళలో దేవతలాగా దేవుళలాగా తల్లిదండ్రులని చూడటం ఆ రోజులే బాగున్నాయి సమాజం అప్పుడే నీటిగా ఒక పద్ధతిగా డిసిప్లన్ గా వెళ్ళింది.
(05:32) అందుకనే జీవితాలు బాగున్నాయి అన్నమాట వాళ్ళవి ఇప్పుడు తల్లిదండ్రులనే గౌరవించట్లేదు కొడుతున్నారు. సహాయం వాళ్ళు మనకు అందివ్వరు గానీ మన దగ్గర నుంచి సహాయం ముందే తీసుకుంటారు. మనం వాళ్ళ పిల్లల్ని చదివించడానికి సహాయం చేయొచ్చు వాళ్ళు ఎదుగుదలకి చేయొచ్చు వాళ్ళు తిండి తెప్పలకి చేయొచ్చు వాళ్ళఏమనా అప్పుల్లో ఉన్నారంటే తీర్చొచ్చు వాళ్ళ శరీరాలు మన డబ్బుతోనే పెరగొచ్చు కానీ మనకి సహాయం చేయకపోగా చేసిన సహాయాన్ని కృతజ్ఞత లేకుండా ఇట్టే తీసి పడేస్తారు.
(06:08) చాలా తేలికగా తీసిపడేస్తారు సిగ్గు కూడా ఉండదు మొఖం మీద ఉమ్మేసిన తుడుచుకొని పోతారు. పైగా సహాయం చేసిన వాళ్ళనే నీచంగా మాట్లాడతారు. ఇంకా మనక ఎంత సహాయం చేశారు అన్నది గుర్తుండదు. మనక ఏమన్నా అవసరం వచ్చినప్పుడు కండిషన్స్ పెడుతూ మనల్ని బెదిరిస్తూ ఉంటారు మనం వాళ్ళని కాలు పట్టుకొని బ్రతిమలాడాలి సవర తీయాలి అన్నమాట. చిన్న విషయం అందరికీ తెలుసు కుక్క కింద అన్నం పెడితే ఒక ముద్ద పెడితే మన గుమ్మం ముందే కాపలాగా వస్తూ ఉంటుంది కానీ మనిషికి ఈరోజు ఆ విలువలు లేవు చాలా కొలాప్స్ అయిపోయినయి ఎథిక్స్ అన్ని ఇంకా అవి రావు మాట మరి ఎటువైపు వెళ్తున్నాడు మనిషి అసలు మనిషి
(06:54) పొట్టనందుకు ఆ విలువలు ఎంతవరకు ఉంచుకోవాలి అసలు విలువ అన్నది ఈ రోజుల్లో మనుషులు ఉన్నాయా తిమ్మ తిరిగిపోయి బొమ్మ కనబడుతుంది అన్నమాట బంధువులు అని పేరు ఎత్తగానే కొంతమంది ఉంటారు మన ఇళ్లల్లోనే పిల్ల అని పెళ్లి చేస్తే మన బంధువుల పిల్ల అక్క కూతురో చెల్లి కూతురో అని వాళ్ళు మొత్తానికి ముంచేస్తారు మొగుడిని కొంగు కట్టేసుకుంటారు ఆడపిల్లలని ఇళ్లకి రానివ్వరు బంధువుల్ని రానివ్వరు వాళ్ళ పిల్లలే బాగుండాలి ఆవిడే ఉద్యోగం చేసుకోవాలి లక్షలు లక్షలు తెచ్చుకోవాలి ఎవరైనా ఇంటికి వెళ్తే ఫ్రిడ్జ్ లో మురిగిపోయినవి పెడతారు.
(07:34) ఇలాంటివి చూసి చూసే బంధువులు అన్న మాటకే భయమేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మేము మన ప్రయాణాలు చేసినప్పుడు ట్రైన్ లో ఇదే టాపిక్స్ నడిచినయి మాట ఒకళకొకలు చరిత్రలు చెప్పుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. మన దేశాన్ని ఏ రాజు పాలించాడు మన ఏరియాని ఏ సామంత రాజు ఏలేడు అనిఅంటే చెప్పలేరేమో గానీ వాళ్ళ చరిత్ర మాత్రం చక్కగా చెప్తున్నారు బాబోయ్ బంధువులా నిజంగా మనం దూరం ఉండి చాలా మంచి పని చేశం ఏదైనా విల్ పవర్ తో నిలబడండి బ్రతికి చూపించండి కష్టం అంటే కన్నీళ్లు కాదు కష్టం అంటే సవాలు రేపు అన్నటి రోజున విజయ పథకం ఎగరవేయటం అన్నది నిరూపించండి మీ
(08:21) సహాయం కావాలంటే బంధువులని ఎప్పుడూ అడగొద్దు అలాగని బయట వాళ్ళని కూడా నమ్మటానికి లేదు ఎవరో గాన ఉంటారు ధర్మాత్ములు అరేయ్ అని మాట సాయం చేసినోళ్ళు ఇప్పుడు అలా ఎవర లేదు. మీరు గనుక చూసుకుంటే పెద్ద పెద్ద వ్యక్తులు ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీని తీసుకుందాం. వాళ్ళు కూడా బహుశా బయట వాళ్ళు వాళ్ళ టాలెంట్ తెలిసి సహాయం చేసి ఉండొచ్చు కానీ బంధువులు ఎవరో ఉండరు బంధువులు అన్నది ఉట్టి ట్రాష్ ఎందుకంటే వీళ్ళతో పడుతున్న తిప్పలు శత్రువుతో కూడా పడరన్నమాట అంతా నీచంగా ఆలోచిస్తున్నారు స్వార్థాలు పెరిగిపోయిని కుళ్ళు పెరిగిపోయింది ఈ సమాజంలో నీచంగా కుక్క
(09:07) కన్నా నీచంగా దిగజారిపోయి బతుకుతున్నారు ఒక మనిషిని ఎలా వాడుకోవాలి నెత్తి మీద ఎలా చేతులు వేయాలి అది కన్న తల్లిదండ్రులతో సహా వాడేసుకుంటున్నారు. అది వాళ్ళకే తెలుస్తది. ఆ నీచమైన బ్రతుకు వాళ్ళు బ్రతికింది గాక పిల్లలను కూడా అదే బాటలో నడిపిస్తున్నారు. మరి మీకు కూడా బంధువులు ఉన్నారా అది ఉంటే ఎటువంటి బంధువులు వాళ్ళ వల్ల మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా లేదా చక్కగా ఇదివరకు ఫ్యామిలీలాగా ఉమ్మడ కుటుంబాలు కలిసి ఉండేవి అది అంటే మనం ఇళ్లకు రాగానే ఏ పెళ్లికో పేరంటానికో సెలవులకో వేస సెలవలకి వచ్చి సరదాగా గడిపేవాళ్ళం ఆ వేసవలో ముంజులు కొట్టిస్తే
(09:47) తినేవాళ్ళం పచ్చళ్లు పట్టుకునేవాళ్ళం ఇంకా రకరకాలుగా రాత్రులు పడుకోకుండా బయట పక్కవేసి ఎంజాయ్ చేసేవాళ్ళం వెళ్ళిపోతూ ఉంటే అంటే చుట్టాలు వెళ్ళిపోతూ ఉంటే అవతల వాళ్ళు చెప్పులు దాచేయటం వెళ్లొద్దు అని ఏడవటం మళ్ళీ ఎప్పుడు వస్తావ అని అడగటం ఇవన్నీ ఉన్నాయా జ్ఞాపకాలు ఉంటే కచ్చితంగా కామెంట్ చేయండి మీ బంధువులను కూడా అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్తే ఇంకా మంచిది లేదా బంధువుల నుంచి సమస్యలు ఎదుర్కొంటుంటే వాళ్ళని పక్కన పెట్టండి సహాయాలు ఎప్పుడూ కోరద్దు దమ్ము ధైర్యంతో నిలబడి చూపించండి మరి ఈ వీడియో పై మీ అభ అభిప్రాయం ఏంటి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ
(10:27) ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది [సంగీతం]
No comments:
Post a Comment