Sunday, August 9, 2026

ముసలితనం త్వరగా వస్తుందా? ఈ అలవాట్లు మానేయండి! Is premature aging setting in? Give up these habits!

 ముసలితనం త్వరగా వస్తుందా? ఈ అలవాట్లు మానేయండి! Is premature aging setting in? Give up these habits!


Author Name:FOOD PHARMACY by Dr. Murali Manohar Chirumamilla

Youtube Channel Url:https://www.youtube.com/@MuraliManohar66

Youtube Video URL:https://www.youtube.com/watch?v=M1n5hWLj_2g



Transcript:
(00:01) వృద్ధాప్యం ఓల్డ్ ఏజ్ చాలామంది భయపడేటువంటి ఒక స్థితి దీనికి కారణం ఏంటంటే అనేక సమస్యలు వేధిస్తాయని అయితే ఆరోగ్యాన్ని గనుక కాపాడుకోగలిగితే నిజానికి వృద్ధాప్యం అనేది ఒక హ్యాపీ ఫేజ్ ఎందుకంటే ఎలాంటి బాధ్యతలు ఉండవు. అయితే చాలామంది ఈ వృద్ధాప్యం వేగంగా రావడానికి వాళ్ళకి తెలుసో తెలియకో కొన్ని కొన్ని అలవాట్లను కల్టివేట్ చేసుకుంటారు.
(00:26) వీటి నుంచి గనుక బయట పడగలిగితే ఈ వృద్ధాప్యం అనేది ఆనందంగా ఉంటుంది. ఇదే మనం తెలుసుకునేది. [సంగీతం] మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ల మళ్ళ మనహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మిమ్మల్ని వేగంగా వృద్ధాప్యం వైపు నెట్టేసేటువంటి కొన్ని అలవాట్లు ఉంటాయి. వీటిని మీరు రెక్టిఫై చేసుకుంటే వృద్ధాప్యం అనేది నిజానికి మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుంది.
(00:58) ఉదయం లేవగానే మనం చేసే చిన్న చిన్న పనులే మన వయసుని ఒక 30% వేగంగా పెంచేస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి. రోజువారి హడావిడిలో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ దైనంద్ర జీవితంలో ఉదయం పూట చేసే కొన్ని సాధారణ పొరపాట్లు ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా సూర్యోదయ సమయంలో అంటే బ్రాహ్మి ముహూర్తంలో మన శరీరంలో వాతపెత్త కఫ దోషాలు సున్నితమైన ఒక దశలో ఉంటాయి ఒక ఫ్లక్స్ లో ఈ సమయంలో సరైన దినచర్య పాటించలేదు అనుకోండి శరీరంలో ఉండే కణాలు త్వరగా క్షీణించి ముందస్తు వృద్ధాప్యానికి దారితీస్తది.
(01:31) ఇది దీన్ని ప్రోజీరా అంటారు వైద్య పరిభాషలో ఉదయం పూట చేసేటువంటి హానికరమైన అలవాటును వదిలించుకోవడం ద్వారా శారీరక మానసిక యవ్వనాన్ని కాపాడుకోవచ్చు. ఈ వీడియోలో ఈ పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. ఉదయం అల్పహారం మానేయటం గురించి మరీ మరీ చెప్పుకోవాలి కొంతమంది ఉదయమే అమ్మమ్మో లావైపోతున్నాం అని ఈ బ్రేక్ఫాస్ట్ ని మానేస్తారు.
(01:58) అసలు బ్రేకింగ్ ద ఫాస్ట్ అనేదే దాని పేరు. పొద్దున్నే తినకుండా ఖాళీ కడుపుతోటి పనులు మొదలు పెట్టడం మానుకొని ఉదయం లేచిన ఒక రెండు గంటల లోపు సమతుల్యమైనటువంటి అల్పహారం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం అంటే మెటబాలిజం తగ్గిపోకుండా ఉంటుంది. రక్తం ఖండాలకు తగిన పోషణ అనేది అందుతుంది. అల్పాహారం మానేసినప్పుడు శరీరంలో ఒత్తిడి పెంచే హార్మోన్ అనేది ఉంటుంది అంటే కార్టిసాల్ దీని స్థాయిలో అమాంతం పెరిగిపోతాయి.
(02:27) మనిషి దీంతో త్వరగా వయసు పైబడినట్టుగా కనిపిస్తాడు. ఇక మరొక అలవాటు నిద్ర లేవగానే ఫోన్ చూడటం అనేది ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా పెద్దవాళ్ళలో కూడా కనిపిస్తుంది ఇది ట్రాజిడీ ఉదయం కళ్ళు తెరవగానే చేతిలోకి ఫోన్ తీసుకోకుండా కనీసం మొదట గంటపాటు మొబైల్ తెరలకి దూరంగా ఉండండి. ధ్యానం నడవటం ఆ చిన్న పిల్లలతో ఆడుకోవటం పెంపుడు జంతువులతో గడపటం ఇలాంటి పనులపైన దృష్టి పెట్టండి.
(02:57) ఇలాగ స్క్రీన్ చూశరనుకోండి అప్పుడు ఫోన్ల నుంచి వచ్చే నీలి కాంతి మెదటికి ఒత్తిని కలిగిస్తుంది. ఆందోళన పెంచే హార్మోన్లని విడుదల చేస్తుంది. దీనితోటి ఏకాగ్రత దెబ్బతింటుంది. అనేక ఇతర అంశాలు అంటే శారీరక మానసిక వృద్ధాప్యం వేగవంతం అవుతుంది. కేవలం కాఫీ మాత్రమే తాగటం కూడా ఒక మిమ్మల్ని త్వరగా ఆ వృద్ధాప్యం వృద్ధాప్యంలోకి నెట్టేసేటటువంటి ఒక అలవాటు పొది నిద్ర లేవగానే కాఫీ జోలికి వెళ్ళకుండా ముందుగా రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్ళని తాగండి దాంట్లో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగితే జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది.
(03:38) రాత్రంతా నిద్రపోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అటువంటి సమయంలో నేరుగా కాఫీ తాగారనుకోండి శరీరం మరింత అప్పడి బారిపోయి ఆ చర్మం తాలూకు కాంతి అనేది పోతుంది కాంతిని కోల్పోయి ముడతలు అనేది పడుతుంది. సూర్యరశ్మికి దూరంగా ఉండటం కూడా త్వరగా వృద్ధులని చేసేటటువంటి ఒక అలవాటు. ఉదయం పూట ఇంట్లోనే ఉండిపోకుండా కనీసం ఒక 20 నిమిషాల పాటు లేత సూర్యరశ్మి తగిలేలాగా ఆరు బయట నడవండి.
(04:09) ఇలా చేయడం వల్ల ఆ జీవ గడియారం ఉంటుంది కదా బయో క్లాక్ అది సరైన గాడిలో పడుతుంది. ఎముకలు దృడంగా మారుతాయి దీంతో ఉదయం సూర్యరశ్మి వ్యాయామం లేవు అనుకోండి హార్మోన్ల సముద్రత దెబ్బతింటుంది రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది దీంతో త్వరగా వృద్ధాపాయాలు వచ్చేస్తాయి. ఇక అన్నిటికి మించి ఉదయం పూట కొంతమంది హడావిడి చేస్తూఉంటారు ఈ అలవాటు వల్ల కూడా వృద్ధాప్యం వచ్చేస్తుంది.
(04:34) ప్రతిరోజు ఉదయం ఆదరా బాదరాగా పరిగెత్తకుండా ఒక 10 నిమిషాలు ముందుగా నిద్ర లేవండి [సంగీతం] జస్ట్ డిఫరెన్స్ 10 నిమిషాలే ముందుగా నిద్రలేచి ప్రశాంతంగా రోజువారి పనులని ఒక ప్లాన్ ప్రకారంగా ప్రణాళికబద్ధంగా పూర్తి చేసుకోండి. ఇలా నిరంతరం ఒకవేళ మీరు హడావాడి పడుతున్నారు అనుకోండి కణాల స్థాయిలో ఒత్తిడి పెరిగిపోయి గుండె ఆరోగ్యం పైన తీవరైన ప్రభావం పడుతుంది.
(04:55) దీర్ఘకాలపు ఒత్తిడి శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెంచి వయసు పైబడిన లక్షణాలని త్వరగా తెచ్చేస్తుంది. ముగింపుగా మీకు ఒక ముఖ్యమైన విషయం మనవి చేయాలి. ఉదయం పూట మనం చేసేటటువంటి ఈ చిన్న చిన్న పొరపాట్లే మన చర్మాన్ని మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి ముందస్తు వృద్ధాప్యానికి అంటే ప్రోజీరాకి దారి తీస్తాయి అని పరిశోధనలలో తేలింది. ఈ అలవాటుని సరిదిద్దుకోవడం ద్వారా మన శరీరానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తూ వయసుని దాచిపెట్టొచ్చు అంటే ఏజ్ ఎరైజర్స్ లాగా పనిచేస్తాయి.
(05:28) ఆరోగ్యకరమైన దినచర్య అనేది కేవలం ఒక రోజులో వచ్చే మార్పు కాదు ఇది జీవితాంతం యవ్వనంగా ఉంచే ఒక అద్భుతమైన జీవన విధానం. ఒకవేళ మీకు అకాల వార్ధకపు లక్షణాలు కనిపిస్తూ ఉంటే అంటే ఆ చర్మం మీద నరాలు తేలి కనిపించటం లేకపోతే ముడతలు పడటం క్రో మార్క్స్ లాఫ్ లైన్స్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి అప్పుడు దీన్ని సెట్ చేసేటటువంటి యాంటీఆక్సిడెంట్స్ కలిగినటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి చవన్ప్రాస్ అశ్వగంధ లేహం ఇలాంటివి అలాగే ఆ ఏదైనా ఒక సమస్య ఉంటే ఉదాహరణకు థైరాయిడ్ లాంటివి వాటిని సరిదిద్దడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి.
(06:02) వీటిని మీరు వైజ సలహాతో వాడుకుంటే ఈ ప్రోజీరా అంటే అకాల వార్తక్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియాలి అనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు.
(06:21) అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి లైక్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. అలాగే మూడు డాట్స్ కనిపిస్తాయి దాని పైన క్లిక్ చేస్తే కింద నుంచి ఒక మెనుూ పాప్ అవుతుంది దాంట్లో హైప్ అని కనిపిస్తుంది ఒక ఆప్షన్ దాన్ని కూడా క్లిక్ చేస్తే ఈ వీడియో హైప్ అవుతుంది అంటే ఎక్కువమంది మీలాగే దీన్ని చూడగలుగుతారు.
(06:38) ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్ 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం [సంగీతం]

No comments:

Post a Comment