Saturday, August 8, 2026

డాక్టర్లు కూడా చెప్పని నిజం! | INDIANS MUST KNOW THIS! | By Naresh Bukya

డాక్టర్లు కూడా చెప్పని నిజం! | INDIANS MUST KNOW THIS! | By Naresh Bukya

Author Name:NB Show Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=g9v9VKNlekE



Transcript:
(00:04) ఈ వరల్డ్ మ్యాప్ ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇందులో ప్రతి దేశంలో ఎంత పర్సెంటేజ్ మంది వెజిటేరియన్స్ గా ఉన్నారో చూపించారు. అమెరికాలో దాదాపు 5% బ్రిటన్ లో 8 నుంచి 10% జర్మనీలో దాదాపు 10% మంది వెజిటేరియన్స్ గా ఉన్నారు. చైనా, జపాన్, బ్రెజిల్, రష్యా ఈ దేశాలన్నిటిలో ఈ నెంబర్ 5% కంటే కూడా తక్కువగా ఉంది. అంటే ప్రపంచంలోని చాలా దేశాల్లో వెజిటేరియన్ ప్రజలు చాలా మైనారిటీగా ఉన్నారు.
(00:33) ఇప్పుడు ఇండియా నెంబర్ చూద్దాం. వేరు వేరు సర్వేల ప్రకారం ఇండియాలో దాదాపు 30 నుంచి 39% మంది వెజిటేరియన్స్ గా ఉన్నారు. అంటే ప్రపంచంలోని మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ. పైగా మన పాపులేషన్ దాదాపు 140 కోట్ల మంది. దీని అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉన్న వెజిటేరియన్ పీపుల్ లో చాలా పెద్ద పాపులేషన్ ఇండియాలోనే ఉంది. మనది ప్రపంచంలోనే అతి పెద్ద వెజిటేరియన్ కంట్రీస్ లో ఒకటి.
(01:02) అంతే కాదు చిన్నప్పటి నుంచి మనకు ఒక విషయం చెప్తూ ఉంటారు అత్యంత పవిత్రమైన హెల్దీ అయిన ఫుడ్ వెజిటేరియన్ ఫుడ్ అని కానీ ఇప్పుడు దీంతో పాటు మరో మూడు నెంబర్స్ చెప్తాను జాగ్రత్తగా వినండి 2025 లో 20 కన్నా ఎక్కువ స్టడీస్ కి సంబంధించిన 18750 మంది డేటాని కలెక్ట్ చేసి మెటా ఎనాలసిస్ చేశారు. దాని రిజల్ట్ ఏంటో తెలుసా ఇండియాలో దాదాపు 51% మందికి వైటమిన్బి12 డెఫిషియన్సీ ఉంది.
(01:32) వెజిటేరియన్ పీపుల్ లో అయితే ఇది దాదాపు 65% వరకు ఉంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో ఈ పర్సంటేజ్ 67 వరకు వెళ్తుంది. ఇప్పుడు రెండో విషయం వినండి. [సంగీతం] ఇండియా ప్రపంచంలో అత్యధికంగా సన్ లైట్ వచ్చే దేశాల్లో ఒకటి. రాజస్థాన్ లోని జోద్పూర్ ని అయితే సన్ సిటీ అని కూడా అంటారు. అక్కడ దాదాపు సంవత్సరం మొత్తం మంచి ఎండ ఉంటుంది. అయినా కూడా వేరు వేరు స్టడీస్ ప్రకారం ఇండియాలో 70 ట 90% మందికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఇప్పుడు మూడో విషయం వినండి.
(02:04) 2025 లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం జీరో నుంచి 10 సంవత్సరాల పిల్లల్లో దాదాపు సగం మందిలో రికైడ్ సింటమ్స్ కనిపించాయి. అంటే పిల్లల ఎముకలు చాలా వీక్ గా మారడం. అలాగే 80 నుంచి 90% ఎల్డర్లీ పీపుల్ స్టియోపోరోసిస్ రిస్క్ లో ఉన్నారు. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ మీలో చాలా మందికి అన్కంఫర్టబుల్ గా అనిపించవచ్చు.
(02:26) అదేంటంటే మన ఫుడ్ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ఫుడ్ లో ఒకటి అయితే మనకు ప్రపంచంలోనే అత్యధిక సన్ లైట్ కూడా ఉంటే మరి మన నర్వ్స్ ఎందుకు వీక్ అవుతున్నాయి? మన బోన్స్ ఇంత త్వరగా ఎందుకు వీక్ అవుతున్నాయి. మనం ఏ విషయం గురించి అయితే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నామో అదే మనల్ని లోపల నుంచి ఖాళీ చేస్తుంది. వీక్ గా మారుస్తుంది. అందుకే ఈ వీడియోలో మనం అసలు నిజం ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం.
(02:53) ముందుగా వైటమిన్బి12 తో స్టార్ట్ చేద్దాం. వైటమిన్బి12 కి ఒకటే పని ఉండదు. దాని మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్లు ఒకటి మీ నర్వ్స్ ని ప్రొటెక్ట్ చేయడం. దీన్ని చాలా సింపుల్ గా చెప్తాను జాగ్రత్తగా వినండి. మన బాడీలో ఉన్న నర్వ్స్ మీద ఒక ఇన్సులేషన్ లేయర్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వైర్ మీద ప్లాస్టిక్ లేయర్ ఎలా ఉంటుందో ఎగజక్ట్లీ అలానే ఆ లేయర్ ని మేలిన్ షీట్ అంటారు.
(03:16) దీని పని ఏంటంటే బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్ లీక్ కాకుండా ఫుల్ స్పీడ్ తో సరైన ప్లేస్ కి చేరేలా చేయడం. ఈ మేలిన్ షీట్ తయారవ్వడానికి దాన్ని హెల్దీగా మెయింటైన్ చేయడానికి మన బాడీలోబి12 వైటమిన్ చాలా అవసరం. అదే బాడీలోబి12 తగ్గిపోయింది అనుకోండి ఈ ఇన్సులేషన్ లేయర్ మెల్లగా డామేజ్ అవ్వడం మొదలవుతుంది. ఎలక్ట్రిక్ వైర్ మీద కవర్ డామేజ్ అయితే సిగ్నల్ ఎలా డిస్టర్బ్ అవుతుందో మన నర్వ్ లో కూడా అలాగే జరుగుతుంది.
(03:44) దాని రిజల్టే ఈరోజు లక్షల మంది ఇండియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న చాలా సింటమ్స్ కానీ వాటిని మనం సాధారణ టైడ్నెస్ అనుకొని ఇగ్నోర్ చేస్తుంటాం. చేతులు కాళ్ళలో టింగలింగ్ సెన్సేషన్ వస్తుంది. చిన్న చిన్న పిన్స్ గుచ్చుతున్నట్టుగా నీడిల్స్ తో గుచ్చుతున్నట్టుగా అనిపిస్తుంది. ఫింగర్స్ అన్ని నంబైపోతాయి. కాళ్ళలో బర్నింగ్ సెన్సేషన్ రావచ్చు.
(04:05) నడిచేటప్పుడు బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. మెమరీ వీక్ అవ్వడం మొదలవుతుంది. మాట్లాడుతుండగానే కొన్ని వర్డ్స్ ని మర్చిపోతుంటాము. బ్రెయిన్ లో ఏదో ఫాగ్ ఉన్నట్టు క్లారిటీ తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇరిటేషన్ పెరుగుతుంది. మూడ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు అన్నిటికంటే షాకింగ్ నెంబర్ వన్ వినండి. నార్త్ ఇండియాలోని ఒక టెర్రిషరీ కేర్ హాస్పిటల్ స్టడీలోబి12 డెఫిషియన్సీ ఉన్న 220 మంది పేషెంట్స్ ని ఎగ్జమైన్ చేశారు.
(04:32) వాళ్ళలో 86 కంటే ఎక్కువ మంది ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారు. వాళ్ళలో మోస్ట్ కామన్ సింటమ్ ఏంటంటే 98% కంటే ఎక్కువ మందికి చేతులు కాళ్ళలో టింగ్లింగ్ నమ్నెస్ లేదా సెన్సేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాదాపు 95% మందికి హెడ్ హెవీనెస్ లేదా హెడేక్ ఉంది. వాళ్ళలో సగం కంటే ఎక్కువ మందికి నర్వ్ టెస్ట్లు చేసినప్పుడు అప్పటికే వాళ్ళ నర్వ్స్ డామేజ్ అయినట్టుగా తెలిసింది.
(05:00) ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏమిటంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇక్కడే చాలా మందికి అన్కంఫర్టబుల్ అనిపించే విషయం తెలుస్తుంది. అదే వైటమిన్బి12 ఏ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ లో ఉండదు. దాదాపు జీరో పప్పుల్లో ఉండవు వెజిటేరియన్స్ లో ఉండదు రైస్ లో ఉండదు రోటీస్ లో ఉండదు ఫ్రూట్స్ లో కూడా ఉండదు డ్రై ఫ్రూట్ లో కూడా ఈబి12 ఉండదు. ఈబి12 ని యాక్చువల్లీ కొన్ని స్పెసిఫిక్ బ్యాక్టీరియాస్ ప్రొడ్యూస్ చేస్తాయి.
(05:28) అది అనిమల్ బాడీలో అక్యములేట్ అవుతుంది. అందుకేబి12 మనకు మీట్, ఫిష్, ఎగ్స్, మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్ లాంటి వాటిలో దొరుకుతుంది. అంటే ఒక ఇండియన్ ప్యూర్ వెజిటేరియన్ కిబి12 కోసం ప్రాక్టికల్లీ మిగిలే ప్రధానమైన సోర్స్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ మాత్రమే. ఇక్కడే యాక్చువల్ ప్రాబ్లం్ స్టార్ట్ అవుతుంది.బి12 రిక్వైర్మెంట్ పూర్తిగా మీట్ అవ్వాలంటే రోజు సరైన క్వాంటిటీలో మిల్క్, కర్డ్ లేదా పన్నీర్ తీసుకోవాలి.
(05:54) కానీ చాలా భారతీయ ఫ్యామిలీస్ అంత క్వాంటిటీ తీసుకోలేరు. కొన్నిసార్లు మనీ వల్ల కొన్నిసార్లు హ్యాబిట్ వల్ల మరి కొన్నిసార్లు టీ లో కొంచెం మిల్క్ వేసుకున్నాం కాబట్టి మనం మిల్క్ తీసుకున్నట్టే అనుకుంటారు. ఇప్పుడు ఈ ఎంటైర్ వీడియోలో చాలా డేంజరస్ పాయింట్ ఒకటి చెప్తాను. దీన్ని చాలా మంది కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ కూడా మిస్ అవుతుంటారు.
(06:15) బి12 డెఫిషియన్సీ వల్ల మెయిన్లీ రెండు ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకటి అనీమియా అంటే బ్లడ్ డెఫిషియన్సీ రెండవది నర్వ్ డామేజ్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి మరో వైటమిన్ కూడా ఉంటుంది. దాన్ని ఫోలిక్ యసిడ్ లేదా వైటమిన్బి9 అంటాము. ఇది పప్పు, గ్రీన్ వెజిటేబుల్స్ గ్రైన్స్ లో బాగా దొరుకుతుంది. ఇండియాలో పిండి లాంటి కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ లో దీన్ని ఫోర్టిఫై అంటే మిక్స్ చేస్తారు.
(06:41) ప్రెగ్నెంట్ ఉమెన్ కి పుట్టే బేబీస్ కి బర్త్ డిఫెక్ట్ రాకుండా ఉండేందుకు ఈ విధంగా చేస్తారు. ఇది గవర్నమెంట్ తీసుకువచ్చిన ఒక మంచి పాలసీ. కానీ దీనికి ఒక హిడెన్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. బాడీలో ఫోలిక్ యసిడ్ సరిపడా ఉన్నప్పుడుబి12 డెఫిషియన్సీ వల్ల బ్లడ్ లో కనిపించాల్సిన కొన్ని లక్షణాల్ని అది మాస్క్ చేయగలదు. అంటే మీ బ్లడ్ రిపోర్ట్ నార్మల్ గా అంత ఓకే అన్నట్టు వస్తుంది.
(07:04) డాక్టర్ కి కూడా అంత నార్మల్ గానే కనిపిస్తుంది. కానీ ఫోలిక్ యాసిడ్ మీ నర్వ్స్ ని ప్రొటెక్ట్ చేయలేదు. [సంగీతం] అంటే బయట రిపోర్ట్ లో అంత నార్మల్ గా కనిపిస్తుంది. కానీ లోపల మీ నర్వ్ ఇన్సులేషన్ మెల్లమెల్లగా డామేజ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ వార్నింగ్ అలారం మోగాలి. ఎమర్జెన్సీ సిగ్నల్స్ రావాలి. కానీ అది రావడం లేదు ఎందుకంటే ఫోలిక్ యసిడ్ వల్లబి12 డెఫిషియన్సీ కి సంబంధించిన బ్లడ్ సైన్స్ హైడ్ అవుతున్నాయి.
(07:31) చివరికి సింటమ్స్ చాలా ఎక్కువయ్యాక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే సమయానికి చేతులు కాళ్ళలో టింగ్లింగ్ నమ్నెస్ నడవడంలో డిఫికల్టీ ఇలాంటి సింటమ్స్ వచ్చేసరికి అప్పటికే చాలా నర్వ్ డామేజ్ జరిగిపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు పర్మనెంట్ డామేజ్ కూడా జరగొచ్చు. ఎందుకంటే నర్వ్స్ ఒక సర్టెన్ లిమిట్ దాటిన తర్వాత డ్ామేజ్ అయితే దాన్ని పూర్తిగా రివర్స్ చేయడం పాసిబుల్ కాదు.
(07:55) అందుకే దీన్ని సైలెంట్ డెఫిషియన్సీ అని కూడా అంటారు. ఇది సైలెంట్లీ పని చేస్తుంది. మెల్లగా మీ బాడీని లోపల నుంచి డామేజ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం చాలా హానెస్ట్ గా చెప్పాలి లేకపోతే ఈ వీడియో కంప్లీట్ గా వన్ సైడ్ అయిపోతుంది. అదేంటంటే నేను ఇక్కడ వెజిటేరియన్ గా ఉండడం తప్పు అని చెప్పడం లేదు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన రీసెర్చ్ ప్రకారం వెజిటేరియన్ డైట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని కూడా తెలిసింది.
(08:21) వెజిటేరియన్ డైట్ వల్ల హార్ట్ డిసీస్ రిస్క్ తగ్గుతుంది. బ్లడ్ ప్రెజర్ బెటర్ అవుతుంది. క్యాన్సర్ రిస్క్ కూడా వెజిటేరియన్ డైట్ వల్ల చాలా వరకు తగ్గుతుంది. సరిగ్గా ప్లాన్ చేసుకున్న ప్లాంట్ బేస్డ్ వెజిటేరియన్ డైట్ పూర్తి హెల్దీగా ఉండొచ్చు. దీనికి ప్రూఫ్ ఇండియాలోనే ఉంది. ఒక ఇండియన్ స్టడీలో డైలీ సరైన క్వాంటిటీలో మిల్క్ తీసుకున్న యంగ్ వెజిటేరియన్స్ లోబి12 లెవెల్ క్లియర్ గా ఇంప్రూవ్ అయినట్టు కనిపించింది.
(08:45) అంటే [సంగీతం] యాక్చువల్ విలన్ వెజిటేరియనిజం కాదు. యాక్చువల్ విలన్ సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా ఫాలో అయ్యే వెజిటేరియనిజం. నేను వెజిటేరియన్ ని అంటే ఆటోమేటికల్లీ నేను హెల్దీగా ఉంటాను. ఇంకా నేను న్యూట్రిషన్ గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు అనే థింకింగ్ యాక్చువల్ ప్రాబ్లం. ఈ థింకింగ్ వల్లే కోట్లాది మంది ప్రజల నర్వ్స్ మెల్లమెల్లగా డామేజ్ అవుతున్నాయి.
(09:07) ఇప్పుడు ఈ స్టోరీలో సెకండ్ పార్ట్ చూద్దాం అదే సన్లైట్ పారడాక్స్ ఎందుకంటేబి12 కేవలం హాఫ్ స్టోరీ మాత్రమే మిగతా హాఫ్ మన బోన్స్ కి సంబంధించింది. అదే వైటమిన్ డి. వైటమిన్ డి లేకుండా మన బాడీ కాల్షియం ని ప్రాపర్ గా అబ్జర్బ్ చేసుకోదు. మీరు ఎంత మిల్క్ తాగినా వైటమిన్ డి లేకపోతే ఆ కాయల్షియం బోన్స్ కి ప్రాపర్ గా చేరదు.
(09:32) దాని కారణంగా పిల్లల్లో రికెట్ అంటే ఎముకలు మృదువుగా మారి బలహీనమవుతాయి. అడల్ట్ లో బోన్ వీక్నెస్ ఈజీ ఫ్రాక్చర్ ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధులు వస్తాయి. వైటమిన్ డి మనకు మెయిన్లీ సన్ లైట్ నుంచి వస్తుంది. అయితే క్వశ్చన్ ఏమిటంటే ఇండియాలో ఇయర్ మొత్తం సన్ లైట్ ఉంటుంది. అయినా కూడా మన భారతీయుల్లో 70 నుంచి 90% మందికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఎలా వస్తుంది? దీనికి నాలుగు రీసన్స్ ఉన్నాయి.
(09:59) ఆ నాలుగు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నెంబర్ వన్ మనం సన్ లైట్ నుంచి యాక్చువల్లీ పారిపోతాము. ఇండియాలో సన్ లైట్ చాలా స్ట్రాంగ్ గా హాట్ గా ఉంటుంది. అందుకే మనం దాన్ని ఎంజాయ్ చేయం దాని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాం. నీడ కోసం వెతుకుతాం. ఏసీ లో కూర్చుంటాం. ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళకుండా అవాయిడ్ చేస్తాం. కానీ యూరప్ లో ప్రజలు సన్ లైట్ కనిపించగానే పార్క్ కు వెళ్లి ఎండలో పడుకుంటారు.
(10:22) వాళ్ళకి సన్ లైట్ ఒక లగ్జరీ లాంటిది. మన దగ్గర మాత్రం అది ఒక ప్రాబ్లం లా కనిపిస్తుంది. రెండవది మన క్లోత్స్ మన కల్చర్ రిలీజియస్ రీజన్ వల్ల బాడీలో చాలా భాగం కవర్ చేసుకుంటాము. వైటమిన్ డి ప్రొడ్యూస్ కావాలంటే సన్ లైట్ డైరెక్ట్ గా స్కిన్ మీద పడడం చాలా ఇంపార్టెంట్. [సంగీతం] అందుకే ఈ డెఫిషియన్సీ మెన్ కంటే ఉమెన్ లో ఎక్కువగా కనిపిస్తుంది.
(10:45) ఇక మూడవది మన స్కిన్ మన స్కిన్ లో మెలన్ ఉంటుంది. ఇది ఒక నాచురల్ సన్ స్క్రీన్ లా పనిచేస్తుంది. స్ట్రాంగ్ సన్ లైట్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. [సంగీతం] ఇది ఒక అడ్వాంటేజ్ కానీ దీనికి ఒక డిస్అడ్వాంటేజ్ కూడా ఉంది. డార్కర్ స్కిన్ లో సేమ్ అమౌంట్ వైటమిన్ డి ప్రొడ్యూస్ కావాలంటే లైటర్ స్కిన్ తో కంపేర్ చేస్తే ఎక్కువ సైపు సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవ్వాల్సి ఉంటుంది.
(11:10) ఇక నాలుగవది పొల్యూషన్ వైటమిన్ డి తయారవ్వడానికి సన్ లైట్ లో ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ రేస్ అవసరం. వాటిని యువబి రేస్ అంటాం. మన సిటీస్ లో ఉన్న పొల్యూటెడ్ ఎయిర్ ఈ రేస్ లో చాలా వరకు బ్లాక్ చేస్తుంది. అంటే మీరు సన్ లైట్ లో నిలబడిన మీ బాడీకి కావలసిన సన్ లైట్ పూర్తిగా అందకపోవచ్చు. ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్ ని కలిపి చూడండి. లో వైటమిన్ డి ఈక్వల్ కాల్షియం అబ్జర్ప్షన్ తక్కువ.
(11:35) లోబి12 ఈక్వల్ నర్వ్ వీక్నెస్ అండ్ డామేజ్ ఒకవైపు బోన్స్ వీక్ అవుతున్నాయి మరోవైపు నర్వ్స్ వీక్ అవుతున్నాయి. దీని ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో డేటా చూస్తే అర్థమవుతుంది. ఒక మల్టీ సెంట్రిక్ స్టడీ ప్రకారంఐదు నుంచి 18 సంవత్సరాల ఇండియన్ చిల్డ్రన్స్ లో కేవలం 42 మందికి మాత్రమే వైటమిన్ డి సరైన లెవెల్లో ఉంది.
(11:58) అంటే ప్రతి ఐదుగురు పిల్లల్లో ముగ్గురికి బోన్ ఫౌండేషన్ వీక్ ఉంటుంది. అది కూడా చాలా చిన్న ఏజ్ లో. యాక్చువల్లీ ఈ ఏజ్ లోనే బోన్స్ ఫ్యూచర్ కోసం స్ట్రాంగ్ గా బిల్డ్ అవ్వాలి. కానీ అక్కడి నుంచే వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏమిటంటే మన దగ్గర ఇలా ఎందుకు జరుగుతుంది మనం ఈ సిచువేషన్ కి ఎలా వచ్చాం నా ఒపీనియన్ ప్రకారం దీనికి రూట్ మన థింకింగ్ లోనే ఉంది.
(12:21) మనం ఫుడ్ ని ఎప్పుడూ ప్యూరిటీ బేసిస్ మీద మెజర్ చేశము. ఏది శుద్ధం ఏది సాత్వికం ఏది క్లీన్ అని ఆలోచించాం. కానీ ఫుడ్ ని న్యూట్రిషన్ బేసిస్ మీద పెద్దగా మెజర్ చేయలేదు. దాంట్లో ఎంత ప్రోటీన్ ఉందిబి12 ఉందా లేదా ఐరన్ ఎంత ఉంది ఇలాంటి క్వశ్చన్స్ ని ఎక్కడ అడగలేదు. ఒకప్పుడు దీని వల్ల పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదు ఎందుకంటే అప్పట్లో ప్రజలు పొలాల్లో పని చేసేవాళ్ళు రోజంతా సన్ లైట్ లో ఉండేవాళ్ళు ఇంట్లో ఆవులు బర్రెలు ఉండేవి.
(12:54) ఫ్రెష్ మిల్క్, కర్డ్, ఘీ లాంటివి మంచి క్వాంటిటీలో తీసుకునేవాళ్ళు. కానీ తర్వాత మనం విలేజ్ నుంచి సిటీకి వచ్చేసాము. పొలాల నుంచి ఆఫీస్ లోకి వచ్చేసాము. సన్ లైట్ నుంచి ఏస రూమ్స్ కి వచ్చాము. ఫ్రెష్ మిల్క్ నుంచి పాకెట్ మిల్క్ టీ లో వేసుకునే కొంచెం మిల్క్ కి షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. కానీ మన ఫుడ్ కంపోజిషన్ మాత్రం అదే విధంగా వండిపోయింది.
(13:16) దాంతో ఈ న్యూ లైఫ్ స్టైల్ కి పాత ఫుడ్ పాటర్న్ సరిపోవడం లేదు. ప్రపంచంలోని చాలా కంట్రీస్ ఈ ప్రాబ్లం ని అడ్రెస్ చేశయి. కానీ మనం అక్కడ కొంచెం వెనకబడ్డాం. చాలా కంట్రీస్ లో పాలు, పప్పు దినుసులు అండ్ పిండి లాంటి ఫుడ్ లోబి12 వైటమిన్ డి ని 45 అంటే అందులో మిక్స్ చేస్తున్నారు. అంటే కామన్ పీపుల్ ఇబ్బంది పడకుండా గవర్నమెంటే డైలీ ఫుడ్ లో వాటిని మిక్స్ అయ్యేలా చేస్తుంది. మన దగ్గర కూడా ఈ పాలసీ ఉంది.
(13:43) కానీ ఇప్పుడిప్పుడే అది ప్రారంభ దశలో ఉంది. మరి ఇలాంటి సిచువేషన్ లో మనం ఏం చేయాలి అంటే చాలా సింపుల్ గా చేయగలిగిన మూడు విషయాలు ఉన్నాయి. మొదటిది వెంటనే టెస్ట్ చేయించుకోండి. మీ ఏజ్ 25 ఇయర్స్ కంటే ఎక్కువ అయితే ఎస్పెషల్లీ మీరు వెజిటేరియన్ అయితే ఇయర్ కి ఒకసారిబి12 అండ్ వైటమిన్ డి లెవెల్ చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్.
(14:06) మీ చేతులు షేక్ అవుతున్న నమ్మినెస్ ఉన్నా మీకు మెమరీ ప్రాబ్లం ఉన్నా వెంటనే చెక్ చేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా నార్మల్ బ్లడ్ రిపోర్ట్ ఒక్కటే అన్ని విషయాలు చెప్పదు. రెండవది మీ ఫుడ్ ని ఇంప్రూవ్ చేసుకోండి. మీరు వెజిటేరియన్ అయితే డైలీ సరైన క్వాంటిటీలో మిల్క్, కర్డ్, పన్నీర్ తీసుకోండి.
(14:28) టీ లో వేసుకునే కొంచెం మిల్క్ మాత్రమే సరిపోతుంది అనుకోకండి. ఎగ్ తినగలిగితే అది కూడాబి12 కి మంచి సోర్స్ అవసరమైతే డాక్టర్ అడ్వైస్ తో సప్లిమెంట్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. మీ బాడీలో డెఫిషియన్సీ ఉంటే దాన్ని కరెక్ట్ చేయడానికి సప్లిమెంట్స్ ఉపయోగపడతాయి. ఇక మూడవది సన్ లైట్ సరైన విధంగా తీసుకోండి. ఉదయం లేదా సాయంత్రం కొన్ని నిమిషాలు డైలీ సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవ్వండి.
(14:52) విండో గ్లాస్ వెనుక కూర్చుంటే సరిపోదు ఎందుకంటే గ్లాస్ యువబి రేస్ ని బ్లాక్ చేస్తుంది. ఇక చివరగా మనం ఈ వీడియోలో ఇప్పటివరకు చెప్పుకున్న విషయాల్ని చిన్నగా సమ్మరైజ్ చేస్తాను జాగ్రత్తగా వినండి. మనది ప్రపంచంలోనే అతి పెద్ద వెజిటేరియన్ కంట్రీస్ లో ఒకటి. అలాగే ప్రపంచంలో అత్యధికంగా సన్లైట్ వచ్చే కంట్రీస్ లో కూడా ఒకటి.
(15:14) అయినా కూడా మన దేశంలో ఉన్న సగానికి పైగా ప్రజల్లోబి12 డెఫిషియన్సీ ఉంది. 70% కంటే ఎక్కువ మందిలో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఇది ఒక కాంట్రడిక్షన్ లో కనిపిస్తుంది కానీ కోయిన్సిడెంట్ మాత్రం కాదు ఎందుకంటే మనం ట్రెడిషన్ ని పట్టుకున్నాం కానీ ట్రెడిషన్ తో పాటు ఉన్న లైఫ్ స్టైల్ ని వదిలేసాము. ప్యూరిటీని పట్టుకున్నాం కానీ న్యూట్రిషన్ ని వదిలేసాము.
(15:36) దాంతో ఇప్పుడు ఒక ఎంటైర్ జనరేషన్ టైర్డ్నెస్ తో స్ట్రగుల్ అవుతుంది. చేతులు కాళ్ళలో షేకింగ్ టింగ్లింగ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బోన్స్ వీక్ అవుతున్నాయి స్ట్రెస్ పెరుగుతుంది మెమరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బై ద వే ఈ వీడియో యొక్క పర్పస్ మీ ఫుడ్ హ్యాబిట్స్ ని పూర్తిగా మార్చేయడం కాదు. మీ ఫుడ్ ని తెలివిగా చూస్ చేసుకోవాలి అని చెప్పడం.
(15:57) ఎందుకంటే ఏ ఫుడ్ అయినా అది పవిత్రమైంది పాత కాలం నుంచి వస్తుంది. మన కల్చర్ లో భాగం కాబట్టి ఆటోమేటికల్లీ హెల్తీ అయిపోతుంది అనుకోకండి. మీ బాడీకి అవసరమైన న్యూట్రియెంట్స్ అన్ని అందులో ఉన్నప్పుడే ఆ ఫుడ్ నిజమైన హెల్తీ ఫుడ్ అవుతుంది. మీరు తీసుకునే ఫుడ్ లో ఏదైనా న్యూట్రిషన్ మిస్ అవుతుంటే మీ బాడీ వెంటనే మీతో గొడవ పెట్టుకోదు.
(16:19) మీకు వెంటనే వార్నింగ్ కూడా ఇవ్వకపోవచ్చు. కానీ సైలెంట్లీ తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. మిమ్మల్ని లోపల నుంచి వీక్ చేస్తూ పోతుంది. చివరగా ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే ఏ టెస్ట్ చేయించుకోవాలనుకున్నా మెడిసిన్స్ లేదా సప్ప్లిమెంట్ తీసుకోవాలనుకున్నా ముందు మీ డాక్టర్ ని తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు.
(16:41) ఈ వీడియో ద్వారా మీరు మీ లైఫ్ లో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మీ వరకు తీసుకోవడానికి నేను నా టీం ఎంతగానో కష్టపడతాం. కాబట్టి వీడియో నచ్చితే మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది.
(17:06) రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై.

No comments:

Post a Comment