బాబూ... ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. ఏం చెయ్యమంటావు? Son… I can’t bear this, What should I do?
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9R9dtRVEV0E
Transcript:
(00:01) ఓ మహాతల్లి మాతృమూర్తి ఆవేదన అండి 70 ఏళ్ళ ఉంటాయి భర్తకి 77 ఏళ్ళ అన్నమాట దాదాపు 49 ఏళ్ళ వైవాహిక జీవితం ఇద్దరు పిల్లలు ఇద్దరు కూడాను సెటిల్ అయ్యారండి అమ్మాయి అల్లుడు అద్భుతమైన వ్యక్తులు ఆ కోడలు మటుకు పిల్లవాడిని కొంతవరకు బొట్టలు వేసుకుందనే చెప్పాలి. అంటే పిల్లవాడు అమాయకుడు అనుకుంటాను భార్య మాట వింటాడు అసలు ఈ మహాతల్లి సమస్య ఏంటంటే నండి ఈ భర్త ఉన్నాడు కదా 77 ఏళ్ళ భర్త
(00:52) సతాయి చేస్తున్నాడండి ఈమెని సూటిపుటి మాటలతో చెయ్యి కూడా ఎత్తాడు ఒకసారి ఎత్తితే ఈమె భరించలేక ఈమె ఎవరనా చెయ్యి ఎత్తే ఒక మాట అంది నేను చేయత్తి గనుక నీ మీద దెబ్బ వేస్తే నీ పరువు ఏమవుతుంది చెప్పు అని ప్రశ్నించిందండి ఆయన కొంచెం అలాగా తగ్గిపోయాడు అన్నమాట రెండు మూడేళ్ళ బట్టి ఇంకా అంతకంటే ఎక్కువేమో గలీజగా తిడతాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడు.
(01:29) అసలు ఆయన మాటలు ఆమెకు రోత కలిగిస్తున్నాయండి రోత కలిగిస్తున్నాయి. మరి మూడు నాలుగు ఏళ్ళు ఎలా నిలబడింది అని ఆమెను అడిగితే ఆమె ఒకటే మాట చెప్పిందండి నేను మెడిటేషన్ అవి చేసుకుంటానండి [గొంతు సవరించుకోవడం] ఎప్పుడు తీరిక తగిలితే అప్పుడు చేసుకుంటాను బహుశా అదే నన్ను నిలబెట్టిందేమో అని అందండి నేను నిజంగా మనసులో అమ్మవారికి దండం పెట్టుకున్నాను ఎందుకంటే మాతృమూర్తి తన సమస్య చెప్పుకోవడానికిఅని ఫోన్ చేసింది కదా మంచి ఆలోచన ఇవ్వు తల్లి అని చెప్పేసి ఎన్నో విషయాలు చెప్పిందండి చెబుతూ నిజంగా చెప్తున్నాను కదా ఆమె వల వల వల ఏడ్చిందండి నాకు చాలా జాలేసింది 70 ఏళ్ల ఒక మాతృశక్తి
(02:17) అలాగా ఏడవటం అంటే ఊహించుకోండి ఇంక పరిస్థితి ఎలా ఉందో అయితే ఈ ముద్రదృష్టానికి అతనికి 77 ఏళ్ళు ఉన్నా కూడాను కొంచెం గట్టిగా ఉంటాడండి గట్టిగా ఉంటాడు. ఏదో 40,000 50,000 ఏదో సంపాదిస్తున్నాడు బయట గవర్నమెంట్ జాబ్ ఏమీ కాదు ఈమె ప్రశ్న ఏంటంటే ఏమిటి సార్ నా పరిస్థితి ఏంటి అసలు ఎక్కడికి పోను నేను చెప్పండి ఎక్కడికి పోను వదిలి పెడితే పొరపాటు చేసిన దాన్ని అయితానేమో మళ్ళీ వెనక్కి రావడానికి ఇబ్బందేమో నాకేమి అర్థం కావట్లేదండి కానీ మనశశాంతి కోసం నేను అమ్మాయి దగ్గరికి
(03:03) వచ్చాను సార్ దాదాపు రెండు నెలలు అయింది అల్లుడు మటుకు నిజంగా చేతులెత్తి నమస్కరించాలి సార్ ఏం పట్టించుకోడు ఈ విషయాన్ని మా అమ్మాయి నీకు ఎలా తోస్తే అలా చెయి మేమ విషయంలో నాకు అభ్యంతరం లేదు అన్నట్టుగా హాయిగా ఉన్నాడు చాలా మంచివాడండి లేకపోతే రెండు నెలలు నేను ఎందుకు ఉండగలను ఎందుకు ఉంటాను అసలు మా అల్లుడు గారి ఇంట్లో అని చెప్పేసి ఆమె చెప్పుకుందాం అమ్మ నాకు అబ్బాయి సంగతి ఒక్కసారి చెప్పు అన్నా అంటే ఏం లేదండి ఆమె ఏం చెప్పిందంటే మా వారు ఆమె అనేసిందండి మూర్ఖ శిఖమణి అని అనేసిందండి ఈ మూర్ఖ శిఖమణి
(03:48) పిల్లవాడికి పిల్లవాడి పిల్లలకి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాడండి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ముందు ఈయన తయారైపోతాడు. అలా చేయటంలో ఇబ్బంది లేదు కానీ నేను దాచుకోవాలయ్యా ఇబ్బంది పడితాం మనం రేపు పొద్దున ఎలాగా అని అన్నా కూడా వినడు వినడు నీకేం తెలియదు అసలు నోరు మూసుకొని కూర్చో అని అంటాడు సరే ఆయన డబ్బు ఆయన ఇష్టం వచ్చిన చేసుకుంటున్నాడు సార్ కానీ నా పరిస్థితి ఏంటి అసలు రోజు మూడు సార్లు వెళ్ళిపో అంటాడు.
(04:20) బాబా నాలుగేళ్ళు నరగానే భరించాను సార్ నాకు అర్థం కావట్లేదు అని అందండి పాపం రకరకాలుగా చెప్పింది అయితే విచిత్రం ఏంటంటే ఆమె కొంచెం [గొంతు సవరించుకోవడం] ధర్మం కూడా మాట్లాడిందండి ధర్మం గురించి కూడా మాట్లాడింది ఎందుకంటే [గొంతు సవరించుకోవడం] ఆమె బాగా మెడిటేషన్ లో ఉంటుంది కదా గురువు గారిని నమ్ముకొని ఇంత ఇబ్బందుల్లో కూడాను ఆమె ధర్మం గురించి మాట్లాడుతున్నది అంటే నాకు చాలా సంతోషం వేసింది ఆమె మీద అసలు నాకు గౌరవం పెరిగిందండి.
(04:50) అలా చెప్పింది చెప్పింది చెప్పింది దాదాపు గంటన్నర వరకు చెప్పిందండి మీరు ఊహించండి అసలు ఆ ఆమె బాధని గంటన్నర వరకు చెప్పిందండి నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఈ మహా తల్లికి ఏం చేద్దాం అని అయితే ఒక్క విషయం అండి ఇటువంటి ఫోన్లు నాకు వస్తూనే ఉన్నాయి నేను ఏదో చెప్తూనే ఉన్నాను కానీ ఆవేశంతో ఒక స్త్రీ ఉన్నట్టుండి బయటికి వచ్చేసింది అనుకోండి తగిన ఏర్పాట్లు చేసుకోకుండా ముఖ్యంగా ఆర్థికమైన ఏర్పాట్లు చేసుకోకుండా బయటికి వచ్చింది అనుకోండి అసలు ఆమె పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే పెనాల్లో నుంచి పుయిలో పడిన పరిస్థితి అవుతుందండి కదా అట్లని మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు ఆ
(05:35) డిప్రెషన్ గనుక ఎక్కువైపోతే ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఆ ఇటువంటి లేడీస్ లో కాబట్టి నేను ఏమన్నానఅంటే అమ్మ అది కాదు మీకంటూ డబ్బు గాని నగ గాని స్థిరాస్తులు గాని ఏమన్నా ఉన్నాయా నాకు చెప్పండి అనిఅంటే ఆమె [గొంతు సవరించుకోవడం] చెప్పింది పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం ఉందండి అమ్మ ఒకవేళ అమ్మితే ఎంత వస్తుంది 35 40 లక్షలు వస్తుంది అని అందండి నేను చాలా సంతోషపడ్డాను అది కాకుండా ఆస్తి ఏమన్నా ఉంది ందా అంటే ఏం లేదండి ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు ని సగభాగం [గురకలు] చేసి అంటే చేశను కాదు కానీ సగభాగాన్ని
(06:21) నాకు ఇచ్చేసి కాయితాలు రాశడండి కాబట్టి రెండు పోర్షన్లో రెంట్లు వస్తూ ఉంటాయి మాకు అని అంది [గొంతు సవరించుకోవడం] మాకు అంటే ఎవరు అన్నా అదేనండి మా కుటుంబానికి అని అంది అయితే ఒకటి సగభాగం మీకు రాశడు దాన్ని విడగొట్టొచ్చా అన్నా ఆ ఇల్లుని ఎట్లా విడగొడతామఅండి అది విడగొట్టే ఇల్లు కాదు ఏదో మూడు అంతస్తులు ఉంది కాబట్టి కింద రెండు పోర్షన్లు నా భాగానికి తగ్గట్టుగా రెంట్లు అవి వస్తాయండి అవి సరే ఏదో నాయన అకౌంట్ లో పడిపోతూ ఉంటాయి అనింది ఎంత వస్తాయమ్మ ఇలాంటి 8000 8000 16000 వస్తాయి సో నాకు రెండో కలు దొరికింది.
(07:03) ఓకే అమ్మ ఇప్పుడు మీ రెండు నెల బట్టి అమ్మాయి దగ్గర ఉంటున్నారు కదా వాతావరణం ఏంటి అన్నా ఏం లేదండి ప్రశాంతంగానే ఉంది అమ్మాయి కూడాను నన్ను బాగానే చూసుకుంటున్నది. మా అల్లుడు గారు కూడా నువ్వు చెప్పాను కదా ధర్మాత్ముడు ఇబ్బంది ఏమి లేదు అని అంది అంటే నేను వెంటనే ఏమన్నానుఅంటే అమ్మ ఇలా ఎంతకాలం అన్నా అదే అర్థం కావట్లేదండి అంది మీ వారు ఏమనా ఫోన్ చేశరా అన్నా ఆయన చేయడండి ఆయన చేయడు మూర్ఖత్వం మూర్తి భవించిన ఆ ఒక మూర్ఖుడుండి ఆయన చేయడండి అంది సరే అమ్మా ఇక్కడ ఎంత కాలం ఉండాలి అన్నది ప్రశ్న కదా దాని గురించి ఆలోచిస్తున్నాను అంటే అదేనండి అండి అమ్మాయి దగ్గర నేను
(07:47) ఉండలేను కదా మరి ఏం చేయాలి అని అందండి మరి అబ్బాయి దగ్గరికి పోగలవా అంటే అబ్బాయి దగ్గర సేమిరా కుదరదండి. కుదరదు ఎందుకంటే అక్కడ కోడలు కొంచెం డిఫరెంట్ మనిషిను అందులో మావారు ప్రతి విషయానికి ఆ పిల్లలకి ఖర్చు పెడుతున్నారు కదా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఏదో సంపాదించుకుంటున్నారు కానీ ఈయనది కొంచెం బోనస్ గా వస్తూ ఉంటుంది కాబట్టి దాని మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువ అండి నేను మావారిని ఈ విషయంలో అడ్డగిస్తున్నాను అని కూడానో పిల్లలకి తెలుసు అందండి అంటూ ఇంకొక మాట అంది నాకు ఈ మధ్య కొంచెం అనారోగ్యం చేసిందండి మా వారు పట్టించుకోవట్లేదు. పిల్లవాడిని అడిగితే
(08:29) పిల్లవాడు ఏమన్నాడంటే నీ దగ్గర బంగారం ఉంది కదమ్మా అది అమ్ముకొని వైద్యం చేయించుకో అన్నాట దుర్మార్గులు కూడా నింపాల అని వాడొచ్చా వాడకూడదా మీరే చెప్పాలి. ఈ విషయం కూడా నాకు చెప్పిందండి అంటే కొడుకు ఇంట్లో వాతావరణాన్ని నాకు ప్రత్యేకంగా చెప్పిందన్నమాట నాకు అర్థం అయపోయింది ఈమె అక్కడికి పోయే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆలోచించి నేను ఒక మాట చెప్పానండి అదేంటంటే అమ్మ ఒక పని చేయాలి.
(08:58) అమ్మాయి ఇంట్లో ప్రస్తుతానికి రెండు నెలలు ఉన్నావు ఇంకో నాలుగు నెలలు ఉంటావు లేదా ఒక సంవత్సరం ఉంటావు తర్వాత తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది ఇక అమ్మ నా దగ్గరే ఉండిపోతుంది అన్న ఒక భావన ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడాను పరుగులో ఉన్నారు పిల్లల పెంపకంలో ఉన్నారు సంసార రంధిలో ఉన్నారు వాళ్ళకు కూడాను ఇబ్బందులు అవే వస్తాయి.
(09:22) అనంగానే నా మాటని కట్ చేస్తూ ఆమె ఏమందంటే నాకు బంగారం ఉంది సార్ అమ్మాయి దగ్గర జాగ్రత్తగా పెట్టాను అనిఅంది. నేను వెంటనే ఒక మాట అన్నా అమ్మ విషయం చెప్తాను వాళ్ళ పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళే అవుతున్నారు డబ్బులు సరిపోకపోవచ్చు ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్య ఒకటి వైద్యానికి కూడాను అట్లానే ఆ బంగారం అమ్మలేరు కదా అట్లానే వాళ్ళ సంపాదనలో మీకు ప్రత్యేకంగా పెట్టలేరు కదా కాబట్టి మీకంటూ ఒక డబ్బు ఉండాలి.
(09:52) ఈ బంగారం అనేది పైకి విసిరేసిన రాయి లాంటిది అది ఎప్పుడైనా సరే మీద పడుతుందమ్మ మీద పడి అమ్మ నేను వాడుకుంటానే నాకు కొంత లోన్ కావాలి పిల్లల ఎడ్యుకేషన్ కి అని అంటే మీరు ఏం చేస్తారు ఇంత కాలం పెట్టి ఉన్నారు కాబట్టి సరే అంటారు కదా అది చివరికి మీకు కాకుండా పోయే అవకాశం ఉందమ్మా ఒక పని చేయండి. అమ్మాయిని ఎల్లుని కూర్చోబెట్టి ఒక మాట చెప్పండి అదేంటంటే నాన్న మీ దగ్గర ఉంటున్నానురా నా పరిస్థితి అలా వచ్చింది మరి మీ దగ్గర ఊరికే నేను భోజనం చేయలేను మీరు మంచివాళ్ళే నేను కాదనను కాకపోతే నెలకి నేను ఇంత ఇవ్వాలని అనుకుంటున్నానురా అది ఎంత అనేది నేను ఎప్పుడు చెప్పలేను ఎందుకంటే నా దగ్గర
(10:35) ప్రస్తుతానికి డబ్బులు లేవు కదా అని అంద అని అనమని [గొంతు సవరించుకోవడం] చెప్పాను అంటే అట్లా అనటం బాగుంటుందా అందండి అంటే నేను ఒకటేమంటాను అమ్మ ఒక విషయం చూడు మీరు ప్రతి నెల ఇంత గనక ఇవ్వగలిగితే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. అంటే చెప్పండి సార్ ఏం చేయమంటారు అందంటే ఆమె కొంచెం కాన్ఫిడెంట్ గా తయారయింది అన్నమాట నా మాటలు వాళ్ళు ఏం లేదమ్మా ఈ గోల్డ్ అంతా అమ్మేసి ఆ 30 40 లక్షలు వస్తాయి కదా అవి శుభ్రంగా సేవింగ్స్ అకౌంట్లో నీ బ్యాంకులో వేసేసుకొని ఆ వడ్డీని మరి 30,000 20,000 లేకపోతే 40,000 వస్తాయి కదా ఒక 20,000 నీది కాదనుకొని పిల్లలకి
(11:14) ఇస్తూ ఉండమ్మా అమ్మాయి చేతిలో పెట్టు లేకోతే అల్లుడి చేతిలో పెట్టు నీ గౌరవ మర్యాదలు కూడా తక్కుతాయి. వాళ్ళకి ఏదో ఒక రకంగా ఈ డబ్బు అవసరానికి వస్తుంది. అంతేగానీ బంగారాన్ని గనుక అలా గనక పెడితే ఇబ్బంది పడతావమ్మా నువ్వు రేపు పొద్దున ఇంతకాలం మరి నిన్ను పోషించినందుకు వాళ్ళు ఒక మాట అడుగుతారు. అడిగినప్పుడు నువ్వు బంగారాన్ని వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది.
(11:37) నీ గ్రాఫ్ కూడా నువ్వు మెల్లమెల్లగా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే నీకు ఆరోగ్యం [గొంతు సవరించుకోవడం] క్షీణించవచ్చు. కదా అటువంటప్పుడు వాళ్ళు ఆదుకోవాలి. ఏది ఉపయోగం లేని ఆ బంగారాన్ని అలా పెట్టుకొని నిన్ను ఆదుకోవాలంటే కూడాను వాళ్ళకి మనసు రాదు. కదా వాళ్ళని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి నాన్న ఇది నేను ఊడికినే తినను నా బంగారం ఉంది అమ్మేస్తాను బ్యాంకులో పెడతాను ఎఫ్డీలు చేసేస్తాను ఆ వడ్డీని మీకు ఇస్తూ ఉంటాను నాన్న ఏదనా ప్రయాణ ఖర్చులకి లేకపోతే నేను ఏదనా ఎప్పుడనా తీరేత చేయాలనుకున్నా లేకోతే మీ పిల్లలకి ఏవనా పుట్టిన రోజులు వచ్చినా కూడాను వద్దు
(12:09) ఒప్పు చేతిలో పెట్టానుకుంటుంది. నా పరిస్థితిని అర్థం చేసుకోండి. దయచేసి ఏమనుకోవద్దు. ఈయన గనుక అంటే నా భర్త గనుక ఇలాగే అంటునే అయితే నేను ఏం చేయగలను ఆ బంగారం మీకే వస్తుంది కదా అని చెప్పి కూర్చోబెట్టి వినయంగా చెప్పమ్మా మీ అల్లుడికి అమ్మాయికి వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకుంటారు అని చెప్తే ఆమె చెప్పడంలేదు అమ్మ ఇంకేమనా సౌర్సెస్ ఉన్నాయా అని అన్నాను అంటే ఏం లేదండి ఇప్పుడు ఆ రెండు పోర్షన్ నుంచి రెంట్ వస్తుంది కదా అదేదో పులుసులు ముక్కలాగా కలిసిపోతున్నది మా భార్య అకౌంట్లో పడి అనింది అంటే నేను ఒక మాట చెప్పాను అమ్మా ఒక పని చెయి కాయితాలు నీ దగ్గరే ఉన్నాయి
(12:52) కదా ఆ సగం పోర్షన్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ కాయితాలు మీ దగ్గరే ఉన్నాయి. ఆ ఇంట్లో రెంట్ ఉంటున్న వాళ్ళు కూడా మీ పోర్షన్ లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. బాబు నేను మా అమ్మాయి దగ్గరికి వచ్చాను కొంతకాలం ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అమ్మాయి దగ్గర నేను ఊరికి ఏమ ఉండలేను కాబట్టి ఆ రెండు పోర్షన్లు రెంట్ ఉంది కదా మీరు పంపించేసేయండి నాకు ఇగో నా అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను దాంట్లో వేసేయండి అని చెప్పండి మొహమాటం లేకుండా చెప్పండి చెబితే మీరు సేవింగ్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు కదా ఇక్కడ దాంట్లో పడుతూ ఉంటాయి బంగారం అమ్మిన తర్వాత వచ్చే
(13:27) డబ్బులు కూడాను దాంట్లో పడుతూ ఉంటాయి మీకు గౌరవ మర్యాదలు ఉంటాయి ఫస్ట్ ఎవరిని దేహీ అని అడగవలసిన పరిస్థితి ఉండదు కాబట్టి మీ అమ్మాయిని ఆదుకుంటూ మీ అల్లుడు గారికి కూడాను కృతజ్ఞతగా ఉంటూ మనవళ్ళు మనవరాళ్ళకి మంచి అమ్మమ్మలాగా ఉంటూ మీరు ప్రస్తుతానికి ప్రస్తుతానికి మీ ఆయన మెత్తబడి దగ్గరికి వచ్చేంతవరకు ఈ పరిస్థితిని ఎలా కొనసాగించండమ్మా ఎందుకంటే 77 ఏళ్ల వ్యక్తి ఒక్కడే ఉండటం చాలా కష్టం ఈరోజు శరీరం గట్టిగా ఉండొచ్చు మనసు గట్టిగా ఉండొచ్చు కానీ మీరు లేని లోటు కొంత కాలం తర్వాత ప్రతి క్షణం కూడాను కనిపిస్తూ ఉంటుందమ్మ ఆయనలో అహం ఉంది
(14:09) కాబట్టి మీకు ఇంకొక్క సంవత్సరం పాటు కూడా ఫోన్ చేయకపోవచ్చు తర్వాత ఆరోగ్యం క్షీణించి మంచంలో పడిన హాస్పిటల్లో చేరిన మీకు గనుక ఇన్ఫర్మేషన్ వస్తే మీరు వెళ్లి సేవ చేయడానికి రెడీగా ఉండండి. సేవ చేయడానికి రెడీగా ఉండండి. ఆయన ఓకే అంటే సేవ చేయండి. ఆయన కోరుకున్న తర్వాత మళ్ళీ మీ అమ్మాయి గారి ఇంటికి వచ్చేసేయండి.
(14:31) అప్పుడు ఆయనలో ఏదనా కదలవలసింది ఉంటే మానవత్వం అది కదులుతుందేమో అబ్సర్వ్ చేయండి అంతేగాన కోర్టుకు పోవటం కేసులు వేసుకోవటం ఆ విడాకులకు అప్లై చేయడం భరణం అడగటం అనేది మీ వయసుకు తగదమ్మా అంటే నేను అట్లా చేయనండి నేను అట్లా చేయను నా జరుగుబాటు గనుక ఏదన్నా ఉంది అంటే అది ఏదన్నా అమ్మాయిని అల్లుడిని బతిలాడుకొని నేను ఇక్కడే చూసుకుంటానండి ఏనందండి చివరికి ఏమైందంటే నా సజెషన్ కొంతవరకు ఆమెకి మనస్సాంతిని ఇచ్చింది అది వర్కవుట్ కూడా అయిందండి వర్కవుట్ కూడాను అయింది.
(15:01) చూడమ్మ ఇంకొక విషయం చెప్తున్నాను మీ ఆయన మీద కోపం తెచ్చుకోవద్దు కాలమే అన్ని గాయాలని మార్పుతుంది. కానీ ఆయనకు సహాయం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు మటకు తప్పకుండా వెళ్ళు తప్పకుండా వెళ్ళు సహాయం చేయి సేవ చేయి భర్త భర్తే నువ్వు కోపతాపాలకి పోవద్దు ఎందుకంటే మీలో దైవత్వం ఉంది. మీరు మెడిటేషన్ చేస్తున్నారు. కాబట్టి ఆ కృతజ్ఞతని ఆ అభాగ్యుడి మీద చూపించు అని నేను ఈ అభాగ్యుడు అనే పదం వాడానండి దీన్ని కోపం తెచ్చుకోవద్దుమా ప్రశాంతంగా ఉండు అని చెప్తే ఆమె నిజంగా సంతోషించిందండి సరేనండి ఆ టెనెంట్స్ కి చెప్తాను ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాను మా పిల్లల్ని
(15:44) బతిలాడుకొని దాన్ని డబ్బు తీసుకొని ఇక్కడ పెట్టుకుంటానండి ఎట్లా లేదన్నా అదిఒక 16వ000 ఇదఒక 30 35వే వచ్చినా కూడాను నాకు కొంచెం డబ్బు ఉన్నట్టుగా ఉంటుంది కదా కాబట్టి నేను మీరు చెప్పినట్టు ఆలోచన చేస్తానండి అందండి నేను చివర్లో మళ్ళీ నేను గట్టిగా చెప్పా ఆయన మీద ఎట్టి పరిస్థితులో కోపం తెచ్చుకోవద్దు.
(16:08) ప్రస్తుతానికి బాధని తట్టుకోలేక మీరు అమ్మాయి దగ్గరకి వచ్చిన్నారు అమ్మాయి దగ్గర కూడాను ఎక్కువ కాలం ఉంటాము అన్నది మటుకు నిర్ధారణ చేసుకోవద్దు. అవసరమైతే అమ్మాయికి చెప్పండి నాన్న మెత్తబడి తగ్గి నువ్వు ఇంటికి రా నేను నిన్ను బాగా చూసుకుంటాను అని అనేంతవరకు ఉంటాను తల్లి నేను ఇక్కడ ఆ తర్వాత మరి చూద్దాం భగవంతుడు నా జీవితాన్ని ఎట్లా నడిపిస్తాడో అని హాయిగా చెప్పేసేయండి మా పిల్లలకి అని కూడా చెప్పానండి ఇది నేను రకరకాలుగా చెప్పాను దాదాపు నేను కూడాను మధ్యలో నన్ను అలా డిస్టర్బ్ చేస్తున్న కూడాను కొంచెం కొంచెం చిరాగ పడుతున్నా లేండి ఏంటమ్మా నేను చెప్పేది
(16:49) వినకపోతే ఎలా తల్లి విను అని చెప్పి ఆ చెప్పండి సార్ చెప్పండి సార్ అందంటే ఎందుకంటే ఆమె ఆతృత నాలో ఒక ఆతృతను పెంచిందండి పెంచడంలో ఏమైందంటే కొంచెం నేను కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. [నవ్వు] ఎందుకంటే నాకు ఫోన్లు వస్తున్నాయండి. చెప్పేవాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పడం మొదలు పెడితే ఆపట్లేదండి రెండు మూడు గంటలు చెప్పడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ బాధలు అలా ఉన్నాయండి.
(17:16) నేను ఎక్కడో ఒక్కడ మరి కట్ చేసి నాకు కావలసిన సమాచారం నేను తీసుకోకపోతే అలాగండి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఉన్నాయి అనుకోండి నేను వాళ్ళ పొద్దునే లేచి కూడా నువ్వు ఆలోచించా సరిైన మార్గం చెప్పానా అని చూపెట్టానా అని మనసు కూడాను మంచి పని చేశవయ్యా అని ఎందుకో చెప్పినట్టుగా అనిపించిందంటే అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ స్త్రీకి కావలసిన ఆర్థిక స్వావలంబన ఆర్థిక స్వ స్వేచ్ఛ తద్వారా అమ్మాయికి అల్లుడికి సహాయం చేయడం అనేది పక్కన పెట్టండి.
(17:51) ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆయన్ని అలా వదిలేసేయమ్మ ఆయన్ని అలా వదిలేసేయ ఆయన మీద కోపం తెచ్చుకోవద్దు. లేదు తింటున్నాడో తినటం లేదో ఎలా ఉంటున్నాడో మహానుభావుడు అని గనుక మీకు అనిపిస్తే ఆ జాలి గనుక మీకు అనుకోకుండా కలిగితే ఫోన్ చేసి మాట్లాడండి ఎత్తితే ఎత్తుతాడు లేకపోతే లేదు ఆయన ఫోన్ చేశడా లేదా అన్నది మటకు మీరు ఆలోచించొద్దు అనిఅంటే మహా తల్లి ఒక మాట అందండి ఏవండీ ఆయన చేయడండి ఆయన చేయడు నేను ఫోన్ చేసిన కూడా నువ్వు చెప్తానండి ఒకవేళ ఎత్తినా మళ్ళీ తెడతాడండి ఇష్టం వచ్చినట్టు తిడతాడుండి ఎందుకంటే ఆయనక ఏదో శరీరం గట్టిగా ఉందండి ఆరోగ్యం బాగుంది ఎక్కడేదో పని
(18:34) చేస్తున్నాడు 30 35000 తెచ్చుకుంటున్నాడు కాబట్టి [గొంతు సవరించుకోవడం] ఆయనలో ఉన్న అహం అనేది అంత తొందరగా కరగదండి అని చెప్పేసి చెప్పిందండి నిర్వందంగా చెప్పేసింది నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. అమ్మ నేను చెప్పవలసింది చెప్పాను. మరి నిర్ణయం మటుకు మీదేనమ్మ సలహా అడిగారు కాబట్టి చెప్తున్నాను దీన్ని పాటించమని కూడా నేను చెప్పట్లేదు.
(18:54) ఎందుకంటే మీకు మనశశాంతి ఉండాలి నెంబర్ వన్ మీరు అక్కడ పిల్లల దగ్గర దేహిని చేయి చాచకుండా ఉండాలి నెంబర్ టూ నెంబర్ త్రీ వాళ్ళ ప్రేమాభిమానాలని మీరు పూర్తిగా పొందాలి. నెంబర్ ఫోర్ వాళ్ళకి మీరు ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండాలి. ఐదో పాయింట్ మీ వారిని ఏమీ అనద్దు అట్లానే మీ పిల్లవాడు ఉన్నాడు కదా ఆ కోడల మీద కూడాను ఏ విధమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోవద్దమ్మ ఏర్పరచుకోవద్దు అప్పుడు గాని మీ జీవితం ధన్యత చెందదు కాలం మెలమెల్లగా అన్ని గాయల్ని మారుపుతుంది అన్నాను కదా అది ఎలా సమాధానం చెప్తుంది అన్నదానికి మటుకు మీరు ప్రశాంతంగా వేచి చూడండి తల్లి అని చెప్పానండి నేను
(19:37) [గురకలు] చాలా సంతోషపడింది అనుకోండి చాలా సంతోషపడింది ఒక్కొకసారి కష్టంఅండి సొల్యూషన్స్ ఇవ్వడం కూడా కష్టం ఎందుకంటే 70 ఏళ్ల వయసులో నేను కూడాను పొరపాటు చేశను అనుకోండి ఆ కుటుంబం గలంత అయింది అనుకోండి ఏం చేయగలని చెప్పండి కదా కాబట్టి ఇదండి పరిస్థితి ఏదో నాకు తోచినంత నేను సలహా ఇచ్చాను ఇది ఎంతవరకు సభ అనేది సబ్స్క్రైబర్స్ గా వ్యూయర్స్ గా మీరు ఆలోచిస్తారు కదా అవసరమైతే మీరు నాకు కూడాను సలహాలు ఇస్తారు కదా కాబట్టి కామెంట్ బాక్స్ లో ఈ విషయంలో మంచి మెసేజ్ని పెట్టండి ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి నా ఛానల్ కి కూడాను సబ్స్క్రైబ్ చేయండి లేదు నాతో
(20:19) మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9491063089 అండి. ఇకపోతే నా YouTube ఛానల్ వచ్చేసి నా పేరు మారుతి కిరణ్ పోరూరి YouTube లోకి వెళ్లి ఎంఏ ఆర్ యుటిహ్ ఐ స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని గనుక టైప్ చేస్తే పిఓ ఆర్ యు ఆర్ఐ నా ఛానల్ ఓపెన్ అవుతుందండి. సో అదండి విషయం లైక్ బటన్ బెల్ ఐకాన్ అంటారా మీ మనసుకు నచ్చితే వాటిని కూడాను ప్రెస్ చేయండి.
(20:52) సో ఇదండి వీడియోలో సంగతి నమస్కారం అండి థాంక్యూ.
No comments:
Post a Comment