ప్రతిరోజూ ఓడిపోతున్నావా ఇది ఒక్కసారి విను | Never Give Up | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iPwPKAOTTIc
Transcript:
(00:01) [సంగీతం] ఈ ప్రపంచంలో దాదాపు 90% మంది జీవితం ఎందుకు ఆగిపోతుందో మీకు తెలుసా? ఓటమి వల్ల కాదు కోలుకోలేని దెబ్బలు తగలటం వల్ల అస్సలు కాదు ఎవరైనా వచ్చి నన్ను రక్షిస్తారు అనే చిన్న భ్రమ వల్ల ప్రతిరోజు ఉదయం లేవగానే ఈరోజు నా జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. ఎవరో వచ్చి నన్ను ఈ కష్టాల నుంచి బయట పడేస్తారు అని చెప్పేసి ఆశగా నిరాశగా వెయిట్ చేస్తున్నారా నిజం ఏంటంటే మీ మనసే మిమ్మల్ని ఒక బానిసలా మారుస్తుంది.
(00:34) మీరు ఆ భ్రమలోనే బ్రతికేస్తున్నారు. స్వామి వివేకానంద గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీరు బలహీనులు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ ప్రపంచంలో మిమ్మల్ని రక్షించడానికి వేరే ఏ శక్తి రాదు మీకు మీరే రక్షకులు అని. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. కానీ మనం ఏం చేస్తాం? ఎవరో బయట వాళ్ళు వచ్చి మన చేయి పట్టుకొని నడిపిస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నాం.
(00:55) సమయం దాటిపోతుంది. వయసయిపోతుంది. అవకాశాలు చేయజారిపోతున్నాయి. కానీ మనం మాత్రం ఆ చీకటి గదిలో కూర్చొని ఇంకా అద్భుతం కోసం ఎదురు చూస్తున్నాం. ఇది వింటున్నప్పుడు మీకు కొంచెం కోపం రావచ్చు నా పరిస్థితులు మీకు తెలియవు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. మనుషులు బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధలోనే ఒక తెలియని సేఫ్ జోన్ ని వెతుక్కుంటారు.
(01:19) దాన్నే సైకాలజీలో కంఫర్టబుల్ పెయిన్ అంటారు. అంటే బాధపడుతూ కూర్చోవడం చాలా తేలిక కదా. బాధ్యత తీసుకోవడం చాలా కష్టం కదా. నా జీవితం నాశనం కావడానికి నా గతమే కారణం, నా ఇంట్లో వాళ్లే కారణం, నా ఫ్రెండ్స్ఏ కారణం అని చెప్పేసి సమాధానాలు చెప్పుకోవడం చాలా సులభం. కానీ నా జీవితానికి నేనే భాగ్యున్నని అని ఒప్పుకోవడం ఉందే దానికి చాలా ధైర్యం కావాలి.
(01:42) ఆ విక్టిమ్ మైండ్సెట్ ఉందే అది ఒక మెల్లని విషం లాంటిది. ప్రతిరోజు మనల్ని లోపలి నుంచి చంపేస్తుంది. మనం ఏమనుకుంటామంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు నా కష్టం ఎవరికీ రాకూడదు అని చెప్పేసి మనకి మనం సానుభూతి చూపించుకుంటూ ఉంటాం. మీకు తెలుసా ఈ ప్రపంచంలో ఎవరికీ మీ కష్టాలతో పని లేదు. మీరు ఏడుస్తున్నంత సేపు లోకం మిమ్మల్ని చూసి జాలిపడుతుంది. లేదా నవ్వుకుంటుంది.
(02:05) కానీ ఒక్కడు కూడా వచ్చి మీ కన్నీళ్లు తుడవడు. స్వామి వివేకానంద గారు ఒకసారి అన్నారు బలహీనత అనేది మరణంతో సమానం ధైర్యమే జీవితం కానీ మనం ఆ బలహీనతనే మన ఆవరణంలా తొడుక్కొని తిరుగుతున్నాం. మనం బాధపడటంలో ఒక వింతైన ఆనందాన్ని కూడా వెతుక్కుంటున్నాం. బాధపడటం కూడా ఒక వ్యసనం లాంటిది. ఆ విషయం చాలా మందికి తెలియదు. అది ఒక అడిక్షన్ అన్నమాట.
(02:31) మనం బాధపడుతూ కూర్చుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి అయ్యో పాపం అని చెప్పేసి ఒక చిన్న రియాక్షన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రియాక్షన్ కోసం ఆ సింపతీ కోసం చాలామంది బాధపడటానికి అలవాటు పడతారు. మొదట ఆ జాలికి బాగా అలవాటు పడిపోతుంది. ఉదయానే లేవగానే అబ్బా ఈరోజు కూడా నా మూడు బాలేదని చెప్పేసి మనకి మనమే సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటాం.
(02:55) మూడు బాగుంటేనే పని చేస్తాను అని అనుకోవడం మనం చేసుకునే అతి పెద్ద పొరపాటు నిజం ఏంటంటే మూడు వచ్చిన తర్వాత పని ప్రారంభం కాదు మీరు లేచి పని ప్రారంభించిన తర్వాతే ఆ మూడు మారుతుంది కానీ మనం ఏం చేస్తాం గొప్ప గొప్ప పుస్తకాలు చదువుతాం గొప్ప గొప్ప మనుషుల గురించి వింటాం వాళ్ళ కథల గురించి వింటాం ఆ 10 నిమిషాలు కాస్త ఆ క్షణంలో కాస్త మీ బ్లడ్ బాయిల్ అయిపోతుంది అన్నమాట అంతేకాకుండా ఆ 10 నిమిషాలు అయిపోయిన వెంటనే మళ్ళీ పాత మనిషి అయిపోతుంది తారు ఎందుకంటే పుస్తకంలో ఉండే మోటివేషన్ అవ్వచ్చు లేకపోతే నిజ జీవితంలో ఒక వ్యక్తి గురించి విన్నప్పుడు అతని గురించి
(03:31) చెప్పినప్పుడు అతను సాధించిన విజయాల గురించి డిస్కస్ చేసినప్పుడు మీకు వెంటనే ఒక మోటివేషన్ వస్తుంది కాకపోతే ఆ మోటివేషన్ అనేది టీ కాఫీ లాంటిది అది ఉన్నంతసేపే కిక్కు కానీ మనకు కావాల్సింది మోటివేషన్ కంటే క్లారిటీ కావాలి. మనకు కావాల్సింది ఒక రియాలిటీ చెక్ అన్నమాట. అసలు ఈ భ్రమ ఈ బలహీనత మన మనసులోకి ఎలా వస్తాయో తెలుసా మన ఆలోచన విధానంలో ఉన్న లోపం వల్ల మనం ప్రతి దాన్ని బయట వెతుక్కుంటున్నాం మన శాంతిని మన సంతోషాన్ని చివరికి మన ఉనికిని కూడా సమాజం ఇచ్చే గుర్తింపులోనే వెతుక్కుంటున్నాం మరొకరు వచ్చి మనల్ని మెచ్చుకోవాలి మరొకరు వచ్చి మనల్ని ప్రోత్సహించాలి అప్పుడే మనం
(04:14) పని చేస్తాం. ఈ ఆలోచనే మనల్ని ఒక పరాయి వ్యక్తికి బానిసగా మారుస్తుంది. మీ విలువను నిర్ణయించే హక్కు వేరే ఎవరికో ఎందుకు ఇస్తున్నారు? స్వామి వివేకానంద్ గారు బలంగా ఒక మాట చెప్పారు ప్రపంచం మిమ్మల్ని ఏమనుకుంటున్నా సరే మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. మీరు నేను బలవంతున్ని అనుకుంటే బలవంతులు అవుతారు.
(04:38) నేను బలహీనుడిని అనుకుంటే బలహీనులు అవుతారు కానీ మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పక్కవాడు ఏమనుకుంటాడు అనే భయంతో జీవిస్తున్నాం. మన కలలు మన నిర్ణయాలు మన అడుగులు అన్ని ఇతరుల అభిప్రాయాలు చుట్టూనే తిరుగుతున్నాయి. అంతకంటే బానిసత్వమైన జీవితం మరొకటి ఉంటుందా? మనం ఎప్పుడూ ఒక పాత పాట పాడుతూనే ఉంటాం. నా గతం చాలా ఘోరమైనది.
(05:01) నాకు చిన్నప్పటి నుంచి సరైన అవకాశాలు రాలేదు. మా ఇంట్లో వాళ్ళు నన్ను సపోర్ట్ చేయలేదు. అవును ఇదంతా నిజమే కావచ్చు కానీ గతాన్ని పట్టుకొని వేలాడటం వల్ల మీ వర్తమానం మారుతుందా? బావిలో పడిన గాడిద కథ మీకు తెలిసే ఉంటుంది. గాడిద బావిలో పడిపోగానే రైతు దాన్ని బయటకి తీయడం కష్టమని భావించి దానిపైన మట్టి కప్పలని చూశాడు. ఆ గాడిది ఏం చేసిందో తెలుసా పై నుంచి పడుతున్న ప్రతి బస్తా మట్టిని ఒంటి పై నుండి దులిపేసి ఆ మట్టి పైనే అడుగు వేస్తూ పైకి వచ్చింది.
(05:31) మీ మీద కూడా ఈ లోకంలో రోజుకో బస్తా విమర్శల మట్టిని వేస్తూనే ఉంటుంది. ఆ మట్టి కిందే పూడిపోతారా లేక దాన్ని దుడిపేసి ఒక మెట్టుగా మార్చుకొని పైకి వస్తారా? ఈ నరకం నుంచి బయట పడటానికి ఒకే మార్గం ఉందండి. అదే కార్యాచరణ అవును కార్యాచరణే స్వేచ్ఛ. మీరు కూర్చొని ఎంత ఆలోచించినా మీ ఆలోచనలు మీ కష్టాలను తీర్చవు. కేవలం మీరు వేసే ఒక్క అడుగు మాత్రమే మీ స్థితిని మారుస్తుంది.
(05:59) నిశ్చలంగా ఉండే నీరు కుల్లిపోతుంది. పారే నీరు మాత్రమే ప్రశాంతవంతమైన నదిలా మారుతుంది. మీ జీవితం కూడా అంతే. మీరు ఆగిపోతే మరణించిన దేహంతో సమానం. కదులుతుంటేనే జీవితం. స్వామి వివేకానంద గారు తరుచు ఒక శక్తివంతమైన ఉపనిషత్ వాక్యాన్ని గుర్తు చేసేవారు. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత అంటే లేవండి మేల్కొనండి లక్ష్యం చేరుకునే వరకు విశ్రమించకండి.
(06:27) ఆయన ఏరోజు మిమ్మల్ని కూర్చొని ఏడవమని చెప్పలేదు. ఆయన మిమ్మల్ని సానుభూతి కోసం అడుక్కోమని చెప్పలేదు. మీలోని నిధానమైన ఉన్న ఆ అనంతమైన శక్తిని మేలుకొల్పమని చెప్పారు. మీ లోపల ఉన్న బలాన్ని గుర్తించిన రోజు ఈ ప్రపంచంలో ఏ సమస్య మిమ్మల్ని భయపెట్టలేదు. ఇప్పుడు ప్రాక్టికల్ గా మీరు ఏం చేయాలో తెలుసా? మొదటిది ఫైవ్ సెకండ్స్ రూల్ ఏదైనా ఒక మంచి పని చేయాలనిపించినప్పుడు లేదా లేచి నిలబడాలనిపించినప్పుడు మీ మెదడు సాకులు చెప్పడం ప్రారంభించక ముందే 5నాలుగుమూడు రెండు ఒకటి అని లెక్క పెట్టి లేచి నిలబడండి.
(07:02) మూడు కోసం అని చెప్పేసి సరైన సమయం కోసం అని చెప్పేసి ఎదురు చూడడం ఆపేయండి. రెండోది గాడిద సూత్రం అమలు చేయండి. పరిస్థితులు మిమ్మల్ని ఎంత కిందకి తొక్కినా ఆ మట్టిని దులిపేసి ప్రతి దెబ్బని ఎదగడానికి ఒక మెట్టుగా మార్చుకోండి. కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి రావు. మీలో ఉన్న సత్తాన్ని ప్రపంచానికి చూపించడానికి వస్తాయి. మూడవది ఎవరి కోసమో కాదు అనే నిశ్చయం.
(07:26) మీరు చేసే ప్రతి పనిని ఇతరుల ప్రశంసల కోసం కాక మీ ఆత్మ సంతృప్తి కోసం మాత్రమే చేయండి. పనిలోనే ఆనందాన్ని వెతుక్కోండి. ఫలితం మీద కాదు. ఇప్పటివరకు మీరు జీవించిన జీవితం ఒక ఎత్తు ఇకపై మీరు జీవించబోయే జీవితం మరొక ఎత్తు మీ ఆలోచన విధానం మారిన క్షణమే మీ ప్రపంచం మారిపోతుంది. ఈ క్షణం నుంచి మీ జీవిత బాధ్యతను వేరే ఎవరి మీదో నెట్టేయడం ఆపేయండి.
(07:54) మీ నాటకానికి మీరే దర్శకుడు, మీరే కథానాయకుడు, మీ గతాన్ని మార్చలేరు. కానీ మీ వర్తమానాన్ని మీ చేతుల్లోకి తీసుకోగలరు. స్వామి వివేకానంద్ గారు చెప్పిన ఒక అద్భుతమైన సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ విశ్వంలో ఉన్న సమస్త శక్తికి ప్రతిరూపాలు. మీరు సాధించలేనిది ఏదీ లేదు, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడమే అతి పెద్ద పాపం. ఈ సమాజం మిమ్మల్ని నియంత్రించడానికి ఎన్నో సరిహద్దులు గీస్తుంది.
(08:19) భయం అనే గొలుసుతో మిమ్మల్ని కట్టేయడానికి చూస్తుంది. ఆ గొలుసులను తెంచుకొని బయటికి రావాల్సిన బాధ్యత మీదే ఇప్పుడు మీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఎప్పటిలాగే రోజు ఉదయానే లేచి పరిస్థితులను తిట్టుకుంటూ ఎవరో వచ్చి నన్ను బాగు చేస్తారని చెప్పేసి ఆశగా ఎదురుచూస్తూ లక్షల మంది లాగా ఆగిపోయి నశించిపోవడం లేదా రెండవది ఇప్పటికిప్పుడు లేచి నిలబడి మీ కన్నీళ్ళను తుడుచుకొని మీలో ఉన్న ఆ అనంతమైన శక్తిని మేలుకొల్పి సమస్యల గుండెల్లో అడుగు వేసి మీ సామ్రాజ్యాన్ని మీరు నిర్మించుకోవడం నిర్ణయం మీదే ఈ వీడియో చూసి ముగిసిన తర్వాత కూడా మళ్ళీ పాత అలవాట్లలోకి
(08:55) జారిపోతారా లేక ఒక కొత్త మనిషిలా బయటికి అడుగు పెడతారా గుర్తుంచుకోండి మిమ్మల్ని గుంటలో పోడ్చడానికి లోకం రోజుకో బస్తా మట్టిని మీపై వేస్తూనే ఉంటుంది. ఆ మట్టి కిందే పూడిపోతారా లేదా దాన్ని దులిపి ఆ మట్టి పైన అడుగు లేసి గుంట బయటకి వస్తారో మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనల్ని మార్చడానికి ఇతరుల కోసం వెతకకండి లేవండి మీ జీవితాన్ని మీరు తిరగరాయండి.
(09:21) ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ [సంగీతం]
No comments:
Post a Comment